ఆసియా ఖండం. ఆ ఖండ మందు భారతదేశం. ఆ దేశమందు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరిజిల్లా ఒకటి. అ జిల్లలో ఇప్పుడు మండపేట అని పిలిచే పట్టణం, పూర్వం మాండవ్యపురం అని పిలిచేవారు. అప్పటి మాట అటుంచి ఇప్పటి మాట తెలుసుకుందాం. ఈ మండపేట పట్టణంలో జనార్ధన స్వామి దేవాలయంలో రామమూర్తి శాస్త్రిగారు ఉపన్యాసాలిచ్చే రోజులవి. భక్తులు ఎందరో వచ్చేవారు. ఇక భక్తురాండ్ర విషయం చెప్పనక్కరలేదు. ప్రతిరోజూ నిత్యనూతన విషయాలు చెప్పేవాడాయన, మహానుభావుడు.
ఆ రోజు ఆదివారంకావడం, ఎక్కువమంది భక్తులతో సభ నిండుగా ఉంది. శాస్త్రి గారు ఉపన్యాస వేదికపై విరాజిల్లుతున్నారు. అపరాసర్స్వతి మూర్తితో ఇష్టదేవతా ప్రార్ధన ముగించి ఇక విషయం ప్రారంభించనున్నారు. ఇంతలో సభ నుండి ఒక భక్తురాలు అయ్యా! గురువుగారూ! ఒక ప్రార్ధన! మీకు తెలియనిదిలేదు. పురాణ పండితులు మాకీనాటి సభలో ఒక నోము గురించి వివరించి అనంతరం ఉపన్యాసం ప్రారంభించండి అని అర్ధించింది ఆ ఇల్లాలు.
విన్నారు శాస్త్రి గారు, సరేనన్నారు . స్త్రీలకు నోములు వ్రతములు ముఖ్యమైన్ అవి. ముందుగా ఈనాడు చిట్టి బొట్టు నోము గురించి చెబుతాను. తెలిసినవాళ్ళు మళ్ళీ వినండి. తెలియనివారు తెలిసికోండి అని వివరంగా చెప్పారు. వారు చెప్పినదే ఈ గ్రంధమున పొందు పరచుచున్నాను. ఇది శివుడు పార్వతికి ఉపదేశించాడు. ఈనాడు ఈ ఇల్లాలు అడిగినది. నీను చదివినది విన్నది మీకు చెబుతున్నాను. ఆచరించి ఫలం పొందండి.
పూర్వకాలాన ఒక గ్రామము నందు ఒక బ్రాహ్మణుడు. ఆయనకు అధిక సంతానం. అందులో ఒక కుమార్తెకు ముఖమున పెట్టిన బొట్టు నిలవడం లేదు. ఊరిలోని వారందరూ ఆమెను చూచి వైధవ్యం ప్రాప్తించునని అనేవారు. విని బ్రాహ్మణా దంపతులు భాదపదేవారు. చేసేది లేక దైవానుగ్రహం కొరకు బ్రాహ్మణుడు ఇల్లు విడిచి తపస్సునకు బయలు దేరాడు.
నియమనిష్టలతో తపస్సు చేసాడు. గౌరీదేవి ప్రత్యక్షమైనది. ఆమె బ్రాహ్మణునితో - ఓ భూసురోత్తమా! శ్రద్ధగా విను. నీ కుమార్తె గత జన్మలో ఇరుగుపొరుగు వారితో గొడవలు పెట్టుకొనేది. వారితో పగ బట్టేది. విరోధము పెంచుకునేది, సౌమ్యంగా ఉండేది గాదు. అందరితో గొడవలు పెట్టుకునేది. చిట్టిబొట్టు నోమునోచి ఐదుగురికి పెట్టవలసిన బొట్టు నలిగురికే పెట్టి ఐదవ ముత్తయిదువుమీద తనకున్న కోపంచే ఆమెకు బొట్టుపెట్టక తన ముఖమున ఉన్న బొట్టు తుడిచేసుకుంది. అందుకే ఈ స్థితి ఈ జన్మమున ఏడ్చినది. పూర్వజన్మల కర్మల ఫలం మరలా మరు జన్మమున అనుభవించితీరాలి.
