భూశుద్ధి :
ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్ధి చేసి,అలికి,బియ్యపు పిండితోగాని,రంగుల చూర్ణములతోగాని,ముగ్గులుపెట్టి,దైవస్థాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి.పీట మరీ ఎత్తుగాని, మరీ పల్లముగానీ ఉండకూడదు.పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపురాసి,కుంకుంమతో బొట్టు పెట్టి,వరిపిండి (బియ్యపుపిండి) తో ముగ్గు వేయాలి. సాధారణంగా అష్టదళ పద్మాన్నే వేస్తారు.పూజచేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి.ఏ దైవాన్ని పూజింపబోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమనుగాని, చిత్రపతమునుగాని, ఆ పీట పై ఉంచాలి.ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి (పసుపును షుమారు అంగుళం సైజులో త్రికోణ ఆకృతిలో ముద్దగా చేసి),దానికి కుంకుమ బొట్టు పెట్టి,పిదప ఒక పళ్లెంలోగాని,క్రొత్త తుండు గిద్ద మీద గాని బియ్యం పోసి దానిపై ఒక తమలపాకు నుంచి,అందు పసుపు గణపతి నుంచి అగరువత్తులు వెలిగించాలి.ఇప్పుడు పూజకు కావలసిన వస్తువులను అమర్చుకోవాలి.దీపారాధన నైరుతి దిశలో చేయవలెను.
దీపారాధనకు కావలసిన వస్తువులు - దీపారాధన విధానము
దీపారాధన చేయుటకు కుంది (ప్రమిద) వెండిది గాని,ఇత్తడిదిగాని,మట్టిది గాని వాడవచ్చును.కుందిలో 3 అడ్డవత్తులు 1 కుంభవత్తి (మధ్యలో)వేసి నూనెతో తడుపవలెను. ఇంకొక అడ్డవత్తి నూనెతో తడిపి ఏకహారతిలో (కర్పూర హారతికి వాడే వస్తువు)వేసి ముందుగా ఏకహరతిలో వేసిన వత్తిని అగ్గిపుల్లతో వెలిగించి,వెలిగించిన వత్తితో కుందిలోని 1 అడ్డవత్తి 1 కుంభవత్తి వెలిగించవలెను.తర్వాత చేయి కడుక్కుని నూనె కుంది నిండావేసి పిదప ఆ కుందికి మూడుచోట్ల కుంకుమ అలంకారము చేయవలెను. తర్వాత అక్షతలు వేసి దీపారాధనను లక్ష్మీ స్వరూపముగా భావించి నమస్కారము చేయవలెను.కుందిలో మిగిలిన రెండు అడ్డవత్తులు పూజా సమయంలో ధూపము చూపిన తరువాత దీపము చూపించుటకు వాడవలెను.దీపారాధనకునువ్వులనూనెగాని,కొబ్బరినూనెగాని,ఆవునెయ్యి గాని వాడవచ్చును.ఈ విధంగా దీపం వెలిగించి ఘంటను వాయిస్తూ నమస్కరించి ఈ క్రింది శ్లోకమును చదువుకొనవలెను.
ఘంటానాదము:
శ్లో || ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసామ్
కుర్యాద్ఘంటారవం తత్ర దేవతాహ్వ హన లాంచన మ్
మనము ఆచమనము చేసినటువంటి పంచపాత్రలోని నీళ్ళు దేవుని పూజకు వినియోగించరాదు.పూజకు విడిగా ఒకగ్లాసుగాని,చెంబుగాని తీసుకొని దానిలో శుద్ధ జలమును పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆ నీళ్ళు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించవలెను.
ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్ధి చేసి,అలికి,బియ్యపు పిండితోగాని,రంగుల చూర్ణములతోగాని,ముగ్గులుపెట్టి,దైవస్థాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి.పీట మరీ ఎత్తుగాని, మరీ పల్లముగానీ ఉండకూడదు.పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపురాసి,కుంకుంమతో బొట్టు పెట్టి,వరిపిండి (బియ్యపుపిండి) తో ముగ్గు వేయాలి. సాధారణంగా అష్టదళ పద్మాన్నే వేస్తారు.పూజచేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి.ఏ దైవాన్ని పూజింపబోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమనుగాని, చిత్రపతమునుగాని, ఆ పీట పై ఉంచాలి.ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి (పసుపును షుమారు అంగుళం సైజులో త్రికోణ ఆకృతిలో ముద్దగా చేసి),దానికి కుంకుమ బొట్టు పెట్టి,పిదప ఒక పళ్లెంలోగాని,క్రొత్త తుండు గిద్ద మీద గాని బియ్యం పోసి దానిపై ఒక తమలపాకు నుంచి,అందు పసుపు గణపతి నుంచి అగరువత్తులు వెలిగించాలి.ఇప్పుడు పూజకు కావలసిన వస్తువులను అమర్చుకోవాలి.దీపారాధన నైరుతి దిశలో చేయవలెను.
