కనుబొమల నడుమ ఎర్రని బొట్టు
పెట్టుకోవడం హైందవ సంప్రదాయం. ఇంటికి వచ్చిన ఏ ముత్తయిదువకైనా బొట్టుపెట్టి
పంపడం మన ఆచారం. పాపిడ నడుమ ధరించే ఈ సిందూరం పెళ్లయిందని చప్పడానికి
ప్రధాన సూచిక. మేష భగవానుడు అంగారకుడు. అతని రంగు ఎరుపు. ఇది చాలా
శుభప్రదమైనదిగా భావిస్తారు. అందువల్లనే ఎర్రని సిందూరాన్ని నుదుటిపైన,
పాపిట మధ్యలో ధరిస్తారు.
ఈ రెండూ సౌభాగ్య చిహ్నాలే. పార్వతి, సతీల స్త్రీ శక్తి చిహ్నంగా కూడా సిందూరాన్ని పరిగణిస్తారు. ఎర్రటి రంగు ఆమె ప్రవేశంతో సంపద చేకూర్చుతుందనీ, స్త్రీ ధరించే సిందూరం కుటుంబ సంక్షేమాన్ని, సంతానాన్ని పరిరక్షిస్తుందని విశ్వాసం.
పురుషులు కూడా నుదుట తిలకం ధరించే సంప్రదాయం ఉంది. ఏదైనా మత సంబంధిత కార్యక్రమాలకు, పెళ్లిళ్లవంటి శుభకార్యాలలో ఈ విధంగా తిలకం ధరిస్తారు. మత సంబంధిత సందర్భాలలో వారు తమ కొలిచే దైవాన్ని అనసరించి తిలకం ఆకృతి ఉంటుంది.
విష్ణు భక్తులు "U" ఆకృతిలో తిలకం పెట్టుకుంటే, శైవ భక్తులు మూడు అడ్డగీతలతో దిద్దుకుంటారు. బొట్టు పెట్టుకునే చోట అగ్యచక్ర లేదా ఆధ్యాత్మిక లేదా మూడో నేత్రం ఉంటుందని చెపుతారు. ఇది ప్రధాన నాడీ కేంద్రం. అనుభవాలన్నీ కలగలిపి ఒకేచోట కేంద్రీకరించే బిందువు ఇది.
ఈ ప్రదేశానికి చల్లని ప్రభావం ఉంటుంది. బొట్టు ఆధ్యాత్మిక సౌకర్యాన్ని చేకూర్చి పెట్టడమే కాకుండా దురదృష్టం, దుష్ట శక్తులు దరిచేరకుండా సంరక్షిస్తుందని విశ్వాసం.

No comments:
Post a Comment