" మోచేతి పద్మము మూగ నోము, ఇది ఎంతో పుణ్యాల నోము
మూగ వ్రత మిది తల్లి , మూగ నోమిది చెల్లి "
పుట్టింట మెట్టింట సిరి సంపదలు కలుగు
అన్నలూ ,తమ్ములూ ఆచరించే నోము
భావలూ , మరదలూ సుఖపడే నోము
పుత్రికలు ,పుత్రులు హాయి నొందే నోము
ఆయుష్షు ,ఆరోగ్య మైశ్వర్య మిచ్చేటి నోము
అంతమందున మోక్షంబు కలుగ జేయు "
అని ప్రతి దినము పత్రాక్షతలు శిరసున దాల్చు కొనవలెను . ఈ నోము ఆశ్వీయుజ బహుళ అమావశ్య నాడు ప్రారంబించి కార్తీక శుద్ధ పౌర్ణమి వరకు ఆచరించ వలెను. ఒకే పూట భోజనం చేయవలెను. నేలపై పండు కొనవలెను . సాయంకాలం ఇంటనున్న తులసి వద్ద శుబ్రం చేసి 4 పద్మములు పెట్టి ,4 దీపములు వెలిగించ వలెను . నలుగురు ముత్తయిదువులకు అలంకారం చేసి 4 నక్షత్రాలను లెక్కపెట్ట వలెను. నాలుగు చొప్పున నలుగురికి అట్లు వాయన మివ్వవలెను . అంతవరకు మౌనంగా ఉండవలెను .అనంతరం రెండు చేతుల మీద ,రెండు కాళ్ళ మీద మొత్తం నాలుగు అట్లు పెట్టుకుని , పైసలుంచు కుని " తిను సమయాన మాకు తిరిగి మా యింటి కూలి అని అనగా నోము నాచరించిన వారి తమ్ముడు తలుపు చాటున నిలబడి ఇప్పుడు రమ్మంటావా ! మరెప్పుడు రమ్మంటావు " అని అనగా వ్రత మాచరించు వారా - ఇప్పుడే రమ్మనవలయును. అంత తమ్ముడు వచ్చి గ్రంధంతో గాని, కాగితంతో గాని ఆమెను నాలుగు దెబ్బలు కొట్టాలి .డబ్బులు అట్లు తీసుకోవాలి . అలా మొదటి సంవత్సరం ,వరుసగా ముగ్గులు , ఎనిమిది దీపములు, ఎనిమిది మంది ముత్తయిదువులకు 8 అట్లు వాయన మీయాలి, 8 అట్లు కానుకలు ,8 దెబ్బలు తినాలి.అనంతరం మూడవ మూడవ సంవత్సరం పన్నెండు చొప్పున సమకూర్చు కోవాలి. తప్పక ఫలం చేకూరుతుంది . నాస్తికులకు ఫలితముండదు .
No comments:
Post a Comment