దీపారాధనకు కావలసిన వస్తువులు - దీపారాధన విధానము
దీపారాధన చేయుటకు కుంది (ప్రమిద) వెండిది గాని,ఇత్తడిదిగాని,మట్టిది గాని వాడవచ్చును.కుందిలో 3 అడ్డవత్తులు 1 కుంభవత్తి (మధ్యలో)వేసి నూనెతో తడుపవలెను. ఇంకొక అడ్డవత్తి నూనెతో తడిపి ఏకహారతిలో (కర్పూర హారతికి వాడే వస్తువు)వేసి ముందుగా ఏకహరతిలో వేసిన వత్తిని అగ్గిపుల్లతో వెలిగించి,వెలిగించిన వత్తితో కుందిలోని 1 అడ్డవత్తి 1 కుంభవత్తి వెలిగించవలెను.తర్వాత చేయి కడుక్కుని నూనె కుంది నిండావేసి పిదప ఆ కుందికి మూడుచోట్ల కుంకుమ అలంకారము చేయవలెను. తర్వాత అక్షతలు వేసి దీపారాధనను లక్ష్మీ స్వరూపముగా భావించి నమస్కారము చేయవలెను.కుందిలో మిగిలిన రెండు అడ్డవత్తులు పూజా సమయంలో ధూపము చూపిన తరువాత దీపము చూపించుటకు వాడవలెను.దీపారాధనకునువ్వులనూనెగాని,కొబ్బరినూనెగాని,ఆవునెయ్యి గాని వాడవచ్చును.ఈ విధంగా దీపం వెలిగించి ఘంటను వాయిస్తూ నమస్కరించి ఈ క్రింది శ్లోకమును చదువుకొనవలెను.
ఘంటానాదము:
శ్లో || ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసామ్
కుర్యాద్ఘంటారవం తత్ర దేవతాహ్వ హన లాంచన మ్
మనము ఆచమనము చేసినటువంటి పంచపాత్రలోని నీళ్ళు దేవుని పూజకు వినియోగించరాదు.పూజకు విడిగా ఒకగ్లాసుగాని,చెంబుగాని తీసుకొని దానిలో శుద్ధ జలమును పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆ నీళ్ళు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించవలెను.
గరుడుని (ఏ వ్రతమును (పూజను) ఆచరించుచున్నామో ఆదేవుని యొక్క బొమ్మ (ప్రతిమ) (తమ శక్తి కొలది బంగారముతో నైనను,వెండితో నైనను,లేక మట్టితో నైనను తీసుకోనవెను). లేదా చిత్రపటము,మండపమునకు మామిడి ఆకులు,అరటి మొక్కలు,కొబ్బరికాయలు,పళ్ళు,పువ్వులు,పసుపు,కుంకుమ,గంధం,హారతి కర్పూరం, అక్షతలు,అగ్గిపెట్టె,అగరువత్తులు,వస్త్ర,యజ్ఞోపవీతములు,తోరణములు (తెల్లని దారమునకు పసుపురాసి 9 వరుసలు (పోగులు) వేసి 9 చోట్ల పువ్వులతో కట్టి,ఈ తోరములను గరుడునికి పూజచేసి పూజచేసిన వారందరూ తమ కుడిచేతికి ధరిస్తారు). ప్రత్యేక నివేదన (పిండివంటలు)పిమ్మట యజమానులు (పూజచేసేవారు) ఈ దిగువ కేశవనామాలను స్మరిస్తూ ఆచమనం చేయాలి. ఈ నామాలు మొత్తం 24 కలవు.
1 . "ఓం కేశవాయ స్వాహ" అని చెప్పుకుని చేతిలో నీరు తీసుకొని లోనికి తీసుకోవాలి.
2 . "ఓం నారాయణాయ స్వాహ" అనుకుని ఒకసారి
3 ." ఓం మాధవాయ స్వాహ "అనుకుని ఒకసారి జలమును పుచ్చుకోవలెను.తరువాత
4 . "ఓం గోవిందాయ నమః"అని చేతులు కడుగుకోవాలి.
