మన పూర్వీకులు మనకు ఎన్నో ఎన్నెన్నో మంచి మంచి మహత్తర మైన పవిత్రమైన వ్రతములు ,నోములు అందించారు. వాటిని అందుకొని ఆచరించి ఫలితాలు పొందిన వారెందరో ఉన్నారు. అందరూ ఆచరించి ఫలితం పొంద వచ్చును .మరి ఈ లక్ష పసుపు నోము గురించి తెలిసికోండి .ఫలితం పొందండి.
" లక్ష పసుపు నోము నేను నోచాను
లక్షణ మైన సంభంద మందుకున్నాను
లక్షణ మైన మాంగళ్య మందింది నాకు
సలక్షణమైన సంతానం కలిగి నారయ్య
ఇహ మందు సుఖపడి తినయ్య నేను
పరమందు మోక్షమ్ము కలుగ జేయయ్య "
అని అనుకుని పవిత్రాక్షతలు శిరసున దాల్చి ఒక సంవత్సరం గడిచాక లక్ష పసుపు కొమ్ములు సిద్దం చేసికొని ఇంటివద్దే ఉండి దోసెడు కొమ్ములు ముత్తయిదువులకు పంచుతూ ఉండండి .అంతే కాదు గౌరీ పేరున లేదా శ్రీ లక్ష్మీ పేరున సహస్ర నామార్చన చేసిన కుంకుమను ఆ పసుపు కొమ్ములతో సమర్పించాలి .తప్పక ఫలితం లభించ గలదు. ఆచరించండి . ఆలోచన ఎందుకు ? ఫలితం పొందండి.
భక్తి అవసరం .శ్రద్ధ ముఖ్యం .విశ్వాసం ప్రధానం . తప్పక ఫలితం లబించ గలదు .దైవ భక్తి లేని వారు నాస్తికులు ఆచరించ వద్దని మనవి. వారికి ఫలిత ముండదు .
No comments:
Post a Comment