Friday, August 17, 2012

సరస్వతీ వ్రతకల్పము

భూశుద్ధి :
ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్ధి చేసి,అలికి,బియ్యపు పిండితోగాని,రంగుల చూర్ణములతోగాని,ముగ్గులుపెట్టి,దైవస్థాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి.పీట మరీ ఎత్తుగాని, మరీ పల్లముగానీ ఉండకూడదు.పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపురాసి,కుంకుంమతో బొట్టు పెట్టి,వరిపిండి (బియ్యపుపిండి) తో ముగ్గు వేయాలి. సాధారణంగా  అష్టదళ పద్మాన్నే వేస్తారు.పూజచేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి.ఏ దైవాన్ని పూజింపబోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమనుగాని, చిత్రపతమునుగాని, ఆ పీట పై ఉంచాలి.ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి (పసుపును షుమారు అంగుళం సైజులో త్రికోణ ఆకృతిలో ముద్దగా చేసి),దానికి కుంకుమ బొట్టు పెట్టి,పిదప ఒక పళ్లెంలోగాని,క్రొత్త తుండు గిద్ద మీద గాని బియ్యం పోసి దానిపై ఒక తమలపాకు నుంచి,అందు పసుపు గణపతి నుంచి అగరువత్తులు వెలిగించాలి.ఇప్పుడు సరస్వతీ పూజకు కావలసిన వస్తువులను అమర్చుకోవాలి.దీపారాధన నైరుతి దిశలో చేయవలెను.

దీపారాధనకు కావలసిన వస్తువులు - దీపారాధన విధానము
దీపారాధన చేయుటకు కుంది (ప్రమిద) వెండిది గాని,ఇత్తడిదిగాని,మట్టిది గాని వాడవచ్చును.కుందిలో 3 అడ్డవత్తులు 1 కుంభవత్తి (మధ్యలో)వేసి నూనెతో తడుపవలెను. ఇంకొక అడ్డవత్తి నూనెతో తడిపి ఏకహారతిలో (కర్పూర హారతికి వాడే వస్తువు)వేసి ముందుగా ఏకహరతిలో వేసిన వత్తిని అగ్గిపుల్లతో వెలిగించి,వెలిగించిన వత్తితో కుందిలోని 1 అడ్డవత్తి 1 కుంభవత్తి  వెలిగించవలెను.తర్వాత చేయి కడుక్కుని నూనె కుంది నిండావేసి పిదప ఆ కుందికి మూడుచోట్ల కుంకుమ అలంకారము చేయవలెను. తర్వాత అక్షతలు వేసి దీపారాధనను లక్ష్మీ స్వరూపముగా భావించి నమస్కారము చేయవలెను.కుందిలో మిగిలిన రెండు అడ్డవత్తులు పూజా సమయంలో ధూపము చూపిన తరువాత దీపము చూపించుటకు         వాడవలెను.దీపారాధనకునువ్వులనూనెగాని,కొబ్బరినూనెగాని,ఆవునెయ్యి గాని వాడవచ్చును. మనము ఆచమనము చేసినటువంటి పంచపాత్రలోని నీళ్లు దేవుని పూజకు వినియోగించరాదు.పూజకు విడిగా ఒకగ్లాసుగాని,చెంబుగాని తీసుకొని దానిలో శుద్ధ జలమును పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆ నీళ్ళు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించవలెను.

శ్రీ సరస్వతీ పూజకుకావలసిన వస్తువులు:
సరస్వతీదేవి  బొమ్మ లేదా చిత్రపటము రెండు కానిచో  బంగారముతో నైనను,వెండితో నైనను చేసిన కాసు. ధూపమునకు సాంబ్రాణి, కొబ్బరికాయలు,పళ్ళు,పువ్వులు, పసుపు, కుంకుమ, గంధం, హారతి కర్పూరం, అక్షతలు, అగ్గిపెట్టె, అగరువత్తులు, వస్త్ర, యజ్ఞోపవీతములు మరియు  ప్రత్యేక నివేదనకు స్త్రీ దేవతారాధనకు చలిమిడి,పానకం, వడపప్పు ముఖ్యంగా చేయవలసి యుండును. (పానకం అనగా శుద్ధమైన నీటిలో బెల్లం, ఏలక్కాయపొడి, మిరియాలపొడి కలుపవలెను. వడపప్పు అనగా పెసరపప్పును శుభ్రము చేసి నీటితో నానబెట్టి నానిన వడపప్పును విడిగా తీసి పెట్టుకొనవలెను. మరియు మహానైవేద్యము కొరకు మంచి భక్ష్యములతో, పిండివంటలతో కూడిన భోజనము తయారుచేసి పెట్టుకొనవలెను. పిమ్మట యజమానులు (పూజచేసేవారు) ఈ దిగువ కేశవనామాలను స్మరిస్తూ ఆచమనం చేయాలి. ఈ నామాలు మొత్తం 24  కలవు.

