రుద్రాక్షలు పర్వతాల మీద
ముఖ్యంగా హిమాలయాల్లో కొంత ఎత్తులో పెరిగే ఒక వృక్షజాతి గింజలు. అవి ఇంకా
పలు ప్రాంతాల్లో, పశ్చిమ కనుమల్లో కూడా పెరుగుతాయి. ఎక్కువ రుద్రాక్షలు
నేపాల్, బర్మా, థాయ్‌లాండ్, ఇండోనేషియాల నుంచి వస్తాయి. రుద్రాక్షలు మీ
శక్తితోనే ఒక గూడులాగా తయారు చేసి, వేరే శక్తులు మిమ్మల్ని కలత పెట్టకుండా
చేస్తాయి.
అందుకే రుద్రాక్షలు ఎప్పుడూ తిరుగుతూ, వేర్వేరు చోట్ల తినే వారికి చాలా ఉపయోగకరం. మీరు గమనించే ఉంటారు. మీరు కొత్త చోటుకు వెళ్లినపుడు, ఒక్కోచోట మీరు తేలికగా నిద్రలోకి జారిపోతారు. ఇంకొన్ని చోట్ల మీరు అలసిపోయి పడుకున్నా నిద్రరాదు. దీనికి కారణం మీ చుట్టూ పరిసరాల్లో స్థితి మీ తరహా శక్తికి అనుకూలమైంది కాకపోవటం వల్ల.
అందుకే అక్కడ మిమ్మల్ని విశ్రమించనీయదు. సాధువులు, సన్యాసులు ఒకేచోట రెండవసారి పడుకోకూడదు తిరుగుతూ ఉంటారు. అందువల్ల పరిస్థితులు, పరిసరాలు వారికి బాధ కలిగించవచ్చు. అందుకే వారెప్పుడూ రుద్రాక్షలు వేసుకునే ఉంటారు.
ఈ రోజుల్లో మళ్లీ ప్రజలు వారి వృత్తి, వ్యాపార రీత్యా వివిధ ప్రాంతాల్లో తింటారు. పడుకుంటారు. మనిషి ఒకేచోట పడుకుంటుంటే, తింటుంటే వారికి అక్కడ ఒక రకమైన గూడు ఏర్పడుతుంది. కానీ ఎప్పుడూ తిరిగే వారికి, అనేక చోట్ల తినే వారికి, నిద్రించే వారికి, రుద్రాక్ష మీ శక్తితోనే గూటిని ఏర్పరస్తుంది.
ప్రకృతిలో వివిధ రకాలుగా నీరు విషపూరితమయ్యే అవకాశముంది. కాబట్టి అరణ్యాల్లో నివసించే సాధువులు, సన్యాసులు అన్ని చోట్ల మంచినీరు తాగలేరు. అలా తాగితే ఆ నీరు వారిని దుర్బలం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం అవుతుంది. ఆ నీటి మీద రుద్రాక్షమాలను పట్టుకుంటే, మాల సవ్య దిశలో తిరిగితే ఆ నీరు తాగవచ్చు. అదే విషపూరితమైన నీరైతే రుద్రాక్షమాల అపసవ్య దిశలో తిరుగుతుంది.
రుద్రాక్ష దుష్ట శక్తుల నుంచి రక్షణగా ఉంటుంది. కొందరు ఇతరులకు హాని కలిగించటానికి కొన్ని దుష్టశక్తులను ప్రయోగించవచ్చు. అయితే ఈ హానికరమైన సంఘటనల నుంచి రుద్రాక్ష కవచంలా పనిచేస్తుంది. ఈ విధంగా శక్తివంతం చేసిన రుద్రాక్షలను గృహస్థులు వేసుకోకూడదు.
రుద్రాక్షకు ఒకటి నుంచి ఇరవై ఒకటి దాకా ముఖాలు ఉండవచ్చు. అవి వివిధ రకాలుగా ఉపయోగపడతాయి. అందుకే రుద్రాక్షను దుకాణంలో కొని వేసుకోకూడదు. కాని పంచముఖి రుద్రాక్ష ఆడ, మగ, పిల్లలు అందరికీ మంచిదే. అది సౌఖ్యానికి, ఆరోగ్యానికి, స్వతంత్రతకూ సర్వత్రాదోహదకారి.
రుద్రాక్ష రక్తపోటుని కూడా తగ్గిస్తుంది. మీ నరాలకు కొంత నెమ్మదిని కలిగించి మీ నాడీ వ్యవస్థకు కొంత స్వాంతన, చురుకుదనాన్ని కలిగిస్తుంది. మీరు మీ జీవితాన్ని పవిత్రం చేసుకుందామనుకుంటే, రుద్రాక్ష మంచి ఉపకరణం.

No comments:
Post a Comment