Friday, August 17, 2012

అమావాస్య సోమవతీ వ్రతము

భూ శుద్ధి :
ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్దిచేసి ,అలికి , బియ్యపు పిండితో గాని ,రంగుల చూర్ణములతో గాని ,ముగ్గులు పెట్టి ,దైవ స్థాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి పీట మరీ ఎత్తుగా గాని ,మరీ పల్లముగా గాని ఉండకూడదు .పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపు వ్రాసి ,కుంకుమతో బొట్టు పెట్టి ,వరి పిండి (బియ్యపు పిండి )తో ముగ్గు వేయాలి సాదారణంగా అష్ట దళ పద్మాన్నే వేస్తారు .పూజ చేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి .ఏ దైవాన్ని పూజించ బోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమను గాని ,చిత్రపటం గాని ఆ పీటపై ఉంచాలి .ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి (పసుపును షుమారు అంగుళం సైజులో త్రికోణ ఆకృతిలో ముద్దగా చేసి ) దానికి కుంకుమ బొట్టు పెట్టి , పిదప ఒక పళ్ళెంలో గాని ,క్రొత్త తుండు గుడ్డ మీద గాని బియ్యం పోసి దానిపై ఒక తమలపాకు ఉంచి ,అందు పసుపు గణపతి నుంచి అగరువత్తులు వెలిగించాలి .ఇప్పుడు పూజకు కావలసిన వస్తువులను అమర్చుకోవాలి .దీపారాధన నైరుతి దిశలో చేయవలెను.
దీపారాధనకు కావలసిన వస్తువులు -దీపారాధన విధానము :
దీపారాధన చేయుటకు కుంది (ప్రమిద ) వెండిది గాని ,ఇత్తడి ది గాని ,మట్టిది గాని వాడ వచ్చును. కుందిలో 3 అడ్డ వత్తులు 1 కుంభ వత్తి (మధ్యలో ) వేసి నూనెతో తడపవలెను . ఇంకొక అడ్డ వత్తి నూనెతో తడిపి ఏక హారతిలో(కర్పూర హారతికి వాడే వస్తువు ) వేసి ముందుగా ఏక హారతిలో వేసిన వత్తిని అగ్గిపుల్లతో వెలిగించి ,వెలిగించిన వత్తితో కుందిలోని 1 అడ్డ వత్తి 1 కుంభ వత్తి వెలిగించ వలెను. తర్వాత చేయి కడుక్కుని నూనె కుంది నిండా వేసి పిదప ఆ కుందికి మూడు చోట్ల కుంకుమ అలంకారము చేయవలెను . తర్వాత అక్షతలు వేసి దీపారాదనను లక్ష్మీ స్వరూపముగా భావించి నమస్కారము చేయవలెను . కుందిలో మిగిలిన రెండు అడ్డ వత్తులు పూజా సమయంలో ధూపము చూపిన తరువాత దీపము చూపించుటకు వాడవలెను.దీపారాధనకు నువ్వుల నూనెగాని ,కొబ్బరి నూనెగాని ,ఆవు నెయ్యి గాని వాడవచ్చును . ఈ విధంగా దీపం వెలిగించి ఘంటను వాయిస్తూ నమస్కరించి ఈ క్రింది శ్లోకమును చదువు కొనవలెను.
ఘంటా నాదము :
శ్లో || ఆగ మార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్ష సామ్
కుర్యా ద్ఘంటారవం తత్ర దేవతా హ్వాహన లాంచనమ్
మనము ఆచమనము చేసినటువంటి పంచ పాత్రలోని నీళ్ళు దేవుని పూజకు వినియోగించ రాదు. పూజకు విడిగా ఒక గ్లాసు గాని ,చెంబు గాని తీసుకుని దానిలో శుద్ధ జలమును పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆ నీళ్ళు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించ వలెను.

పూజకు కావలసిన వస్తువులు :
సోమవతీ దేవి ఏ వ్రతమును (పూజను ) ఆచరించు చున్నామో ఆ దేవుని యొక్క బొమ్మ (ప్రతిమ ) (తమ శక్తి కొలది బంగారముతో నైనను ,వెండితో నైనను లేక మట్టితో నైనను తీసుకొనవలెను ), లేదా చిత్ర పటము ,మండపమునకు మామిడి ఆకులు ,అరటి మొక్కలు ,కొబ్బరి కాయలు , పళ్ళు , పువ్వులు ,పసుపు ,కుంకుమ , గంధం, హారతి కర్పూరం , అక్షతలు ,అగ్గి పెట్టె , అగరువత్తులు ,వస్త్ర, యజ్నోపవీతములు , తోరములు, (తెల్లని దారమునకు పసుపు రాసి 9 వరుసలు (పోగులు ) వేసి 9 చోట్ల పువ్వులతో కట్టి ,ఈ తోరములను దేవునికి పూజ చేసి పూజచేసిన వారందరూ కుడి చేతికి ధరిస్తారు. ప్రత్యేక నివేదన (పిండి వంటలు )
(పూజ చేసేవారు ) ఈ దిగువ కేశవ నామాలను స్మరిస్తూ ఆచమనం చేయాలి .ఈ నామములు మొత్తం 24 కలవు.
1  ఓం కేశవాయ స్వాహా " అని చెప్పుకొని చేతిలో నీరు తీసుకొని లోనికి తీసుకోవాలి
2 . " ఓం నారాయణాయ స్వాహా "అనుకొని ఒకసారి
3 . " ఓం మాధవాయ స్వాహా " అనుకొని ఒకసారి జలమును పుచ్చుకోనవలెను .తరువాత
4 . " ఓం గోవిందాయ నమః " అని చేతులు కడుగు కోవాలి .
5 . " విష్ణవే నమః " అనుకుంటూ నీళ్ళు త్రాగి, మధ్య వ్రేలు , బొటన వ్రేళ్ళతో కళ్ళు తుడుచుకోవాలి .
6 . " ఓం మధుసూదనాయ నమః " అని పై పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి .
7 . "ఓం త్రివిక్రమాయ నమః " క్రింది పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి .
8 ,9 ." ఓం వామనాయ నమః " " ఓం శ్రీధరాయ నమః " ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్ళు చల్లు కోవాలి
.10 . ఓం హృషీ కేశాయ నమః ఎడమ చేతిలో నీళ్ళు చల్లాలి .
11 .  ఓం పద్మనాభాయ నమః  పాదాలపై ఒక్కొక్క చుక్క నీరు చల్లు కోవాలి .
12 . ఓం దామోదరాయ నమః శిరస్సుపై జలమును ప్రోక్షించు కోవలెను .
13 .ఓం సంకర్షణాయ నమః చేతి వ్రేళ్ళు గిన్నెలా వుంచి గడ్డము తుడుచుకోనవలెను .
14 . ఓం వాసుదేవాయ నమః వ్రేళ్ళతో ముక్కును వదులుగా పట్టుకొనవలెను .
15 .16 . ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్దాయ నమః నేత్రాలు తాకవలెను .
17 .18 .ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః రెండు చెవులూ తాక వలెను
19 .20 ఓం నార సింహాయ నమః ఓం అచ్యుతాయ నమః బొడ్డును స్పృశించ వలెను .
21 .ఓం జనార్ధనాయ నమః చేతి వ్రేళ్ళతో వక్ష స్థలం , హృదయం తాకవలెను .
22 . ఓం ఉపేంద్రాయ నమః చేతి కొనతో శిరస్సు తాకవలెను .
23 .24 .ఓం హరయే నమః ఓం శ్రీ కృష్ణాయ నమః కుడి మూపురమును ఎడమ చేతి తోను , ఎడమ మూపురమును కుడి చేతితోను ఆచమనం చేసిన తరువాత ఆచమనం చేసి ,వెంటనే సంకల్పము చెప్పుకోనవలెను .
ఆచమనము అయిన తరువాత ,కొంచెం నీరు చేతిలో పోసుకుని నేలపై చిలకరించుతూ ఈ శ్లోకమును పటించవలెను .
శ్లో || ఉత్తిష్టంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః
యేతేషామ విరోదేన బ్రహ్మ కర్మ సమారభే ||