1 . "ఓం కేశవాయ స్వాహ" అని చెప్పుకుని చేతిలో నీరు తీసుకొని లోనికి తీసుకోవాలి.
2 . "ఓం నారాయణాయ స్వాహ" అనుకుని ఒకసారి
3 ." ఓం మాధవాయ స్వాహ "అనుకుని ఒకసారి జలమును పుచ్చుకోవలెను.తరువాత
4 . "ఓం గోవిందాయ నమః"అని చేతులు కడుగుకోవాలి.
5 . "ఓం విష్ణవే నమః"  అనుకుంటూ నీళ్ళు త్రాగి,మధ్యవ్రేలు,బొటన వ్రేళ్ళతో కళ్ళు తుడుచుకోవాలి.
6 ." ఓం మధుసూదనాయ నమః"  అని పైపెదవిని కుడునుంచి ఎడమకి నిమురుకోవాలి.
7 . "ఓం తివిక్రమాయ నమః" క్రింది పెదవిని కుడినుంచి ఎడమకి నిమురుకోవాలి.
8 . 9 . "ఓం వామనాయ నమః" " ఓం శ్రీధరాయ నమః"  ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్ళు చల్లుకోవాలి.
10 . ఓం హృషీకేశాయ నమః ఎడమ చేతితో నీళ్ళు చల్లాలి.
11 .ఓం పద్మనాభాయ నమః పాదాలపై ఒకొక్క చుక్క నీరు చల్లుకోవాలి.
12 . ఓం దామోదరాయ నమః శిరస్సుపై జలమును ప్రోక్షించుకోవలెను.
13 . ఓం సంకర్షనాయ నమః చేతివేళ్లు గిన్నెలా వుంచి గడ్డము తుడుచుకోవలెను.
14 . ఓం వాసుదేవాయ నమః వ్రేళ్ళతో ముక్కును వదులుగా పట్టుకోవలెను.
15 . 16 . ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః నేత్రాలు తాకవలెను.
17 . 18 . ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః రెండు చెవులూ తాకవలెను.
19 . 20 . ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః బొడ్డును స్ప్రుసించవలెను
21 . ఓం జనార్ధనాయ నమః చేతివేళ్ళతో వక్షస్థలం,హృదయం తాకవలెను.
22 . ఓం ఉపేంద్రాయ నమః చేతి కొనతో శిరస్శు తాకవలెను.
23 . 24  ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః కుడి మూపురమును ఎడమచేతితోను,ఎడమ మూపురమును కుడుచేతితోను ఆచమనము చేసిన తరువాత ఆచమనము చేసి,వెంటనే సంకల్పము చెప్పుకోవలెను.
ఆచమనము అయిన తరువాత,కొంచెం నీరు చేతితో పోసుకొని నేలపై చిలకరించుతూ ఈ శ్లోకమును పటింపవలెను.
శ్లో || ఉత్తిష్టంతు భూత పిశాచాః యే తే భూమిభారకాః
యే తే  షామ విరోధేనా బ్రహ్మ కర్మ సమారభే ||

ప్రాణాయామమ్యః
ఓం భూ: - ఓం భువః ఓంసువః - ఓం మహః - ఓం జనః - ఓం తపః -ఓగ్ o  సత్యం - ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీ మహీధీ యోయోనః ప్రచోదయాత్ - ఓం ఆపోజ్యోతిర సోమృతం బ్రహ్మభూర్భువ స్సువరోం అని సంకల్పము చేప్పుకోనవలెను.

సంకల్పము:
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్ధిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే ఆద్య బ్రహ్మణః (ఇక్కడ శ్రీమహవిష్ణో రాజ్ఞాయ అని కూడా చెప్పవచ్చు) ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరత ఖండే మేరో ర్ధక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే (మనకు శ్రీ శైలము ప్రధాన క్షేత్రము కావున మనము శ్రీశైలమునకు ఏ దిక్కున ఉన్నామో అ దిక్కు చేప్పుకొనవలెను),కృష్ణా గోదావర్యో: మధ్య ప్రదేశే (మనం ఏ ఏ నదులకు మధ్యన ఉన్నామో ఆయా నదుల పేర్లు చేప్పుకొనవలెను),శోభన గృహే (అద్దె ఇల్లు అయినచో వసతి గృహే అనియు,సొంత ఇల్లుయినచో స్వగృహే అనియు చేప్పుకొనవలెను). సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన .................... సంవత్సరే, (ఇక్కడ తెలుగు సంవత్సరము అంటే పూజచేయునప్పుడు ఏ సంవత్సరము జరుగుచున్నదో ఆ సంవత్సరము యొక్క పేరు చెప్పుకొనవలెను, ...........ఆయనే,(సంవత్సరమునకు రెండు ఆయనములు- ఉత్తరాయనము, దక్షిణాయనము. జనవరి 15 మకర సంక్రమణం మొదలు జులై 14 కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణం,జులై 15  కర్కాటక సంక్రమణం నుండి మరల జనవరి 14 పెద్ద పండుగ అనగా మకర సంక్రమణం వరకు దక్షిణాయనం .పూజచేయునపుడు ఏ ఆయనము జరుగుచున్నదో దానిని చెప్పవలెను).......... ఋతు:, (వసంత,గ్రీష్మ,వర్ష మొ||ఋతువులలో పూజ సమయములో జరుగుచున్న ఋతువు పేరు) ..........మాసే,(చైత్ర ,వైశాఖ మొ|| పన్నెండు మాసములలో పూజ సమయములో జరుగుచున్న మాసంపేరు) ..............పక్షే,(నెలకు రెండు పక్షములు పౌర్ణమికి ముందు శుక్ల పక్షము,అమ్మవాస్యకు ముందు కృష్ణ పక్షములు వీటిలో పూజ జరుగుతున్నసమయమున గల పక్షము పేరు)..........తిథౌ,(ఆరోజు తిథి) ............వాసరే (ఆరోజు ఏ వారమన్నదీ చెప్పుకొని) శభ నక్షత్రే,శుభ యోగే ,శభ కరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీపరమేశ్వర ముద్దిశ్య  శ్రీపరమేశ్వర  ప్రీత్యర్ధం పురుషులైనచో శ్రీమాన్ ......గోత్రస్య ........నామధేయః, శ్రీమత్యః, గోత్రస్య, నామధేయస్య అనియు,స్త్రీ లైనచో శ్రీమతి, గోత్రవతి, నామధేయవతి, శ్రీమత్యాః,  గోత్రవత్యాః,నామధేయవత్యాః అనియు (పూజచేయువారి గోత్రము,నామము చెప్పి) నామధేయస్యః ధర్మపత్నీ సమేతస్య (పురుషులైనచో) మమ సహకుటుంబస్య,క్షేమ స్థైర్య వీర్య విజయ అభయఆయురారోగ్య ఐశ్వర్యాభి వ్రుద్ధ్యర్ధం ,ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ  ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం, పుత్రపౌత్రాది వ్రుద్ధ్యర్ధం సకలవిధ మనోవాంచాఫల సిద్ధ్యర్ధం,సర్వాభీష్ట సిద్ధ్యర్ధం అని (స్త్రీలు మాత్రము పూజ చేసుకోనునప్పుడు) అఖండిత సర్వ సుఖ సౌభాగ్య సంతతి ఆయు: ఆరోగ్య ఐశ్వర్యాః అభి వృద్ధ్యర్ర్ధం అని(దంపతులు కూర్చుని చేసుకోనునపుడు) శ్రీసరస్వతీ దేవతా ముద్దిశ్య సరస్వతీ దేవతా ప్రీత్యర్ధం (ఏ దేవుని పూజించుచున్నామో ఆ దేవుని యొక్క పేరు చెప్పుకొని) కల్పోక్త  ప్రకారేణ యావచ్చక్తి (నాకు తోచినరీతిలో, నాకు తోచిన నియమములతో,నాకు తోచిన విధముగా,భక్తి శ్రద్ధలతో సమర్పించుకొంటున్న పూజ) ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. తధంగ కలశ పూజాం కరిష్యే || పిదప కలశారాధనను చేయవలెను.



