Saturday, August 18, 2012

కైలాస గౌరీ నోము

జీవితమును పవిత్రంగా క్రమశిక్షనగా నడుపుకుందుకు, ఇహపర సాధనకు మన పూర్వీకులలో కొందరు పెద్దలు మన ఆడువారాలకు అందరికీ కొన్ని వ్రతములు, నోములు, పూజలు ఏర్పరచారు. వాటి అంతరార్ధం విషయం అటుంచి ప్రయోజన విషయానికి వస్తే ఎన్నో మరెన్నో. ఈ నోములు, వ్రతములు, పూజలు ఆడువారికి మొదట శుచిని, శుభ్రతను, నేర్పుతాయి. క్రమశిక్షణను అలవరుస్తాయి. ఆరోగ్యమును పెంచుతాయి. ఇతరులకు ఇచ్చుకోవాలనే భావనను గుర్తుచేస్తాయి. ఏ స్త్రీ తనకోసం జీవించకూడదని ఇతరులకోసం పాటుపడాలని చెపుతూ ఉంటాయి. కొంతమందికి ఈ అధునాతన కాలంలో కూడా వ్రతాలు, నోములు, పూజలు ఏమిటండీ పిచ్చినమ్మకాలు, మూడవిశ్వాసాలు అని అనిపిస్తుంది. అది వారి తప్పుకాదు. నాస్తికులు, చెడు ప్రవర్తనకు అలవాటు పడ్డవారు వారి భావాలు సమాజం పై రుద్దడం వల్ల ఆ భావం ఏర్పడుతోంది. దైవం ఉన్నాడో లేదో మనకు వద్దు . భగవంతుడు కనపడడని అందరికీ తెలుసు. అయినా అతీంద్రియ శక్తి, దివ్యజ్యోతి నడుపుతోంది అని భావిద్దాం.

కర్మభూమి, ధర్మ భూమి, తపోభూమి, ఆదర్శభూమి, పవిత్రతలభూమి అగు మన భారత భూమిపై ఆస్తికత పెరటాలి. అందుకు ఇంటి వాతావరణము నందు పెద్దలు నిత్యపూజలు జరుపుకోవాలి. వాటిని పిల్లలు అనుసరించి ఆచరిస్తారు. వాతావరణ ప్రభావం తప్పక మానవుని పైన పడుతుంది. ఇంటి వాతావరణం పవిత్రంగా ఉన్నవాడు ఇంట్లో అందరూ పవిత్ర భావంతో మెలగాలి. అందుకు పిన్నలకు పెద్దలు ఆదర్శప్రాయులు కావాలి. వారడిగిన ప్రశ్నలకు సహేతుకంగా జవాబులు చెప్పాలి. వారిలో శ్రద్దా, భక్తీ పెంపొందాలి. అప్పుడే ఆత్మకల్యాణం దాంతో లోక కల్యాణం జరుగుతాయి. ఎందరెన్ని చెప్పినా దేవతాశక్తికి మించిన శక్తి లేదు. ఇతర శక్తులన్నీ దైవ శక్తికి తలవంచి తీరుతాయి ఇది నిజం. త్రికాలాబాధ్యమైన సత్యంకాని మనం ఆచరించే ఆచరణలో నమ్మకం, విశ్వాసం, భక్తీ, శ్రద్దా, అవసరం, ముఖ్యం, ప్రధానం. లేనివాడు అంటా, అన్నే వృధా.

No comments:

Post a Comment