ప్రాణాయామమ్య: ఓం భూ : -ఓం భువః ఓం సువః - ఓం మహః -ఓం జనః ఓం తపః - ఓగ్ సత్యం -ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహీ దీయో యోనః ప్రచోదయాత్ - ఓం ఆపోజ్యోతిర సోమృతం బ్రహ్మ భూర్భువ స్సువరోం అని సంకల్పము చెప్పు కొనవలెను.
సంకల్పము : మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే అద్య బ్రాహ్మణః (ఇక్కడ శ్రీ మహా విష్ణో రాజ్ఞాయ అని కూడా చెప్పవచ్చు ) ద్వితీయ పరార్దె శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్బాగే శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే (మనకు శ్రీశైలము ప్రధాన క్షేత్రము కావున మనము శ్రీశైలమునకు ఏ దిక్కున ఉన్నామో ఆ దిక్కు చెప్పుకొనవలెను ), కృష్ణా గోదావర్యో : మధ్య ప్రదేశే (మనం ఏ ఏ నదులకు మధ్యన ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకొనవలెను ), శోభన గృహే (అద్దె ఇల్లు ఐనచో వసతి గృహే అనియు , సొంత ఇల్లయినచో స్వగృహే అనియు చెప్పుకొనవలెను ), సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర సన్నిదౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన .......... సంవత్సరే , (ఇక్కడ తెలుగు సంవత్సరమును అంటే పూజ చేయునపుడు ఏ సంవత్సరము జరుగు చున్నదో ఆ సంవత్సరము యొక్క పేరు చెప్పుకొనవలెను. ) ......... ఆయనే , సంవత్సరమునకు రెండు ఆయనములు - ఉత్తరాయణము, దక్షిణాయనము . జనవరి 15 మకర సంక్రమణం మొదలు జూలై 14 కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణము , జూలై 15 కర్కాటక సంక్రమణము నుండి మరల జనవరి 14 పెద్ద పండుగ అనగా మకర సంక్రమణము వరకు దక్షిణాయనం పూజ చేయునపుడు ఏ ఆయనము జరుగుచున్నదో దానిని చెప్పవలెను )...........ఋతు : (వసంత ,గ్రీష్మ , వర్ష మొ || ఋతువు లలో పూజ సమయములో జరుగుచున్న ఋతువు పేరు )............మాసే , (చైత్ర , వైశాఖ మొ || పన్నెండు మాసములలో పూజాసమయంలో జరుగు చున్న మాసం పేరు ) .......పక్షే , (నెలకు రెండు పక్షములు పౌర్ణమికి ముందు శుక్ల పక్షము , అమావాస్యకు ముందు కృష్ణ పక్షములు వీటిలో పూజ జరుగుచున్న సమయమున గల పక్షము పేరు ) ........తిధౌ , (ఆరోజు తిది ) .........వాసరే (ఆ రోజు ఏ వారమైనది చెప్పుకొని ) శుభ నక్షత్రే , శుభయోగే ,శుభ కరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిధౌ మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం పురుషులైనచో శ్రీమాన్ ...........గోత్రస్య ........నామధేయః, శ్రీమత్యః , గోత్రస్య ,నామదేయస్య అనియు, స్త్రీలైనచో శ్రీమతి , గోత్రవతి , నామదేయవతి, శ్రీమత్యాః ,గోత్ర వత్యాః, నామధేయవత్యాః , అనియు (పూజచేయువారి గోత్రము , నామము చెప్పి ) నామదేయస్యః ధర్మపత్నీ సమేతస్యః (పురుషులైనచో ) మమ సహ కుటుంబస్య ,క్షేమ స్థైర్య, వీర్య , విజయ ,అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ద్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం , పుత్ర పౌత్రాభి వృధ్యర్ధం,సకల విధ మనోవాంచాఫల సిద్ద్యర్ధం , శ్రీ తులసీ ధాత్రి సహిత శ్రీ లక్ష్మీ నారాయణ దేవతా ప్రీత్యర్ధం (ఏ దేవుని పూజించు చున్నామో ఆ దేవుని యొక్క పేరు చెప్పుకుని ) క్షీరాబ్ధి శయన వ్రతాభ్యాం కర్మ కరిష్యే . సంభవ ద్భిరుపచారై: సంభవతానియమేన సంభవతాప్రకారేణ యావచ్చక్తి (నాకు తోచిన రీతిలో ,నాకు తోచిన నియమములతో , నాకు తోచిన విధముగా ,భక్తి శ్రద్దలతో సమర్పించు కుంటున్న పూజ ) ధ్యానా వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే .ఆదౌ నిర్విఘ్నేన పరి సమాప్యర్ధం గణాధిపతి పూజాం కుర్యాత్. తతః తులసి ధాత్రి సహిత లక్ష్మీ నారాయణ దేవతా ముద్దిశ్య తులసి ధాత్రి సహిత లక్ష్మీ నారాయణ దేవతా ప్రీత్యర్ధం కల్పోక్త విధానేన యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే || పిదప కలశారాదనను చేయవలెను.


కలశ పూజను గూర్చిన వివరణ : వెండి, రాగి , లేక , కంచు గ్లాసులు (లేదా పంచ పాత్రలు ) రెండింటిలో శుద్ధ జలమును తీసుకుని ఒక దానియందు అక్షతలు , తమలపాకు ,పువ్వు ఉంచుకొనవలెను. రెండవ పాత్రకు బయట మూడు వైపులా గంధమును వ్రాసి కుంకుమను అద్దవలెను ఇట్లు చేయునపుడు గ్లాసును గుండ్రముగా త్రిప్పుచూ గంధమును కాని , కుంకుమను గాని పూయరాదు. గంధమును ఉంగరపు  వ్రేలితో పూయవలెను. కుంకుమ అక్షతలు వగైరా బొటన, మధ్య, ఉంగరపు వ్రేళ్ళను కలిపి సమర్పించ వలెను. యజమానులు (ఒక్కరైతే ఒకరు, దంపతులైతే ఇద్దరూను ) ఆ కలశాన్ని కుడి చేతితో మూసి వుంచి ఇలా అనుకోవాలి .
ఈ విధముగా కలశమును తయారుచేసి పూజను చేయునపుడు మొదటగా ఈ శ్లోకమును చదువవలెను .

మం || కలశస్య ముఖే విష్ణు : కంటే రుద్ర స్సమాశ్రితః
     మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణా స్మృతాః ||
     ఋగ్వేదో ధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః
     అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితః
శ్లో || గంగైచ యమునే చైవ కృష్ణే ,గోదావరి ,సరస్వతి ,నర్మదా సింధు
  కావేర్యౌ జలేస్మిన్ సన్నిధం కురు.
ఇక్కడ ఇలా శ్లోకము ముగిసిన తరువాత ఆయాతు శ్రీ తులసీ ధాత్రి సహిత శ్రీ లక్ష్మీ నారాయణ పూజార్ధం దురితక్షయ కారకాః (ఏ దేవుని పూజిస్తున్నామో ఆ దేవుని పేరు చెప్పవలెను ) కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య  (కలశ మందలి ఉదకమును దేవునిపై చల్లాలి) ,ఓం ఆత్మానం సంప్రోక్ష్య అని (ఆ నీటిని తనపై చల్లుకోవాలి ) ఓం పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య (పూజా ద్రవ్యములపై కూడా చల్లాలి ) కలశ మందలి నీటిని పై మంత్రం చదువుతూ పువ్వుతో గాని ,ఆకుతో గాని చల్లాలి .
మార్జనము : ఓం అపవిత్రః పవిత్రోవా సర్వా వస్తాం గతోపివా
                యస్మరే త్పుండరీ కాక్షం సభాహ్యాభ్యంతర శ్శుచి :||
అని పిదప కాసిని అక్షతలు ,పసుపు, గణపతిపై వేసి ,ఆయనను తాకి నమస్కరించి ప్రాణ ప్రతిష్టాపన చేయవలెను. ప్రాణ ప్రతిష్ట అనగా శ్రీ తులసీ ధాత్రి సహిత శ్రీ లక్ష్మీ నారాయణ ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త స్సుముహూర్తోస్తు తధాస్తు . స్థిరోభవ, వరదోభవ ,సుముఖోభవ ,సుప్రసన్నోభవ. తరువాత ఇలా చదువుతూ విఘ్నేశ్వరునికి నమస్కరించవలెను .
శ్లో || శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
  ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వ విఘ్నోప శాంతయే ||

  సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజ కర్ణక :
  లంబోరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః
  ధూమ కేతు ర్గణాధ్యక్షః పాలచంద్రో గజానన

వక్రతుండ శ్శూర్ప కర్ణో హేరంబః స్కంద పూర్వజః
షోడ శైతాని నామాని యః పటే చ్చ్రుణు యాదపి
విద్యా రంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తధా
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య నజాయతే ||
పిదప షోడశోప చార పూజను చేయవలెను .షోడశోపచారములనగా ఆవాహన ,ఆసనం ,అర్ఘ్యం , పాద్యం ,ఆచమనీయం , స్నానం , వస్త్రం, యజ్ఞోపవీతం , గంధం ,పుష్పం, ధూపం , దీపం , నైవేద్యం, తాంబూలం ,నమస్కారం ,ప్రదక్షణములు మొదలగునవి .
షోడశోపచార పూజా ప్రారంబః
ధ్యానం :
శ్లో || దేవ దేవ మహా ప్రాజ్ఞ లోకేశ సురపూజిత ,
  యావత్పూజా సమాప్యేహాం తావత్త్వం సన్నిధర్భవ ||

