మనకు మన పూర్వులు చక్కని వ్రతాలు , నోములు, పూజలు అందించారు. జీవితమును పారమార్ధిక దృష్టితో సాగించాలని కోరుకునే వారు వ్రతాలు ఆచరించాలి , నోములు నోయాలి .సమయం మంచి పనులకే వెచ్చించాలి .అదే అర్ధం , పరమార్ధం .
ఒక నాడు మా దేవాలయము నందు ఒక విద్వాంసుడు పురాణం చెబుతూ అక్కడ వింటున్న స్త్రీల నుద్దేశించి - పరమ పవిత్రమైన స్త్రీలారా ! ఈ సందర్భమున మీకా నోము గురించి వివరించి చెబుతాను ఆచరించి ఫలం పొందండి .
దీని పేరు లింగ దానము నోము .లింగ దానం చేసిన లింగ రూపుడు శివుడు మెచ్చు . శివుడు మెచ్చిన కలుగు అధిక సిరి, సంపదలు అంత మందున కలుగు ముక్తి మనకు . జన్మించిన ప్రతి జీవి మరణించి తీరు. అది సృష్టి ధర్మం . పుట్టిన ప్రతి జీవి గిట్టక మానదు. అందుచేత పుట్టిన వారు మోక్ష ప్రాప్తికి సాధన చేయాలి. ప్రయత్నించాలి . కనీసం సులభ సాధ్యమైన ఈ నోము నోచి మోక్ష మార్గం పొందండి .
ఇక ఉద్యాపన విషయం వివరంగా . అని ఆయన -
ఈ లింగ దానము నోమునకు కార్తీక మాసం యోగ్యమైనది .శుచియై లింగమును ఆరాధించి పూజించి నమస్కరించవలెను . సుగంధ ద్రవ్యాలు తెప్పించి ,దక్షిణ ,తాంబూలం సిద్దం చేసుకుని బంగారు, వెండి ప్రమిదలతో నెయ్యి వేసి ఒత్తులు వేసి వెలిగించవలెను. అనంతరం మీ గ్రామాన గల ఉత్తములైన బ్రాహ్మణులలో ఒకరిని ఎన్నుకుని పిలిపించి ఆయనకు దాన మిచ్చి నమస్కరించవలెను. బ్రాహ్మణుడు భూసురుడని అనాది సిద్దంగా వస్తున్న విషయం . అందరికి తెలిసినదే .
ఇది సత్యం నిత్యం ఆయన ఆశీస్సులు పొంది ఇహ, పర సుఖములు పొందండి .
No comments:
Post a Comment