Saturday, August 18, 2012

కళ్యాణ గౌరీ నోము

ఈ వ్రతమునకు గాని ,నోమునకు గాని ప్రత్యేకమైన కధ లభించలేదు . పరిశీలనకు ,పరిశోధనకు నేను తీసికున్న గ్రంధాలలో ఏ ఒక్క గ్రంధ మందూ ఏ విధమైన వివరణతో కూడిన కధ లభించలేదు. అందుచేతనే నేను కూడా ఈ గ్రంధ మందు పాటకులకు వివరంగా ఉద్యాపన అందించ లేక పోయాను . ఈ కళ్యాణ గౌరీ నోము స్త్ర్రీలందరూ ఆచరించ వచ్చును. ఈ నోము నోచినవారు ముందుగా కళ్యాణ గౌరీ వ్రతం పట్టిన కలిమి మిన్నకు కడలేని ఐదవ తనము కలుగు

నిత్య కల్యాణం పచ్చ తోరణంబు
కావలసినంత కడుపు పంట పండు
కామితార్ధము లీడేరు ఫలసిద్ది కలుగు .

అని చెప్పి ప్రతి దినం స్నానం చేసి శుచిగా అక్షతలు నెత్తిన వేసుకొనవలెను.

ఒక ముత్తయిదువునకు చక్కగా తల దువ్వి బొట్టు పెట్టి ఆమెనే సాక్షాత్తుగా గౌరీ దేవిగా భావించి పవిత్రంగా శుచిగా భక్తి శ్రద్దలతో వినయ విదేయలతో ఆమెకు నమస్కరించాలి . అలా మూడు వందల అరవై రోజులు ఆచరించి సంవత్సరాంతమున సుగంధ ద్రవ్యములు ,పసుపు, కుంకుమ ,పండ్లు ,పూలు , మట్టెలు , మంగళ సూత్రం ,రవిక ,చీర , వీటితో బాటు తాంబూలం ఉంచి మంగళ సూత్ర ధారణ జరిగిన పెండ్లి కుమార్తెకు వాయన మివ్వవలెను . ఉద్యాపన పైన వివరించి నట్లు చేయవలెను. కళ్యాణ గౌరీ తప్పక మీకు శుభములు చేయగలదు. నమ్మకంతో ,విశ్వాసంతో ఈ నోము నాచరించి ఫల సిద్ది పొందండి. స్త్రీలందరూ నోయ తగ్గ వ్రత మిది.

No comments:

Post a Comment