Saturday, August 18, 2012

ముప్పది మూడు పున్నముల నోము


అదో పల్లెటూరు .ఆ ఊరిలో ఒక రైతు .అతడికో కుమారుడు కుమార్తె .కుమార్తెకు వివాహమైనది .ఆమె కాపురానికి వెళ్ళినది. ఆమె భర్త ఆరోగ్యం పాడైనది. రోజు రోజుకూ ఆ జబ్బు పెరిగి పోసాగినది . జీవిస్తాడన్న ఆశ పోయింది . పాపం ఆమె మగని కనిపెట్టుకుని అక్కడే ఉండిపోయింది .

ఇంతలో పొరిగింటి వారి కోడలు ముప్పది మూడు పున్నములు నోము నోచి వాయన మందుకొనుటకు ఎవరూ లేక మగని వద్ద కూర్చున్న రైతు కూతురు ఇంటికి వచ్చి వాయనం అందుకొందును రమ్మంది . సరేనని వెళ్లి వాయనం అందుకుని తిరిగి వచ్చే సరికి మగడు హాయిగా లేచి కూర్చున్నాడు . అటు ఇటు తిరగసాగాడు .

అంత ఆమె వాయనం అందుకుంటేనే ఫలితం చేకూరిందే నోము నోచిన ఎట్టి ఫలిత ముండునో యని వ్రత విధానం తెలిసికొని నోము నోచింది . అంతే మగడు సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు జీవించాడు. నోము ఫలంగా సర్వ సుఖాలు పొందారు. ఇహ మందు పరమందు మోక్ష మందారు .

ఇక ఉద్వాసన వినండి. ప్రతిరోజు తెల్లవారు జామున లేచి కాలకృత్యాలు నెరవేర్చుకుని స్నానం చేసి కధ చెప్పుకుని పవిత్రాక్షతలు శిరసున ధరించి ఒక సంవత్సర కాలం అలా జరిగిన తరువాత ఒక పెరంటాలిని ఇంటికి ఆహ్వానించి అభ్యంగన స్నానం చేయించి ముప్పది మూడు గంట్లున్న ఒక కొత్త జల్లెడలో 33 అట్లు , రవికెల గుడ్డ , దక్షిణ తాంబూలం , నల్లపూసలు , అవి వక్కలు, అవియాకులు , జాగ్రత్తగా ఉంచి పైన పాత జల్లెడ బోర్లించి వాయన మీయవలెను.

భక్తి శ్రద్దలతో ఆచరించిన తప్పక ఫలితం కలదు. అన్ని వర్ణాల వారు ,అందరూ ఆచరించ వచ్చు. అందరికి ఒకే రకమైన ఫలితం ఉంటుంది. నమ్మకం ముఖ్యం.

No comments:

Post a Comment