Saturday, February 9, 2013

సంపదలు కోరుకుంటున్నారా.. ఐతే పడమటిముఖంగా కూర్చుని తినండి.!

సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు చేకూరాలని కోరుకుంటున్నారా.. అయితే పడమటిముఖంగా కూర్చుని భుజించాలని పండితులు అంటున్నారు. ఆయువును కోరేవారు తూర్పు ముఖంగాను, కీర్తిని కోరేవారు దక్షిణ ముఖంగాను కూర్చోవాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అయితే తల్లిదండ్రులున్నవారు దక్షిణముఖంగా కూర్చోరాదు. అలాగే ఉత్తరముఖంగా ఎవ్వరూ కూర్చుని భుజించకూడదు.

భుజించేటప్పుడు ఇతర ఆలోచనలేవీలేకుండా మొదట మధుర పదార్థాన్ని మధ్య ఉప్పు, పులుపు, కారము, చివర వగరు చేదు మొదట ద్రవ పదార్థాన్ని, మధ్యలో గట్టి పదార్థాలను, కడపటి ద్రవపదార్థాలు తింటుంటే ఆరోగ్యంగా ఉంటారని ఆయుర్వేదం చెబుతోంది. భుజించిన తర్వాత కనీసం నూరడుగులైనా వేయాలి.

ఎందుకంటే భుజించిన వెంటనే కూర్చోవడం వల్ల శరీరం లావెక్కుతుంది. నిద్రించడం వల్ల రోగం వస్తుంది. కొన్ని అడుగులు వేయడం వల్ల ఆయువు పెరుగుతుంది. భుజించిన వెంటనే నిద్రించడం వల్ల అజీర్ణ రోగం వస్తుంది

No comments:

Post a Comment