అతో దేవా ఇతి సర్వత్ర మంత్రాను షంగతః
శ్రీ మదశ్వత్దరాయణ దేవతాభ్యో నమః
ఓం శ్రీ సోమవతీ దేవి నమః ధ్యాయామి - ధ్యానం సమర్పయామి అని శ్రీ సోమవతీ దేవిని మనస్సున ధ్యానించి నమస్కరించ వలెను .
ఆవాహనం :
శ్లో || శరణం మే జగన్నాధా శరణం భక్త వత్సల
  వరదో భవ హేనాద శాశ్వతః
శ్రీ సోమవతీ దేవి నమః ఆవాహయామి .
ఆవాహనార్ధం అక్షతాం సమర్పయామి .
అనగా మనస్పూర్తిగా దేవుని మన ఇంట్లోకి ఆహ్వానించడం అటు మనస్సున స్మరిస్తూ అక్షతలు దేవునిపై చల్లవలెను .
ఆసనం :
శ్లో || ఓం నమో వాసుదేవాయ సత్యానంద చిదాత్మనే
  రత్న సింహాసనం తుభ్యం దాస్యామి స్వీకురు ప్రభో ||
ఓం శ్రీ సోమవతీ దేవి నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి .సింహాసనార్ధం అక్షతాం సమర్పయామి .దేవుడు కూర్చుండుటకై మంచి బంగారు పీట వేసినట్లు అనుకుంటూ అక్షతలు వేయవలెను.

అర్ఘ్యం :
శ్లో || పరిత్రాణ పరానంద పద్మ పత్రే క్షణ ప్రభో
  గృహాణర్ఘ్యం మయాదత్తం కృష్ణ విష్ణో జనార్ధన ||
ఓం శ్రీ సోమవతీ దేవినమః హస్తౌ : అర్ఘ్యం సమర్పయామి . దేవుడు చేతులు కడుగు కొనుటకై నీళ్ళి స్తున్నామని మనసున తలుస్తూ ,ఉద్దరిణెతో నీరు వేరొక గిన్నెలో వదల వలయును.
పాద్యం :
శ్లో || సింహాసనం గజవాహన సర్వజ్ఞ సర్వ లక్షణ సంయుత
  పాద్యం గృహాణ మద్దత్తం శ్రియో సహా సురోత్తమ ||
ఓం శ్రీ సోమవతీ దేవి నమః పాదౌ : పాద్యం సమర్పయామి . దేవుడు కాళ్ళు కడుగు కొనుటకు నీరు ఇస్తున్నామని మనసున అనుకుంటూ పువ్వుతో పంచ పాత్ర లోని నీరు అదే గిన్నెలో ఉద్దరిణెతో వదలవలెను.
ఆచమనీయం :
శ్లో || హర వైడూర్య సంయుక్తే సర్వ లోక హితే శివే ,
                          గృహణాచమనం దేవి శంకరార్ధ శరీరణి ||

ఓం శ్రీ సోమవతీ దేవి నమః ఆచమనం సమర్పయామి .అంటూ దేవుని ముఖము కడుగుకొనుటకై నీళ్ళి స్తున్నామని మనసున తలుస్తూ పైన చెప్పిన పాత్రలో ఉద్దరిణెతో ఒక మారు నీరు వదలవలెను .
సూచన : అర్ఘ్యం ,పాద్యం, ఆచమనం మొదలగువాటికి ఉద్దరిణెతో  నీరు వేరొక పాత్రలోనికి వదలవలెను. అరివేణం (పంచ పాత్రకు క్రింద నుంచు పళ్ళెము ) లో వదలరాదు .

మధుపర్కం :
శ్లో || నమో నిత్యాయ శుద్దాయ యోగ  ధ్యాన పరాయణ ,
  మధు పర్కం గృహాణేదం సర్వ లోకైక నాయక ||
శ్రీ సోమవతీ దేవి నమః మధుపర్కం సమర్పయామి అని స్వామివారికి స్నానం చేయుటకు వస్త్ర మిచ్చు చున్నామని తలుస్తూ , ఈ మధుపర్కంను ఆయన ప్రతిమకు అద్దవలెను. (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆపైన రెండు వైపులా పసుపులో అద్ది ఉంచుకున్న దాన్ని మధుపర్కం అంటారు )

పంచామృత స్నానం :
శ్లో || సంస్నాపనం కరిష్యామి లక్ష్మీ నారాయణ ప్రభో ,
  స్నానే నానేవ దేవేశ మమ పాపస్య పోహతు ||
ఓం శ్రీ సోమవతీ దేవి నమః పంచామృత స్నానం సమర్పయామి అని స్నానమునకు పంచామృతములతో కూడిన నీరు ఇచ్చునట్లు భావించి ఆవునెయ్యి ,ఆవుపాలు , ఆవు పెరుగు ,తేనె ,పంచదార కలిపిన పంచామృతమును స్వామిపై ఉద్దరిణె తో చల్లవలెను.
శుద్దోదక స్నానం :
శ్లో || గంగోదకం సమానీతం సువర్ణ కలశ స్థితం ,
  స్నాప నార్ధం మయానీతం గృహాణ పరమేశ్వర ||
శుద్దోదక స్నానం సమర్పయామి
ఓం శ్రీ సోమవతీ దేవి నమః శుద్దోదక స్నానం సమర్పయామి .పంచపాత్ర లోని శుద్ధ నీటిని పువ్వుతో దేవునిపై చల్లవలెను .
వస్త్ర యుగ్మం :
శ్లో || దేవ దేవ జగన్నాధ నమః శ్రీ వత్స ధారిణే
  వస్త్ర యుగ్మం ప్రదాస్యామి సంగృహాణ జనార్ధన ||
ఓం శ్రీ సోమవతీ దేవి నమః వస్త్ర యుగ్మం సమర్పయామి . (యుగ్మమనగా రెండు ) అనుచూ వస్త్రమును (ప్రత్తిని పెద్ద బొట్టు సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆపైన రెండు వైపులా కుంకుమలో అద్దినచో అది వస్త్రమగును. ఇటువంటివి రెండు చేసుకొన వలెను ) స్వామివారి ప్రతిమకు అద్దవలెను.
యజ్ఞోపవీతం :
శ్లో || లక్ష్మీశాయ నమస్తేస్తు త్రాహిమాం భవ సాగరాత్ ,
  బ్రహ్మ సూత్రం చోత్తరీయం గృహాణ ప్రార్ధి తో మయా ||
ఓం శ్రీ సోమవతీ దేవి నమః ఉపవీతం సమర్పయామి .అనగా జందెమును ఇవ్వవలెను .ఇదియును ప్రత్తితో చేయ వచ్చును .ప్రత్తిని తీసుకుని పసుపు చేత్తో బొటనవ్రేలు ,మధ్య వ్రేలితో మధ్య మధ్య నలుపుతూ పొడవుగా చేసి ,కుంకుమ అద్దవలెను . దీనిని పురుష దేవతా పూజకు మాత్రమే సమర్పించ వలెను.
గంధం :
శ్లో || కర్పూరాగరు కస్తూరి కుంకుమాన్మిశ్ర చందనం ,
  తుభ్యం దాస్యామి దేవేశ సం గృహాణ నమోస్తుతే ||
ఓం శ్రీ సోమవతీ దేవి నమః గంధాన్ సమర్పయామి .
ముందుగా తీసి పెట్టుకున్న గంధమును కుడి చేతి ఉంగరం వ్రేలుతో స్వామివారి ప్రతిమపై చల్లవలెను .

