Saturday, August 18, 2012

గడపగౌరీ నోము

స్త్రీల వ్రతములు, నోములలో గడపగౌరీ నోము ఒకటి. ఇది పరమ పవిత్రమైనది. ఫలదాయకమైన నోము. ఈ నోమునకు ఒక కథ యందు ఉద్యాపన చెప్పబడినది.ఫలసిద్ధి గల నోమిది. భక్తితో, శ్రద్ధతో నమ్మకంతో, నియమ నిష్టలతో చేయవలెను. తప్పక ఫలం లభించగలదు. స్త్రీలందరూ ఆచరించదగ్గ నోమిది. ఆచరించి ఫలసిద్ధి పొందండి.

ఈ నోము నోచిన స్త్రీ లందరూ ధన్యురాళ్ళే , పవిత్రులే, పున్యస్త్రీలే, ప్రాతః కాలాన లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి శుచిగా మడిగా నిర్మలమైన మనసుతో "గంగ శంకరుని కరుణకు తిరుగులేదు" అని అనుచూ అక్షతలు నెత్తిన వేసుకోవాలి. అంటే కాదు పొరుగువారి ఇంటి గడపకు పసుపురాసి మూడు కుంకుమ బొట్లు పెట్టాలి. అనంతరం 26 గారెలు వండి పసుపు - కుంకుమ, బట్టలు వెండితో తయారుచేయించిన మట్టెలు, మంగళ సూత్రములు సిద్ధం చేసుకొని దక్షిణ ఇచ్చి తాంబూలంతో ఒక ముత్తయిదువునకు అదే పేరంటానికి వాయనం ఇచ్చుకోవలెను. ఇలా చేయడంవల్ల స్త్రీ సకల ఐశ్వర్యములతో సుఖ, శాంతులతో దీర్ఘ సుమంగళిగా జీవించగలదు.

స్త్రీలందరూ వ్రుధాకాలక్షేపం చేయక తమ సుఖ శాంతులకోసం ఆత్మా కళ్యాణంతో లోక కల్యాణం కోసం నోములు, వ్రతములు ఆచరించి కాలమును సద్వినియోగ పరచుకొనవలెను. అప్పుడే "సర్వేజనా స్సుఖినోభవంతు " అనేది సిద్ధించగలదు. ఇది నిర్వివాదాంశము. త్రికాలాబాధ మానమైన సత్యం. స్త్రీలందరూ నోములూ, వ్రతములూ ఆచరించి ఇహమందు సుఖించి పరమందు మోక్షం పొందండి. జన్మకు మరణం తప్పదు. జీవి కొంతకాలమే ఈ భూమండలము పై ఉంటుంది. జీవితం సుఖమయం చేసికోండి.

No comments:

Post a Comment