Friday, August 17, 2012

రధ సప్తమీ వ్రతకల్పము

శ్రీరస్తు

సూర్యుని ఏకాదశ మంత్రములు : ఓం మిత్రాయ నమః , ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః ,ఓం భానవే నమః , ఓం ఖగాయ నమః , ఓం పూష్ణే నమః , హిరణ్యగర్భాయ నమః , ఓం మరీచయే నమః , ఓం ఆదిత్యాయ నమః , ఓం సవిత్రే నమః , ఓం అర్కాయ నమః , ఓం భాస్కరాయ నమః

(ఏ రోజున అరుణోదయ కాలంలో సప్తమీతిథి ఉందో, ఆ రోజునే స్నానాన్నీ,రథసప్తమీ వ్రతాన్ని చేయాలి.ఒకవేళ రెండు రోజులలోని అరుణోదయాలలోను సప్తమి ఉంటే,మొదటి రోజే రథసప్తమిగా భావించాలి. షష్టి నాడు ఒంటిపూట భోజనంతో ఉండి,సప్తమినాడు అరుణోదయాన్నే (ఉదయాన్నే) స్నానం చేసి,సువర్ణ - రజత- తామ్ర - లోహ పాత్రలలో దేనిలో నైనా తైలంపోసి దీపం వెలిగించి, సూర్య ప్రిమని లఖించి,షోడశోపచారాలతో నూ పూజించాలి. ఆ పుణ్య కాలం సంక్రాతి పుణ్యకాలం వంటిది.అలాంటి పుణ్యకాలంలో గంగాది నదులలో దీపాలని వదిలి, పితృతర్పణం మొదలైనవి ఆచరించి,సూర్యోపాసన చేసినవారికి - గత ఏడు జన్మలలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. షష్టీ సప్తమీ యోగము 'పద్మకం' అని చెప్పబడుతోంది. ఇటువంటి యోగం వేయి సూర్య గ్రహణాలతో సమానమని గర్గ మహామునిచే భోధించబడింది).

భూశుద్ధి :
ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్ధి చేసి,అలికి,బియ్యపు పిండితోగాని,రంగుల చూర్ణములతోగాని,ముగ్గులుపెట్టి,దైవస్థాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి.పీట మరీ ఎత్తుగాని, మరీ పల్లముగానీ ఉండకూడదు.పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపురాసి,కుంకుంమతో బొట్టు పెట్టి,వరిపిండి (బియ్యపుపిండి) తో ముగ్గు వేయాలి. సాధారణంగా  అష్టదళ పద్మాన్నే వేస్తారు.పూజచేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి.ఏ దైవాన్ని పూజింపబోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమనుగాని, చిత్రపతమునుగాని, ఆ పీట పై ఉంచాలి.ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి (పసుపును షుమారు అంగుళం సైజులో త్రికోణ ఆకృతిలో ముద్దగా చేసి),దానికి కుంకుమ బొట్టు పెట్టి,పిదప ఒక పళ్లెంలోగాని,క్రొత్త తుండు గిద్ద మీద గాని బియ్యం పోసి దానిపై ఒక తమలపాకు నుంచి,అందు పసుపు గణపతి నుంచి అగరువత్తులు వెలిగించాలి.ఇప్పుడు పూజకు కావలసిన వస్తువులను అమర్చుకోవాలి.దీపారాధన నైరుతి దిశలో చేయవలెను.

పూజకు కావలసిన వస్తువులు - దీపారాధన విధానము
దీపారాధన చేయుటకు కుంది (ప్రమిద) వెండిది గాని,ఇత్తడిదిగాని,మట్టిది గాని వాడవచ్చును.కుందిలో 3 అడ్డవత్తులు 1 కుంభవత్తి (మధ్యలో)వేసి నూనెతో తడుపవలెను. ఇంకొక అడ్డవత్తి నూనెతో తడిపి ఏకహారతిలో (కర్పూర హారతికి వాడే వస్తువు)వేసి ముందుగా ఏకహరతిలో వేసిన వత్తిని అగ్గిపుల్లతో వెలిగించి,వెలిగించిన వత్తితో కుందిలోని 1 అడ్డవత్తి 1 కుంభవత్తి  వెలిగించవలెను.తర్వాత చేయి కడుక్కుని నూనె కుంది నిండావేసి పిదప ఆ కుందికి మూడుచోట్ల కుంకుమ అలంకారము చేయవలెను. తర్వాత అక్షతలు వేసి దీపారాధనను లక్ష్మీ స్వరూపముగా భావించి నమస్కారము చేయవలెను.కుందిలో మిగిలిన రెండు అడ్డవత్తులు పూజా సమయంలో ధూపము చూపిన తరువాత దీపము చూపించుటకు వాడవలెను. దీపారాధనకునువ్వులనూనెగాని,కొబ్బరినూనెగాని,ఆవునెయ్యి గాని వాడవచ్చును. మనము ఆచమనము చేసినటువంటి పంచపాత్రలోనీళ్లు దేవుని పూజకు వినియోగించరాదు. పూజకు విడిగా ఒక గ్లాసుగాని,చెంబు గాని తీసుకొని దానిలో శుద్ధ జలమును పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆ నీళ్లు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించవలెను.



రథ సప్తమీ వ్రత పూజకుకావలసిన ముఖ్య  వస్తువులు:
సూర్యుని ప్రతిమ (తమ శక్తి కొలది బంగారం,వెండి లేదా రాగిరేకు పై లిఖించినది) లేదా చిత్రపటము,పువ్వులు,కొబ్బరికాయలు,పళ్ళు,పసుపు,కుంకుమ,గంధం,హారతి కర్పూరం, అక్షతలు,అగ్గిపెట్టె,అగరువత్తులు,వస్త్ర,యజ్ఞోపవీతములు, ప్రత్యేక నివేదనమునకు సూర్యునికి ప్రీతికరమైన చక్రపొంగలి (క్షీరాన్నం) చేయాలి. ఇంకనూ వీలైనచో పిండివంటలు మొ||వి సిద్ధము చేసుకొనవలెను.

పిమ్మట యజమానులు (పూజచేసేవారు) ఈ దిగువ కేశవనామాలను స్మరిస్తూ ఆచమనం చేయాలి. ఈ నామాలు మొత్తం 24  కలవు.
1 . "ఓం కేశవాయ స్వాహ" అని చెప్పుకుని చేతిలో నీరు తీసుకొని లోనికి తీసుకోవాలి.
2 . "ఓం నారాయణాయ స్వాహ" అనుకుని ఒకసారి
3 ." ఓం మాధవాయ స్వాహ "అనుకుని ఒకసారి జలమును పుచ్చుకోవలెను.తరువాత
4 . "ఓం గోవిందాయ నమః"అని చేతులు కడుగుకోవాలి.
5 . "ఓం విష్ణవే నమః"  అనుకుంటూ నీళ్ళు త్రాగి,మధ్యవ్రేలు,బొటన వ్రేళ్ళతో కళ్ళు తుడుచుకోవాలి.
6 ." ఓం మధుసూదనాయ నమః"  అని పైపెదవిని కుడునుంచి ఎడమకి నిమురుకోవాలి.
7 . "ఓం తివిక్రమాయ నమః" క్రింది పెదవిని కుడినుంచి ఎడమకి నిమురుకోవాలి.
8 . 9 . "ఓం వామనాయ నమః" " ఓం శ్రీధరాయ నమః"  ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్ళు చల్లుకోవాలి.
10 . ఓం హృషీకేశాయ నమః ఎడమ చేతితో నీళ్ళు చల్లాలి.
11 .ఓం పద్మనాభాయ నమః పాదాలపై ఒకొక్క చుక్క నీరు చల్లుకోవాలి.
12 . ఓం దామోదరాయ నమః శిరస్సుపై జలమును ప్రోక్షించుకోవలెను.
13 . ఓం సంకర్షనాయ నమః చేతివేళ్లు గిన్నెలా వుంచి గడ్డము తుడుచుకోవలెను.
14 . ఓం వాసుదేవాయ నమః వ్రేళ్ళతో ముక్కును వదులుగా పట్టుకోవలెను.
15 . 16 . ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః నేత్రాలు తాకవలెను.
17 . 18 . ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః రెండు చెవులూ తాకవలెను.
19 . 20 . ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః బొడ్డును స్ప్రుసించవలెను
21 . ఓం జనార్ధనాయ నమః చేతివేళ్ళతో వక్షస్థలం,హృదయం తాకవలెను.
22 . ఓం ఉపేంద్రాయ నమః చేతి కొనతో శిరస్శు తాకవలెను.
23 . 24  ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః కుడి మూపురమును ఎడమచేతితోను,ఎడమ మూపురమును కుడుచేతితోను ఆచమనము చేసిన తరువాత ఆచమనము చేసి,వెంటనే సంకల్పము చేప్పుకోవలెను.

