పూర్వకాలాన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన హరిభక్తుడు. మాహావిష్ణువు ప్రత్యక్షం కావడంతో ఒక కుమార్తెను ప్రసాదించమని కోరాడు. అంట విష్ణువు ఐదవతనం లేని ఆడబిడ్డను ప్రసాదించాడు. ఆ బిడ్డ పెరిగి పెద్దదైనది. తండ్రి ఆమెకు ఒక రాతి విగ్రహానికి ఇచ్చి వివాహం చేసాడు. అంతే ఆ విగ్రహం పగిల్పోయింది. అది చూసి ఆమె దిగులుగా మంచం పట్టింది. అందరూ ఆమెను ఇలో నారాయణమ్మ అని అనసాగారు, పిలువసాగారు.
ఒకనాడు మహావిష్ణువు ఆ అమ్మాయి యింటిముందు నుండి పోసాగారు. అప్పుడు ఆమె కోపంతో అలుకు పాత్ర విసరింది అందులో ఒక కంది గింజ ఉంది. దానిని తీసి విష్ణువు ఒక అడవిలో భూమిలో పెట్టాడు. అది కొన్నాళ్ళకు చెట్టు అయినది. ఇంతలో నారాయణమ్మ మరణించింది. ఆమె మరలా దరిద్రురాలిగానే జన్మించింది. ఆ కంది మొక్క దగ్గరకు పోయి కందికాయలు తింటూ జీవించ సాగింది. హరిని స్మరించుకుంటూ రోజులు గడుపుతోంది.
హరి దర్శనమిచ్చాడు. చిలుకముగ్గులనోము నోచామన్నాడు. అంతా వివరించి చెప్పాడు. హరి చెప్పినట్లు ఆమె చేసినది. ఆమెకు స్వర్గలోకం ప్రసాదించాడు శ్రీహరి. ఇక ఉద్యాపన వినండి.
ఈ నోమును ఐదు సంవత్సరములు నోచాలి. ఈ ఐదు సంవత్సరాలలో ఏదో ఒక సంవత్సరము 5 శేర్ల బియ్యంతో అప్పాలు చేయవలెను. 15 అంగవస్త్రాలు, 15 చెంబులు లేదా గ్లాసులు 15 మంది బ్రాహ్మణులకు సమర్పించాలి. అంతరం 5 గురు ముత్తయిదువులకు చీర, రవిక, పసుపు, కుంకుమలు, శక్తికొలది దక్షిణ, తాంబూలాదులు సమర్పించాలి. అందరికి భోజనం పెట్టాలి. ఫలితం లభించగలదు.
చిలుక తొక్కిన ముగ్గు కావున ఈ నోముకు చిలుక ముగ్గులనోమని పేరు వచ్చినది.

No comments:
Post a Comment