Saturday, August 18, 2012

కడుపు చెదరని గౌరీ నోము

పూర్వ కాలం నాటి మాట .ఆ రోజులలో ఒక గ్రామం .అ గ్రామాన ఒక బ్రాహ్మణ కుటుంబం .యజమాని సోమయాజులవారు ,ఆయన కొక కుమార్తె ,వివాహమైనది .అత్తవారింట అడుగు పెట్టింది .కాలం గడుస్తోంది .ఆమె తన మంచి తనంతో అందరి మెప్పు పొందుతోంది . మంచి కోడలు అనిపించు కుంటోంది .ఆదర్శంగా కాపురం చేసి కొంటోంది .

ఆమె గర్భవతి అయినది .అటు పుట్టింటి వారు ఇటు అత్తింటివారు అందరికందరూ సంతోషించారు. కానీ పాపం నాల్గవ నెల రాగానే గర్భం పోయింది . అది మొదలు ఆమెకు గర్భం నిలుచుట లేదు .కారణం తెలియడం లేదు .అందరూ విచారించేవారు . పాపం అంత మంచి పిల్లకు ఏమిటీ గర్భ భంగమని అనుకునేవారు .గర్భ విచ్చిన్నానికి కారణం తెలియక బాధ పడేవారు .

ఒక రోజున వారింటికి ఒక వృద్దురాలు పెరంటాలుగా వచ్చింది . ఆమెకు తమ కోడలి విషయం చెప్పుకున్నారు. ఆ ముసలి ముత్తయిదువ అమ్మా ! నీ కోడలి చేత కడుపు చెదరని గౌరీ నోము చేయించు. ప్రతిరోజూ ఉదయానే లేచి స్నానం చేసి కధ చెప్పుకొని అక్షతలు తలపై చల్లించు . 5 మానికల బియ్యపు పిండితో జిల్లేడు కాయలు చేయించి కొబ్బరి కాని ,నువ్వు పప్పు కాని పూర్ణం తయారు చేయించి పిండితో 25 ముద్దలు చేయించి 5 ముత్తైదువులకు దక్షిణ తాంబూలం ఇచ్చి వాటిని వాయన మిప్పించు . కజ్జికాయలు వండు సమయాన పొట్టలు విడిపోకుండా చూచుకోవాలి సుమా అని చెప్పి వెళ్లి పోయింది .అత్తమామలు భర్తతో ఆ నోము ఆచరించ మన్నారు .సోమయాజులు వారి కుమార్తె శ్రద్దగా నోము ఆచరించినది .పండంటి బిడ్డడు పుట్టాడు. మరి నోము ఫలమే అది .వ్రత మహత్యమే.

No comments:

Post a Comment