హోమ భస్మాన్ని బొట్టుగా
పెట్టుకోవచ్చునని పండితులు అంటున్నారు. హోమకుండంలో సుగంధ ద్రవ్యాలను,
జిల్లేడు, మోదుగ, చంద్రస ఉత్తరేణి, జువ్వి, గరిక, దర్భ తదితర సమిధలను,
ద్రాక్ష మొదలైన పండ్లను, పిండి, పొంగలి, అన్నం మొదలైన పుష్ఠికర పదార్థాలను,
ఆవు నేయిని ఆహూతులనిస్తున్నారు. ఆకాశ వాతావరణంలో వాటి గుణాలు
ఇనుమడిస్తాయి. అంతేగాకుండా అవి వేదమంత్రాలతో అభిమంత్రిచంబడుతున్నాయి.
మంత్రోచ్ఛారణతో పాటూ పవిత్ర భావన, శ్రద్ధాభక్తి విశ్వాసాలు వాటిలో నిండి ఉన్నాయి. ఇంతటి మహా ప్రభావ సంపన్నమైన హోమ భస్మాన్ని నుదుటన బొట్టుగా పెట్టుకోవడం ద్వారా శారీరక, మానసిక దోషాలెన్నో బాగవుతాయి. హోమకుండంలో యజ్ఞం చేయదగిన సమిధలనే వాడాలని పురోహితులు చెబుతున్నారు.

No comments:
Post a Comment