ఇప్పుడైననూ మించినది లేదు. నీవు ఇంటికి పోయి నీ కుమార్తె చే వ్రతమాచరింపచేయి. శ్రద్దాభక్తులతో చేయమని చెప్పు. ఆమెకు పసుపు - కుంకుమలు నిలుస్తాయి. వెళ్ళు. శుభం కలుగుతుంది. అని గౌరీ దేవి మార్గము ఉపదేశించినది.
బ్రాహ్మణుడు గౌరీదేవికి నమస్కరించి పరమానంద భరితుడై ఇంటికి తిరిగి వచ్చి తన కుమార్తెచే చిట్టి బొట్టు నోము నోయించి వైధవ్యం లేకుండా కాపాడాడు. ఆమె ఇహమందు సుమంగళిగా జీవించింది. పరమందు మోక్షం సాధించింది.
ఇక ఉద్యాపన విషయం వినిపిస్తాను వినండి అని శాస్త్రిగారు ఈ నోమును మాఘమాసమందు ఆచరించాలి. అదే శ్రేష్టమైన మాసం. శుద్ధ సప్తమినాడు వ్రతం ప్రారంభించాలి. పై కథను చెప్పుకొని లేదా చదువుకొని శిరసున పవిత్రాక్షతలు ధరించాలి. ఆ రోజు మొదలుకొని ఒక సంవత్సరకాలం ప్రోద్దుటగాని, సాయంత్రం గాని ఏదో సమయాన 5 గురు పేరంటాండ్రకు ముత్తయిదువులకు బొట్టు పెట్టాలి. సంవత్సరం పూర్తి కాగానే ఇంటికి 5 గురు పేరంటాండ్రను పిలిచి అభ్యంగన స్నానం చేయించి బాగుగా అలంకరించి వారికి భోజనములు పెట్టవలయును. పది బొట్లను చేయించి రెండేసి చొప్పున రెండేసి చొప్పున 5 గురికి లాంచనముగా సమర్పించవలెను. పసుపు - కుంకుమలు మీరు సుమంగళీ స్త్రీలు తప్పక ఆచరించవలయును. అధిక ఫలదాయిని. ఇది చిట్టిబోట్టునోము. మీరు తెలిసికొనండి.
భరించు వాడు భర్త, భర్తను సుఖ పెట్టడం నేర్చుకోవాలి.
సాధింపులు, వేధింపులు ఉండకూడదు.
తలకు మించిన బరువు భర్తకు రానీయకూడదు.
ఉత్తముడైన భర్త లభించినా, అతనిని పూజించినా పుణ్యమే.
దుర్మార్గుడిని మార్చుకోడానికి ప్రయత్నించాలి.
సంసారం సుఖపడాలంటే స్త్రీ చేతిలోనే ఉంది.
తానూ సుఖపడి భర్తను సుఖపెట్టాలి.
వృదాకాలక్షేపంతో మంచిపనులకు సమయం వెచ్చించాలి.
ఉన్నంతలో తానూ తిని పదిమందికి పెట్టుకోవాలి.
జన్మకు అంతం మరణమే గనుక జీవితకాలంలో మంచిని సాధించాలి.
అనుమానం, అవమానం, అపనిందలపాలు కాకూడదు.
అడుగడుగునా భర్తను అపోహలు చేయకూడదు.
అన్ని వేళలా ఆనందంగా, హాయిగా ఉండాలి. కుటుంబ సభ్యులను ఉంచాలి.
నోములునోచి ఇహం, పరం సాధించాలి అదే స్వర్గం.

No comments:
Post a Comment