కలశ పూజను గూర్చిన వివరణ :
వెండి,రాగి,లేక కంచు గ్లాసులు (లేదా పంచపాత్రలు) రెండిటిలో శుద్ధ జలమును తీసుకొని ఒకదానియందు ఉద్ధరిణినీ,రెండవ దానియందు అక్షతలు,తమలపాకు,పువ్వు ఉంచుకొనవలెను. రెండవ పాత్రకు బయట మూడు వైపులా గంధమును వ్రాసి కుంకుమను అద్దవలెను.ఇట్లు చేయునపుడు గ్లాసును గుండ్రముగా త్రిప్పుచూ గంధమును గాని కుంకుమను గాని పూయరాదు. గంధమును ఉంగరపు వేలితో పూయవలెను.కుంకుమ అక్షతలు వగైరా బొటన,మధ్య,ఉంగరపు వ్రేళ్ళను కలిపి సమర్పించవలెను.యజమానులు (ఒక్కరైతే ఒకరు,దంపతులైతే ఇద్దరూను) ఆ కలశాన్ని కుడిచేతితో మూసిఉంచి, ఇలా అనుకోవాలి.ఈ విధముగా కలశమును తయారు చేసి పూజను చేయునప్పుడు మొదటగా ఈ శ్లోకమును చదువవలెను.
మం|| కలశస్య ముఖే విష్ణు: కంటే రుద్రా స్సమాస్శ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాత్రు గనాస్మ్రుతాః||
ఋగ్వేదో థ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః
అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః

శ్లో || గంగైచ యమునే చైవ కృష్ణే ,గోదావరి,సరస్వతీ,
నర్మదా సింధు కావేర్యౌ జలే స్మిన్ సన్నిధింకురు ||

ఇక్కడ ఇలా శ్లోకము ముగిసిన తరువాత ఆయాతు శ్రీసరస్వతీ దేవతా (ఏ దేవుని పూజైతే చేస్తున్నామో ఆ దేవుని పేరును చెప్పవలెను)పూజార్ధం మమ దురితక్షయ కారకాః కలశోదకేనా ఓం దేవం సంప్రోక్ష్య (కలశ మందలి ఉదకమును దేవుని పై చల్లాలి),ఓం ఆత్మానం సంప్రోక్ష్య అని (ఆ నీటిని తనపై చల్లుకోవాలి) ఓం పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య (పూజా ద్రవ్యములపై కూడా చల్లాలి) కలశమందలి నీటిని పై మంత్రం చదువుతూ పువ్వుతో గాని,ఆకుతో గానీ,చల్లాలి.