5 . "ఓం విష్ణవే నమః" అనుకుంటూ నీళ్ళు త్రాగి,మధ్యవ్రేలు,బొటన వ్రేళ్ళతో కళ్ళు తుడుచుకోవాలి.
6 ." ఓం మధుసూదనాయ నమః" అని పైపెదవిని కుడునుంచి ఎడమకి నిమురుకోవాలి.
7 . "ఓం తివిక్రమాయ నమః" క్రింది పెదవిని కుడినుంచి ఎడమకి నిమురుకోవాలి.
8 . 9 . "ఓం వామనాయ నమః" " ఓం శ్రీధరాయ నమః" ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్ళు చల్లుకోవాలి.
10 . ఓం హృషీకేశాయ నమః ఎడమ చేతితో నీళ్ళు చల్లాలి.
11 .ఓం పద్మనాభాయ నమః పాదాలపై ఒకొక్క చుక్క నీరు చల్లుకోవాలి.
12 . ఓం దామోదరాయ నమః శిరస్సుపై జలమును ప్రోక్షించుకోవలెను.
13 . ఓం సంకర్షనాయ నమః చేతివేళ్లు గిన్నెలా వుంచి గడ్డము తుడుచుకోవలెను.
14 . ఓం వాసుదేవాయ నమః వ్రేళ్ళతో ముక్కును వదులుగా పట్టుకోవలెను.
15 . 16 . ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః నేత్రాలు తాకవలెను.
17 . 18 . ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః రెండు చెవులూ తాకవలెను.
19 . 20 . ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః బొడ్డును స్ప్రుసించవలెను
21 . ఓం జనార్ధనాయ నమః చేతివేళ్ళతో వక్షస్థలం,హృదయం తాకవలెను.
22 . ఓం ఉపేంద్రాయ నమః చేతి కొనతో శిరస్శు తాకవలెను.
23 . 24 ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః కుడి మూపురమును ఎడమచేతితోను,ఎడమ మూపురమును కుడుచేతితోను ఆచమనము చేసిన తరువాత ఆచమనము చేసి,వెంటనే సంకల్పము చేప్పుకోవలెను.
ఆచమనము అయిన తరువాత,కొంచెం నీరు చేతితో పోసుకొని నేలపై చిలకరించుతూ ఈ శ్లోకమును పటింపవలెను.
శ్లో || ఉత్తిష్టంతు భూత పిశాచాః యే తే భూమిభారకాః
యే తే షామ విరోధేనా బ్రహ్మ కర్మ సమారభే ||
ప్రణాయామమ్యః
ఓం భూ: - ఓం భువః ఓంసువః - ఓం మహః - ఓం జనః - ఓం తపః -ఓగ్ o సత్యం - ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీ మహీధీ యోయోనః ప్రచోదయాత్ - ఓం ఆపోజ్యోతిర సోమృతం బ్రహ్మభూర్భువ స్సువరోం అని సంకల్పము చేప్పుకోనవలెను.