ఆచమనము అయిన తరువాత,కొంచెం నీరు చేతితో పోసుకొని నేలపై చిలకరించుతూ ఈ శ్లోకమును పటింపవలెను.
శ్లో || ఉత్తిష్టంతు భూత పిశాచాః యే తే భూమిభారకాః
యే తే  షామ విరోధేనా బ్రహ్మ కర్మ సమారభే ||

ప్రణాయామమ్యః
ఓం భూ: - ఓం భువః ఓంసువః - ఓం మహః - ఓం జనః - ఓం తపః -ఓగ్ o  సత్యం - ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీ మహీధీ యోయోనః ప్రచోదయాత్ - ఓం ఆపోజ్యోతిర సోమృతం బ్రహ్మభూర్భువ స్సువరోం అని సంకల్పము చేప్పుకోనవలెను.

సంకల్పము:
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్ధిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే ఆద్య బ్రహ్మణః (ఇక్కడ శ్రీమహవిష్ణో రాజ్ఞాయ అని కూడా చెప్పవచ్చు) ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరత ఖండే మేరో ర్ధక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే (మనకు శ్రీ శైలము ప్రధాన క్షేత్రము కావున మనము శ్రీశైలమునకు ఏ దిక్కున ఉన్నామో అ దిక్కు చేప్పుకొనవలెను),కృష్ణా గోదావర్యో: మధ్య ప్రదేశే (మనం ఏ ఏ నదులకు మధ్యన ఉన్నామో ఆయా నదుల పేర్లు చేప్పుకొనవలెను),శోభన గృహే (అద్దె ఇల్లు అయినచో వసతి గృహే అనియు,సొంత ఇల్లుయినచో స్వగృహే అనియు చేప్పుకొనవలెను). సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన .................... సంవత్సరే, (సంవత్సరమునకు రెండు ఆయనములు- ఉత్తరాయనము, దక్షిణాయనము. జనవరి 15 మకర సంక్రమణం మొదలు జులై 14 కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణం,జులై 15  కర్కాటక సంక్రమణం నుండి మరల జనవరి 14 పెద్ద పండుగ అనగా మకర సంక్రమణం వరకు దక్షిణాయనం .పూజచేయునపుడు ఏ ఆయనము జరుగుచున్నదో దానిని చెప్పవలెను).......... ఋతు:, (వసంత,గ్రీష్మ,వర్ష మొ||ఋతువులలో పూజ సమయములో జరుగుచున్న ఋతువు పేరు) ..........మాసే,(చైత్ర ,వైశాఖ మొ|| పన్నెండు మాసములలో పూజ సమయములో జరుగుచున్న మాసంపేరు) ..............పక్షే,(నెలకు రెండు పక్షములు పౌర్ణమికి ముందు శుక్ల పక్షము,అమ్మవాస్యకు ముందు కృష్ణ పక్షములు వీటిలో పూజ జరుగుతున్నసమయమున గల పక్షము పేరు)..........తిథౌ,(ఆరోజు తిథి) ............వాసరే (ఆరోజు ఏ వారమన్నదీ చెప్పుకొని) శభ నక్షత్రే,శుభ యోగే ,శభ కరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీపరమేశ్వర ముద్దిస్య శ్రీపరమేశ్వర  ప్రీత్యర్ధం పురుషులైనచో శ్రీమాన్ ......గోత్రస్య ........నామధేయః, శ్రీమత్యః,గోత్రస్య ,నామధేయస్య అనియు,స్త్రీ లైనచో శ్రీమతి,గోత్రవతి,నామధేయవతి,శ్రీమత్యాః, గోత్రవత్యాః,నమధేయవత్యాః అనియు (పూజచేయువారి గోత్రము,నామము చెప్పి) నామధేయస్యః ధర్మపత్నీ సమేతస్య (పురుషులైనచో) మమ సహకుటుంబస్య,క్షేమ స్థైర్య వీర్య విజయ అభయఆయురారోగ్య ఐశ్వర్యాభి వ్రుద్ధ్యర్ధం ,ధర్మార్ధ కామ మోక్ష ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం,పుత్రపౌత్రాది వ్రుద్ధ్యర్ధం సకలవిధ మనోవాంచాఫల సిద్ధ్యర్ధం, శ్రీసూర్యనారాయణమూర్తి దేవతాముద్దిశ్య శ్రీ సూర్యనారాయనమూర్తి దేవతా  ప్రీత్యర్ధం (ఏ దేవుని పూజించుచున్నామో ఆ దేవుని యొక్క పేరు చెప్పుకొని) సంభవద్భి రుపచారై: సంభావతానియమేనా సంభావతా ప్రకారేణ యావచ్చక్తి (నాకు తోచినరీతిలో, నాకు తోచిన నియమములతో,నాకు తోచిన విధముగా,భక్తి శ్రద్ధలతో సమర్పించుకొంటున్న పూజ) ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. తధంగ కలశ పూజాం కరిష్యే || పిదప కలశారాధనను చేయవలెను.


కలశ పూజను గూర్చిన వివరణ :
వెండి,రాగి,లేక కంచు గ్లాసులు (లేదా పంచపాత్రలు) రెండిటిలో శుద్ధ జలమును తీసుకొని ఒకదానియందు ఉద్ధరిణినీ,రెండవ దానియందు అక్షతలు,తమలపాకు,పువ్వు ఉంచుకొనవలెను. రెండవ పాత్రకు బయట మూడు వైపులా గంధమును వ్రాసి కుంకుమను అద్దవలెను. ఇట్లు చేయునప్పుడు గ్లాసును గుండ్రముగా త్రిప్పుచూ గంధముగాని కుంకుమను గాని పూయరాదు. గంధమును ఉంగరపు వేలితో పూయవలెను.కుంకుమ అక్షతలు వగైరా బొటన,మధ్య,ఉంగరపు వ్రేళ్ళను కలిపి సమర్పించవలెను.యజమానులు (ఒక్కరైతే ఒకరు,దంపతులైతే ఇద్దరూను) ఆ కలశాన్ని కుడిచేతితో మూసిఉంచి, ఇలా అనుకోవాలి.

ఈ విధముగా కలశమును తయారు చేసి పూజను చేయునప్పుడు మొదటగా ఈ శ్లోకమును చదువవలెను.
మం|| కలశస్య ముఖే విష్ణు: కంటే రుద్రా స్సమాస్శ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాత్రు గనాస్మ్రుతాః||
ఋగ్వేదో థ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః
అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః

శ్లో || గంగైచ యమునే చైవ కృష్ణే ,గోదావరి,సరస్వతీ,
నర్మదా సింధు కావేర్యౌ జలే స్మిన్ సన్నిధింకురు ||

ఇక్కడ ఇలా శ్లోకము ముగిసిన తరువాత ఆయాతు శ్రీసూర్యనారాయణ మూర్తయే నమః   (ఏ  దేవుని పూజైతే చేస్తున్నామో ఆ దేవుని పేరును చెప్పవలెను)పూజార్ధం మమ దురితక్షయ కారకాః కలశోదకేనా ఓం దేవం సంప్రోక్ష్య (కలశ మందలి ఉదకమును దేవుని పై చల్లాలి),ఓం ఆత్మానం సంప్రోక్ష్య అని (ఆ నీటిని తనపై చల్లుకోవాలి) ఓం పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య (పూజా ద్రవ్యములపై కూడా చల్లాలి) కలశమందలి నీటిని పై మంత్రం చదువుతూ పువ్వుతో గాని,ఆకుతో గానీ,చల్లాలి.



మార్జనము
ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావ స్థాంగ తోపివా
యస్స్మరే త్పుండరీ కాక్షం సబాహ్యభ్యంతర శ్శుచి:||
అని పిదప కాసిని అక్షతలు,పసుపుగణపతి పై వేసి,ఆయనకు తాకి నమస్కరించి ప్రాణ ప్రతిష్టాపన చేయవలెను.ప్రానప్రతిష్టాపన అనగా శ్రీ మహాగణాధిపతయేనమః ప్రాణప్రతిష్టాపన ముహూర్త స్సుముహూర్తోస్తూ తథాస్తు. తరువాత ఇలా చదువుతూ విఘ్నేశ్వరునికి నమస్కారించవలెను.

