Saturday, August 18, 2012

మాఘది వారాల నోము


పూర్వ కాలం నాటి మాట. ఆ కాలాన ఒకానొక రాజ్యం .ఆ రాజ్యాన్ని ఒక రాజు పాలించే వాడు .ఆయనకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య భూలక్ష్మి. చిన్న భార్య శ్రీలక్ష్మి .పెద్ద భార్య ఉత్తమురాలు . చిన్న భార్య అన్ని విషయాలలో నూ చెడ్డదే . రాజుకు ఆమెయన్న మిక్కిలి మక్కువే . రాజు అండ చూసుకుని చిన్న భార్య పెద్ద భార్యను రాజ్యం నుండి పంపించేసింది . పాపమామె గర్భవతి .నీచ రాజకీయాలు తెలియక కర్మ ప్రారబ్ధం అని ఆమె అడవుల పాలై తిరుగుతోంది .

ఒకనాడు ఆమెకు సోమయాజులు గారి భార్య సోమిదేవమ్మ మాఘపాది వారాల నోము నోచి కధ వినే వారు దొరకక వెతకగా వెతకగా ఆమె దొరికింది. ఆమెను ఇంటికి తీసుకుని వెళ్లి అభ్యంగన స్నానం చేయించి ,చక్కని భోజనం పెట్టి కధ చెప్పి వాయన మిచ్చింది.

అంత ఆమె తన కధను ఆమెకు చెప్పుకొని తనను ఆపదల నుండి కాపాడ మంది. సోమిదేవమ్మ మాఘపాది వారాల నోము నోయమంది . ఏ బాధలు ఉండవు అని దగ్గర ఉండి నోము నోయించింది .వ్రతఫలం వెంటనే పనిచేసింది .రాజు తాను చేసిన తప్పును తెలిసికొని వెంటనే భటులను పంపి రాణి ని వెతికించి రాజ్యానికి రప్పించాడు. ప్రేమాను రాగాలతో చూసుకున్నాడు.నోము ఫలంగా ఆమె ఇహమందు సుఖ పడి పరమందు మోక్షమందింది .

ఇక ఉద్యాపన .అయిదుగురు ముత్తయిదువులను ఇంటికి పిలిపించండి .తలంటి స్నానం చేయించండి . పసుపు, కుంకుమ ,రవికెల గుడ్డలు , పిండి వంటలు సిద్దం చేసుకుని దక్షిణ ,తాంబూలం ఈయ వలెను. 5 బూరెలు ,7 గిన్నెలతో పరమాన్నము ,7 గిన్నెలతో మంచి పెరుగు నైవేద్యం పెట్టవలెను. ఆ నివేదనతో 10 మందికి భోజనం పెట్టవలెను . పేరంటాలిని పిలిపించి ఊయల గట్టె చీర  ,ఉగ్గు గిన్నె , అంగ వస్త్రము సమర్పించండి . శ్రద్దా భక్తులతో చేసిన వారికి తప్పక ఫలం సిద్దించ గలదు.

No comments:

Post a Comment