Saturday, February 9, 2013

నవగ్రహాలు : చేయాల్సిన పూజలు - వ్రతాలు

భూమిపై ఉండే ప్రతి మానవుని మదిలో వివిధ కోర్కెలు ఉంటాయి. ఇవి నెరవేర్చుకునేందుకు వివిధ రకాల యజ్ఞయాగాదులు, పూజలు పునస్కారాలు చేస్తుంటారు. ముఖ్యంగా ప్రతి ఆలయంలో ఉండే నవగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తూ.. ప్రదక్షిణలు చేస్తుంటారు. అయితే ప్రకృతిలో ఉన్న నవ గ్రహాలను పూజించేందుకు ప్రత్యేక పూజలు చేయాల్సింది. ముఖ్యంగా వీటి అనుగ్రహానికి వివిధ రకాల వ్రతాలను చేస్తే ఫలితం కనిపిస్తుంది. ఆ నవగ్రహాల అనుగ్రహానికి చేయవలసిన వ్రతాలను ఓ సారి పరిశీలిద్ధాం...

సూర్యగ్రహ అనుగ్రహముకు రథసప్తమి, శ్రీరామనవమి, కేదారేశ్వర, సూర్య చంద్ర వ్రతము చేయాలి. అలాగే చంద్ర గ్రహానికి అమావాస్య సోమతి వ్రతం, కృష్ణాష్టమి వ్రతం, సోమవార వ్రతం, కజుడు అనుగ్రహానికి నాగుల చవితి, నాగ పంచమి, అంగారక చవితి, కాత్యాయనీ వ్రతము, కుజగౌరీ వ్రతము చేయాలి. బుధుడు అనుగ్రహానికి శ్రీ అనంత పద్మనాభ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము, తులసీ వ్రతము, గురు గ్రహానికి శ్రీ సత్యసాయి వ్రతము, శ్రీ సత్యదత్త వ్రతము, త్రినాథ వ్రతాలను చేయాల్సి ఉంటుంది.

అలాగే శుక్రుడు అనుగ్రహానికి వరలక్ష్మీ వ్రతం, వైభవలక్ష్మీ వ్రతం, శ్రీలక్ష్మి కుబేర వ్రతం, సంతోషిమాత, అనఘాదేవి వ్రతాలను చేయాలి. శని గ్రహం అనుగ్రహానికి హనుమద్వ్రతము, శివరాత్రి, శనైశ్చర వ్రతాలు, రాహు గ్రహానికి శ్రీదేవి నవరాత్రి, సావిత్రీ, షోడశగౌరీ వ్రతం, కేతువు అనుగ్రహానికి వినాయక చవతి, సంకష్టహర చతుర్థి, పుత్రగణపతి వ్రతాలు చేస్తే ఫలింత వుంటుందని సిద్ధాంతాలు చెపుతున్నాయి.

No comments:

Post a Comment