శ్లో|| శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వవిఘ్నోపశాంతయే
సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః
లంబోదర శ్చ వికటో విఘ్నరాజో వినాయకః
ధూమకేతు ర్గనాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్సూర్పకర్ణో హేరంబః స్కంధః పూర్వజః
షోడ శైతాని నామాని యః పటే చ్చ్రుణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్త స్య నజాయతే ||

అని ప్రార్ధించి పిమ్మట సూర్యునికి  షోడశోపచార పూజను చేయవలెను.షోడశోపచారములనగా ఆవాహన,ఆసనం,అర్ఘ్యం,పాద్యం,ఆచమనీయం,స్నానం,వస్త్రం,ధూపం,దీపం,నైవేద్యం,తాంబూలం,నమస్కారం,ప్రదక్షిణములు మొదలగునవి.
షోడశోపచార పూజ ప్రారంభః
ధ్యానం:
శ్లో || ధ్యేయ స్సదా సవిత్రుమండల మధ్యవర్తీ
నారాయణ స్సర సిజాసన సన్నివిష్టమ్ ||
కేయూర వాన్మకర కుండల వాన్కిరీ టీ |
హరీ హిరణ్మయ పుర్ధ్రత శ్మంఖ చక్రః ||

శ్లో || నమస్సవిత్రే జగదేక చక్షుషే |
జగత్ప్రసూతి స్థితినాశ హేతవే
త్రయీ మయాయ త్రిగుణాత్మ ధారిణే |
విరించి నారాయణ శంకరాత్మనే || ప్రాణ ప్రతిష్టాపనం కుర్యాత్



ధ్యానం : ఓం భూర్భువ స్స్వః | ఓం హ్రాం | ఓం హగ్గ్ సశ్శుచిషత్ ||
రవివారాది దైవత్యం భాస్కరం విశ్వరూపిణమ్ |
ఓం హ్రాం మిత్రాయ నమః ధ్యాయామి ||
ఓం శ్రీసూర్యాయ నమః  ధ్యాయామి - ధ్యానం సర్పయామి అని సూర్యుని  మనస్సున ధ్యానించి నమస్కరించవలెను.

ఆవాహనం :
ఓం శ్రీసూర్యాయ నమః ఆవాహయామి. ఆవాహనార్ధం అక్షతాం సమర్పయామి.అనగా మనస్పూర్తిగా దేవుని మన ఇంట్లోకి ఆహ్వానించడం.అట్లు మనస్సున స్మరిస్తూ అక్షతలు దేవుని పై వేయవలెను.

ఆసనం :  ఓం భూర్భువ స్స్వః | ఓం హ్రీం | ఓం వ సుర న్త రి క్షు సత్ ||
శ్లో || దివాకర నమస్తుభ్యం సర్వలోకైక నాయక |
దివ్య సింహాసనం దేవ స్వీకురుష్వ రవి ప్రభో ||
ఓం హ్రీం ఓం రవయే నమః నవరత్న ఖచిత స్వర్ణ  సింహాసనం సమర్పయామి||
సింహాసనార్ధం అక్షతాం సమర్పయామి.దేవుడు కూర్చుండుటకై మంచి బంగరుపీట వేసినట్లు అనుకుంటూ అక్షతలు వేయవలెను.

పాద్యం:  ఓం భూర్భువ స్స్వః | ఓం హ్రూం | ఓం హొ తావే ది షత్ ||
శ్లో || గ్రహరాజ నమస్తుభ్యం పాద్యంగంధాది భిర్యుతం |
స్వచ్చం పాద్యం మయాదత్తం సంగృహాణ దివాకర ||
ఓం హ్రూం ఓం సూర్యాయ నమః పాదయో పాద్యం సమర్పయామి||
ఓం శ్రీసూర్యాయ నమః పాదౌ : పాద్యం సమర్పయామి.దేవుడు కాళ్లు కడుగుకొనుటకు నీరు ఇస్తున్నామని మనసున అనుకుంటూ ఫ్పువ్వుతో పంచపాత్రలోని నీరు అదే గిన్నెలో ఉద్ధరిణెతో వదలవలెను.

అర్ఘ్యం :  ఓం భూర్భువ స్స్వః | ఓం హ్రైం | ఓం అతిధి ర్దురోణ  సత్ ||
శ్లో || గంగాజలం సమానీతం రక్త పుష్యాది భిర్యుతం
అర్ఘ్యం గృహాణ భగవన్ మార్తాండాయ నమోనమః ||
ఓం హ్రైo ఓం భానవేనమః హస్తయో: అర్ఘ్యం సమర్పయామి.||
ఓం సూర్యాయ నమః హస్తౌ: అర్ఘ్యం సమర్పయామి. దేవుడు చేతులు కడుగుకొనుటకై నీళ్ళిస్తున్నామని మనసున తలుస్తూ, ఉద్ధరిణితో నీరు వేరొక గిన్నెలో వదలవలయును.



ఆచమనీయం : ఓం భూర్భువస్స్వః ఓం హ్రౌం | ఓం నృషద్వరసత్ |
పద్మపత్ర జగచ్చక్షుః పద్మాసన సమప్రభ
ప్రద్యోతన పవిత్రంచ దదామ్యాచ మనం కురు ||
ఓం హ్రౌం ఓం ఖగాయనమః ముఖే ఆచమనం సమర్పయామి.ఓం సూర్యాయ నమః ఆచమనీయం సమర్పయామి.అంటూ దేవుని ముఖము కడుగుకొనుటకై నీళ్లిస్తున్నామని మనమున తలుస్తూ పైన చెప్పిన పాత్రలో ఉద్ధరిణెతో ఒకమారు నీరు వదలవలెను.
సూచన :
అర్ఘ్యం,పాద్యం,ఆచమనం మొదలగు వాటికి ఉద్ధరిణెతో నీరు వేరొక పాత్రలో వదలవలెను.అరివేణంలో వదలరాదు.

మధుపర్కం : ఓం భూర్భువస్స్వః ఓం హ్రః ఓం ఋత సద్యే మ సత్
మధ్వాజ్య దధి సంయుక్తం శర్కరాక్షీ ర సంయుతం
మధుపర్కం గృహాణేదం మయాతుభ్యం సమర్పిత మ్|
ఓం హ్రః ఓం పూష్ణే నమః మధుపర్కం సమర్పిత మ్ .
ఓం శ్రీ సూర్యాయ నమః మధుపర్కం సమర్పయామి అని స్వామివారికి స్నానం చేయుటకు వస్త్రమిచ్చుచున్నామని తలుస్తూ,ఈ మధుపర్కంను ఆయన ప్రతిమకు అద్దవలెను.(ప్రత్తిని పెద్ద బొట్టుబిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆపైన రెండువైపులా పసుపులో అద్ది ఉంచుకొన్నదాన్ని మధుపర్కం అంటారు).

పంచామృత స్నానం : పంచామృతేన స్నపనం భాస్కర స్య కరో మ్య హ మ్
నశ్యంతు పంచపాపాని సూర్యదేవ ప్రసాదతః ||
ఆప్యాయస్వేతి పంచమంత్రై: పంచామృత స్నానమ్
1 . (క్షీరం) ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వత స్సోమవ్రుష్ణ్య మ్ | భవా వాజస్య సంగథే ||
2 . (దధి) ఓం దధి క్రావ్ణో అకారి షం జిష్ణోర శ్వ స్య వాజినః | సురభి నో ముఖా కరత్ప్ర ణ ఆయోగ్గ్ షి తారి షత్
3 . (ఘ్రుతం) ఓం ఘ్రుతం మిమిక్షే ఘ్రుత మస్య యోని ర్ఘ్రుతే శ్రితో ఘ్రుత మ్వ స్య ధా మ |
అనుష్వధ మావ హమాదయ స్వ స్వాహ కృతం వృషభ వక్షి హవ్య మ్ ||
4 . (శర్కర) ఓం యమాయ త్వా మఖాయ త్వా సూర్య స్య త్వా త వ సే |
దేవస్త్వా సవితా మద్యానక్తు పృథి వ్యాసగ్గ్ స్సృశ స్పాహి అర్పిర సిశో చిర సిత పోసి ||
5 . (మధు) ఓం మధువాతా ఋతాయతే మధుక్ష రన్తి సివ్దవః మాద్వీర్న స్సన్త్వో షధీః|
మధునక్త ముతో మధుమత్పార్థి వగ్గ్ రజః మధుద్యౌ రన్తు నః పితా
మధుమాన్నో వన స్పతిర్మధుమాం అస్తు సూర్యః మాధ్వి ర్గావో భవస్తు వః ||
ఇతి పూష్ణే నమః పంచామృత స్నానం సమర్పయామి.
అని స్నానమునకు పంచామృతములతో కూడిన నీరు ఇచ్చునట్లు భావించి ఆవునెయ్యి,ఆవుపాలు,ఆవుపెరుగు,తేనె,పంచదార కలిపిన పంచామృతమును స్వామిపై ఉద్ధరిణెతో చల్లవలెను.


