Saturday, August 18, 2012

బాలాదివారాల నోము

పూర్వకాలంనాటి మాట. ఆ కాలాన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు ఒక కుమారుడు,పేరు గణపతిశర్మ. వివాహమైనది. అతని భార్య కాపురానికి వచ్చినది. ఆమెపేరు సుబ్బలక్ష్మి. కొడుకు - కోడలు సుఖంగా కాపురం చేసుకుంటున్నారు. ఆ బ్రాహ్మణునకు ఒక కూతురు కూడా ఉంది. ఆమెకు వివాహం కాలేదు. ఆమె పేరు శ్రీదేవి.

ప్రతిరోజూ వారి యింటికి ఒక యాయవారం బ్రాహ్మణుడు వచ్చేవాడు. ఆయనకు బ్రాహ్మణుని కూతురు బియ్యం పెట్టేది. బియ్యం తీసుకొని ఆయన " గంగాస్నాన ప్రాప్తిరస్తు " అని దీవించి వేల్లిపోయేవాడు. ఒకనాడు ఆ దీవెన తండ్రి విన్నాడు. తల్లి కూడా వింది. వారిద్దరూ - ఏమండీ ! ప్రతీరోజూ మీరిలానే దీవిస్తున్నారా? ఈ దేవేన అంతర్ధానమేమిటి? అని అడుగగా, ఆయన అడిగారు గనుక చెబుతున్నాను. ఈమెకు వివాహం అయిన కొద్దికాలానికే భర్త చనిపోతాడు. వైధవ్యం సిద్ధిస్తుంది. అందుచేతనే ఇలా దీవిస్తున్నాను.

విన్నారు తల్లితండ్రులు. చాలా భాధపడ్డారు. వెంటనే వారు ఏమండీ ? ఈమెకు పసుపు - కుంకుమలు నిలుచు మార్గం లీడా? ఐదవతనం నిలబడే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని అడుగగా ఆయన తప్పకుండా చెబుతాను శ్రద్ధగా వినండి. మీ కుమార్తెకు వివాహం అయిన వెంటనే అల్లుడు మరణిస్తాడు. అ మరణించిన శవాన్ని భద్రపరచండి. భయపడకండి. మీ అమ్మాయిని గంగానదికి పంపండి. వెంట పసుపు - కుంకుమలను పొట్లాలుగా కట్టుకొని వెళ్లమనండి.

తిన్నగా గంగానదిని చేరగానే అక్కడ ఒక స్త్రీ అమ్మా నే తెచ్చుకొన్న పసుపు, కుంకుమ పొట్లాలు జారిపోయాయి. మీకు దొరికాయా? దొరికితే ఇవ్వండి అని అరుస్తుంది. ఆ అరిచే స్త్రీకి మీ కూతురు వెంట తీసుకొని వెళ్ళిన పొట్లాలను ఇవ్వమనండి. తరువాత పసుపు - కుంకుమ తన శరీరానికి పూసికొని గంగానదిలో స్నానం చేయమనండి.

అనంతరం ఇంటికి వచ్చాక 5 సొల్ల బియ్యం తీసుకొని పరామాన్నం వండించండి. మీ గ్రామాన ఉన్న ఒక ఉత్తమురాలిని పిలిచి ఆమెకు భోజనం పెట్టి పరమాన్నం వడ్డించండి. ఆమె ప్రక్కనే కూర్చుని మీ కుమార్తెను కూడా భోజనం చేయమనండి. అనంతరం కొత్త బట్టలు, దక్షిణ, తాంబూలం సిద్ధం చేసుకొని ఆమెకు వాయనం మిప్పించండి. శ్రద్ధగా భక్తితో చేయించండి. మానిమ్చిన భర్త బ్రతుకుతాడు.

వ్రత లోపం జరుగరాదు. శ్రద్ద అవసరం. భక్తీ ముఖ్యం, లక్ష్యం, ధ్యేయం ప్రధానం. అన్నిటికీ మించినది నమ్మకం సుమండి అని చెప్పి అ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. అనంతరం బ్రాహ్మణ దంపతులు తమకుమర్తెచే వ్రతం జరిపించారు. వ్రత ఫలితంగా ఆమె భర్త బ్రతికాడు. నూరేండ్లు నిండుగా హాయిగా సుఖముగా జీవించారు వారిద్దరూ.

ఈ వ్రతం ఆదివారాలలో చేయాలి. అన్నీ వివరముగా తెలిసికొని జరపండి. తప్పక ఫలం సిద్ధించగలదు. దైవ శక్తి ముందు ఏది నిలువలేదు.

No comments:

Post a Comment