ధ్యానం:
శ్లో || పుస్త కేతుయలోదేవి క్రీడతే పరమార్ధతః - తత్ర తత్ర ప్రకుర్వీత
ధ్యాన మావాహనాది కంధ్యానమేవం ప్రకుర్వీత సాధవో విజితేంద్రియః ప్రనవాసన మారూడం
తదర్ధత్వేన నిశ్చితాం

అంకుశంచాక్ష సూత్రంచ పాశం వీణాంచ ధారిణీ మ్ ముకాహార సమాయుక్తం మోద రూపాం
మనోహరామ్ సితేనా దర్ప ణా భే న వస్త్రేణో పరిభూషితాః సుస్తనే వేదవేద్యాంచ
చంద్రార్ధ కృత శేఖరామ్

జటాక లా సంయుక్తాం పూర్ణ చంద్ర నిభాననామ్ త్రిలోచనాం మహాదేవీ స్వర్ణ నూపుర
ధారిణీ మ్ కటకై స్వర్ణ రత్నా ద్యైర్ముక్తా వలయ భూషితాం,కంబుకంటీం సుతామ్రోషీం
సర్వాభరణ భూషితామ్

కేయూరై ఖలా ద్యైశ్చ ద్యోతయంతీ జగత్రయమ్ శబ్ద బ్రహ్మత్మికాం దేవి ధ్యాన కర్మ సమాహితః ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమః ధ్యాయామి అని శ్రీ సరస్వతీ దేవిని ధ్యానం చేయవలెను.పిమ్మట షోడశోపచార పూజ చేయవలెను. షోడశోపచారములనగా ఆవాహన, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నమస్కారం, ప్రదక్షిణములు  మొదలగునవి. పిదప షోడశోపచార పూజను చేయవలెను
ఆవాహనం :
అత్రాగచ్చ జగద్వంద్వే సర్వలోకైక పూజితే,
మయాక్రుతా మిమాం పూజాం గృహాణ జగదీశ్వరీ ||
ఓం శ్రీసరస్వత్యై  నమః ఆవాహయామి. ఆవాహనార్ధం అక్షతాం సమర్పయామి.అనగా మనస్పూర్తిగా దేవుని మన ఇంట్లోకి ఆహ్వానించడం.అట్లు మనస్సున స్మరిస్తూ అక్షతలు దేవుని పై వేయవలెను.
ఆసనం :
శ్లో || అనేక రత్న సంయుక్తం సువర్ణేన విరాజితం
ముక్తా మణ్యంచితంచారు చాసనం తే దదామ్య హం ||
ఓం శ్రీసరస్వత్యై  నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి.సింహాసనార్ధం అక్షతాం సమర్పయామి.దేవి కూర్చుండుటకై మంచి బంగరుపీట వేసినట్లు అనుకుంటూ అక్షతలు వేయవలెను.

పాద్యం:
శ్లో || గంధ పుష్పాక్ష తై స్సార్ధం శుద్ధ తోయేన సంయుతం,
శుద్ధ స్పటిక తుల్యాంగి పాద్యంతే ప్రతిగృహ్యతాం ||
ఓం శ్రీసరస్వత్యై  నమః పాదౌ : పాద్యం సమర్పయామి.దేవి కాళ్లు కడుగుకొనుటకు నీరు ఇస్తున్నామని మనసున అనుకుంటూ ఫ్పువ్వుతో పంచపాత్రలోని నీరు అదే గిన్నెలో ఉద్ధరిణెతో వదలవలెను.


అర్ఘ్యం :
శ్లో || భక్తా భీష్ట ప్రదే దేవి దేవదేవాది వందితే,
దాత్రుప్రియే జగద్ధాత్రి దదామ్య ర్ఘ్యం గృహాణ మే ||
ఓం శ్రీసరస్వత్యై  నమః హస్తౌ: అర్ఘ్యం సమర్పయామి. దేవి  చేతులు కడుగుకొనుటకై నీళ్లిస్తున్నానని మనసున తలుస్తూ,ఉద్ధరిణితో నీరు వేరొక గిన్నెలో వదలవలయును.

ఆచమనీయం :
శ్లో || పూర్ణచంద్ర సమానాభే కోటి సూర్య సమప్రభే,
భక్త్యా సమర్పితం వాణీ గృహాణా చ మనీయకం ||
ఓం శ్రీ సరస్వత్యై నమః ఆచమనీయం సమర్పయామి.అంటూ దేవి  ముఖము కడుగుకొనుటకై నీళ్లిస్తున్నామని మనమున తలుస్తూ పైన చెప్పిన పాత్రలో ఉద్ధరిణెతో ఒకమారు నీరు వదలవలెను.
సూచన :
అర్ఘ్యం,పాద్యం,ఆచమనం మొదలగు వాటికి ఉద్ధరిణెతో నీరు వేరొక పాత్రలో వదలవలెను.అరివేణం (పంచపాత్రకు క్రిందనుంచు పళ్లెము)లో వదలరాదు.

మధుపర్కం :
శ్లో ||కమల భువన జాయే కోటి సూర్య ప్రకాశే
విశద శుచివిలాసే కో మలాకార యుక్తే
దధి మధు ఘ్రుత యుక్తం క్షీర రంభాఫలాడ్యం
సురుచిర మధుపర్కం గృహ్యాతాం దేవవంద్యే ||
ఓం శ్రీ సరస్వత్యై  నమః మధుపర్కం సమర్పయామి అని సరస్వతీ దేవికి  స్నానం చేయుటకు వస్త్రమిచ్చుచున్నామని తలుస్తూ,ఈ మధుపర్కంను  ప్రతిమకు అద్దవలెను.(ప్రత్తిని పెద్ద బొట్టుబిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆపైన రెండువైపులా పసుపులో అద్ది ఉంచుకొన్నదాన్ని మధుపర్కం అంటారు).