శుద్దోదక స్నానం : శ్లో || గంగాజలం సమానీతం గంధ కర్పూర సంయుతం |
స్నాపయామిత్రి లోకేశ గృహ్యతాం వైదివాకర |
ఓం పూష్ణేనమః శుద్దోదక స్నానం సమర్పయామి.||
ఓం శ్రీసూర్యాయ నమః శుద్దోదక స్నానం సమర్పయామి. పంచపాత్రలోని శుద్ధ నీటిని పువ్వుతో దేవునిపై చల్లవలెను.

వస్త్రయుగ్మం: ఓం భూర్భువస్స్వః ఓం హ్రాం ఓం అబ్జాః
శ్లో || దివాకర నమస్తుభ్యం పాపం నాశయ భాస్కర
రక్త వస్త్ర మిదం దేవ ప్రీత్యర్ధం ప్రతిగృహ్యతామ్
ఓం హ్రాం ఓం హిరణ్య గర్భాయనమః రక్త వస్త్రద్వయం సమర్పయామి.
ఓం సూర్యాయ నమః వస్త్ర యుగ్మం సమర్పయామి. అనుచు వస్త్రమును (పత్తిని గుండ్రని బిళ్ళఆకారములో  చేసి నీటిలో తడిపి ఆపైన రెండు వైపులా కుంకుమతో అద్దినచో అది వస్త్రమగును.ఇటువంటివి రెండు చేసుకొనవలెను ) స్వామివారి ప్రతిమకు అద్దవలెను.

యజ్ఞోపవీతం : ఓం భూర్భువస్స్వః ఓం హ్రీం ఓం గో జాః
శ్లో || అహః పతే నమస్తుభ్యం తీ క్ ష్ణాం శు పతయే నమః
ఉపవీతం మయాదత్తం సంగృహాణ దివాకర ||
ఓం హ్రీం ఓం మరీచయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి.
ఓం శ్రీసూర్యాయ నమః ఉపవీతం సమర్పయామి. అనగా జందెమును ఇవ్వవలెను.ఇదియును ప్రత్తితో చేయవచ్చును.ప్రత్తిని తీసుకొని పసుపుచేత్తో బొటన వ్రేలు,మధ్య వ్రేలితో మధ్య మధ్య నలుపుతూ పొడువుగా చేసి, కుంకుమ అద్దవలెను.దీనిని పురుషదేవతా పూజకు మాత్రమే సమర్పించవలెను.

గంధం:
శ్లో || గోరోచన సమాయుక్తం క స్తూర్యాది సమన్వితం |
గంధం దాస్యామి దేవేశ సంగృహాణ దివాకర ||
ఓం హ్రూం ఓం ఆదిత్యాయ నమః రక్త చందనం సమర్పయామి.
ఓం శ్రీసూర్యాయ నమః గంధాన్ సమర్పయామి. ముందుగా తీసిపెట్టుకున్న గంధమును కుడిచేతి ఉంగరం వ్రేలితో స్వామివారి ప్రతిమపై చల్లవలెను.


అక్షతాన్:
శ్లో || అక్షతాన్ దేవదేవేశ రక్త గంధ సమన్వితా న్
గృహాణ సర్వలోకేశ మయాదత్తాన్ సురేశ్వర ||
ఓం శ్రీసూర్యనారాయణ పరబ్రహ్మణే నమః రక్తాక్షతాన్ సమర్పయామి.
ఓం శ్రీసూర్యాయ నమః అక్షతాన్ సమర్పయామి. (అక్షతలకు బియ్యమును తడిపి పసుపు వేసి కలుపవలెను).అక్షతలు తీసుకొని స్వామివారి ప్రతిమపై చల్లవలెను.

సర్వాభరణాని : రక్త మాణిక్య సంయుక్తం భూషణాని విశేషతః
మాయాదత్తాని గృహ్ణీ ష్వ పద్మ గర్భ సముద్యతే ||
శ్రీ సూర్యాయ నమః ముక్తాభరణాని సమర్పయామి.
శ్రీ సూర్యాయ నమః సర్వాభరణం సమర్పయామి. శక్తి కొలది ఆభరణములను స్వామివద్ద వుంచి పూజించవలయును.

పుష్ప సమర్పణ :
శ్లో || రక్త వర్ణాని పుష్పాణి పద్మాని వివిధాని చ|
మల్లికాదీని పుష్పాణి గృహాణ సుర పూజిత ||
ఓం హ్రైo ఓం సవిత్రే నమః పుష్పం సమర్పయామి.
ఓం శ్రీ సూర్యాయ నమః పుష్పాణి సమర్పయామి.స్వామివారికి పువ్వులతో అలంకారము చేయవలెను.పువ్వులను స్వామిపై వేసి నమస్కారించవలెను.
పిదప అధాంగ పూజను చేయవలెను.ఈ క్రింది నామాలను చదువుతూ పుష్పములతో గాని,పసుపు కుంకుమలతో గాని స్వామిని పూజించవలెను.

అథాంగ పూజ
ఓం శ్రీ సూర్యాయ నమః పాదౌ పూజయామి;ఓం శ్రీ దివాకరాయ నమః జంఘే పూజయామి; ఓం శ్రీ ప్రభాకరాయ నమః జానుయుగ్మం పూజయామి; ఓం శ్రీ భాస్కరాయ నమః ఊరూ పూజయామి; ఓం శ్రీ జగన్నాథాయ నమః కటిం పూజయామి; ఓం శ్రీ త్రయీమయాయ నమః నాభిం పూజయామి; ఓం శ్రీ ఆదిత్యాయ నమః కుక్షిం పూజయామి; ఓం శ్రీ ద్యమణయే నమః వక్ష స్థలం పూజయామి; ఓం శ్రీ సుబాహవే నమః బాహూ పూజయామి; ఓం శ్రీ రవయే నమః పార్స్వౌ పూజయామి; ఓం శ్రీ జ్యోతిషాంపతయే నమః భుజా పూజయామి; ఓం శ్రీ త్ర్యైలోక్యాయ నమః కంటం పూజయామి; ఓం శ్రీ తిమిరాపహరాయ నమః ముఖం పూజయామి;ఓం శ్రీ దివ్య చక్షుషే నమః నేత్రే పూజయామి; ఓం శ్రీ మణికుండలాయ నమః కర్ణౌ పూజయామి; ఓం శ్రీ పద్మాక్షాయ నమః లలాటం పూజయామి; ఓం శ్రీ భానవే నమః శిరః పూజయామి ఓం శ్రీ సర్వాత్మనే నమః సర్వాంగణ్యాని పూజయామి.

అనంతరం 108  పేర్లు గల అష్టోత్తర శతనామావళితో స్వామిని పూజించవలెను. ఈ క్రింది నామములను చదువుచూ ఒక్కొక్క నామమునకు స్వామిపై అక్షతలు లేదా పసుపు కుంకుమను వేస్తూ పూజ చేయవలెను.



