Saturday, August 18, 2012

ధైర్యలక్ష్మి నోము

ప్రాచీన కలం నాటి మాట. ఆ కాలాన ఒక ధనవంతునకు నలుగురు కుమారులు జన్మించారు. అనంతరం ఒక కుమార్తె పుట్టింది. ఆమెను అందరూ గారంగా పెంచుకుంటున్నారు. పెండ్లీడు రాగానే ఆమెకు చక్కని వరునికి ఇచ్చి వివాహం చేశారు. వివాహం అయిన తరువాత ఆమె అత్త వారింటికి వెళ్ళినది.

అత్తవారింట అడుగుపెడుతూనే భయం భయం అని అరవసాగింది. నిద్రలో ఉలికిపడేది. ఒంటరిగా ఉండలేకపోయేది. అన్నిటికి భయపడేది. ఆ భయం కారణంగా తరచూ జ్వరంతో బాధపడేది. పాపం అదేమీ కర్మమో ఆమె భర్త కూడా వ్యాధికి గురు అయ్యాడు. ప్రారబ్ధం ,విధి, కర్మ, అనుభవించక తప్పదు కదా!

వారింటికి ఒకనాడు ఒక మహాపండితుడు రాగా తన విషయం చెప్పుకుంది. విని ఆయన " అమ్మాయీ! భయపడకు నీవు ధైర్యలక్ష్మీ నోము నాచరించిన ఏ భయం ఉండదు. అనగా ఆమె ఆయన చెప్పినట్లు ధైర్యలక్ష్మీ నోము నోచినది. అంటే ఎక్కడలేని ధైర్యం వచ్చినది. భర్త ఆరోగ్యం కుడుతపడినది. సిరి, సంపదలు, భోగభాగ్యాలు కలిగాయి. ఆ నోము ఫలితంగా ఇహమందు సుఖపడి పరమందు మోక్షం సంపాదించింది. ఇక ఉద్యాపన వినండి.

ఒక సంవత్సరకాలం ప్రతినిత్యం స్నానం చేసి పవిత్రమైన రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి. సంవత్సరం పూర్తి కాగానే పొంగలి ధైర్యలక్ష్మికి నైవేద్యం పెట్టాలి. ఆ ప్రసాదమును పదిమందికి పెట్టి, వ్రతం ఆచరించినవారు కళ్ళకు అద్దుకొని ఆరగించాలి. అనంతరం యథాశక్తి అన్న సంతర్పణ చేయాలి. ఈ ధైర్యలక్ష్మీ నోము నోచినవారికి తప్పక ఫలితం సిద్ధిస్తుంది. నాస్తికులు చేయవద్దని మనవి. ఆస్తికులకే ఈ వ్రతాలు, నోములు.

No comments:

Post a Comment