Saturday, August 18, 2012

అట్లతద్దెనోము

ప్రాచీనకాలం నాటి మాట. ఒక రాజుగారి అమ్మాయి తన చలికత్తెలతో అట్లతద్దె నోము నోచినది. చలికత్తెలందరూ ఉపవాసముండిరి. రాచకన్య మాత్రం సుకుమారి కావడంవల్ల ఉపవాసముండి సాయంకాలానికి సొమ్మసిల్లి పడిపోయినది. అంత ఆమె సోదరుడు చేట్టునకొక అద్దము వ్రేలాడదీసి చంద్రోదయ మైనది భోజనం చేయవచ్చును అని అరిచాడు. పాపం నిజమనుకొని ఆ రాచబిడ్డ వాయన మందించి భోజనం చేసినది.

వ్రతమున లోటు కలగడం వల్ల ఆమెకు మంచి సంభంధం కుదరలేదు, రాలేదు. తన తోటి వారందరికి వివాహాలయిపోయాయి. ఆమె విచారించి గ్రామాన గల కాళికాలయమునకు పోయి - " అమ్మా! అందరిలా నీనూ వ్రత మాచరించాను. వారందరకీ వివాహాలు అయ్యాయి. నాకు మాత్రం కాలేదు. అందుకు కారణం తెలుపుమమ్మా" అని అడిగిందామె. అంత గౌరీ ఆమె చేసిన లోటును, పొరపాటును గుర్తుచేసి మరలా చేయమన్నది. రాచబిడ్డ తప్పుతెలుసుకొని మరల అట్లతద్దె నోము నోచినది. ఆనాడే ఆశ్వేయుజమాసం బహుళతదియ కావడంవల్ల ఆమె యాధావిధిగా వ్రత మాచరించింది. ఫలితంగా తగిన యోగ్యుడైన వరుడు లభించాడు. వ్రత ఫలితంగా ఆమె తన భర్తతో హాయిగా సుఖంగా జీవించింది. ఉద్వాసన వినండి.

ఈ వ్రతము ఆశ్వీయుజమాస మందలి బహుళ తదియనాడు ఉపవసించవలెను. చంద్రోదయమయ్యే వరకూ ఏమి ముట్టకూడదు. గౌరీ దేవికి 10 అట్లు నివేదన చేయవలెను. అలా 9 సంవత్సరములు జరుపవలెను. పదవ సంవత్సరము 10 మంది ముత్తయిదువులకు తలంటి స్నానం చేయించవలెను. పదిమందికి పడేసి అట్లు, పసుపు, కుంకుమ, రవికెలగుడ్డలు, దక్షిణ, తాంబూలం, సమర్పించి సంతృప్తిగా భోజనం పెట్టవలెను.

No comments:

Post a Comment