శ్రీ సూర్యా ష్టోత్తర శత నామావళి (శ్రీ మదధ ర్వణ రహస్యే)
ఓం అరుణాయ నమః
ఓం శరణ్యాయ నమః
ఓం కరుణారససిన్ధవే  నమః
ఓం అసమాన బలాయ నమః
ఓం ఆర్తరక్షకాయ నమః
ఓం ఆదిత్యాయ నమః
ఓం ఆదిభూతాయ నమః
ఓం అఖిలాగమవేదినే నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం అఖిలజ్ఞాయ నమః             ||10||
ఓం అనన్తాయ నమః
ఓం ఇవాయ నమః
ఓం విశ్వరూపాయ నమః
ఓం ఇజ్యాయ నమః
ఓం ఇన్ద్రాయ నమః
ఓం భానవే నమః
ఓం ఇన్ది రామన్దిర స్థాయ నమః
ఓం వన్దనాయాయ నమః
ఓం ఈశాయ నమః
ఓం సుప్రసననాయ నమః                              ||20||
ఓం సుశీలాయ నమః
ఓం సువర్చసే నమః
ఓం వసుప్రదాయ నమః
ఓం వసవే నమః
ఓం వాసుదేవాయ నమః


ఓం ఉజ్జ్వలాయ నమః
ఓం ఉగ్రరూపాయ నమః
ఓం ఊర్ధ్వగాయ నమః
ఓం వివస్వతే నమః
ఓం ఉద్యత్కిరణ జాలాయ నమః             ||30||
ఓం హృషీకేశాయ నమః
ఓం ఊర్జస్వలాయ నమః
ఓం వీర్యాయ నమః
ఓం నిర్జయాయ నమః
ఓం జయాయ నమః
ఓం ఊరుద్వయాభారూప నమః
యుక్తసారథయే నమః
ఓం ఋషిచక్ర చరాయ నమః
ఓం ఋజుస్వభావచిత్తాయ నమః
ఓం నిత్య స్తుత్యాయ నమః                        ||40||
ఓం ఋకారా మాత్రుకావర్ణ రూపాయ నమః
ఓం ఉజ్వలతేజసే నమః
ఓం ఋక్ష్యాదినాధ మిత్రాయ నమః
ఓం పుష్కరాక్షాయ నమః
ఓం లుప్తదన్తాయ నమః
ఓం శాన్తాయ నమః
ఓం కాన్తిదాయ నమః
ఓం ఘనాయ నమః
ఓం కనత్కనక భూషాయ  నమః      ||50||


ఓం ఖద్యోతాయ  నమః
ఓం లునితాఖిలదేత్యా నమః
ఓం సత్యానన్ద స్వరూపిణే నమః
ఓం అపవర్గ ప్రదాయ నమః
ఓం ఆర్త శరణ్యాయ నమః
ఓం ఏకాకినే నమః
ఓం భగవతే నమః
ఓం సృష్టి స్థిత్యంత కారిణే నమః
ఓం గుణాత్మనే నమః
ఓం ఘ్రుణి భ్రుతే  నమః                           ||60||
ఓం బృహతే నమః
ఓం బ్రహ్మణే నమః
ఓం ఐశ్వర్య దాయ నమః
ఓం శ ర్వాయ నమః
ఓం హరిదశ్వాయ నమః
ఓం  శౌరయే నమః
ఓం  దసదిక్స ప్రకాశాయ నమః
ఓం భక్తవశ్యాయ నమః
ఓం ఓజస్కరాయ నమః
ఓం జయినే నమః                                 ||70||
ఓం జగదానన్ద హేతవే నమః
ఓం జన్మ మృత్యు జరావ్యాధి నమః
ఓం వర్జితాయ నమః
ఓం ఉచ్ఛస్థాన సమారూఢ రథస్థాయ నమః
ఓం అసురారయే నమః


ఓం కమనీయకరాయ నమః
ఓం ఆజ్జ వల్లభాయ నమః
ఓం అన్తర్బహిః ప్రకాశాయ నమః
ఓం అచిన్త్యాయ నమః
ఓం ఆత్మరూపిణే నమః                    ||80||
ఓం అచ్యుతాయ నమః
ఓం అమరేశాయ నమః
ఓం పరస్మై జ్యోతిషే నమః
ఓం ఆహాస్కరాయ నమః
ఓం రవయే నమః
ఓం హరయే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం తరుణాయ నమః
ఓం వరేణ్యాయ నమః
ఓం గ్రహణాం పతయే నమః                 ||90||
ఓం భాస్కరాయ నమః
ఓం ఆదిమధ్యాన్త రహితాయ నమః
ఓం సౌఖ్య ప్రదాయ నమః
ఓం సకలజగాతాం పతయే నమః
ఓం సూర్యాయ నమః
ఓం కవయే నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరేశాయ నమః
ఓం తేజోరూపాయ నమః
ఓం శ్రీం హిరణ్య గర్భాయ నమః                ||100 ||


మాఘ శుద్ధ షష్టి రోజున స్నానం చేసికొని,దేవపూజ నిర్వర్తించి సూర్యాలయానికి వెళ్లి భగవానుణ్ణి ఆరాధించాలి.రాత్రి నిరాహారుడై నేలపైన పరుండాలి.తరువాత సప్తమినాడు ఉదయాన్నే లేచి సర్వాలంకృతమైన రథం నిర్మించి, మంటపం మధ్యనుంచి కుంకుమ గంధాక్షతలతో పూజించి, పూలహారాలతో అలంకరించి,సంపూర్ణ లక్షణమైన సూర్యవిగ్రహాన్ని రథంలో ఉంచి అర్పించాలి.నివేదన చేయాలి.రాత్రి జాగారం చేసి (నిదుర పోకుండా మేలుకొని) అష్టమినాడు ఉదయాన్నే స్నానంచేసి బ్రాహ్మణులకు కోరిన దానాలివ్వాలి.ఆ రథాన్ని, రెండు రక్త వస్త్రాలను (ఎర్రని వస్త్రాలను), రక్త వర్ణపు (ఎర్రని) ఆవునూ గురువుకు దానమివ్వాలి.ఈ వ్రతం ఆచరిస్తే భాస్కర ప్రసాదంవల్ల నీ కుమారుడు మహాతేజస్వి అవుతాడు. అపూర్వ బలపరాక్రమవంతుడై సమస్త భోగాలను అనుభవించి, నిరాటంకంగా రాజ్యం పరిపాలించి సూర్యలోకం పొంది,అక్కడ ఒక కల్ప పర్యంతం ఉండి,తరువాత చక్రవర్తిత్వం పొందుతాడు అని చెప్పాడు. ఇంకనూ ఈరోజున (రథసప్తమి రోజున) సూర్యదేవుడికి క్షీరాన్నం నివేదన (నైవేద్యం) చెయ్యాలి. ఈ ప్రసాదాన్నే ఎందుకు నివేదన చెయ్యాలనే దానికి కూడా ఒక కారణమున్నది. దక్ష యజ్ఞం జరిగినప్పుడు అల్లుడైన శివునికి పరాభవం కలిగింది. శివుడు ఉగ్రుడై మామమీదకు వీరభద్రుణ్ణి పరివారంతో సహా పంపించాడు.వీరభద్రుడి వీరవిహారంతో దేవతలందరూ దెబ్బతిన్నారు. ఆ సందర్భములోనే సూర్యుడికి పళ్లన్నీ రాలిపోయి బోసివాడయ్యాడు. కనుకనే సూర్య దేవుడికి అమూల్యమైన ప్రసాదం క్షీరాన్నం అని చెబుతారు. ఈ మాఘమాసంలోని నాలుగు ఆదివారాలు కూడా సూర్యునికి ప్రత్యేక పూజను నిర్వహించి పాలు పొంగించి క్షీరాన్నం చేసి నైవేద్యం పెడతారు.అని ఈ విధంగా చెప్పిన కృష్ణునితో యుధిష్ఠిరుడు ఈ వ్రతమును ఆచరించినచో చక్రవర్తి కాగలరని నీవు చెప్పియుంటివి. ఇంతకుముందు భూలోకములో ఎవరు ఈ వ్రతమును ఆచరించి అట్లు ఆ వ్రతఫలము యెవ్వరి కైననూ ప్రాప్తించినదా? అని పలుకగా కృష్ణుడు ఈ వ్రతమును గురించిన కథను ఈ విధముగా చెప్పసాగెను.

రథసప్తమీవ్రతం ఆచరిస్తే చక్రవర్తి పదవివస్తుందని నిరూపించే కథ భవిష్య పురాణంలో ఉన్నది. దీన్ని ధర్మరాజుకు శ్రీ కృష్ణుడు తెలియజేసెను. కాంభోజ దేశమున యశోవర్తి యను చక్రవర్తి యుండెను. ఆయన వ్రుద్ధాప్యమున పరిపాకము (చేసిన పాపములయొక్క ఫలము) ఎందువలన కల్గెనో తెలుపవలసినదిఅని ఒక్కనొక బ్రాహ్మణశ్రేష్టుని అడిగెను.అట్లడిగిన రాజుతో 'ఓ రాజా! వీరువీరి పూర్వజన్మలో వైశ్యకులమున జన్మించి మిక్కిలి లోభులై (పిసినారులై) యుండిరి.అందుచేత వీరిట్టి రోగములకు గురికావలసిన వారైరి. వారి రోగనివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమమును చూడవలెను. ఆవిధముగా వారావ్రతము చూచినంత మాత్రమున దాని మహాత్యముచే వారి పాపములు పోవును.గాన, వ్యాధితో భాదపడువారిని గొనివచ్చి ఆవ్రత వైభవము వారికి చూపవలెను.'అని బ్రాహ్మణుడు చెప్పగా, రాజు 'అయ్యా! ఆ వ్రాత మెట్లు చేయవలెనో దాని విధి విధాన మేమో తెలుపుడని ప్రార్దించెన.' అందులకా బ్రాహ్మణుడు ఓ రాజా ఏ వ్రతము చూచినంత మాత్రమున జడత్వము నశించిపోవునో ఆ రథసప్తమి అను పేరుగల వ్రతము సర్వులూ ఆచరించదగినది. ఆవ్రత ప్రభావమున సకల పాపములూ హరించి, చక్రవర్తిత్వము గల్గును. ఆవ్రత విధానము తెలుపుచున్నాను శ్రద్ధగా వినుము.



