పూర్వకాలమునాటి మాట. ఆ కాలాన ఒక రాజ్యం. ఆ రాజ్యాన్ని ఒక రాజు పాలించేవాడు. ఆయనకు ఒక కుమార్తె. పేరు రాజ్యలక్ష్మి. ఆ రాజుగారికి ఒక మంత్రి. ఆయన పేరు రామశాస్త్రి. ఆయనకు ఓకే అకుమార్తే. ఆమె పేరు శ్రీలక్ష్మి. ఒక సంవత్సరాన రాజు కూతురు, మంత్రికూతురు భాగ్యాదివారాల నోము నోచారు. మంత్రిగారి కుమార్తె శ్రీలక్ష్మి లక్ష్యంతో నోము నోచినది. ఫలితంగా సర్వసుఖాలూ, సమస్త భోగాలు అనుభవించింది. రాజుగారి కుమార్తె రాజ్యలక్ష్మి ధనగర్వంతో ఆ వ్రతాలూ, నోములూ ఏమిటి ? ఏదో నోయమన్నారు అని నోచానుగాని అని నిర్లక్ష్యంగా వర్తమాచరించింది. ఫలితంగా అష్ట కష్టాలు పడింది. ఎన్నో బాధలు అనుభవించింది.
చివరకు అడవులపాలై దారీ తెన్నూ కానక తిరుగుతోంది. అంట ఆమెకు శివపార్వతులు కనిపించారు. వారా రాచ బిడ్డను పిలిచి ఆమె చేసిన అపరాధం తెలిపి - అమ్మా! నీవు మరలా భాగ్యాదివారాల నోము నోయి. వ్రతమాచరించు చు. బాధలుండవు. దుఖముండదు. విచారింపవలసిన పనిలేదు. అని చెప్పి అదృశ్యమయ్యారు. ఆమె ఆ ఆది దంపతులు చెప్పినట్లుగానే వ్రతమాచరించి తిరిగి సర్వసంపదలు పొంది ఇహమందు సుఖపడి, పరమందు మోక్షమందింది.
ఇక ఉద్యాపన వినండి. ఒక చక్కని పట్టుబట్ట తెప్పించు కోవాలి. దానితో అంచులు మాత్రం విడిచి మిగిలిన రవిక తాయారు చేయించుకోవాలి, ఆ రవికెను ఒక చేటలో పరచాలి. అందు మంగళ సూత్రం, నల్లపూసలు, పసుపు, కుంకుమ, దక్షిణ, తాంబూలం, ఉంచి చేత మూట వేసి ఒక బ్రాహ్మణ ముత్తయిదువునకు వాయన మీవలెను. సంవత్సర మంతా ఈ కథ చెప్పుకోనుచూ పవిత్రక్షతలు శిరమున జల్లుకొనవలెను. ఒంటి పూట భోజనం చేయవలెను.
నేలపై పడుకోనవలెను. దీక్షాది కాలాన శివపార్వతులను స్మరించుకుంటూ పూజించవలెను. తప్పక ఫలం లభించగలదు.

No comments:
Post a Comment