శ్రావణమాసంలో త్రిలోకనాథుడు, డమరూధారియైన భోలాశంకరుడిని పూజించడంతో మంచిఫలితాలు సాధించవచ్చని పురాణపండితులు సూచిస్తున్నారు.
భోలాశంకరుడిని ప్రశన్నం చేసుకోవడానికి శ్రావణమాసంలో భక్తులు శివుడిని అనేక రకాలుగా పూజించి అభిషేకాలతో ముంచెత్తుతుంటారు. దీంతో భోలాశంకరుడు త్వరగా ప్రశన్నుడై కోరినవారికి కోరినన్ని కోరికలు నెరవేరుస్తుంటాడు. క్రింద పేర్కొనబడిన చిన్న మంత్రాన్ని జపించి శివుడ్ని బిల్వపత్రాలతో పూజిస్తే గత మూడు జన్మల పాపాలు నశిస్తాయని పురాణాలు చెపుతున్నాయి. మంత్రం ఇలా ఉంది...
** త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్ర్యాయుధమ్ త్రిమగ్న పాప-సంహారం ఏకం బిల్వం శివార్పణం.
మహిళలు శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలనుంచి 16 సోమవారపు వ్రతాలను పాటిస్తారు. ముత్తైదువలు తమ భర్త, పిల్లలను ఎల్లవేళలా కాపాడమని అలాగే తమ కుమార్తెకు మంచి భర్త లభించేలా ఆశీర్వాదించాలని తమ కుటుంబవృద్ధి కలగాలని భక్తిశ్రద్ధలతో 16 సోమవారపు వ్రతాలను పాటిస్తారు. దీంతో కులం వృద్ధి, సంపద, సన్మానాల కొరకు కూడా ఈ పూజలు చేయడం జరుగుతుంటుంది.
ఈ సోమవారపు వ్రతాలను ప్రారంభించేందుకుగాను ప్రత్యేక ముహూర్తం మరియు శివుని ఆలయంగురించి ప్రత్యేకంగా ఉండేలా చూసుకోవాలి. శివుని దేవాలయాలు వివిధ స్థానాలలో ఉంటాయి. కాబట్టి మీరు ఏ రోజునుంచైతే సోమవారపు వ్రతాన్ని పాటిస్తారో, ఆ రోజునుంచి శివాలయాన్ని దర్శించుకుంటుండండి. దీంతో మీరు ఏ ఉద్దేశ్యంతో అయితే శివుడ్ని ఆరాధిస్తున్నారో అది ఖచ్చితంగా నెరవేరుతుందంటున్నారు పురాణ పండితులు.
ఎందుకంటే శివుడు వృషభవాహనంపై కూర్చుని ఉంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. గౌరీదేవితో ఉంటే శుభం కలుగుతుంది. కైలాసంపైనుంటే మీకు సుఖ-సంతోషాలు కలుగుతాయి. సభలో కూర్చుని ఉంటే మీ కులవృద్ధి జరుగుతుంది. అదే శివుడు భోజనం చేస్తుంటే మీకు అన్నం లభిస్తుంది. కాబట్టి బాగా ఆలోచించుకుని ఈ సోమవారపు వ్రతాలను పాటించండి. వ్రతాలను ప్రారంభించే ముందు పండితుల సలహాలను తీసుకోవడం చాలా మంచిది.
శివాలయాలగురించి: తిథిం చ ద్ధిగుణీ కృత్యపంచాభిశ్చ సమన్తితమ్ II
సప్తభిస్తుహరీభ్దిగంశేషం శివవాస ఉచ్చయేత్ II సకే కైలాశ వాసంచద్ధితీయం గౌరిన్ని హో II తృతీయే వృషభారూఢ చతుర్థే చ సమాస్థిత పంచమే భోజనేచైవ క్రీడాయాంతురసాత్మకే II శూన్యేశ్మశానకేచైవ శివవాసంచ యోజయేత్ II
ఈ విధంగా శివుని ఆలయాలను చూసి వ్రతారంభం చేయండి. దీంతో భోలాశంకరుడు మీ ఇష్టకామ్యార్థిని పూర్తి చేస్తాడంటున్నారు పండితులు. భోలాశంకరుడిని ఇలా స్మరించుకోండి.
ధ్యాయేన్నిత్యం మహేశం రజత గిరినిభం చారు చంద్రావతంసమ్ I
రత్నా కల్పోజ్జవలాంగ పరశుమృగవరాభీతి హస్తం ప్రసన్నం I
పధాసీనం సమన్తాత్ స్తుతమయాగణై వ్యాధ్రకృతిం వసానం I
విశ్వాధం విశ్వంధం నిఖిల భయహరం పంచవక్త్రం త్రినేత్రం II

No comments:
Post a Comment