సంకల్పము:
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్ధిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే ఆద్య బ్రహ్మణః (ఇక్కడ శ్రీమహవిష్ణో రాజ్ఞాయ అని కూడా చెప్పవచ్చు) ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరత ఖండే మేరో ర్ధక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే (మనకు శ్రీ శైలము ప్రధాన క్షేత్రము కావున మనము శ్రీశైలమునకు ఏ దిక్కున ఉన్నామో అ దిక్కు చేప్పుకొనవలెను),కృష్ణా గోదావర్యో: మధ్య ప్రదేశే (మనం ఏ ఏ నదులకు మధ్యన ఉన్నామో ఆయా నదుల పేర్లు చేప్పుకొనవలెను),శోభన గృహే (అద్దె ఇల్లు అయినచో వసతి గృహే అనియు,సొంత ఇల్లుయినచో స్వగృహే అనియు చేప్పుకొనవలెను). సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన .................... సంవత్సరే, (సంవత్సరమునకు రెండు ఆయనములు- ఉత్తరాయనము, దక్షిణాయనము. జనవరి 15 మకర సంక్రమణం మొదలు జులై 14 కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణం,జులై 15 కర్కాటక సంక్రమణం నుండి మరల జనవరి 14 పెద్ద పండుగ అనగా మకర సంక్రమణం వరకు దక్షిణాయనం .పూజచేయునపుడు ఏ ఆయనము జరుగుచున్నదో దానిని చెప్పవలెను).......... ఋతు:, (వసంత,గ్రీష్మ,వర్ష మొ||ఋతువులలో పూజ సమయములో జరుగుచున్న ఋతువు పేరు) ..........మాసే,(చైత్ర ,వైశాఖ మొ|| పన్నెండు మాసములలో పూజ సమయములో జరుగుచున్న మాసంపేరు) ..............పక్షే,(నెలకు రెండు పక్షములు పౌర్ణమికి ముందు శుక్ల పక్షము,అమ్మవాస్యకు ముందు కృష్ణ పక్షములు వీటిలో పూజ జరుగుతున్నసమయమున గల పక్షము పేరు)..........తిథౌ,(ఆరోజు తిథి) ............వాసరే (ఆరోజు ఏ వారమన్నదీ చెప్పుకొని) శభ నక్షత్రే,శుభ యోగే ,శభ కరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీగరుడ ముద్దిస్య శ్రీగరుడ ప్రీత్యర్ధం పురుషులైనచో శ్రీమాన్ ......గోత్రస్య ........నామధేయః, శ్రీమత్యః,గోత్రస్య,నామధేయస్య అనియు,స్త్రీ లైనచో శ్రీమతి,గోత్రవతి,నామధేయవతి,శ్రీమత్యాః, గోత్రవత్యాః,నమధేయవత్యాః అనియు (పూజచేయువారి గోత్రము,నామము చెప్పి) నామధేయస్యః ధర్మపత్నీ సమేతస్య (పురుషులైనచో) మమ సహకుటుంబస్య,క్షేమ స్థైర్య వీర్య విజయ
అభయఆయురారోగ్య ఐశ్వర్యాభి వ్రుద్ధ్యర్ధం ,ధర్మార్ధ కామ మోక్ష ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం,పుత్రపౌత్రాది వ్రుద్ధ్యర్ధం సకలవిధ మనోవాంచాఫల సిద్ధ్యర్ధం, శ్రీగరుడ ముద్దిశ్య గరుడ ప్రీత్యర్ధం (ఏ దేవుని పూజించుచున్నామో ఆ దేవుని యొక్క పేరు చెప్పుకొని) సంభవద్భి రుపచారై: సంభావతానియమేనా సంభావతా ప్రకారేనా యావచ్చక్తి (నాకు తోచినరీతిలో, నాకు తోచిన నియమములతో,నాకు తోచిన విధముగా,భక్తి శ్రద్ధలతో సమర్పించుకొంటున్న పూజ) ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. తధంగ కలశ పూజాం కరిష్యే || పిదప కలశారాధనను చేయవలెను.
కలశ పూజను గూర్చిన వివరణ :
వెండి,రాగి,లేక కంచు గ్లాసులు (లేదా పంచపాత్రలు) రెండిటిలో శుద్ధ జలమును తీసుకొని ఒకదానియందు ఉద్ధరిణినీ,రెండవ దానియందు అక్షతలు,తమలపాకు,పువ్వు ఉంచుకొనవలెను. రెండవ పాత్రకు బయట మూడు వైపులా గంధమును వ్రాసి కుంకుమను గాని పూయరాదు. గంధమును ఉంగరపు వేలితో పూయవలెను.కుంకుమ అక్షతలు వగైరా బొటన,మధ్య,ఉంగరపు వ్రేళ్ళను కలిపి సమర్పించవలెను.యజమానులు (ఒక్కరైతే ఒకరు,దంపతులైతే ఇద్దరూను) ఆ కలశాన్ని కుడిచేతితో మూసిఉంచి, ఇలా అనుకోవాలి.ఈ విధముగా కలశమును తయారు చేసి పూజను చేయునప్పుడు మొదటగా ఈ శ్లోకమును చదువవలెను.
