పూర్వ కాలము నాటి మాట .ఆ రోజులలో ఒక బ్రాహ్మణ కుటుంబం .వారికొక కుమార్తె జన్మించినది. ఆమె అకారణంగా ఏడుస్తూ ఉండేది. ఎవరూ ఆ ఏడ్పు మాన్పలేక పోయారు . నిత్యం ఆ గోల పడలేక ఇరుగు -పొరుగు వారందరూ కలసి పాప ఏడుపు కారణంగా ఆ కుటుంబాన్ని అక్కడ నుండి వెడల గొట్టారు. చేసేది లేక ఆ బ్రాహ్మణుడు కుటుంబంతో ఒక అడవి చేరుకున్నాడు. విచారిస్తూ కూర్చున్నాడు .ఏం దారి తోచలేదు. వెక్కి వెక్కి ఏడవ సాగాడు. అంత శివుడు పార్వతీ దేవితో సహా అక్కడకు వచ్చి బ్రాహ్మణుని దుఃఖానికి కారణ మడిగి తెలిసికొని తానిలా చెప్పాడు .-
ఓయీ !బ్రాహ్మణా ! నీ కుమార్తె ఏడుపునకు కారణం లేకపోలేదు .ఈమె గత జన్మమున కంద గౌరీ నోమును నోచి విడిచి పెట్టింది . అందుచేతనే ఈమెకీ శోకం సిద్దించింది . వేరేం కాదు .ఇంటికి పోయి కంద గౌరీ నోము నోయించి ఈమె ఏడుపు మాన్పించుకో . గ్రామస్తులు మంచిగా చూస్తారు. అన్ని సుఖాలు కలుగుతాయి. వెళ్ళు అని చెప్పగా ఆ బ్రాహ్మణుడు పార్వతీ పరమేశ్వరులు చెప్పిన విధంగా ఇంటికి పోయి కంద గౌరీ నోము నోయించాడు. చిత్రం ఏడుపా ! పాడా !చక్కగా ఉందా ఆ అమ్మాయి ,ధైర్యం ,ఉత్సాహం, ఉల్లాసం, సుఖం, హాయి అన్నీ సిద్ధించాయి . చూచిన వారందరూ ఆశ్చర్య పోయారు. ఎంత విడ్డూరము ! ఏమీ కాదు అంతా నోము మహత్యం . ఇక ఉద్యాపన వినండి .ఈ కధ చెప్పుకుని ఒక సంవత్సర కాలం అక్షతలు నెత్తిపై వేసుకొనవలెను. వెండి ,బంగారం తో చేసిన కంద దుంపలను తయారు చేయించుకొని మామూలు కంద గడ్డ సంపాదించి రవికెల గుడ్డ ,లక్క జోళ్ళు ,నల్లపూసల తాళ్ళు , దక్షిణ తాంబూలం సిద్దం చేసి ముత్తయిదువునకు వాయన మీయవలెను . ఫలం తప్పక సిద్దిస్తుంది .

No comments:
Post a Comment