ఆభరణం :
శ్లో || స్వభావ సుందరాంగాయ నానా శక్త్యా శ్రయాయతే |
   భూషణాని విచిత్రాణి కల్పయా మ్యమరార్చిత ||
ఓం శ్రీ సోమవతీ దేవి నమః ఆభరణాన్ సమర్పయామి అని స్వామికి మనము చేయించిన ఆభరణములను అలంకరించ వలెను . లేనిచో అలంకరణార్ధం అక్షతాన్ సమర్పయామి. అని అక్షతలు స్వామిపై వేసి ఆభరణాన్ సమర్పయామి అని నమస్కరించవలెను .
అక్షతలు :
శ్లో || తండు లానార్ద్ర కా స్వచ్చామహావ్రీ హి సముద్భవ
  అక్షతానర్పయేత్తుభ్యం సంగృహాణ సురేశ్వరః ||
ఓం శ్రీ సోమవతీ దేవి నమః అక్షతాన్ సమర్పయామి . (అక్షతలకు కొద్ది బియ్యమును తడిపి పసుపు వేసి కలుపవలెను ) అక్షతలు తీసుకుని స్వామివారి ప్రతిమపై చల్లవలెను .
పుష్ప సమర్పణ :
శ్లో || మాల్యానిచ సుగంధిని మాలత్యాంచ ప్రభో
  మయాహ్నుతాని పూజార్ధం ,గృహాణ కమలాధిప ||
ఓం శ్రీ సోమవతీ దేవినమః పుష్పాణి సమర్పయామి స్వామివారికి పువ్వులతో అలంకారము చేయవలెను .పువ్వులను స్వామిపై వేసి నమస్కరించ వలెను. పిదప అధాంగ పూజను చేయవలెను. ఈ క్రింది నామాలను చడువుచూ పుష్పములతో గాని , పసుపు కుంకుమలతో గాని స్వామిని పూజించవలెను.
అధాంగ పూజా ||
నారాయణాయ  నమః పాదౌ పూజయామి
కేశవాయ నమః గుల్ఫౌ పూజయామి
హరయే నమః జంఘౌ పూజయామి
సంకర్షణాయ నమః ఊరూ పూజయామి
వరాహాయ నమః కటిం పూజయామి
పద్మనాభాయ నమః నాభిం పూజయామి
దామోదరాయ నమః ఉదరం పూజయామి
కాలాత్మనే నమః స్తనౌ పూజయామి
రామాయ నమః స్కందౌ పూజయామి
వైకుంట నాదాయ నమః కంటం పూజయామి
అనిరుద్దాయ నమః బాహుం పూజయామి
చు పుష్పములతో గాని ,పసుపు కుంకుమలతో
పరమేశ్వరాయ నమః హస్తౌ పూజయామి
దేవాది దేవాయ నమః శ్రోత్రే పూజయామి
సర్వ వ్యాపినే నమః శిరః పూజయామి
సర్వశ్వరాయ నమః సర్వాంగాని పూజయామి
పంచామృత స్నానం :
శ్లో || సంస్నాపనం కరిష్యామి లక్ష్మీ నారాయణ ప్రభో ,
  స్నానే నానేవ దేవేశ మమ పాపస్య పోహతు ||
ఓం శ్రీ సోమవతీ దేవి నమః పంచామృత స్నానం సమర్పయామి అని స్నానమునకు పంచామృతములతో కూడిన నీరు ఇచ్చునట్లు భావించి ఆవునెయ్యి ,ఆవుపాలు , ఆవు పెరుగు ,తేనె ,పంచదార కలిపిన పంచామృతమును స్వామిపై ఉద్దరిణె తో చల్లవలెను.
శుద్దోదక స్నానం :
శ్లో || గంగోదకం సమానీతం సువర్ణ కలశ స్థితం ,
  స్నాప నార్ధం మయానీతం గృహాణ పరమేశ్వర ||
శుద్దోదక స్నానం సమర్పయామి
ఓం శ్రీ సోమవతీ దేవి నమః శుద్దోదక స్నానం సమర్పయామి .పంచపాత్ర లోని శుద్ధ నీటిని పువ్వుతో దేవునిపై చల్లవలెను .
వస్త్ర యుగ్మం :
శ్లో || దేవ దేవ జగన్నాధ నమః శ్రీ వత్స ధారిణే
  వస్త్ర యుగ్మం ప్రదాస్యామి సంగృహాణ జనార్ధన ||
ఓం శ్రీ సోమవతీ దేవి నమః వస్త్ర యుగ్మం సమర్పయామి . (యుగ్మమనగా రెండు ) అనుచూ వస్త్రమును (ప్రత్తిని పెద్ద బొట్టు సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆపైన రెండు వైపులా కుంకుమలో అద్దినచో అది వస్త్రమగును. ఇటువంటివి రెండు చేసుకొన వలెను ) స్వామివారి ప్రతిమకు అద్దవలెను.
యజ్ఞోపవీతం :
శ్లో || లక్ష్మీశాయ నమస్తేస్తు త్రాహిమాం భవ సాగరాత్ ,
  బ్రహ్మ సూత్రం చోత్తరీయం గృహాణ ప్రార్ధి తో మయా ||
ఓం శ్రీ సోమవతీ దేవి నమః ఉపవీతం సమర్పయామి .అనగా జందెమును ఇవ్వవలెను .ఇదియును ప్రత్తితో చేయ వచ్చును .ప్రత్తిని తీసుకుని పసుపు చేత్తో బొటనవ్రేలు ,మధ్య వ్రేలితో మధ్య మధ్య నలుపుతూ పొడవుగా చేసి ,కుంకుమ అద్దవలెను . దీనిని పురుష దేవతా పూజకు మాత్రమే సమర్పించ వలెను.

గంధం :
శ్లో || కర్పూరాగరు కస్తూరి కుంకుమాన్మిశ్ర చందనం ,
  తుభ్యం దాస్యామి దేవేశ సం గృహాణ నమోస్తుతే ||
ఓం శ్రీ సోమవతీ దేవి నమః గంధాన్ సమర్పయామి .
ముందుగా తీసి పెట్టుకున్న గంధమును కుడి చేతి ఉంగరం వ్రేలుతో స్వామివారి ప్రతిమపై చల్లవలెను .
ఆభరణం :
శ్లో || స్వభావ సుందరాంగాయ నానా శక్త్యా శ్రయాయతే |
   భూషణాని విచిత్రాణి కల్పయా మ్యమరార్చిత ||
ఓం శ్రీ సోమవతీ దేవి నమః ఆభరణాన్ సమర్పయామి అని స్వామికి మనము చేయించిన ఆభరణములను అలంకరించ వలెను . లేనిచో అలంకరణార్ధం అక్షతాన్ సమర్పయామి. అని అక్షతలు స్వామిపై వేసి ఆభరణాన్ సమర్పయామి అని నమస్కరించవలెను .
అక్షతలు :
శ్లో || తండు లానార్ద్ర కా స్వచ్చామహావ్రీ హి సముద్భవ
  అక్షతానర్పయేత్తుభ్యం సంగృహాణ సురేశ్వరః ||
ఓం శ్రీ సోమవతీ దేవి నమః అక్షతాన్ సమర్పయామి . (అక్షతలకు కొద్ది బియ్యమును తడిపి పసుపు వేసి కలుపవలెను ) అక్షతలు తీసుకుని స్వామివారి ప్రతిమపై చల్లవలెను .
పుష్ప సమర్పణ :
శ్లో || మాల్యానిచ సుగంధిని మాలత్యాంచ ప్రభో
  మయాహ్నుతాని పూజార్ధం ,గృహాణ కమలాధిప ||
ఓం శ్రీ సోమవతీ దేవినమః పుష్పాణి సమర్పయామి స్వామివారికి పువ్వులతో అలంకారము చేయవలెను .పువ్వులను స్వామిపై వేసి నమస్కరించ వలెను. పిదప అధాంగ పూజను చేయవలెను. ఈ క్రింది నామాలను చడువుచూ పుష్పములతో గాని , పసుపు కుంకుమలతో గాని స్వామిని పూజించవలెను.
అధాంగ పూజా ||
నారాయణాయ  నమః పాదౌ పూజయామి
కేశవాయ నమః గుల్ఫౌ పూజయామి
హరయే నమః జంఘౌ పూజయామి
సంకర్షణాయ నమః ఊరూ పూజయామి
వరాహాయ నమః కటిం పూజయామి
పద్మనాభాయ నమః నాభిం పూజయామి
దామోదరాయ నమః ఉదరం పూజయామి
కాలాత్మనే నమః స్తనౌ పూజయామి
రామాయ నమః స్కందౌ పూజయామి
వైకుంట నాదాయ నమః కంటం పూజయామి
అనిరుద్దాయ నమః బాహుం పూజయామి
చు పుష్పములతో గాని ,పసుపు కుంకుమలతో
పరమేశ్వరాయ నమః హస్తౌ పూజయామి
దేవాది దేవాయ నమః శ్రోత్రే పూజయామి
సర్వ వ్యాపినే నమః శిరః పూజయామి
సర్వశ్వరాయ నమః సర్వాంగాని పూజయామి
తరువాత అష్టోత్తర శతనామావళి పూజ దీని యందు 108 మంత్రములుండును . ఈ మంత్రములను చడువుచూ పుష్పములతో గాని ,పసుపు కుంకుమ లతో గాని స్వామిని పూజించవలెను .
పిదప అగరువత్తిని వెలిగించి
ధూపం :
శ్లో || గగ్గులం ఘ్రుత సంయుక్త ననాగం ధైస్సు సంయుతం ,
  ధూపం గృహాణ కృపయా సుప్రీతో వరదోభవః
ఓం శ్రీ సోమవతీ దేవి నమః ధూప మాఘ్రాపయామి .ధూపం సమర్పయామి అంటూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ కుడి చేత్తో అగరువత్తిని తిప్పుచూ పొగను స్వామికి చూపవలెను

