గాయత్రీమంత్రంతో కనీసం
పదిసార్లైనా అభిమంత్రించిన జలముతో శిరస్సును అవయవాలను ప్రోషించుకుంటే
గాయత్రీ స్నానమవుతుంది. దీనివల్ల సమస్త పాపములు పరిహారమవుతున్నాయి.
భగవద్ధ్యానము, విష్ణు చింతనము, వేదాంత శ్రవణము, సద్గ్రంథపఠనము ఇటు
వంటివన్నీ ధ్యానమయస్నానాల్లో చేరుతాయి.
అలాగే ఏకాదశి, పూర్ణిమ, అమావాస్య మొదలైన పర్వదినాల్లో ఉపవాసముండి ఆత్మవిచారణ సాగిస్తూ జ్ఞానాన్ని సంపాదించడం బోధమయ స్నానం అంటారు. ఉపవాసముంటే పూర్తిగా ఆహారం తీసుకోకుండా ఉండడం.
ఆహారం తీసుకోవడం వల్ల ఏకాగ్రత కుదరదు. భగవధ్ద్యానం సరిగా కుదరదు. అందువల్ల ఉపవాసం చేయమన్నారు. ఉండలేనివారు పాలో, పండ్లో కొద్దిగా తీసుకోవచ్చు.

No comments:
Post a Comment