దేవతలు రెండు రకాలు.
జన్మదేవతలు, కర్మ దేవతలు. అగ్ని, ఇంద్రుడు, యముడు, వాయువు, వరుణుడు మొదలగు
వారంతా జన్మ దేవతలు. భూలోకం, ఇతర లోకాల్లో పుణ్య కర్మలు చేసి వాటికనుగుణంగా
స్వర్గాది భోగాలను అనుభవించడానికి వెళ్ళే నహుషుడు మొదలగువారు కర్మ దేవతలు.
మొదటిరకం వారు.. లోక హితానికై సృష్టించబడి, ఆయా అధికారాలు చెలాయిస్తూ యజ్ఞ, యాగాదులలో భోక్తల్తె, ప్రళయం వరకు ఉండేవారు, ఇక రెండవ రకం వారు.. వారి పుణ్యరాశి క్షీణించగానే, తిరిగి తమ కర్మలననుసరించి వేరు వేరు లోకాలకు పోయి జన్మించే వారు కోకొల్లలు. మొదటి తరగతి వారు అష్ట వసువులు, ఏకాదశ రుద్రలు, ద్వాదాశాదిత్యులు, ఇద్దరు అశ్వినీ దేవతలు మొత్తం 33 వర్గాలు. 33 కోట్ల దేవతలని కూడా ప్రసిద్ధి.
ఇక్కడ కోటి అంటే సమూహం అనే అర్థమే తీసుకోవాలి గానీ, సంఖ్యతో సంబంధం లేదు. ఇంకా పితృదేవతలు అని మరొక వర్గం ఉంది. వీరు మరణించిన వారి సంతతిచే చేయబడే శ్రాద్ధ కర్మలచే తృప్తి పొంది, మృతులకు వారి బంధువులకు కూడ దుర్గతి నివారణ, సద్గతి ప్రాప్తి కలిగించగల అధికారాన్ని కలిగి ఉంటారు.
మనిషి మరణించడంతోటే, మొదట వెళ్ళేది పితృలోకానికే. అక్కడే అందరి జన్మ జన్మల వివరాలు, చేసిన పాప పుణ్యాల లెక్కలు సిద్ధంగా ఆ లోకంలో ఉన్న రికార్డుల కనుగుణంగా, జీవి ఆయా లోకాలకు వెళ్తాడు.

No comments:
Post a Comment