దీపం :
శ్లో || జ్ఞానోద్దీప నాయేతి జ్ఞాన బుద్ద జప్రదోభవ
  వహ్ని దాయోజితం దీపం గృహాన పరయా ముదా ||
ఓం శ్రీ సోమవతీ దేవి నమః సాక్షాత్ దీపం దర్శయామి .
అని మొదట్లో చెప్పిన విధంగా దీపారాదనలో ఉన్న అదనపు వత్తులలో ఒక దానిని తీసుకుని హారతి వెలిగించే దాంట్లో వేసి వెలిగించి గంట మ్రోగిస్తూ ఆ దీపం స్వామికి చూపుతూ పై శ్లోకమును చదువవలెను .
నైవేద్యం :
శ్లో || దివ్యాన్నం షడ్రశోపెతం నానా భాక్ష్యైశ్చ సంయుతం
  మయా ప్రదత్తం నైవేద్యం సం గృహాణ శ్రియా సహః
ఓం శ్రీ సోమవతీ దేవి నైవేద్యం సమర్పయామి.
అని ఒక బెల్లం ముక్క ,పళ్ళు, కొబ్బరికాయ మొదలగునవి ఒక పళ్ళెము లోనికి తీసుకుని స్వామీ వద్ద ఉంచి దానిపై పువ్వుతో నీళ్ళు చల్లుతూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ "ఓం భూర్బువ స్సువః ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ,ధియో యోనః ప్రచోదయాత్ ,సత్యం త్వర్తేన పరిషించామి,(ఋతం త్వా సత్యేత పరిషించామి అని రాత్రి చెప్పవలెను ) అమృతమస్తు అమృతో పస్తరణ మసి ,ఓం ప్రాణాయ స్వాహా ,ఓం అపానాయ స్వాహా , ఓం వ్యానాయ స్వాహా ,ఓం ఉదానాయ స్వాహా ,ఓం సమానాయ స్వాహా , మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటూ ఆరు మార్లు చేతితో (చేతి లోని ఉద్దరిణెతో ) స్వామికి నివేదనం చూపించాలి .పిదప ఓం శ్రీ సోమవతీ దేవి నమః నైవేద్యా నంతరం ' హస్తౌ ప్రక్షాళ యామి 'అని ఉద్దరిణె తో పంచపాత్రలోని నీరు ముందు చెప్పిన అర్ఘ్య పాత్ర (పంచ పాత్ర కాకుండా విడిగా చెంబులో పెట్టుకునే నీళ్ళ పాత్ర ) లో వదలాలి . తరువాత 'పాదౌ ప్రక్షాళ యామి ' అని మరోసారి నీరు అర్ఘ్య పాత్రలో ఉద్దరిణె తో వదలాలి .పునః శుద్దాచమనీయం సమర్పయామి . అని ఇంకొక పర్యాయం నీరు వదలాలి .
మధ్యౌ మధ్యౌ పానీయం :-
గంగోధకం సమానీతం పానార్ధం పరమం శివ
హ్నుషీకేశ నమస్తుభ్యం గృహాణ పరయాముదా ||
తాంబూలం :
శ్లో || పూగీ ఫలై స్సకర్పూరై గ్నాగ వల్లీ దళైర్యుతం
  కర్పూరం చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతి గృహ్యాతాం
ఓం శ్రీ సోమవతీ దేవి నమః తాంబూలం సమర్పయామి
అని చెబుతూ తాంబూలమును (మూడు తమలపాకులు ,రెండు పోక చెక్కలు ,అరటి పండు వేసి ) స్వామి వద్ద ఉంచాలి .తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కొనుటకు నీరు ఇస్తున్నామని తలుస్తూ ,' తాంబూల చరవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ' అంటూ ఉద్దరిణెతో నీరు అర్ఘ్య పాత్రలో వదలాలి . పిమ్మట కర్పూరం వెలిగించి

నీరాజనం :
శ్లో || ఘ్రుత వర్తి సహస్త్యైశ్చ కర్పూర శకలై స్తదా ,
                      నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ ||
ఓం శ్రీ సోమవతీ దేవి నమః కర్పూర నీరాజనం సమర్పయామి .
అని కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి ముందుగా దీపారాధనకు వెలిగించిన దీపంతో వెలిగించి ,మూడు మార్లు త్రిప్పుచూ ,చిన్నగా గంట వాయించ వలెను. అనంతరం మళ్ళీ పువ్వుతో నీరు హారతి కుంది చివర వదులుతూ 'కర్పూర నీరాజనానంతరం శుద్దాచమనీయం సమర్పయామి 'అని చెప్పినీరాజనం  స్వామివారికి చూపించి తరువాత ఇంటిలోని వారందరూ హారతిని కళ్ళకు అద్దుకోవాలి తరువాత అక్షతలు, పువ్వులు, చిల్లర డబ్బులు చేతిలో పట్టుకుని ,
మంత్ర పుష్పం :
శ్లో || హిరణ్య పాత్రం మహా మంత్రేణ నీరాజనం
  శ్రీమతే సర్వ భూతాత్మం త్రాహిమాం భవ సాగరాత్
  మధుసూదన దేవేశ గృహాణ కుసుమాంజలిం ||
మంత్ర పుష్పం సమర్పయామి.
శ్రీ సోమవతీ దేవి నమః యధాశక్తి మంత్ర పుష్పం సమర్పయామి. అని చెప్పుకుని అక్షతలు ,పువ్వులు, చిల్లర స్వామి వద్ద ఉంచవలెను. పిమ్మట ఈ దిగువ మంత్రం జపిస్తూ మూడు సార్లు ప్రదక్షిణలు చేయాలి.
ప్రదక్షిణం :
శ్లో || ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ ,
  నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్న నాశన ||
శ్లో || ప్రధమ గణ దేవేశ ప్రసిద్దే గణ నాయక ,
     ప్రదక్షణం కరోమి త్వామీశ పుత్ర నమోస్తుతే ||
శ్లో || యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
  తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షణ పదే పదే ||
ఓం శ్రీ సోమవతీ దేవి నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి శ్రీ స్వామికి చేతిలో అక్షతలు , పువ్వులు తీసుకుని లేచి నిలబడి మూడుసార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి (అనగా తమలో తాము చుట్టూ తిరిగి ) పిమ్మట సాష్టాంగ నమస్కారం చేసి (మగవారు పూర్తిగా పడుకుని తలను నేలకు ఆన్చి ,ఆడువారు మోకాళ్ళపై పడుకుని కుడికాలు ఎదమకాలుపై వేసి ) తరువాత స్వామిపై చేతిలో నున్న అక్షతలు ,పువ్వులు చల్లి మరల తమ స్థానమున ఆసీనులై నమస్కరించుచూ
నమస్కారమ్ :
శ్లో || నమస్కరో మ్యహంభక్త్యా సర్వ పాప హారా వ్యయ ,
   కురుమే జన్మ సఫలం త్వత్పా దాంబుజ వందనాత్ ||

ప్రార్ధన మ్ :
లక్ష్మీ సర్వ లోకేశ సర్వ సంపత్ప్ర దోభవ ,
గృహాణార్ఘ్యం మయాదత్తం కృపయా పరయాముదా||
దేవ దేవ జగన్నాధా సృష్టి సంహార కారక ,
శరణ్యం త్వాం ప్రసన్నోస్మి త్రాహిమాం పురుషోత్తమ ||
నిర్విఘ్నోస్మి మహా ఘోరే సంసారే దుఃఖ సాగరే ,
మాముద్దర హృషీ కేశ భో భో భవ భయాపహా ||
:
యస్య స్మృత్యాచ :- ప్రార్ధనా శ్లోకం
అశ్వత్థ నారాయణ స్సుప్రీతో వరదో భవతు,
మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణే
అగ్రత శ్శివ రూపాయ వృక్ష రాజాయతే నమః

