కలియుగ వైకుంఠం శ్రీ
వేంకటేశ్వర స్వామి ఆలయానికి విరాళాలు, కానుకలు కోకొల్లలుగా వస్తుంటాయి. ఏడు
కొండలపై వెలసిన శ్రీవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు
వస్తూవుంటారు. అలాంటి మహిమాన్వితమైన శ్రీవారి ఆభరణాల విలువ వెయ్యి కోట్లకు
పైగా దాటిందని తెలిసింది.
ఈ ఆభరణాలను భద్రపరిచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) స్థల కేటాయింపులో మల్లగుల్లాలు పడుతోంది. ఇలా శ్రీవారి నగలను భద్రపరిచేందుకు స్థలం లేకపోవడంతో ఏడాదికోసారి వేలం నిర్వహిస్తోంది. శ్రీవారికి కానుకగా భక్తులు ఆభరణాలను కిలోల బరువుతో సమర్పిస్తూ ఉంటారు.
ఇదిలా ఉంటే శ్రీవారికి ధరించే స్వర్ణమాల 12 కిలోల బరువుతో కూడుకున్నది. దీనిని స్వామివారికి అలంకరించేందుకు ముగ్గురు పండితులు అవసరమట. ఆలయంలోని నీలపు వజ్రం ప్రపంచంలో ఎక్కడా లేదని పురోహితులు చెబుతున్నారు. దీనివిలువ మాత్రమే రూ. వంద కోట్లు.
రాజేంద్ర చోళుడు, కృష్ణదేవరాయలు పలు ఆభరణాలను స్వామివారికి కానుకగా సమర్పించారు. ఆజానుబాహుడైన శ్రీవారు విలువలేని ఆభరణాలు ధరించినా నిరాయుధపాణిగా, కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు.

No comments:
Post a Comment