అది పరమపవిత్రమైన వసిష్ఠ నదీ తీరం. పశ్చిమ గోదావరిజిల్లా. అజిల్లాలో భీమవరం అనే పేరుగల పట్టణమందు శివాలయంలో పురాణపండ పండితుడు పురాణ ప్రవచనం చేస్తున్నారు, వారి ఉపన్యాసం వినడానికి జనం తండోపతండాలుగా వచ్చేవారు. ఉపన్యాసం విని నాస్తికులు ఆస్తికులుగా మారారు. అంతటి ప్రతిభా సంపత్తి గల ఆయన వేదికపై నిలబడి గంభీరగళంఎత్తి ఉపన్యాసం ప్రారంభించసాగారు. ముందుగా ఇష్ట దేవతను ప్రార్ధించారు. అనంతరం విషయం లోకి వెళ్ళే ముందు ఉద్యక్తులు కావడంతో ఒక భక్తురాలు లేచి - " అయ్యా! మీరీనాడు ఒకనోమును గురించి వివరంగా చెప్పి అనంతరం కథలోకి వెళ్ళండి" అని వినయంగా అడిగింది. విన్నారు ఆయన, సరేనని చిత్ర గుప్త నోము గురించి చెప్పసాగారు. ఈ నోమును గురించి శివుడు పార్వతికి వివరించాడు. అదీ నీను మీకు చెబుతున్నానని ప్రారంభించసాగారు.
పూర్వకాలం ఆ కాలాన రాజుగారి భార్య మరియు మంత్రి గారి భార్య వ్రతం చేసారు. మంత్రిగారి భార్య చిత్రగుప్త నోము నోచినది. కానీ రాజుగారి భార్య ఆ నోము నాచరించలేదు. కాలం గడుస్తోంది. శత్రువులు ఆ రాజ్యం పై దండెత్తారు. రాజు ఓడిపోయాడు. అంట అ ప్రభువు అంతఃపుర స్త్రీలను మరణించమని ఆదేశించగా రాజుభార్య, మంత్రిభార్య మరణించారు.
అంత యమదూతలు వారిద్దరినీ యమధర్మరాజు వద్దకు తీసుకోనిపోయారు. యముడు చిత్రగుప్తుని పిలిపించి వీరి పుణ్య - పాపములు తెలియజేయమనగా చిత్రగుప్తుడు ప్రభూ! మంత్రిభార్య అన్నే మంచిపనులే చేసినది. అందుకే ఆమెకు పుణ్యలోకములు ప్రసాదించండి. ఇక రాజు భార్య చిత్రగుప్త నోము నోచలేదు. తగిన విధంగా శిక్షించండి అని పలుకగా విని రాజు భార్య - యమధర్మరాజా! నన్ను మన్నించండి. నేను పొరపాటున ఈ వ్రతం చేయలేదు. అనగా యముడు మహారాణీ! నీకు మరల ప్రాణం పోస్తున్నాను. తిరిగి భూలోకం వెళ్లి చిత్రగుప్త వ్రతం చేయి. మరలా రాజ్యం సిద్ధించగలదు. నీ ప్రభువు నీకు దక్కగలడు, వెళ్లి అని యముడు ఆమెను భూలోకం పంపాడు.
అంత మహారాణి భూలోకం చేరి యమధర్మరాజు చెప్పినట్లు చిత్రగుప్త నోము నోచినది. వ్రత ప్రభావం వలన రాజు ఆమెకు లభించాడు. మరలా మహారాణి అయినది. సకల భోగములు అనుభవించినది. ఇక ఉద్యాపన వినండి. ఒక సంవత్సర కాలం కథ చెప్పుకోవాలి. పవిత్రాక్షతలు శిరస్సున చల్లుకోవాలి. 5 కుంజముల ఎద్దులు తొక్కని ధాన్యం కట్లు కట్టని గంపలలో ఉంచాలి. 5 షేర్లు బియ్యం సిద్ధం చేసుకోవాలి. 5 మూరల పట్టు వస్త్రం తెప్పించి గుమ్మడి పండుతో సహా దక్షిణ సమర్పించి తాంబూలంతో ఒక పండితునకుగాని పురోహితునకుగానీ లేదా తోడబుట్టినవారికి గాని అందీయాలి. శ్రద్ధా భక్తులతో ఆచరించాలి. తప్పక ఫలితం గలుగును. ఆచరించి ఇహమందు సుఖపడి పరమందు మోక్ష మందండి.
అని శివుడు పార్వతికి తెలిపిన ఈ వ్రత కథను పురాణ పండితులవారా సభలో చెప్పగా పొందుపరచి ఈ గ్రంధములో మీ కందించాను. అందుకొని స్త్రీలందరూ ఆచరించి సర్వసౌఖ్యాలు పొందండి.

No comments:
Post a Comment