మం|| కలశస్య ముఖే విష్ణు: కంటే రుద్రా స్సమాస్శ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాత్రు గనాస్మ్రుతాః||
ఋగ్వేదో థ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః
అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః
శ్లో || గంగైచ యమునే చైవ కృష్ణే ,గోదావరి,సరస్వతీ,
నర్మదా సింధు కావేర్యౌ జలే స్మిన్ సన్నిధింకురు ||
ఇక్కడ ఇలా శ్లోకము ముగిసిన తరువాత ఆయాతు శ్రీగరుడ (ఎ దేవుని పూజైతే చేస్తున్నామో ఆ దేవుని పేరును చెప్పవలెను)పూజార్ధం మమ దురితక్షయ కారకాః కలశోదకేనా ఓం దేవం సంప్రోక్ష్య (కలశ మందలి ఉదకమును దేవుని పై చల్లాలి),ఓం ఆత్మానం సంప్రోక్ష్య అని (ఆ నీటిని తనపై చల్లుకోవాలి) ఓం పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య (పూజా ద్రవ్యములపై కూడా చల్లాలి) కలశమందలి నీటిని పై మంత్రం చదువుతూ పువ్వుతో గాని,ఆకుతో గానీ,చల్లాలి.
మార్జనము
ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావ స్థాంగ తోపివా
యస్స్మరే త్పుండరీ కాక్షం సబాహ్యభ్యంతర శ్శుచి:||
అని పిదప కాసిని అక్షతలు,పసుపుగణపతి పై వేసి,ఆయనకు తాకి నమస్కరించి ప్రాణ ప్రతిష్టాపన చేయవలెను.ప్రాణప్రతిష్టాపన అనగా శ్రీ మహాగణాధిపతయేనమః ప్రాణప్రతిష్టాపన ముహూర్త స్సుముహూర్తోస్తూ తథాస్తు. తరువాత ఇలా చదువుతూ విఘ్నేశ్వరునికి నమస్కారించవలెను.
శ్లో|| శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వవిఘ్నోపశాంతయే
సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః
లంబోదర శ్చ వికటో విఘ్నరాజో వినాయకః
ధూమకేతు ర్గనాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్సూర్పకర్ణో హేరంబః స్కంధః పూర్వజః
షోడ శైతాని నామాని యః పటే చ్చ్రుణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్త స్య నజాయతే ||
పిదప షోడశోపచార పూజను చేయవలెను.షోడశోపచారములనగా ఆవాహన,ఆసనం,అర్ఘ్యం,పాద్యం,ఆచమనీయం,స్నానం,వస్త్రం,ధూపం,దీపం,నైవేద్యం,తాంబూలం,నమస్కారం,ప్రదక్షిణములు మొదలగునవి.
షోడశోపచార పూజ ప్రారంభః
ధ్యానం:
శ్లో || ఏవంగుణ విశేషణ విశిష్టాయాం! శుభ తిథౌ! అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ఆయురారోగ్య
ఇశ్వర్యాభి వ్రుద్ధ్యర్ధం, పుత్రపౌత్రాభి వ్రుద్ధ్యర్ధం,దీర్ఘ సువాసినీ త్వసిద్ధ్యర్ధం సమస్త మంగళా వాప్యర్ధం వర్షే వర్షే ప్రయుక్త ఫణీ గౌరీ దేవతా ముద్దిశ్య
ఫణిగౌరీ దేవతా ప్రీత్యర్ధం గౌరీ పూజాం కరిష్యే ||
ఆదౌ కలశ గణపతి పూజాం కృత్వా ||
ఓం శ్రీ గరుడ నమః ధ్యాయామి - ధ్యానం సర్పయామి అని గరుడ దేవుని మనస్సున ధ్యానించి నమస్కరించవలెను.
ఆవాహనం :
ఆగచ్చ దేవదేవేశ శంకరార్ధ శరీరిణీ|
ఆవాహయామి భక్త్యాత్వాం ఫణి గౌరీ నమస్తుతే ||
ఓం శ్రీ గుడాయ నమః ఆవాహయామి. ఆవాహనార్ధం అక్షతాం సమర్పయామి.అనగా మనస్పూర్తిగా దేవుని మన ఇంట్లోకి ఆహ్వానించడం.అట్లు మనస్సున స్మరిస్తూ అక్షతలు దేవుని పై వేయవలెను.
ఆసనం :
శ్లో || మాణిక్య వజ్ర వైడూర్య నీలరత్నాది శోభితం
రత్న సింహాసనం దివ్యం గృహాణ పరమేశ్వరీ ||
ఓం శ్రీగరుడానమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి.సింహాసనార్ధం అక్షతాం సమర్పయామి.దేవుడు కూర్చుండుటకై మంచి బంగరుపీట వేసినట్లు అనుకుంటూ అక్షతలు వేయవలెను.