ఓం హ్రీం సంపత్కరాయ నమః
ఓం ఐం ఇష్టార్దదాయ నమః
ఓం సుప్రసన్నాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం శ్రేయసే నమః
ఓం భక్తకోటి సౌఖ్య ప్రదాయినే నమః
ఓం నిఖిలాగమనే నమః
ఓం నిత్యానన్దాయ నమః                 ||108||
ఓం ఉషాఛాయాదేవి సమేత శ్రీ సూర్యనారాయణస్వామినే నమః  అష్టోత్తర శతనామావళి సంపూర్ణం.

ధూపం: ఓం భూర్భువస్స్వః ఓం హ్రౌం  ఓం ఋతం
శ్లో || ధూపం గృహాణదే వేశ సర్వసౌభాగ్యదాయక
మయానివేదితం తుభ్యం గ్రహరాజ నమోస్తుతే
ఓం హ్రౌం అర్కాయ నమః దూపమాగ్రాపయామి. ధూపం సమర్పయామి.అంటూ ఎడమ చేతితో గంట వాయిస్తూ కుడిచేత్తో అగరుబత్తిని తిప్పుతూ పొగను స్వామికి చూపవలెను.

దీపం: ఓం భూర్భువస్స్వః ఓం హ్రః ఓం బృహత్
శ్లో || అజ్ఞాన నాశనం దేవ సర్వసిద్ద ప్రదోభవ |
సకర్పూ రాజ్యదీ పంచ సంగృహాణ దివాకర ||

ఓం హ్రః ఓం భాస్కరాయ నమః దీపం దర్శయామి అని మొదట్లో చెప్పిన విధంగా దీపారాధనలో వున్న అదనపువత్తులలో ఒకదానిని తీసుకొని హారతి వెలిగించే దాంట్లో వేసి వెలిగించి గంట మ్రోగిస్తూ ఆ దీపం స్వామికి చూపుతూ పై శ్లోకమును చదువవలెను.

నైవేద్యం: ఓం భూర్భువస్స్వః ఓం హ్రం హ్రీం హ్రూం హ్రైంo
ఓం హగ్గ్ సశ్శుచి షద్వ సురంతరిక్ష సద్దో తావే డి షద తి థి ర్దు రోణ సత్ |
శ్లో|| పరమాన్నంచ నైవేద్యం సఫలంచ సశర్కరం
గృహాణ సర్వలోకేశ మయాదత్తం సురేశ్వర ||


ఓం హ్రం హ్రీం హ్రుం హ్రైం ఓం మిత్ర,రవి,సూర్య,భానుభ్యో నమః క్షీరాన్నం నివేదయామి.
ఓం శ్రీ సూర్యాయ నమః నైవేద్యం సమర్పయామి. అని పళ్ళు,కొబ్బరికాయ,ప్రత్యేక నైవేద్యం క్షీరాన్నం మొదలగునవి స్వామివద్దనుంచి దానిపై పువ్వుతో నీళ్లు చల్లుతూ ఎడమ చేత్తో గంటవాయిస్తూ 'ఓం భూర్భువ స్సువః ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి,ధీ యో యోనః ప్రచోదయాత్, సత్యం త్వర్తేన పరిషించామి,(ఋతం త్వా సత్యేత పరిషించామి అని రాత్రి చెప్పవలెను) అమృతమస్తు అమృతో పస్తర ణమసి,ఓం ప్రాణాయ స్వాహా,ఓం అపానాయ స్వాహ,ఓం వ్యానాయ స్వాహ,ఓం ఉదానాయ స్వాహ,ఓం సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటూ ఆరుమార్లు చేతితో (చేతిలోని ఉద్ధరిణెతో) స్వామికి నివేదనం చూపించాలి.పిదప ఓం శ్రీ సూర్యాయ నమః నైవేద్యానంతరం 'హస్తౌ ప్రక్షాళ యామి'అని ఉద్ధరిణెతో పంచపాత్రలోని నీరు ముందు చెప్పిన ఆర్యపాత్ర (పంచ పాత్ర కాకుండా విడిగా చెంబులో పెట్టుకొనే నీళ్ల పాత్ర )లో వదలాలి.తరువాత 'పాదౌ ప్రక్షాళయామి' అని మరోసారి నీరు ఆర్ఘ్య పాత్రలో ఉద్ధరిణెతో వదలాలి.పునః శుద్ధచమనీయం సమర్పయామి అని ఇంకొక పర్యాయం నీరు వదలాలి.

తాంబూలం :
శ్లో|| ఓం భూర్భువస్స్వః ఓం హ్రౌం హ్రః హ్రం హ్రీం
ఓం నృషద్వర సద్రుత సద్వ్యోమ సదబ్జా గోజాః
శ్లో|| సపూగీ ఫల కర్పూరం నాగవల్లీ దళై ర్యుతం
ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ||

ఓం హ్రౌం హ్రః హ్రం హ్రీం ఓం ఖగ పూష హిరణ్య గర్బ మరీచిభ్యోనమః తాంబూలం సమర్పయామి. అని చెబుతూ తాంబూలమును (మూడు తమలపాకులు,రెండు పోకచెక్కలు,అరటి పండు వేసి) స్వామివద్ద ఉంచాలి.తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కొనుటకు నీరు ఇస్తున్నామని తలుస్తూ ,'తాంబూల చరవణా నంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి'అంటూ ఉద్ధరిణెతో నీరు ఆర్ఘ్య పాత్రలో వదలాలి.పిమ్మట కర్పూరం వెలిగించి

నీరాజనం: ఓం భూర్భువస్స్వః ఓం హ్రూం హ్రైం హ్రౌం హ్రః
ఓం ఋత జా అద్రి జాఋతం బృహత్ ||
శ్లో|| నీరాజనం సుమంగళ్యం నమస్తే దివ్య తేజసే |
ఇదం గృహాణ దేవేశ మంగళం కురుభాస్కర ||
ఓం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఓం ఆదిత్య సవిత్రు అర్క భాస్కరేభ్యో నమః కర్పూర నీరాజనం దర్శయామి. అని కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి ముందుగా దీపారాధనకు వెలిగించిన దీపంతో వెలిగించి,మూడుమార్లు త్రిప్పుచూ,చిన్నగా ఘంట వాయించవలెను.అనంతరం మళ్లీ పువ్వుతో నీరు హారతి కుంది చివర వదులుతూ 'కర్పూర నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి' అని చెప్పి నీరాజనం స్వామివారికి చూపించి తరువాత ఇంటిలోని  వారందరూ హారతిని కళ్ళకు అద్దుకోవాలి. తరువాత అక్షతలు,పువ్వులు,చిల్లర డబ్బులు చేతితో పట్టుకొని,


మంత్రపుష్పం : ఓం భూర్భువస్స్వః ఓం హ్రం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః

ఓం హగ్గ్ సస్శు చి షద్వ సురంతరిక్ష సద్దో తావే ది షదతి ధిర్ధురోణ సత్
వ్రుషద్వర సద్రుత్ సద్వ్యోమ సత్ ఓం యదే తన్మండ లంత పతి...............భవతి

శ్లో || భాస్కరాయ విద్మహే మహాద్ద్యుతిక రాయ ధీమహి |
తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ ||

శ్లో || ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి |
తన్నః స్సూర్యః ప్రచోదయాత్ ||

ఓం హ్రం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఓం మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూషభ్యో నమః సువర్ణ మంత్ర పుష్పం  సమర్పయామి అని చెప్పుకొని అక్షతలు,పువ్వులు,చిల్లర స్వామివద్ద ఉంచవలెను.పిమ్మట ఈ దిగువ మంత్రం జపిస్తూ మూడుసార్లు ప్రదక్షిణలు చేయాలి.