పంచామృత స్నానం :
శ్లో || దదిక్షీరఘ్రుతో పేతం శర్కరా మధు సంయుతం,
పంచామృత స్నాన మిదం స్వీకురుష్వ మహేశ్వరీ ||
ఓం శ్రీ సరస్వత్యై  నమః పంచామృత స్నానం సమర్పయామి
అని స్నానమునకు పంచామృతములతో కూడిన నీరు ఇచ్చునట్లు భావించి ఆవునెయ్యి,ఆవుపాలు,ఆవుపెరుగు,తేనె,పంచదార కలిపిన పంచామృతమును దేవిపై ఉద్ధరిణెతో చల్లవలెను.



శుద్దోదక స్నానం :
శ్లో || శుద్దోదకేనా సుస్నానం కర్తవ్యం విధిపూర్వకం,
సువర్ణ కలశానీ తైర్నానాగంధ సువాసితై: ||
ఓం శ్రీ సరస్వత్యై  నమః శుద్దోదక స్నానం సమర్పయామి. పంచపాత్రలోని శుద్ధ నీటిని పువ్వుతో దేవి పై చల్లవలెను.

వస్త్రయుగ్మం:
శ్లో ||శకల వస్త్ర ద్వయం దేవి కోమలం కుటిలాలకే,
మయి ప్రీత్యా త్వయా వాణి బ్రహ్మాణీ ప్రతిగ్రుహ్యతాం ||
ఓం శ్రీ సరస్వత్యై  నమః వస్త్ర యుగ్మం సమర్పయామి. అనుచు వస్త్రమును (పత్తిని పెఅద్దబొట్టుబిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆపైన రెండు వైపులా కుంకుమతో అద్దినచో అది వస్త్రమగును.ఇటువంటివి రెండు చేసుకొనవలెను ) దేవియొక్క ప్రతిమకు అద్దవలెను.

యజ్ఞోపవీతం :
శ్లో || శబ్ద బ్రహ్మాత్మికే దేవి శబ్ద శాస్త్ర కృతాలయే,
బ్రహ్మ సూత్రం గృహాణత్వం బ్రహ్మశక్రాది పూజితే ||
ఓం శ్రీ సరస్వత్యై  నమః యజ్ఞోపవీతం సమర్పయామి
అని ప్రత్తిని తీసుకొని పసుపుచేత్తో బొటన వ్రేలు,మధ్య వ్రేలితో మధ్య మధ్య నలుపుతూ పొడువుగా చేసి, కుంకుమ అద్దవలెను.దీనిని దేవిపై వుంచవలెను.

ఆభరణం:
శ్లో || కటకమకుటహరై ర్నపురై రంగదాణ్యై
ర్వివిధ సుమణి యుక్త్యై ర్మేఖలా రత్న హరై: ||
కమలదళ విలసే కామదే సంగృహీ ష్వ
ప్రకటిత కరుణార్ద్రే భూషితే: భూషణాని ||
ఓం శ్రీ సరస్వత్యై  నమః ఆభరణాన్ సమర్పయామి. అనుచు దేవికి ఏదేని బంగారముతో లేదా వెండితో చేసిన స్త్రీలు ధరించెడి  ఆభరణములను చేయించిన చో అలంకరించవలెను.లేనిచో పశుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులు దేవి పై వేసి నమస్కరించవలెను.


గంధం:
శ్లో || కటక మకుటహరై ర్నూపురై రంగ ద్యై ర్వి విధ సుమణియుక్త్యై ర్మేఖలా
రత్నహరై: కమలదళ
విలాసే కామదే సంగృహీష్వ ప్రకటిత కరుణార్ద్రే భూరితౌ భూషణాని ఆభరణాని చ,
చందనాగరు కస్తూరీ కర్పూరాద్యైశ్చ సంయుతం,గంధం గృహాణ వర దేవి విధి పత్నీ
ర్నమో స్తుతే ||
ఓం శ్రీసరస్వత్యై  నమః గంధాన్ సమర్పయామి. ముందుగా తీసిపెట్టుకున్న గంధమును కుడిచేతి ఉంగరం వ్రేలితో దేవి పై  చల్లవలెను.

అక్షతలు:
శ్లో || అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలియాన్ తుండుల నిర్మితాన్
గృహాణ వరదే దేవి బ్రహ్మశక్తి స్శుభాత్మ కాన్ ||
ఓం శ్రీసరస్వత్యై  నమః అక్షతాన్ సమర్పయామి.
(అక్షతలకు బియ్యమును తడిపి పసుపు వేసి కలుపవలెను).అక్షతలు తీసుకొని సరస్వతీ దేవిపై  చల్లవలెను.

పుష్ప పూజ :
శ్లో || మందారాది సుపుష్పైశ్చ మల్లికాభి ర్మనో హరై:
కరవీరైర్మనోర మ్యై ర్వకుల లై: కేత కై శ్శుభై:
పున్నా గై ర్జాతీ కుసుమై ర్మందారై శ్చ సుశోభి తై:
నీలోత్పలై: శుభై శ్చాన్యై స్తత్కాల తరు సంభ వై :
కల్పితాని చ మాల్యాని గృహణా మరవందితే.
ఓం శ్రీ సరస్వత్యై నమః పుష్పాణి సమర్పయామి. అని వివిధ రకమైన పువ్వులతో సరస్వతీ దేవిని పూజించవలెను. పిదప అధాంగ పూజను చేయవలెను.ఈ క్రింది నామాలను చదువుతూ పుష్పములతో గాని,పసుపు కుంకుమలతో గాని పూజించవలెను.



