శ్రీమద్భగవద్గీత భగవానుడైన
శ్రీ కృష్ణుని దివ్యవాణి. అనంత మహిమాపేతమైన భగవద్గీత సమస్త వేదాలసారం. పరమ
రహస్యవిషయ సమన్వితనిధి. ఇందులోని లక్ష్యం అతి నిగూఢం. ఇందులో భగవంతుని గుణ
ప్రభావ స్వరూపం చెప్పబడింది. తత్త్వరహస్యాలు, భక్తి కర్మ జ్ఞానాది పలువిధ
రహస్య విషయాలను వివరించడం జరిగింది. అందువల్లనే గీత సర్వశాస్త్ర శోభితం.
ఇంకా భగవద్గీత శ్రీ మహావిష్ణువు యొక్క ముఖ కమలం నుంచి వెలువడింది. అందుకే వ్యాస భగవానుడు గీత ప్రాశస్త్యాన్ని గురించి ఈ కింది విధంగా చెప్పాడు.
గీతా సుగీత కర్తవ్యా కిమన్యై : శాస్త్ర సంగ్రహై :
యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాత్ విని: స్మృతా
ప్రతి వ్యక్తి భగవద్గీతను ఆరు విధాలుగా సేవించాలి. అవి శ్రవణం, కీర్తనం, పఠనం, పాఠనం, మననం, ధారణం అనేవి. అలాచేస్తే శ్రీకృష్ణభగవానుని పాదారవిందాలను సేవించినట్లే అవుతుంది. గీత అనే అనంతరత్నాకరంలో ప్రవేశించి, పరిశోధిస్తే ఆమూల్యమైన జ్ఞాన రత్నాలు లభిస్తాయన్నది నిజం.
ఈ సంసారం అనే సాగరంలో అజ్ఞానమనే సముద్రంలో మునిగి తేలుతున్న జీవులను ఉద్ధరించి, భగవత్ర్పాప్తి కలిగించగలిగేదే "గీత" మాత్రమేనన్నది స్పష్టం. గీతాపఠనం వలన జ్ఞాననిష్ఠతో, కర్మ నిష్ఠతో ప్రవర్తించి మోక్షసిద్ధిని పొందవచ్చు.

No comments:
Post a Comment