అర్ఘ్యం :
శ్లో || గంగాగోదావరీ తోయం కృష్ణవేణీ సముద్భవం|
అర్ధ్యం దాస్యామితే దేవి ఫణిగౌరి, నమోస్తుతే ||
ఓం శ్రీగరుడాయ నమః హస్తౌ: అర్ఘ్యం సమర్పయామి. దేవుడు చేతులు కడుగుకొనుటకై నీళ్లిస్తున్నానని మనసున తలుస్తూ,ఉద్ధరిణితో నీరు వేరొక గిన్నెలో వదలవలయును.
పాద్యం:
శ్లో || సుశీతలం జలంరమ్యం కర్పూరాగరు శోభితం |
ఇదం పాద్యం మయాదత్తం స్వీకురుష్వ సురేశ్వరి ||
ఓం శ్రీ గరుడాయ నమః పాదౌ : పాద్యం సమర్పయామి.దేవుడు కాళ్లు కడుగుకొనుటకు నీరు ఇస్తున్నామని మనసున అనుకుంటూ ఫ్పువ్వుతో పంచపాత్రలోని నీరు అదే గిన్నెలో ఉద్ధరిణెతో వదలవలెను.
ఆచమనీయం :
శ్లో || ఫణిగౌరి నమస్తుభ్యం శుభ్రం జలమనుత్త మం
ఆచమ్యతాం మహాదేవి పరచాభ వమే సదా ||
ఓం శ్రీ గరుడాయ నమః ఆచమనీయం సమర్పయామి.అంటూ దేవుని ముఖము కడుగుకొనుటకై నీళ్లిస్తున్నామని మనమున తలుస్తూ పైన చెప్పిన పాత్రలో ఉద్ధరిణెతో ఒకమారు నీరు వదలవలెను.
సూచన :
అర్ఘ్యం,పాద్యం,ఆచమనం మొదలగు వాటికి ఉద్ధరిణెతో నీరు వేరొక పాత్రలో వదలవలెను.అరివేణం (పంచపాత్రకు క్రిందనుంచు పళ్లెము)లో వదలరాదు.
మధుపర్కం :
శ్లో || మధుపర్కం ప్రదాస్యామి దధి శర్కర సయుతం |
భక్త్యా మయార్పితుం దేవి ఫణిగౌరి నమోస్తుతే ||
ఓం శ్రీ గరుడాయ నమః మధుపర్కం సమర్పయామి అని స్వామివారికి స్నానం చేయుటకు వస్త్రమిచ్చుచున్నామని తలుస్తూ,ఈ మధుపర్కంను ఆయన ప్రతిమకు అద్దవలెను.(ప్రత్తిని పెద్ద బొట్టుబిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆపైన రెండువైపులా పసుపులో అద్ది ఉంచుకొన్నదాన్ని మధుపర్కం అంటారు).
పంచామృత స్నానం :
శ్లో || పయోదధి సమాయుక్తం ఘ్నత శర్కర సంయుతం
పంచామృతై స్స్నాన మిదం గృహాణా సురమర్ధిని
ఓం శ్రీ గరుడాయ నమః పంచామృత స్నానం సమర్పయామి
అని స్నానమునకు పంచామృతములతో కూడిన నీరు ఇచ్చునట్లు భావించి ఆవునెయ్యి,ఆవుపాలు,ఆవుపెరుగు,తేనె,పంచదార కలిపిన పంచామృతమును స్వామిపై ఉద్ధరిణెతో చల్లవలెను.
శుద్దోదక స్నానం :
శ్లో || అపోహిష్టేతి, శుద్దోదక స్నానం||
ఓం శ్రీగరుడాయ నమః శుద్దోదక స్నానం సమర్పయామి.
పంచపాత్రలోని శుద్ధ నీటిని పువ్వుతో దేవునిపై చల్లవలెను.
వస్త్రయుగ్మం:
శ్లో || రక్త పీత మయా వస్త్రం దుకూలాంచ మనోహరం
మయాదత్త మిదం వస్త్రం ధార్యతాంభండ మర్దినః ||ఓం గరుడాయనమః వస్త్ర యుగ్మం సమర్పయామి.(యుగ్మమనగా రెండు) అనుచు వస్త్రమును (పత్తిని పెఅద్దబొట్టుబిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆపైన రెండు వైపులా కుంకుమతో అద్దినచో అది వస్త్రమగును.ఇటువంటివి రెండు చేసుకొనవలెను ) స్వామివారి ప్రతిమకు అద్దవలెను.