అథాంగ పూజ
ఓం బ్రహ్మణ్యై   నమః పాదౌ పూజయామి
ఓం బ్రహ్మణ్య మూర్తయే నమః గుల్ఫౌ పూజయామి
ఓం జగ త్స్వరూపిణ్యై  నమః జంఘౌ పూజయామి
ఓం జగదాద్యై నమః జానునీ పూజయామి
ఓం చారువిలాసిన్యై నమః ఊరూ పూజయామి
ఓం కమలభూమయే నమః కటిం పూజయామ
ఓం జన్మహీనాయై నమః జఘనం పూజయామి
ఓం గంభీరనాభయే నమః నాభిం పూజయామి
ఓం హరి పూజ్యాయ నమః ఉదరం పూజయామి
ఓం లోకమాత్రే నమః స్తనౌ పూజయామి
ఓం గాన విచక్షనాయై నమః కంటoపూజయామి
ఓం స్కంధప్ర పూజ్యాయై నమః స్కందౌ పూజయామి
ఓం ఘనబహవే నమః బాహూపూజయామి
ఓం పుస్తక ధారిణ్యై నమః హస్తౌ పూజయామి
ఓం శ్రోత్రియ బంధవే నమః  శ్రోత్రే  పూజయామి
ఓం వేద స్వరూపిణ్యై  వక్త్రం పూజయామి
ఓం సువానిన్యై నమః నాసికాం పూజయామి
ఓం బింబ సమానోష్యై నమః ఓష్టౌ పూజయామి
ఓం కమలాచక్షుసే నమః నేత్రే పూజయామి
ఓం తిలకదారిణ్యై నమః ఫాలం పూజయామి
ఓం చంద్రమూర్తయే నమః చికురాన్ పూజయామి
ఓం సర్వప్రదాయై నమః ముఖం పూజయామి
ఓం సరస్వత్యై నమః శిరః పూజయామి
ఓం బ్రహ్మరూపిణ్యై నమః సర్వాంగాణి పూజయామి

అనంతరం 108  పేర్లు గల అష్టోత్తర శతనామావళితో  పూజించవలెను. ఇది కూడా ఒకొక్క నామమును చదువుతూ పువ్వులు, పసుపు,లేదా కుంకుమతో పూజించవలెను.



సరస్వత్యష్టోత్తర శతనామావళి.

ఓం సరస్వ తైయ్య నమః
ఓం మహాభద్రాయై నమః       
ఓం మహమాయాయై నమః     
ఓం వర ప్రదాయై నమః
ఓం పద్మనిలయాయై నమః
ఓం పద్మా క్ష్రైయ నమః
ఓం పద్మవక్త్రాయై నమః
ఓం శివానుజాయై నమః       
ఓం పుస్త కధ్రతే  నమః
ఓం జ్ఞాన సముద్రాయై నమః ||10 ||
ఓం రమాయై నమః
ఓం పరాయై నమః
ఓం కామర రూపాయై నమః
ఓం  మహా విద్యాయై నమః
ఓం మహాపాత కనాశిన్యై నమః
ఓం మహాశ్రయాయై నమః
ఓం మాలిన్యై  నమః
ఓం మహాభోగాయై నమః
ఓం మహాభుజాయై నమః
ఓం మహాభాగ్యాయై నమః || 20 ||       
ఓం మహొత్సాహాయై నమః
ఓం దివ్యాంగాయై నమః
ఓం సురవందితాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం మహాపాశాయై నమః
ఓం మహాకారాయై నమః
ఓం మహాంకుశాయై నమః
ఓం సీతాయై నమః  
ఓం విమలా యై నమః
ఓం విశ్వాయై నమః || 30 ||
ఓం విద్యున్మాలాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం చంద్రికాయ్యై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్ర లేఖావిభూషితాయై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం సురసాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం దివ్యాలంకార భూషితాయై నమః
ఓం వాగ్దేవ్యై నమః || 40 ||
ఓం వసుధాయ్యై  నమః
ఓం తీవ్రాయై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహా బలాయై నమః
ఓం భోగదాయై నమః
ఓం  భారత్యై నమః
ఓం భామాయై నమః
ఓం గోవిందాయై నమః
ఓం గోమత్యై నమః
ఓం శివాయై నమః
ఓం జటిలాయై నమః
ఓం వింధ్యవాసాయై నమః  
ఓం వింధ్యాచల విరాజితాయై నమః
ఓం చండి కాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం బ్రహ్మజ్ఞా నైకసాధ నాయై నమః
ఓం సౌదామాన్యై నమః
ఓం సుధా మూర్త్యై నమః
ఓం సుభద్రాయై నమః || 60 ||
ఓం సుర పూజితాయై నమః
ఓం సువాసిన్యై నమః
ఓం సునాసాయై నమః
ఓం వినిద్రాయై నమః
ఓం పద్మలోచనాయై నమః
ఓం విద్యా రూపాయై నమః
ఓం విశాలాక్ష్యై నమః
ఓం బ్రహ్మాజాయాయై నమః
ఓం మహా ఫలాయై నమః
ఓం త్రయీమూర్త్యై నమః || 70 ||
ఓం త్రికాలజ్ఞాయే నమః
ఓం త్రిగుణాయై నమః
ఓం శాస్త్ర రూపిణ్యై నమః
ఓం శుంభా సురప్రమదిన్యై నమః
ఓం శుభదాయై నమః


