Saturday, August 18, 2012

అక్షయ బొండాల నోము

అదో గ్రామం. ఆ గ్రామము నందు ఒక జంగందేవర ఉండేవాడు. అతడు యింటియింటి తిరుగుచూ బిక్ష మెత్తుకొని జీవించేవాడు. వచ్చిన దానితో తృప్తి పడి కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. పాటి ఇంట బిక్షవేసిన వారిని మీకు సదా శుభం కలుగుగాక!

ఒకనాడు జంగమదేవర మామూలుగా వచ్చి ఒక ఇల్లాలిని బిక్షమదిగి ఆమెకు శుభం కలుగుగాక అని దీవించి వెడుతూ ఉండగా ఆ ఇల్లాలు - ఏమయ్య జంగందేవరా! ప్రతిరోజూ నీవు ఇలానే కదా దీవిస్తునావు కానీ నాకు ఏ శుభం కలుగలేదే ఎందుకు నీ దీవెన అని హేళన చేసింది. అంట ఆ జంగమదేవర నవ్వి - అమ్మా! అమ్మా! దీవెన వృధా పోదు. పిచ్చిదానా! దేనికయినా సమయం రావాలి. సందర్భం చేకూరాలి. తొందర కూడదు. నిదానం అవసరం. విను, శుభం కలగాలన్న ఒక వ్రతం చేయి. నా మాటలయందు నమ్మకముంటేనే సుమా! విశ్వాసం లేనివాడి నోముకు ఫలం సిద్ధించదు. అన్నిటికి నమ్మకమే ప్రధానం అని వ్రాత విధానం చెప్పి ఆ జంగమదేవర వెళ్ళిపోయాడు.

ఆ ఇల్లాలు జంగం దేవర చెప్పిన ప్రకారం చేసింది. ఆ వ్రతమే అక్షయ బొండాల నోము. వ్రత ఫలంగా ఆమెకు సిరి సంపదలు కలిగాయి. భోగ - భాగ్యాలు చేకూరాయి. అక్షయ సంపద, అక్షయ సంతానం ప్రాప్తించాయి. ఇక ఉద్వాసన విషయం వినండి. ప్రతినిత్యం స్నానం చేసి ఒక సంవత్సరకాలం ఒక ముత్తయిడువునకు ఒక చక్కని కొబ్బరిబొండం తాంబూలాదులతో పెట్టి యిచ్చి నమస్కరించవలెను. అల సంవత్సరం గడిచాక ఐదుగురు పేరంటాండ్రకు పసుపురాసి బొట్టుపెట్టి ఐదేసి బొండాలు, కొత్తబట్టలు, దక్షిణ, తాంబూలాలు యిచ్చి వాయనమీయాలి. అనంతరం ఆది దంపతులగు శివ పార్వతులకు శ్రద్దా భక్తులతో నమస్కరించాలి. సుఖం, సంపద, సిరి, సౌభాగ్యం, సంతానం, సౌఖ్యం, శాంతి సిద్ధించి పరమందు మోక్షం కలుగుతుంది. వ్రత మందు లోపం రాకూడదు.

ఈ అక్షయ బొండాలనోము వలన అక్షయ సంపద, సంతతి, అక్షయ మాంగల్యం, అక్షయ మోక్షం ప్రాప్తించును. చక్కని కొబ్బరిబొండాలు మంచి మనసుతో సమర్పించుకోవాలి. అన్నిటికన్నా నమ్మకం ముఖ్యం. విశ్వసించినవారికి ఈ విశ్వమందు అన్ని చేకూరతాయి.

పాట
అక్షయ బొండాలనోమండి
ఏ ఒక్కరూ
నిర్లక్ష్యం చేయక చేయండి
అక్షయ సిరులను ఇచ్చేనోమండి
ప్రతిఒక్కరూ
దీక్షతో ఈ వ్రతం చేయండి
అక్షయ సంపదలిచ్చె వ్రతమండి
అందరికందరూ శ్రద్ధా భక్తులతోనూ చేయండి
అక్షయ బొండాల నోమండి
ఏ ఒక్కరూ
నిర్లక్ష్యం చేయక చేయండి

పరమ పవిత్రమైన భారతదేశమునందు జన్మించిన స్త్రీలకు మన పూర్వులు చక్కని, పవిత్రమైన పుణ్య ప్రదమైన అత్యంత ఫలప్రదమైన అనేక నోములు వివరించి చెప్పారు. వృథా కాలక్షేపం చేయక స్త్రీలు వ్రతమాచరించి ఫలం అనుభవించండి. ఇది అక్ష్యయబొం డాల నోము వివరంగా వివరిస్తాను ఆచరించండి.ఫలం పొందండి.

అక్షయ బొండాలనోము
అక్షయ సంపద లిచ్చు నోము
అక్షయ బొండాల నోము
అక్షయ సంతతి నిచ్చునోము
అక్షయ బొండాల నోము
అక్షయ మాంగల్య మిచ్చు నోము
అక్షయ బొండాల నోము
అక్షయ మోక్షంబు నిచ్చు నోము
అక్షయ మోక్షంబు నిచ్చు నోము

అని అనుకొని పవిత్రాక్షతలు శిరసున దాల్చవలెను. పసుపు ముద్దలు అయిదు, కుంకుడుకాయ పరిమాణంలో తయారుచేసికొని 5 గురు ముత్తయిదువులకు సమర్పించవలెను. అనంతరం దక్షిణ, తాంబూలం, రవికెలగుడ్డలు, పసుపు, కుంకుమ మంచి చక్కని బొండాలనూ వాయన మిచ్చుకొనవలెను. వివరాలు తెలిశాయి కదా! ఇక ఆలస్యం దేనికి ఆచరించండి, ఫలం పొందండి.

దేవం పై నమ్మకం లేనివారు, దేవతారాధన చేయనివారు ఈ వ్రతం చేయవద్దు, ఫలితముండదు.

No comments:

Post a Comment