Saturday, August 18, 2012

ములగ గౌరీ నోము


పవిత్ర భారత దేశాన ఆంధ్ర ప్రదేశ్ ఒక రాష్ట్రము .ఆ రాష్ట్రాన పశ్చిమ గోదావరి జిల్లాలో గల పాలకొల్లు పట్టణం . ఆ పట్టణ మందు భక్తులందరూ పురాణ పండ పండితుని ఉపన్యాసాలు ఏర్పాటు చేశారు . ఉపన్యాస కేసరి ,ఉపన్యాస సార్వభౌమ , పురాణ వాచస్పతి అని బిరుదులు గన్న పురాణ పండ పండితుడు వేదికపై పుంభావ సరస్వతిలా విరాజిల్లు తున్నాడు. ఇష్ట దేవతా ప్రార్ధన ముగించి ఉపన్యాసం మొదలిడ సాగాడు. ఇంతలో ఒక భక్తురాలు అయ్యా ! గురువు గారూ ములగ గౌరీ నోము గురించి వివరించి చెప్పండి అని కోరగా సరేనని చెప్పారు. వారు చెప్పినది ఇక్కడ పొందు పరుస్తున్నాను.

పరమ పవిత్రమైన వ్రతమిది .ఆచరించ వచ్చును. ముందుగా ఈ విషయం తెలుసు కొనవలెను.

"జయము అయిదవ తనము
సిరిసంపదలు కలుగు
నోము నోచిన వారు
ములగని పలుకరాదసలు
ములగ  తినకండి మీరు
ములగ నీడకు పోకండి మీరు
అటులాచారించిన కలుగు
సంపదలు భోగ భాగ్యాలు."

అని పటించి పవిత్రాక్షతలు శిరసున జల్లుకోనవలెను. సంవత్సరాంతమున మాఘ శుద్ధ సప్తమి గాని పౌర్ణమి గాని వ్రతం పూర్తి చేసుకోవాలి. అట్టివారికి జయము, సంపద, అయిదవ తనము కల్గును. ఇక ఉద్యాపన వినండి . 12 మంది ముత్తయిదువులను పిలిచి 12 వాయినాలు సిద్దం చేసుకొని అనగా 24 ములగ కాడలు , 2 ఆకులు గల 12 ములగ రెమ్మలు , నల్లపూసలు, లక్కజోళ్ళు, దక్షిణ ,తాంబూలం సిద్దం చేసుకుని పేరంటాళ్ళకు అందియ్యవలెను . భక్తితో చేసిన ఫలం లభించ గలదు.

No comments:

Post a Comment