ప్రదక్షిణం : ఓం భూర్భువస్స్వః ఓం హ్రం.......... హ్రః ఓం అబ్జా
గోజా ఋత జా ఋతం బృహత్
శ్లో|| ప్రదక్షిణం కరిష్యామి సర్వపాప ప్రణాశన
సర్వాభీష్ట ఫలందేహి నమస్తే లోకభాంధవ ||

శ్లో||  చ్చాయా సంజ్ఞా సమేతాయ రవయేలోక సాక్షిణే |
హరయే నూరు సూతాయ సప్తాశ్వాయ నామోనమః ||

శ్లో|| యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రణశ్యంతి  ప్రదక్షిణ ప్రభాకర ||
ఓం ఓం భూర్భువస్స్వః ఓం హ్రం.......... హ్రః ఓం హిరణ్యగర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కరేభ్యో నమః   ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి అశ్వారో హాన్సమర్పయామి  గజారో హాన్సమర్పయామి అని శ్రీస్వామికి  అక్షతలు, పువ్వులు, తీసుకొని లేచి నిలబడి మూడుసార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి (అనగా తమలో తాము చుట్టూ తిరిగి) పిమ్మట సాష్టాంగ నమస్కారం చేసి (మగవారు పూర్తిగా పడుకుని తలను నేలకు ఆన్చి,ఆడువారు మోకాళ్ల పై పడుకుని కుడికాలు ఎడమ కాలుపై వేసి) తరువాత స్వామిపై చేతిలో నున్న అక్షతలు, పువ్వులు చల్లి మరల తమ స్థానమున ఆసీనులై నమస్కరించుచూ 



పునఃపూజ:
ఓం శ్రీ సూర్యాయ  నమః పునః పూజాంచ కరిష్యే అని  చెప్పుకొని,పంచపాత్రలోని నీటిని చేతితో తాకి,అక్షతలు స్వామిపై చల్లుచూ ఈ క్రింది మంత్రములు చదువుకొనవలెను.
ఛత్రం ఆచ్చాదయామి, చామరం వీజయామి,నృత్యం దర్శయామి,గీతం శ్రావయామి, వాద్యం ఘోషయామి, సమస్త రాజోపచార,శక్త్యోపచార,భక్త్యోపచార పూజాం సమర్పయామి
అనుకొని,నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకమును చదువుకొనవలెను.

శ్లో|| యస్య స్మ్రు త్యాచ నామోక్త్యా త పం పూజా క్రియాది షు
యానం సంపూర తాంయాతి సద్యో వందే మహేశ్వరం
యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||

అనేక మయాక్రుతేన కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః శ్రీసూర్యనారాయణ ఏతత్ఫలం శ్రీ సూర్యనారాయణార్పణ మస్తు అంటూ అక్షతలు నీటితోపాటు అరవేణంలో వదలవలెను.పిమ్మట 'శ్రీసూర్య నారాయణ మూర్తి  ప్రసాదం శిరసా గృహ్ణామి'అనుకొని స్వామివద్ద అక్షతలు తీసుకొని తమ తమ తలలపై వేసుకొనవలెను.ఆ పిదప పసుపు గణపతిని తీసి దేవుని పీటము పై నుంచవలెను.దీనిని ఉద్వాసన చెప్పటం అంటారు.
ఓం శ్రీగణాధిపతయే  యధాస్థానం ప్రవేశయామి. శోభనార్ధం పునరాగమనాయచ అని ఉద్వాసన పలుకుతారు.

                                                         పూజావిధానం సంపూర్ణం

రథ సప్తమీ వ్రతకథ
యుధిష్టిరుడు శ్రీ కృష్ణుని ఈ విధంగా అడిగెను.
"ఓ కృష్ణా! రథసప్తమినాడు చేయవలసిన విధివిధానము నాకు తెలియజేయుము అనగా .........
శ్రీ కృష్ణుడిలా జవాబిచ్చెను.

శ్లో|| అత్ర వ్రతే షష్ట్యామేక భుక్త్వం కృత్వా సప్తమ్యామరుణో దయ వేళాయాం -
శిష్టాచారాత్ సప్తార్క పర్ణాని సప్తబదరీ పత్రాణి వాశిర సినిధాయ ||



మాఘ శుద్ధ షష్టి రోజున స్నానం చేసికొని,దేవపూజ నిర్వర్తించి సూర్యాలయానికి వెళ్లి భగవానుణ్ణి ఆరాధించాలి.రాత్రి నిరాహారుడై నేలపైన పరుండాలి . ఇంటికి వచ్చి అతిథులతో బంధుమిత్రులతో సహా(నూనె చేరని పదార్ధాలతో) భోజనం చేయాలి. తరువాత సప్తమినాడు ఉదయాన్నే లేచి సర్వాలంకృతమైన రథం నిర్మించి, మంటపం మధ్యనుంచి కుంకుమ గంధాక్షతలతో పూజించి, పూలహారాలతో అలంకరించి,సంపూర్ణ లక్షణమైన సూర్యవిగ్రహాన్ని రథంలో ఉంచి అర్పించాలి.నివేదన చేయాలి.రాత్రి జాగారం చేసి (నిదుర పోకుండా మేలుకొని) అష్టమినాడు ఉదయాన్నే స్నానంచేసి బ్రాహ్మణులకు కోరిన దానాలివ్వాలి.ఆ రథాన్ని, రెండు రక్త వస్త్రాలను (ఎర్రని వస్త్రాలను), రక్త వర్ణపు (ఎర్రని) ఆవునూ గురువుకు దానమివ్వాలి.ఈ వ్రతం ఆచరిస్తే భాస్కర ప్రసాదంవల్ల నీ కుమారుడు మహాతేజస్వి అవుతాడు. అపూర్వ బలపరాక్రమవంతుడై సమస్త భోగాలను అనుభవించి, నిరాటంకంగా రాజ్యం పరిపాలించి సూర్యలోకం పొంది,అక్కడ ఒక కల్ప పర్యంతం ఉండి,తరువాత చక్రవర్తిత్వం పొందుతాడు అని చెప్పాడు. ఇంకనూ ఈరోజున (రథసప్తమి రోజున) సూర్యదేవుడికి క్షీరాన్నం నివేదన (నైవేద్యం) చెయ్యాలి. ఈ ప్రసాదాన్నే ఎందుకు నివేదన చెయ్యాలనే దానికి కూడా ఒక కారణమున్నది. దక్ష యజ్ఞం జరిగినప్పుడు అల్లుడైన శివునికి పరాభవం కలిగింది. శివుడు ఉగ్రుడై మామమీదకు వీరభద్రుణ్ణి పరివారంతో సహా పంపించాడు.వీరభద్రుడి వీరవిహారంతో దేవతలందరూ దెబ్బతిన్నారు. ఆ సందర్భములోనే సూర్యుడికి పళ్లన్నీ రాలిపోయి బోసివాడయ్యాడు. కనుకనే సూర్య దేవుడికి అమూల్యమైన ప్రసాదం క్షీరాన్నం అని చెబుతారు. ఈ మాఘమాసంలోని నాలుగు ఆదివారాలు కూడా సూర్యునికి ప్రత్యేక పూజను నిర్వహించి పాలు పొంగించి క్షీరాన్నం చేసి నైవేద్యం పెడతారు.అని ఈ విధంగా చెప్పిన కృష్ణునితో యుధిష్ఠిరుడు ఈ వ్రతమును ఆచరించినచో చక్రవర్తి కాగలరని నీవు చెప్పియుంటివి. ఇంతకుముందు భూలోకములో ఎవరు ఈ వ్రతమును ఆచరించి అట్లు ఆ వ్రతఫలము యెవ్వరి కైననూ ప్రాప్తించినదా? అని పలుకగా కృష్ణుడు ఈ వ్రతమును గురించిన కథను ఈ విధముగా చెప్పసాగెను.