వయనం:-
అశ్వత్ధం ప్రతి గృహ్ణాతు ఆశ్వభో వైద దాతిచ
అశ్వత్ధ స్తారకో భాభ్యాం ఆశ్వత్దాయ నమో నమః
పునః పూజ :
ఓం శ్రీ సోమవతీ దేవి నమః పునః పూజాంచ కరిష్యే అని చెప్పుకుని ,పంచపాత్రలోని నీటిని చేతితో తాకి ,అక్షతలు స్వామిపై చల్లుతూ ఈ క్రింది మంత్రములు చదువుకొనవలెను .
విశేషోపచారములు:
ఛత్రం ఆచ్చాదయామి ,చామరం వీజయామి ,నృత్యం దర్శయామి ,గీతం శ్రావయామి ,వాద్యం ఘోషయామి , సమస్త రాజోపచార ,శక్త్యోపచార ,భక్త్యోప చార ,పూజాం సమర్పయామి అనుకొని ,నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకమును చదువు కొనవలెను .
పూజా ఫల సమర్పణమ్:
శ్లో || యస్య స్మృత్యాచ నామోక్త్యా తపం పూజా క్రియాది షు
   యాన సంపూరతాం యాతి సద్యో వందే తమచ్యుతమ్
   మంత్ర హీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర |
   యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||
అనయా ధ్యానా వాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః శ్రీ సోమవతీ దేవి సుప్రీతో స్సుప్రసన్నో వరదో భవతు .ఏతత్ఫలం శ్రీ సోమవతీ దేవి అర్పణ మస్తు అంటూ అక్షతలు నీటితో పాటు అరవేణంలో వదలవలెను .పిమ్మట ' శ్రీ సోమవతీ దేవి ప్రసాదం శిరసా గృహ్ణామి ' అనుకొని స్వామివద్ద అక్షతలు తీసుకొని తమ తమ తలలపై వేసుకొనవలెను . ఆ పిదప పసుపు గణపతి ఉన్న పళ్ళెము నొకసారి పైకి ఎత్తి తిరిగి క్రింద ఉంచి పళ్ళెములో ఉన్న పసుపు గణపతిని తీసి దేవుని పీటముపై నుంచ వలెను . దీనిని ఉద్వాసన చెప్పటం అంటారు.
ఓం శ్రీ సోమవతీ దేవి నమః యధాస్థానం ప్రవేశయామి. శోభనార్ధం పునరాగమనాయచ అని ఉద్వాసన పలుకుతారు .
పూజావిధానం సంపూర్ణమ్ .

తీర్ధ ప్రాశనము :

శ్లో || అకాల మృత్యు హరణం సర్వ వ్యాధి నివారణమ్ |

సమస్త పాప క్షయ కరం శ్రీ సోమవతీ దేవి పాదోదకం పావనం శుభమ్ ||

అని తీర్థమును చేతిలో వేసుకుని మూడుమార్లు నోటిలోనికి తీసుకొనవలెను. వ్రత కథా ప్రారంభము
ధర్మ స్వభావుడైన "ధర్మరాజు " అంపశయ్య పై పడుకొని యున్న భీష్మ పితామహుని చూచి సాష్టాంగ నమస్కారము (అనగా వ్యక్తి తన మోకాళ్ళపై వంగి ఎదమకాలిపై కుడికాలు పెట్టి రెండు చేతులతో నమస్కారము చేయవలెను ) చేసి ఇలా అడిగెను. దుర్యోధనుని యొక్క దురాశ చేత మన కులమంతయూ నశించెను ,భూమిని పాలించు రాజులందరూ మరణించిరి భూమియందు చిన్నవారు, ముసలివారు ,వ్యాధి (రోగము)తో బాధ పడువారు తప్ప ఇంకెవరూ లేరు. ఈ భారత వంశమున మేము( అనగా పాండవులు ) ఐదుగురము మిగిలితిమి .అటువంటి రాజ్యాధికారము కూడా ప్రకాశించదు .సంతానము (బిడ్డలు ) యుద్దములో మరణించుట వలన కొంచెము కూడా సంతోషము కలుగుట లేదు . అశ్వద్దామ యొక్క 'అస్త్రము ' (ఆయుధము ) చేత ఉత్తర గర్భము దగ్ధ మైనందున (పోయినందున )బాధ కలిగెను. కావున ఏమి చేయవలెను ? ఇందువలన సంతానము (బిడ్డలు ) ఎక్కువకాలము జీవించుటకు (బ్రతికి యుండుటకు) ఏ ఉపాయము ఉన్నదో దానిని తెలుపుము., అనగా కౌరవ ,పాండవులకు తాత ఐన భీష్ముడు ఇలా చెప్పు చున్నాడు. ధర్మ పుత్రుడా సంతానము చిరకాలము (ఎక్కువకాలము ) బ్రతుక గల వ్రతమును ఒక దానిని నీకు చెప్పెదను వినుము. అది అటువంటి వ్రతములలో ఉత్తమమైన వ్రతమును గూర్చి చెప్పెదను వినుము అని ఇలా చెప్పెను.
అమావాస్యా సోమవారముతో కూడిన రోజున అశ్వత్ధ వృక్షమును (రావి చెట్టు ) దాని మూలమున ఉన్న విష్ణువును పూజించి ,నూటెనిమిది (108 ) లెక్క గల రత్నములు గాని ,బంగారము గాని ,పండు మొదలైనవి గాని చేతిలో పట్టుకుని ,వృక్షమునకు నూట ఎనిమిది ప్రదక్షణలు చేయవలెను . ఓ ధర్మజా ! ఈ వ్రతము శ్రీ మహా విష్ణువునకు చాలా ఇష్టమైనది మరియు శ్రేష్టమైనది .అభిమన్యుని బార్య 'ఉత్తర ' ఈ వ్రతము చేతనే తన పుత్రుని (కొడుకుని ) బ్రతికించు కున్నది. గుణ వంతుడైన ,ముల్లోకములలో (ఖ్యాతి ) పేరు పొందగల కుమారుని కన్నది . అని చెప్పిన భీష్ముని మాట విని ధర్మరాజు ఇలా చెప్పుచున్నాడు.
ఓ పితామహా వ్రతములలో గొప్పదైన ఆ వ్రతమున గూర్చి నాకు వివరముగా తెలియ చెప్పుము .ఆ వ్రతమును ఈ భూలోకములో ఎవరు చేసిరి ఇలా అడిగిన ధర్మరాజుతో భీష్ముడు ఈ విధముగా చెప్పు చున్నాడు .