యజ్ఞోపవీతం :
శ్లో || బ్రహ్మం సూత్రం శుభ్ర మిదం త్రిగుణం త్రిగ్గుణై ర్యుతం
బ్రహ్మగంది యుతం దేవి ధారయ స్వమహేశ్వరీ ||
ఓం శ్రీగరుడాయ నమః ఉపవీతం సమర్పయామి
అనగా జందెమును ఇవ్వవలెను.ఇదియును ప్రత్తితో చేయవచ్చును.ప్రత్తిని తీసుకొని పసుపుచేత్తో బొటన వ్రేలు,మధ్య వ్రేలితో మధ్య మధ్య నలుపుతూ పొడువుగా చేసి, కుంకుమ అద్దవలెను.దీనిని పురుషదేవతా పూజకు మాత్రమే సమర్పించవలెను.
గంధం:
శ్లో || శ్రీగంధం మిశ్రం స్తూర్యాది సమన్వితం |
గంధం గృహాణ దేవేశి మయాదత్తం మిదంశుభే ||
ఓం శ్రీగరుడాయ నమః గంధాన్ సమర్పయామి.
ముందుగా తీసిపెట్టుకున్న గంధమును కుడిచేతి ఉంగరం వ్రేలితో స్వామివారి ప్రతిమపై చల్లవలెను.
ఆభరణం:
శ్లో || గౌరీ న్ము మాయేతి కుంకుమాది పరిమళ ద్రవ్యాణి చ
ముక్తా మాణిక్య వైడూర్య రత్న హేమాది నిర్మితం దివ్య మాభ
రణం దేవి గిరిజాయై నమోస్తుతే ||
ఓం శ్రీగరుడాయ నమః ఆభరణాన్ సమర్పయామి.
ఆ స్వామికి మనము చేయించిన ఆభరణములను అలంకరించవలెను.లేనిచో అలంకరనార్ధం అక్షతాన్ సమర్పయామి అని అక్షతలు స్వామిపై వేసి ఆభరణాన్ సమర్పయామి అని నమస్కరించవలెను.
అక్షతలు:
శ్లో || అక్షతాన్ద వాళాకారా న్శాతి తండుల మిశ్రితాం |
హరిద్రాచూర్ణ సంయుక్త ప్రీత్యర్ధం ప్రతిగృహ్యాతాం ||
ఓం శ్రీగరుడాయ నమః అక్షతాన్ సమర్పయామి.
(అక్షతలకు బియ్యమును తడిపి పసుపు వేసి కలుపవలెను).అక్షతలు తీసుకొని స్వామివారి ప్రతిమపై చల్లవలెను.
పుష్ప సమర్పణ :
శ్లో || శామంతికావకుళ చంపక పాతలాభై:
పున్నాగ జాజి కరవేరి రసాల పుష్పై:
చిల్వ పరవాల తులసీ దళ మల్లికాద్యై
స్త్వాం పూజయామి జగదీశ్వర తే పదాబ్జే ||
ఓం శ్రీ గరుడాయ నమః పుష్పాణి సమర్పయామి.స్వామివారికి పువ్వులతో అలంకారము చేయవలెను.పువ్వులను స్వామిపై వేసి నమస్కారించవలెను.
పిదప అధాంగ పూజను చేయవలెను.ఈ క్రింది నామాలను చదువుతూ పుష్పములతో గాని,పసుపు కుంకుమలతో గాని స్వామిని పూజించవలెను.
