పూర్వకాలంనాటి మాట. ఆ రోజులలో ఒక గ్రామాన ఒక యువకుడు. అతడు ఒకనాడు తన సోదరిని చూచి రావాలని ప్రక్క గ్రామమునకు బయలుదేరాడు. సాయంకాలం అయ్యేసరికి నెమ్మదిగా నడిచి చెల్లెలి ఇంటికి వెళ్ళాడు. ఆన్నాను ఆహ్వానించింది. చెల్లెలు ఎంతగానో సంబరపడిపోయింది. కష్ట - సుఖాలు మాటాడింది. కుశల ప్రశ్నలు అయాక రాక రాక తన ఇంటికి వచ్చిన అన్నకు మంచి పిండివంటలతో శాక - పాకాలతో భోజనం తయారు చేయ నారంభించింది. పోపు పెట్టె సమయానికి (తాలింపు) కరవేపాకు వంటివి ఇంట్లో లేకపోవటం వల్ల అన్నాను పిలచి దొడ్లో దూరంగా ఎక్కడో మూలవున్న కరివేపాకు మొక్క చూపించి - అన్నయ్యా! తాలింపులోకి రెండు రెబ్బలు విరుచుకురారా అని పంపింది. ఆమె తన పనిలో నిమగ్న మయింది.
అన్న చెట్టు దగ్గరకు వెళ్లి కరివేపాకు కోస్తుండగా విధి వశాన ఎక్కడనుంచో వచ్చి విశ్రాంతిగా పరున్న పాము అతడిని కరిచింది. అంతే మాట లేకుండా నురగలు క్రక్కుతూ అతడు మరణించాడు. పాపమాచెల్లెలు భోరుభోరున ఏడ్చింది. విధి బలీయం. ఎవరూ ఎదిరంచలేదు. చూడ్డానికి వచ్చి చచ్చిపోయావా అని విలపించింది. కాలం కాటేయడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. కాల పురుషునకు లొంగని వారు లేరు. అవతార పురుషులకే సాధ్యం కాలేదు. సామాన్యులొకలెక్కయా?
పాపం పిండి వంటలతో భోజనం పెట్టలని ఆశ పడింది. ఇంతలో ఇలా ముంచుకొచ్చింది. పాపమా చెల్లెలు అన్న పోయిన దుఃఖంలో ఉండగా గ్రామాన ఉన్న ఒక బ్రాహ్మణ ముత్తయిదువ పరుగున వచ్చి - అమ్మా ! బాధపడకు ఇప్పుడు నీవు ఏడ్వడం కాదు. నాతోరానీ పుట్టింటికి ఏఆపద రాకుండా ఒక నోము గురించి చెపుతాను. దానిని ఆచరించు అన్ని బాధలు తొలగిపోయాయి. సుఖంగా ఉండవచ్చు. అం ధైర్యం చెప్పి పార్వతీ దేవిలా ఉన్న ఆమె చేల్లెలిచే బచ్చలిగౌరీ నోము నోయించింది.
అంతే నోము ఫలంగా మరణించిన అన్నగారు నిద్రనుండి లేచి కూర్చున్నట్లుగా కూర్చున్నాడు. చెల్లెలు పరమానంద భరితురాలై పోయింది. సంతోషించింది. చక్కగా భోజనం పెట్టి పంపింది. వ్రతఫలం మరణించిన అన్న లేచి కూర్చున్నాడు
ఇక ఉద్వాసన వినండి. తెల్లవారు జామున లేచి స్నానం చేయాలి. బచ్చలకాడ తెప్పించుకోవాలి. అలాటిదే వెండితోనూ బంగారు తోనూ తయారు చేయించుకొని సిద్ధం చేసికోవాలి. అంతేకాదు ఆకులతో వున్నా పువ్వుకూడా సిద్ధంగా ఉంచుకోవాలి. కొత్తబట్టలు, దక్షిణ, తాంబూలం సిద్ధంగా ఉంచుకొని మీరున్న ప్రాంతాన ఒక మంచి ముత్తయిదువునకు వాయన మీయాలి. మంచి మనసుతో నిర్మలంగా భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. పుట్టింటి వారికీ ఏ ఆపదా వుండదు. అ గౌరమ్మ తల్లి చల్లగా కాపాడుతుంది. అమ్మదయ ఉండాలేగానీ ఏ కొరతారాదు. సుఖ, శాంతులు, సంపద, భోగభాగ్యాలు, సిద్ధిస్తాయి. నమ్మకం ముఖ్యం సుమండీ.
పుట్టింటి సుఖం కోరే ఆడువారందరూ ఈ వ్రతం చేయవచ్చును. నమ్మిక లేని వారు మాత్రం వ్రతమాచరించవద్దు అని మనవి. చిత్త శుద్ధి లేనివారికి ఫలం శూన్యం సుమండీ. అలోచించి ఆచరించండి.

No comments:
Post a Comment