ఓం సర్వాత్మికాయై నమః
ఓం రక్త బీజనిహంత్ర్యై నమః
ఓం చాముండాయై నమః
ఓం అంబికాయై నమః
ఓం మాన్ణాకాయ ప్రహరణాయై నమః || 80 ||
ఓం ధూమ్రలోచనమర్దనాయై నమః
ఓం సర్వదే వస్తుతాయై నమః
ఓం సౌమ్యాయై నమః
ఓం సురా సుర నమస్క్రతాయై నమః  
ఓం కాళ రాత్ర్యై నమః
ఓం కలాధారాయై నమః
ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః
ఓం వాగ్దేవ్యై నమః   
ఓం వరారోహాయై నమః
ఓం వారాహ్యై నమః || 90 ||
ఓం వారి జాసనాయై నమః
ఓం చిత్రాంబరాయై నమః
ఓం చిత్ర గంధా యై నమః
ఓం చిత్ర మాల్య విభూషితాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామప్రదాయై నమః
ఓం వంద్యాయై నమః
ఓం విద్యాధర సుపూజితాయై నమః  
ఓం శ్వేతాననాయై నమః
ఓం నీలభుజాయై నమః || 100 ||   

ఓం చతుర్వర్గ ఫలప్రదాయై నమః
ఓం చతురానన సామ్రాజ్యై నమః
ఓం రక్త మధ్యాయై నమః
ఓం నిరంజనాయై నమః
ఓం హంసాసనాయై నమః
ఓం నీలంజంఘాయై నమః
ఓం శ్రీ ప్రదాయై నమః
ఓం బ్రహ్మవిష్ణు శివాత్మి కాయై నమః || 108 ||                    

      
                         సరస్వత్యష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి

ధూపం: దశాంగం గగ్గులో పేతం సుగంధంచ మనోహరం
ధూపం : గృహాణ కల్యాణి భక్తిత్వం ప్రతిగృహ్యాతామ్
శ్లో|| ఓం శ్రీ సరస్వత్యై  నమః దూపమాఘ్రాపయామి. ధూపం సమర్పయామి.అంటూ ఎడమచేత్తో గంటవాయిస్తూ కుడిచేత్తో అగరుబత్తిని తిప్పుతూ పొగను దేవికి చూపవలెను.

దీపం :  ఘ్రుతావర్తి సంయుక్తం దీపితం దీపమంబికే
గృహాణ చిత్స్వ రూపేత్వం కమలాసన వల్లభే

శ్లో|| ఓం శ్రీ సరస్వత్యై  నమః సాక్షాత్ దీపం దర్శయామి. అని మొదట్లో చెప్పిన విధంగా దీపారాధనలో వున్న అదనపువత్తులలో ఒకదానిని తీసుకొని హారతి వెలిగించే దాంట్లో వేసి వెలిగించి గంట మ్రోగిస్తూ ఆ దీపం దేవికి చూపుతూ పై శ్లోకమును చదువవలెను.

నైవేద్యం:  అపూపాన్ వివిధాన్ స్వాదూన్ శాలిపిష్టోప పాచితాన్
మృదులాన్ గూడా సమ్మిశ్రాన్ సజ్జీరక మరీచికా న్
కదళీపన సామ్రాణి చ పక్వాని సుఫలాని కందమూల వ్యంజనాని సోపదంశం మనోహరం,
అన్నం చతుర్విదోపేతం క్షీరాన్నంచ ఘ్రుతం దధిశీతో దకంచ సుస్వాదు
స్సుకర్పూరై లాది వాసితం,
భక్ష్యభోజ్య సమాయుక్తం నైవేద్యం ప్రతిఘ్రుహ్యాతాం
శ్లో|| ఓం శ్రీ సరస్వత్యై నమః  నైవేద్యం సమర్పయామి. అని సరస్వతీ మాతకు భక్ష్య భోజ్యములు, పళ్ళు, పాయసము, కొబ్బరికాయ మొదలునవి దేవివద్దనుంచి దానిపై పువ్వుతో నీళ్లు చల్లుతూ ఎడమ చేత్తో గంటవాయిస్తూ ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటూ ఆరుమార్లు చేతితో (చేతిలోని ఉద్ధరిణెతో) దేవికి నివేదనం చూపించాలి.పిదప  నైవేద్యానంతరం 'హస్తౌ ప్రక్షాళ యామి'అని ఉద్ధరిణెతో పంచపాత్రలోని నీరు ముందు చెప్పిన ఆర్యపాత్ర (పంచ పాత్ర కాకుండా విడిగా చెంబులో పెట్టుకొనే నీళ్ల పాత్ర )లో వదలాలి.తరువాత 'పాదౌ ప్రక్షాళయామి' అని మరోసారి నీరు ఆర్ఘ్య పాత్రలో ఉద్ధరిణెతో వదలాలి.పునః శుద్ధచమనీయం సమర్పయామి అని ఇంకొక పర్యాయం నీరు వదలాలి.

తాంబూలం :  తాంబూలం సకర్పూరం పూగ నాగదళైర్యతం,
గృహాణ దేవదేవేశీ తత్వరూపీ నమోస్తుతే ||
శ్లో||  ఓం శ్రీ సరస్వత్యై నమః తాంబూలం సమర్పయామి. అని చెబుతూ తాంబూలమును (మూడు తమలపాకులు,రెండు పోకచెక్కలు,అరటి పండు వేసి) దేవివద్ద  ఉంచాలి.తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కొనుటకు నీరు ఇస్తున్నామని తలుస్తూ ,'తాంబూల చరవణా నంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి'అంటూ ఉద్ధరిణెతో నీరు ఆర్ఘ్య పాత్రలో వదలాలి.పిమ్మట కర్పూరం వెలిగించి

నీరాజనం:  నీరాజనం గృహాణత్వం జగదానంద దాయిని,
జగత్తి మిర మార్తాండ మండలేతే నమోనమః ||

శ్లో|| ఓం శ్రీ సరస్వత్యై నమః కర్పూర నీరాజనం సమర్పయామి. అని కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి ముందుగా దీపారాధనకు వెలిగించిన దీపంతో వెలిగించి శ్రీ సరస్వతీమాతకు హారతి నీయవలెను.

