Saturday, August 18, 2012

చల్ల చిత్త నోము

అది పవిత్ర గోదావరీ నదీ తీరం. ఆ తీరాన రాజమహేంద్రవరం. ఆ పట్టణాన రామకృష్ణ మటం. ఆ పరమ పవిత్రమైన మాట ప్రాంగణంలో గురువుగారు అని పిలబడే రామమూర్తి శాస్త్రి భారతోపన్యాసాలు. వారు ప్రతిరోజూ స్యంత్రం 5 గంటలనుండి 7 గంటలవరకు ఉపన్యాసం చెప్పేరోజులవి. ఆ బాల గోపాలము సరిగా సమయానికి అక్కడే చేరేవారు. వారు చెప్పే ప్రతినిమిషం శ్రద్ధగా వినేవారు. ఎందరొచ్చిన నిశబ్దంగా ఉండేది.

ఒకనాడు గురువుగారు ఉపన్యాసం ప్రాంభించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతలో సభనుండి ఒక స్త్రీ పేరు కాశీఅన్నపూర్ణాదేవి. ఆమె గురువుగారూ ఈనాడు ముందుగా ఒక నోము వివరించి ఆ తరువాత భారత ఉపన్యాసము ప్రారంభించండి. అది మా స్త్రీలకూ ఉపయోగపడే విషయం, తప్పక తెలియజేస్తారని ప్రార్ధిస్తున్నాను. అని ఆమె కూర్చుంది. విన్నారు శాస్త్రి గారు. పూర్వకాలన పార్వతికి శివుడు చెప్పిన "చల్ల చిత్త నోము " గురించి చెప్పారు. ఆనాడు నేనూ ఆ సభలో ఉన్నాను. అంతా విన్నాను. అదే ఇందు పొందుపరుచుచున్నాను. మీరూ తెలిసికోండి, ఆచరించండి.

ఈ నోమును నోచిన చల్లగా ఉంటారు. "సిరులబ్బి, పాడి వుండు పంట మెండు, ఇల్లాలి కాలి మట్టెలు ఘల్లుమని మ్రోగు" అని అంటూ అక్షతలు శిరసున చల్లుకోవాలి. ప్రతినిత్యం మజ్జిగచేయు సమయాన పాత్ర చుట్టూ పడ్డ మజ్జిగలో పసుపు కలపాలి. దానిని 5 గురు పేరంటాండ్రకు పూయాలి, బొట్టుపెట్టాలి. అల సంవస్తరము చేయాలి. అనంతరం చివరగా ఒకరోజు ఇంటనున్న పాలన్నియు తోడుపెట్టి చిలికి ఆ మజ్జిగను వెన్ననూ భద్రపరచి శుభ్రంగా వుంచి ముత్తయిదువునకు పిలిచి దక్షిణ ఇచ్చి తాంబూలం సమర్పించి మేకు వెన్నతో కూడిన మజ్జిగను వాయన మీవలెను. ఈ నోము నోచినప్పుడు దీనితో చిట్టి బొట్టు నోము కూడా నోచుకొనవచ్చును. భక్తితో శ్రద్ధగా ఈ నోమును సంవత్సరకాలం చేయాలి. అప్పుడే ఫలితం. మధ్యలో ఆపరాదు. నమ్మకం అవసరం. విశ్వాసం లేనివారు నోములు నోయ నవసరంలేదు. వ్రతములు ఆచరించ నక్కరలేదు. నమ్మిక ముఖ్యం సుమండీ. ఈ ఇరవైయ్యవ శతాబ్దిలో కూడా ఈ మూడనమ్మకాలా ఆనవచ్చు. ముందే చెప్పాను అలా అనేవారు ఆచరించనవసరం లేదు.

ఇందలి అంతరార్ధం తెలిసుకొని వ్యవహరించాలి. వ్రతములు, నోములు కేవలం పుణ్యానికే కాదు. ఎంతో అంతరార్ధం ఇమిడియున్నది. మీమీ మనసులో మేదస్సులతో ఆలోచిస్తే అంతా మీకే అర్ధమౌతుంది. అంతేగాని ఎవరో చెప్పాలి చెయ్యాలి అని ఆలోచించకూడదు. ప్రతి పనియందు ఒక అంతరార్ధం నిండి ఉంటుంది. మన పూర్వులు ఎంతగానో ఆలోచించి వీటిని ప్రపంచానికి అందించారు. అందుకోండి, ఆచరించండి, ఇహము, పరము కూడా.

చల్ల చిత్త నోము నోచి చల్లగా ఉండండి.
చల్ల చిత్త నోము నోచి హాయిగా ఉండండి
చల్ల చిత్త నోము నోచి సిరి, సంపదలందండి
చల్ల చిత్త నోము నోచి పాడి పంటలందుకోండి
పుణ్యమైన నోము పవిత్రమైన వ్రతమిది
నోచి ఆచరించి మీరు ఫలసిద్ధిని పొందండి
ఇహమందున సుఖపడండి
పరమందున సుఖపడండి
ఇహ, పర సుఖదాయిని
ఈ నోము ఆచరించండి

No comments:

Post a Comment