అంతటనూ పేరు పొందిన కాంచి అను పట్టణము ఒకటి ఉండెను. ఆ పురములోని బ్రాహ్మణ , క్షత్రియ ,వైశ్య, శూద్ర ఈ నాలుగు జాతులవారు తమ తమ ధర్మములను చక్కగా ఆచరించు చుండిరి .ఆ నగరం ఇంద్రుని ఇంద్రుని అమరావతి నగరం వలె ప్రకాశించు చుండెను . ఆ పట్టణ మందు రత్న సేనుడు అను రాజు కలడు అతను రాజ్య పాలనము చేయు చుండగా దేవతలు ,ప్రజలు సంతోషించిరి . ఈతి బాధలు లేకుండెను . ఇలా ఉండగా ఆ నగరంలో దేవ స్వామి అని పేరు పొందిన ఒక బ్రాహ్మణుడు ఉండెను. ఆయన భార్య 'రూపవతి ' ధనవతి అని పేరు కలిగినది .ఆమె లక్ష్మీ వలె ప్రకాశించు చుండెను . ఆమెకు ఏడుగురు కొడుకులు , అందమైన కుమార్తెను కనెను . ఇలా తన కొడుకులు , కోడళ్ళు ,మనుమలు ,మనుమరాండ్రతో సంతోషించు చుండెను. ఇలా ఉండగా ఒకనాడు ఒక బ్రాహ్మణుడు 'బిక్ష ' (అనగా తినుటకు కావలసిన ఆహారమును ప్రతి ఇంటి ముందు నిలుచుని అడుగుట ) కొరకు వచ్చెను .అతనిని చూచి ,దేవస్వామి యొక్క కోడళ్ళు ఏడుగురును, ప్రేమతో అతనికి వారు ప్రత్యేకించి బిక్షను తెచ్చి వేసిరి. ఆ బ్రాహ్మణుడు సంతోషించి ,మీకు సుమంగళీ త్వము (అనగా భర్త చనిపోకుండా కాపాడ బడునది ) మంచి సంతానము (అనగా మంచి బిడ్డలు ) కలుగును. అని దీవించెను. ఆ తరువాత 'ధనవతి 'తన కూతురైన 'గుణవతి ' ని పిలిచి ఓ అమ్మాయీ నీవు ఈ విప్రునికి (అనగా బ్రాహ్మణునికి ) బిక్షను పెట్టుము అనగా ఆమె అట్లు చేసెను .అప్పుడు ఆ విప్రుడు ఓ శుచి కలదానా (అనగా శుబ్రమైన దానా ) నీవు ధర్మవతివి కమ్ము అనెను. అది విని ఆ 'గుణవతి ' తల్లి దగ్గరకు పోయి ఆ బ్రాహ్మణుడు ఆశీర్వ దించిన విధము తెలిపెను అది విని ఆ 'ధనవతి ' కూతురును తీసుకుని మరల ఆ బ్రాహ్మణుని వద్దకు పోయి తన కూతురు చేత నమస్కారము చేయింపగా ఆ బ్రాహ్మణుడు ఇంతకు ముందు ఆశీర్వదించినట్లు ఆశీర్వదించెను. అది విని ధనవతి బాధ చెంది విప్రునితో (అనగా బ్రాహ్మణునితో ) ఇట్లన్నది .ఓ బ్రాహ్మణ శ్రేష్టా నియమ యుక్తులైన (నియమములు ఆచరించిన ) నా కోడళ్ళకు మాత్రము' సౌమంగల్య కరము ' కలుగును గాక అని ఆశీర్వ దించి ,నా కూతురు నమస్కరించి నపుడు ధర్మవతి ,దీర్ఘాయువు అనగా నూరు సంవత్సరములు జీవించు దానవు కమ్ము అని భౌధముగా ఆశీర్వదించితివి ఎందుకు ? అని అడుగగా ఆ బ్రాహ్మణుడు ! ఓ ధనవతీ నీవు పున్యవతివి ,కీర్తి కలదానవు కావున నీ కుమార్తె గూర్చి చెప్పెదను వినుము. ఈమె సప్తపదీ మధ్య మందు వైధవ్యము చెందగలదు .కావున ఉత్తమమును , నాశనము కానిది ఐన ధర్మమును ఎక్కువగా చేయవలయును .కావున ఇలా ఆశీర్వదించితిని అని బ్రాహ్మణుడు పలుకగా ఆ ధనవతి బాధ చెందిన హృదయముతో అతనికి నమస్కరించి ,దీనిని పోగొట్టుకొనుటకు ఏదైనా ఉపాయము ఉన్నచో చెప్పుమనగా ఆ బ్రాహ్మణుడు ఓ 'ధనవతీ 'ఈమె వివాహ సమయమున సోమ అనునది వచ్చి ,ఈమె వైధవ్యమును పోగొట్టును గాక అనిన విని ,ధనవతి ఇలా అడుగుచున్నది . ఓ బ్రాహ్మణ శ్రేష్టా ఈ సోమ అను ఆమె ఎవరు ? ఆమె జాతి ఏమి ? ఎక్కడ నుండి వచ్చినది .దానినంత వివరించ మనగా ఆ బ్రాహ్మణుడు చెప్పు చున్నాడు.


ఓ 'ధనవతి ' దేశమందు సోమ అను పేరుగల చాకలి ఆమె ఒకతి ఉన్నది . ఆమె నీ ఇంటికి వచ్చినచో నీ కూతురు వైధవ్యము పోవును .అని చెప్పి ఆ బ్రాహ్మణుడు వెళ్లి పోయెను. ఆ తరువాత ధనవతి తన కొడుకులను పిలిచి, ఈ కధ చెప్పును. ఓ పుత్రులారా ,మీ చెల్లెలుకు ఒక బ్రాహ్మణుడు సప్తపదీ మధ్యమున వైధవ్యము ప్రాప్తించును. అనగా కలుగును అని చెప్పినాడు సింహళ దేశమున ఉన్న ఒక చాకలి ఆమెను తెచ్చినచో వైధవ్యము తొలగిపోవును . అని చెప్పినాడు .కావున మీరు సింహళ దేశమునకు పోవలయును అనగా కొడుకులు ఇలా పలికిరి .ఓ తల్లి తండ్రులారా కుమార్తె యందు ఉన్న ప్రేమతో ఏడు ఆమడల దూరమున ఉన్న సింహళ దేశమునకు మమ్ము పొమ్మను చున్నారు.దేశము విడిచి మేము వెళ్ళము అని పలికిరి.సోమా సముద్రము యొక్క మధ్యన ఉన్నది .అది దాటుట కష్టము కనుక మేము పోలేము అని పలుకగా వారి తండ్రి ఐన 'దేవస్వామి ' తన ఏడుగురు కొడుకులతో తాను కూడా సింహళ దేశమునకు వెళ్లి పుత్రిక యొక్క వైధవ్యము పోవుటకు సోమయను ఆమెను తెచ్చెదను అని కొడుకులతో పలుకగా అది విని శివ స్వామి అను చిన్న కొడుకు తండ్రితో ఓ తండ్రీ మీరు అలా చెప్పుట వలన మాకు మంచి కలుగదు .సింహళ దేశమునకు నేను పోయెదను.
అని వెంటనే లేచి తన' సోదరి ' (అక్క లేక చెల్లెలు ) ను తీసుకుని ప్రయాణ మయ్యెను. కొన్ని రోజులకు సముద్ర తీరము చేరి అక్కడ విశాలమైన ఒక మఱ్ఱి చెట్టు (వట వృక్షము ) నీడన కూర్చుని ఉండగా ఆ చెట్టు యందు ఉన్న ఒక( గృద్ర రాజము ) గ్రద్ద పక్షి వేరు చోట నుండి తెచ్చిన మెత్తని మాంసము చేత తన పిల్లలను కాపాడు చుండెను. ఇది చూచి ఆ బ్రాహ్మణ కుమారుడైన శివ స్వామి వేరే కొంత మాంసము తెచ్చి ఆ గ్రద్ద పిల్లలకు వేయగా అవి దానిని ముట్టుకోనలేదు .వెంటనే ఆ గ్రద్ద చూచి, దాని పిల్లలతో ఎందుకు తినలేదని అవి ఇట్లు పలికెను. ఓ తండ్రీ ఈ చెట్టు క్రింద ఒక బ్రాహ్మణుడు నిరాహారుడై (భోజనము చేయని వాడై )ఉండగా మేము ఎట్లు చేయుదము అనగా ఆ పక్షి రాజు దయ కల్గిన వాడై వారి దగ్గరకు వచ్చి మీ కోరికను తెలుసుకుంటిని ,మిమ్ములను రేపటి ఉదయమున "సింహళ ద్వీపము "చేరునట్లు సముద్రము దాటించెదను. అని చెప్పి ,మరల తన బిడ్డలకు భోజనము పెట్టి మరునాడు తెల్లవారు ఝామున ఆ పక్షిరాజు వారిని సముద్రము దాటించి ,ఆ సముద్ర మధ్యమున ఉండు సింహళ ద్వీపము నందు సోమా ఇంటి తలుపులు చూపగా వారు ఆ రోజు నుండి ఆ ఇంటిని ఊడ్చి ,అలికి (అనగా ఆవుపేడ ,బర్రె పేడ ఈ రెండిటిలో ఏదో దాని చేత నైననూ పూర్వము ఇల్లు శుభ్రము చేసేవారు ) ఇలా చేసి, ఒక సంవత్సరము వారు అక్కడ అలా గడిపారు. ఇలా ఉండగా (రజకి) చాకలి ఐన సోమ అనునది ఇంటి నుండి బయటకు వచ్చి చక్కగా ముగ్గులచే అలంకరింపబడిన దానిని చూచి ఆశ్చర్యము చెంది ఇలా ముగ్గులు అందముగా వేసిన వారు ఎవ్వరో అని ఆలోచించు చుండగా ఆ విపర కన్య (అనగా బ్రాహ్మణ కన్య ) కనిపించెను. తన అన్న తో కూడా వెలగు చున్న ఈ కన్యను చూసి ,దేవతా మూర్తులవలె వెలుగుచున్న మీరెవరు ? ఈ దేశమునకు ఏల వచ్చితిరి ? తుచ్చమైన జాతిగల (అంటే నీచ జాతి గల ) నాకు మంచి చరిత్ర కల మంచి జాతి యందు పుట్టిన మీరు సేవ చేయుటకు కారణ మేమి ? అని అడిగిన ఆ శివ స్వామి ఇట్లు చెప్పెను