పుష్పాంజలి:  శారదే లోకమాతే స్త్వ మాశ్రి తాభీ ష్ట దాయిని
పుష్పాంజలిం  గృహాణత్వం మయాభాక్త్యా సమర్పిత మ్ ||
సరస్వత్యై నమః పుష్పాంజలిం సమర్పయామి అని పువ్వులను దేవిపై ఉంచి నమస్కరించవలెను.

మంత్రపుష్పం : యాకుం దేందు తుషార హార ధవళా యా శుభ్ర  వస్త్రాన్వితా  
యా వీణా వరదండ మండిత కరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతిభి ర్దే వై స్సదా పూజితా
సామాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శే ష జాడ్యా పహా
శ్లో|| సరస్వత్యై  నమః యథాశక్తి మంత్ర పుష్పం సమర్పయామి అని చెప్పుకొని అక్షతలు,పువ్వులు,చిల్లర దేవివద్ద  ఉంచవలెను.

ప్రదక్షిణ నమస్కారాన్ : పాశాంకుశ ధరా వాణీ వీణాపుస్తక ధారిణీ,
మమ వక్త్రే వసే న్నిత్యం దుగ్ద కుందేందు నిర్మలా
చతుర్దశ సువిద్యా సురమతే యా సరస్వతీ,
చతుర్ద శేషు లోకేషు సామే వాచి వ సేచ్చిరమ్ ||
పాహిపాహి జగద్వంద్యే నమస్తే భక్త వత్సలే,
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమోనమః ||
ఓం శ్రీ సరస్వత్యై నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.అని చేతిలో అక్షతలు, పువ్వులు, తీసుకొని లేచి నిలబడి మూడుసార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి (అనగా తమలో తాము చుట్టూ తిరిగి) పిమ్మట సాష్టాంగ నమస్కారం చేసి (మగవారు పూర్తిగా పడుకుని తలను నెలకు ఆన్చి,ఆడువారు మోకాళ్ల పై పడుకుని కుడికాలు ఎడమ కాలుపై వేసి) తరువాత దేవిపై చేతిలో నున్న అక్షతలు, పువ్వులు చల్లవలెను.

వాయినదానం : భారతీ ప్రతిగృహ్ణాతు భారతీ వై దదాతి చ,
భారతీ తారకోభాభ్యాం భారత్యై తే నమే నమః
సరస్వత్యై నమః వాయందానం సమర్పయామి అని శనగలు(నానబెట్టినవి),తాంబూలం(మూడు ఆకులు, వక్క, అరటిపండు), రావికలగుడ్డ,(జాకెట్టు) గుడ్డ, పువ్వులు, 9  రకముల పిండి వంటలు, రకమునకు 9  చొప్పున ఒక పళ్ళెములో పెట్టి, మరొక పళ్ళెములో మూసి, కొంగుపైన కప్పి ముత్తయిదువునకు బొట్టుపెట్టి ఆమెను సరస్వతీ దేవిగా భావించి వాయన మీయవలెను.

పునఃపూజ: ఓం సరస్వత్యై  నమః పునః పూజాంచ కరిష్యే అని  చెప్పుకొని,పంచపాత్రలోని నీటిని చేతితో తాకి,అక్షతలు దేవిపై చల్లుచూ ఈ క్రింది మంత్రములు చదువుకొనవలెను.
చత్రం ఆచ్చాదయామి, చామరం వీచయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, వాద్యం ఘోషయామి, సమస్త రాజోపచార, శక్త్యోపచార, భక్త్యోపచార పూజాం సమర్పయామి అనుకొని, నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకమును చదువుకొనవలెను.
ఏ తత్ఫలం శ్రీ సరస్వతీ మాతర్పణ మస్తు అంటూ అక్షతలు నీటితో పాటు అరవేణంలో వదలవలెను. పిమ్మట 'శ్రీ సరస్వతీ దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి' అనుకొని దేవివద్ద అక్షతలు తీసుకొని తమ తమ తలలపై వేసుకొనవలెను.ఆ పిదప పసుపు గణపతి ఉన్న పళ్ళెము నొకసారి పైకి ఎత్తి తిరిగి క్రింద ఉంచి పసుపు గణపతిని తీసి దేవుని పీటము పై నుంచవలెను. దీనిని ఉద్వాసన చెప్పటం అంటారు.

శ్లో|| యస్య స్మ్రుత్యాచ నామోక్త్యా త పం పూజాక్రియాది షు
న్యూనం  సంపూర్ణ  తాంయతి సద్యోవందే తమచ్యుత మ్
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్ధన,
యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||

అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః శ్రీ సరస్వతీ దేవతా సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు. శ్రీ సరస్వతీ దేవతా ప్రసాదం శిరసాగృహ్ణామి అని దేవికి నమస్కరించి ప్రసాదమును స్వీకరించవలెను. 

No comments:

Post a Comment