రథసప్తమీవ్రతం ఆచరిస్తే చక్రవర్తి పదవివస్తుందని నిరూపించే కథ భవిష్య పురాణంలో ఉన్నది. దీన్ని ధర్మరాజుకు శ్రీ కృష్ణుడు తెలియజేసెను. కాంభోజ దేశమున యశోవర్తి యను చక్రవర్తి యుండెను. ఆయన వ్రుద్ధాప్యమున పరిపాకము (చేసిన పాపములయొక్క ఫలము) ఎందువలన కల్గెనో తెలుపవలసినదిఅని ఒక్కనొక బ్రాహ్మణశ్రేష్టుని అడిగెను.అట్లడిగిన రాజుతో 'ఓ రాజా! వీరువీరి పూర్వజన్మలో వైశ్యకులమున జన్మించి మిక్కిలి లోభులై (పిసినారులై) యుండిరి.అందుచేత వీరిట్టి రోగములకు గురికావలసిన వారైరి. వారి రోగనివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమమును చూడవలెను. ఆవిధముగా వారావ్రతము చూచినంత మాత్రమున దాని మహాత్యముచే వారి పాపములు పోవును.గాన, వ్యాధితో భాదపడువారిని గొనివచ్చి ఆవ్రత వైభవము వారికి చూపవలెను.'అని బ్రాహ్మణుడు చెప్పగా, రాజు 'అయ్యా! ఆ వ్రాత మెట్లు చేయవలెనో దాని విధి విధాన మేమో తెలుపుడని ప్రార్దించెన.' అందులకా బ్రాహ్మణుడు ఓ రాజా ఏ వ్రతము చూచినంత మాత్రమున జడత్వము నశించిపోవునో ఆ రథసప్తమి అను పేరుగల వ్రతము సర్వులూ ఆచరించదగినది. ఆవ్రత ప్రభావమున సకల పాపములూ హరించి, చక్రవర్తిత్వము గల్గును. ఆవ్రత విధానము తెలుపుచున్నాను శ్రద్ధగా వినుము.

మాఘమాసమందలి శుక్లపక్షమున వచ్చు షష్టి దినమున గృహస్తు (యజమాని) యీ వ్రాతమాచరింతునని తలవవలెను.పవిత్ర జలములుగల నదులలోగాని, చెరువునందు గాని,నూతియందుగాని తెల్లనినువ్వులతో విధివిధానముగా స్నాన మాచరించవలెను లేదా ఇలవేలుపులకు,కులవేలుపులకు,ఇష్టదేవతలకు మ్రొక్కి పూజించి అటుపిమ్మట సూర్యదేవాలయమునకు పోయి ఆయనకు  నమస్కరించి,పుష్పములు,ధూపములు,దీపములు, అక్షతలతో శుభప్రాప్తి కొరకు పూజించవలెను.పిదప స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి,అతిథులతో సేవకులతో,బాలకులతో భక్ష్య భోజ్యములు ఆరగించవలెను. ఆ దినమున తైలము శరీరమునకు పూసుకొని స్నానము చేయరాదు. ఆ రాత్రి వేదపారంగతులగు విప్రులను పిలిపించి,సూర్యభగవానుని విగ్రహాన్ని నియమము ప్రకారము పూజించి,సప్తమితిథి రోజున నిరాహారుడై, భోగములను విసర్జించవలెను. భోజనాలకు పూర్వము 'ఓ జగన్నాథుడా! నేను చేయబోవు ఈ రథసప్తమి వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయించవలసినదిగా వేడుచున్నాను.అని వుచ్చరించుచూ,తన చేతిలో గల జలమును, నీటిలో విడువవలెను. అట్లు నీటిని విడిచిపెట్టి, బ్రాహ్మణులు,తానూ గృహమున నేలపై నారాత్రి శయనించి జితేంద్రియుడై యుండి,ఉదయమున లేచి,నిత్యకృత్యము లాచరించి శుచియై యుండవలెను. ఒక దివ్యమైన సూర్యరథాన్ని దీపమాలికలతోను, చిరుగంటలతోను, సర్వోపచారాలతోను తయారుచేసి,సర్వాంగములను రత్నాలు, మణులతో అలంకరించవలెను. బంగారుతో గాని,వెండితో గాని గుర్రాలను,రథ సారధినీ, రథమునూ తయారుచేసి మధ్యాహ్నవేళ స్నానాదికములను నిర్వర్తించుకొనవలెను. వదరుబోతులను, పాషండులను, దుష్టులను,విడిచిపెట్టి ప్రాజ్ఞులు, సౌర సూక్త పారాయణ చేయుచుండగా నిజగృహము చేరవలెను.

పిమ్మట తన నిత్యకృత్యములను పూర్తి చేసుకొని స్వస్తి బ్రాహ్మాణావాచకములతో వస్త్రమండప మధ్య భాగమున రథమును స్థాపించవలెను.కుంకుమతోను,సుగంధ ద్రవ్యములతోను,పుష్పములతోను పూజించి, రథమున నున్న సూర్యుని సర్వ సంపూర్ణముగా  అర్చన చేయవలెను. ధనలోభము చేయరాదు.లోభియై ధనమును ఖర్చు చేయుటకు మనస్సంగీకరించనిచో వ్రతము వైఫల్యమును,దానివలన మనస్సు వికలత్వమును పొందును. పిమ్మట రథాన్ని,రథసారధిని అందుగల సూర్యభగవానునీ, పుష్ప,ధూప,గంధ,వస్త్ర,అలంకార,భూషనాదులు నానావిధ ఫల భక్ష్యాదులు గల నైవేద్యాలతో పూజించి ఈ క్రింది విధముగా దివాకరుని స్తోత్రము చేయవలెను.

ఓ భాస్కరా! దివాకరా! ఆదిత్యా! మార్తాండ! గ్రహదిపా! అపాంనిథే! జగద్రక్షకా! భూతభావనా! భూతేశ! భాస్కరా! ఆర్త త్రాణ పరాయణా! హరా! ఆచింత్యా! విశ్వసంచారా! విభో ! హే విష్ణో ! ఆదిభూతేశా ! ఆది మధ్యాన్త రహితా! భాస్కరా! ఓ జగత్పతే! భక్తిలేకున్నను, క్రియాశున్యమయినను నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము " పైవిధముగా మనస్సులో తాను వేడిన కోరికను సఫలీకృతం చేయవలెనని భాస్కరుని ప్రార్ధించవలెను.

ధనహీనుడయినను, విధిప్రకారము అన్ని కార్యములు చేయవలెను. రథము, సారథి, గుర్రములు, వివిధరకాల రంగులతో లిఖించిన బొమ్మలు,ఏడు అయిన జిల్లేడు పత్రములతో సూర్యభగవానుని శక్తికొలదీ పూర్వము చెప్పినట్లు విధివిధానముగా పూజించవలెను. పురాణ, శ్రవణ, మంగళ గీతాలతో మంగళ వాద్యాలతో ఆరాత్రి జాగరణ చేసి, పుణ్య కథలను వినవలెను.పిమ్మట రథయాత్రకు బయలుదేరి సూర్యుని మనస్సున ధ్యానము చేయుచు ప్రాతః కాలమున లేచి స్నానకృత్యమును నిర్వర్తించుకొని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనము పెట్టి,వివిధ రత్నభూషణములతో, ధ్యానాదులతో, వస్త్రాలతో,తృప్తి పరచవలెను. అట్లు చేసిన అశ్వమేధ యాగము చేసిన ఫలము లభించును. అని బ్రహ్మవిధులు చెప్పిరి. పిమ్మట యధాశక్తి దానము నీయవలెను. ఈ రథమును తమ పురోహితులయిన గురుదేవులకు రక్త(ఎర్ర రంగు) వస్త్ర యుగళంతో సమర్పించవలెను. ఆవిధంగా చేసినచో యెందుకు జగత్పతి గాకుండును?కాన, సర్వయత్నములచేతనూ రథసప్తమి వ్రాత మాచరించవలెను. దానివలన భాస్కరానుగ్రహము గల్గి మహాతేజులు,బలపరాక్రమవంతులు అయి విపుల భోగములననుభవించి రాజ్యమును నిష్కంటకముగా చేసికొందురు. ఈ రథసప్తమి వ్రతమును చేసినచో పుత్రపౌత్రులను బడసి చివరగా సూర్యలోకము చేరుదురు. అక్కడ ఒక కల్పకాలముండి చక్రవర్తిగా జన్మించి ఆ పదవిననుభవించును.

శ్రీ కృష్ణుడు చెప్పుచున్నాడు:
ఈ విధంగా ఆ ద్విజోత్తముడు సర్వ విషయములను చెప్పి తనదారిని తాను పోయెను.రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్టుడుపదేశించిన రీతిగా ఆచరించి సమస్త సౌఖ్యములన నుభవించెను. ఈవిధముగా ఆరాజపుత్రులు చక్రవర్తిత్వమును పొందిరి.ఈ కథను భక్తితో యెవరు విందురో వారికి భానుడు సంతసించి మంచి ధనధాన్య సంపదలనిచ్చును. ఈ విధముగా బంగారుతో చేయబడిన సారథీ గుర్రాలతో గూడుకోనిన శ్రేష్ట రథమును మాఘమాస సప్తమిరోజున యెవరు దానము చేయుదురో వారు చక్రవర్తిత్వము పొందగలరు.
                                                                    

                                             ఇతి రథసప్తమీ వ్రత కథా సంపూర్ణం.














No comments:

Post a Comment