'గుణవతి ' అని పిలువబడే ఈ కన్యకు సప్తపదీ మధ్యమున ' వైధవ్యము కలుగునని ఒక బ్రాహ్మణుడు పలుకగా అది విని ,ఆ బ్రాహ్మణుని అది తొలగుట ఎట్లు అని అడుగగా అతడు సింహళ ద్వీపమున కల 'సోమ ' అని చాకలి దగ్గర ఉండుట చేత ఈ 'దుష్ట దశ ' తొలగును అని చెప్పగా ,విని ఈమెను తీసుకుని నీ దగ్గరకు వచ్చితిని అని చెప్పెను . అది విని సోమ ఇక మీరు దాస్యము (సేవ ) చేయుట మానుము అనెను .మీ ఆజ్ఞ చే 'వైధవ్య ' నివృత్తికై వచ్చెదనని తన కోడళ్ళను పిలిచి నేను పొరుగు దేశము వెళ్ళు చుంటిని మీరు నేను వచ్చు వరకు ఈ ప్రదేశము నందు ఎవ్వరైనా చనిపోయినచో వారి వద్దనే ఉండి బాధ చెందక వారిని కాపాడుము.అనగా విని అట్లే చేసెదము అనిరి .ఆ తరువాత ఆ' సోమ ' బ్రాహ్మణుని ,అతని చెల్లెలిని ఆకాశ మార్గమున సముద్రము దాటించి ,అనేక దారులు దాటి నిముషములోనే ఆమె మహిమచే కాంచి పురమున ఉండగా ఆ దేవస్వామి ఇంటిలో ధనవతి తన కూతురు వైధవ్యము మాన్పుటకై వచ్చిన సోమను చూచి ,అతి ప్రేమతో ఉపచారములు చేసెను.
అది ఇలా ఉండగా ,శివస్వామి తన చెల్లెలికి తగిన వరుని తెచ్చుటకై వేరే దేశము పోయి ఉజ్జయని నగరములో చేరి ,అక్కడ ఉన్న దేవ శర్మ కొడుకైన రుద్ర శర్మ అను పేరు గల ఒక వరుని తీసుకుని వచ్చి అతనికి పదివేల వరహాలు ధనమును ఇచ్చెను. తరువాత దేవస్వామి మంచి నక్షత్రము కల మంచి ముహూర్తమును సోమా సహాయముచే కన్యాదానము చేయగా హోమాదులు చేయు చుండ (యజ్ఞము చేయుచుండ) సప్త పది మధ్యమున దేవశర్మ ఉన్నవాడు ఉన్నట్లే మరణించెను. ఆ సమయమున చుట్టములు అక్కడ చూచి గట్టిగా ఏడ్చు చుండగా ,అందరూ చూచు చుండగా ఆ సోమ వ్రత ప్రభావముచే మరణం నశింప చేయునట్టి ఈ వ్రత పుణ్యము సంకల్పముతో సహా గుణవతికి ఇవ్వగా దేవశర్మ దాని మహిమచే నిద్ర నుండి లేచుచున్న వానివలె లేచుట చూచెను . సోమ వివాహము జరిపించి ,తన దేశమునకు వెళ్ళుటకు సిద్దమయి ఆ వ్రతమును ఆమెకు ఉపదేశించెను.వారి చేత ఆజ్ఞను పొంది తిరిగి తన దేశమునకు వెడలెను .


అశేషం హరయే శోకం వృక్ష రాజ నమోస్తుతే ||

ఆశ్వత్దే వో నిషధనం వర్నే వోవ సతః కృతా |

గోభాజ ఇభి జలా సదయత్సన వధు పూరుషం |

మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణే |

అగ్రత శ్శివ రూపాయ వృక్ష రాజాయతే నమః ||

యాని కానిచ పాపాని బ్రహ్మ హత్యా సమానిచ |

తాని సర్వాణి నశ్యంతు ప్రదక్షిణ పదే పదే ||

అను ఈ మంత్రములను చదువుచూ ముత్యములు, బంగారము ,వెండి, వజ్రము మొ|| తొమ్మిది రకముల మణుల చేతను ,భక్ష్య పూర్ణములైన (అనగా భోజనము చేయు పాత్రలు అంటే పళ్ళెములు ) పాత్రలు చేతి యందు ఉంచుకొని నూట ఎనిమిది ప్రదక్షిణములు అశ్వత్ధ వృక్షము దగ్గర ఉంచిన ఈ వస్తువులు గురువుకు ఇచ్చి సోమ ప్రీతీ కొరకు ముత్తైదువులను పూజించి బ్రాహ్మణులను పాయసము మొదలగు పిండి వంట పదార్ధములచే బ్రాహ్మణులను తృప్తి పరచి ఆ తరువాత మౌనముగా (అనగా ఏమి మాట్లాడక ) తాను తినవలెను . ఓ ధర్మరాజా ! ఈ ఉత్తమమైన వ్రతమును నీవు కూడా నీ భార్య యైన ద్రౌపది చేత చేయించినచో ,వారి బిడ్డలు దీర్ఘాయులై ఉందురు అన్న భీష్మునితో ధర్మరాజు ఇలా పలుకు తున్నాడు. ఓ పితామహా ! బంగారు ఆభరణములు మొ || వి లేని స్త్రీలకు ఈ వ్రత ఫలమును సంపూర్ణముగా ఎలా లభించును అనిన విని భీష్ముడు ఇలా అంటున్నాడు .ఓ పాండు నందనా ! పూవులు ,పండ్లు,పాయసాన్నముల ద్వారా ప్రదక్షిణము చేసినచో వారికి దరిద్రము అంతా నశించి పూర్ణ (మొత్తము ) ఫలమును పొందుదురు. ఇలా వ్రతమును స్త్రీ లందరూ ఆచరింప వచ్చును . దేవదేవుడైన శ్రీ మహా విష్ణువుకు ఇష్టమైన ఈ వ్రతమును ఏ 'స్త్రీ ' తన భర్త ,బిడ్డల కొరకు ఈ వ్రతమును ఆచరించునో (చేయునో ) ఆమె కోరికలు అన్నియు నెరవేరును. దీనికి ఉద్యాపన విధము కూడా ఉన్నది.


ఇది చేయని వారికి వ్రతము సంపూర్ణము కాదు .అష్ట దళ పద్మము ఏర్పరిచి దాని యందు పన్నెండు కలశములను ఉంచి, శక్తికి మించకుండా బంగారముచేత అశ్వత్ధ (రావి చెట్టు ) వృక్షమును దాని అడుగున నాలుగు చేతులతో కూడిన లక్ష్మీ నారాయణుల బొమ్మను ,బ్రహ్మ శివుడు మొ || దేవతా మూర్తులను ,ప్రత్యేకముగా చేయించి అందు శ్రీ మహావిష్ణువు మొదలైన దేవతలను ఆవాహనము ,మొ ||న షోడశోపచార పూజించి వారి వైభవము కొలది ధూప దీప నైవేద్యములు ఇచ్చి ,రాత్రి పురాణము చదువుచూ జాగరణము చేసి ,మరునాడు ఉదయమున (ప్రొద్దున్న ) అశ్వత్ధ (రావిచెట్టు ) ఆకుల చేతను ,పాయసము చేతనైననూ ,ప్రణవ మంత్రము అనగా ఓంకార చేత నైననూ ,హోమ కుండము (అనగా యజ్ఞము చేయుటకు వీలైన మండపము ) ఏర్పరిచి (దీనిని ఇటుకలతో నాలుగు వైపులా కట్టి అమర్చుతారు ) త్రిమూర్తి స్వరూపుడైన ఆశ్వత్ధుని కడకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మూర్తి స్వరూపమైన అశ్వత్ధ వృక్షము కొరకు పూర్ణాహుతి గావించి (అనగా యజ్ఞ కుండములో వేయు పదార్దములు వేసి ) తరువాత గోవులు గురువుకు ఇచ్చి, బ్రహ్మ పూజ చేసి ,బ్రహ్మ విష్ణువుల (ద్వాదశ ) పన్నెండు కలశములను బ్రాహ్మణులకు ఇయ్యవలెను . ఇలా కలశ దానములు చేసి ,పాయసము, పిండి వంటలచే బ్రాహ్మణులను తృప్తి పరచి వస్త్రములు , దక్షిణ( అనగా తమ శక్తి కొలది పైసలు ) ఇచ్చి సాష్టాంగ నమస్కారము అనగా (వ్యక్తి తాను ఎడమకాలిపై కుడి కాలు పెట్టి వంగి రెండు చేతులతో నమస్కారము చేయుట ) ఇలా చేసి ,వారి ఆశీర్వాదం పొంది తరువాత తాను 'భోజనం ' చేయవలయును.
ఇలా పన్నెండు సంవత్సరములలో ఎప్పుడైనా ఉద్యాపనము చేసినచో ఈ వ్రతము యొక్క ఫలము సంపూర్ణముగా లభించును. అని 'భీష్ముడు' చెప్పగా విని 'ధర్మరాజు ' ఉత్తర మొ || వారిచే చేయించి నందు వలన ఉత్తర కొడుకైన అభిమన్యుడు మొ || వారు అభివృద్ధి చెంది విలసిల్లెను . ఇది భవిష్యత్తు పురాణములోని సోమవార వ్రతము.




No comments:

Post a Comment