అధాంగ పూజ:
శివాయై నమః పాదౌ పూజయామి
భవాన్యై నమః గుల్ఫౌ పూజయామి
రుద్రాన్యై నమః ఊరూ పూజయామి
సర్వాన్యై నమః జంఘే పూజయామి
సర్వమంగళాయై నమః కటిం పూజయామి
అపర్ణాయై నమః స్తనౌ పూజయామి
మృడాయై నమః కంటం పూజయామి
చండికాయై నమః బాహూ పూజయామి
అర్ఘ్యాయై నమః ముఖం పూజయామి
సత్యై నమః నాసికాం పూజయామి
సునేత్రాయై నమః నేత్రే పూజయామి
సుకర్ణాయైనమః కర్ణౌ పూజయామి
మేనకాత్మజాయై నమః లలాటం పూజయామి
ఫణి గౌర్యై నమః శిరః పూజయామి
మహాగౌర్యై నమః సర్వాణ్యంగాణి పూజయామి
అష్టోత్తర శతనామావళి
ఓం మహాగౌర్యై నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం జగన్మాత్రే నమః
ఓం సరస్వత్యై నమః
ఓం చండికాయై నమః
ఓం లోకజనన్యై నమః
ఓం సర్వదేవాదిదేవతా నమః
ఓం పార్వత్యై నమః
ఓం పటమాయై నమః
ఓం ఈశాయై నమః
ఓం నాగేంద్ర తనయాయై నమః
ఓం సత్యై నమః
ఓం బ్రహ్మచారిన్యై నమః
ఓం శర్వాన్యై నమః
ఓం దేవమాత్రే నమః
ఓం త్రిలోచన్యై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం రౌద్ర్యై నమః
ఓం కాలరాత్ర్యై నమః
ఓం తపస్విన్యై నమః
ఓం శివదూత్యై నమః
ఓం విశాలాక్ష్యై నమః
ఓం చాముండాయై నమః
ఓం విష్ణు సోదర్యై నమఃఓం చిత్కళాయై నమః
ఓం చిన్మకారాయై నమః
ఓం మహిషాసుర మర్ధన్యై నమః
ఓం కాత్యాయన్యై నమః
ఓం కామరూపాయై నమః
ఓం గిరిజాయై నమః
ఓం మేనకాత్మజాయై నమః
ఓం భవాన్యై నమః
ఓం మాతృకాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం రమాయై నమః
ఓం బ్రహ్మస్వరూపిన్యై నమః
ఓం రాజ్యలక్ష్మై నమః
ఓం శివప్రియాయై నమః
ఓం నారాయణ్యై నమః
ఓం మహాశక్త్యై నమః
ఓం నవోడాయై నమః
ఓం భాగ్యదాయియై నమః
ఓం అన్నపూర్ణాయై నమః
ఓం సదానందాయై నమః
ఓం యౌవనాయై నమః
ఓం మోహిన్యై నమః
ఓం జ్ఞానశుద్ధ న్యై నమః
ఓం జ్ఞాన గమ్యాయై నమః
ఓం నిత్యానిత్య స్వరూపిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కమలాకారాయై నమః
ఓం రక్తవర్ణాయై నమః
ఓం కళానిధయే నమః
ఓం మధుప్రియాయై నమః
ఓం కల్యాణ్యై నమః
ఓం కరుణాయై నమః
ఓం జనస్థాయై నమః
ఓం వీరపత్న్యై నమః
ఓం విరూపాక్ష్యై నమః
ఓం విరాదధాయై నమః
ఓం హేమరూపాయై నమః
ఓం సృష్టి సంహార కారిణ్యై నమః
ఓం రంజనాయై నమః
ఓం అనాకారాయై నమః
ఓం పరమేశ ప్రియాయై నమః
ఓం పరాయై నమః
ఓం పుష్పిన్యై నమః
ఓం పురుషాకారాయై నమః
ఓం పురుషార్ధ ప్రదాయిన్యై నమః
ఓం కులిన్యై నమః
ఓం మహారూపాయై నమః
ఓం మహారౌద్ర్యై నమః
ఓం మహాపాతక నాశిన్యై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం వామదేవ్యై నమః
ఓం వరదాయై నమః
ఫాం భయనాశిన్యై నమః
ఓం వాగ్దేవ్యై నమః
ఓం వచస్యై నమః
ఓం వారాహ్యై నమః
ఓం విశ్వమోహిన్యై నమః
ఓం నీలవర్ణాయై నమః
ఓం విశాలాక్ష్యై నమః
ఓం సంపత్ప్రభవే నమః
ఓం ఆర్త దుఃఖచ్చేదదక్షాయై నమః
ఓం అంబాయై నమః
ఓం నిఖిలయోగిన్యై నమః
ఓం సుదాపురస్థాయిన్యై నమః
ఓం తరోర్మూలత లంగతాయై నమః
ఓం హరపాహ సమాయుక్తాయై నమః
ఓం మునిమోక్ష పరావరాయై నమః
ఓం ముక్తాయై నమః
ఓం సురమంత్రాయై నమః
ఓం కరప్రదాయై నమః
ఓం కార్త్యై నమః
ఓం వాగ్దేవ్యై నమః
ఓం క్లీంకార్యై నమః
ఓం సంవిదే నమః
ఓం ఈశ్వర్యై నమః
ఓం హ్రీకారాక్షర బీజాయై నమః
ఓం శాంభవ్యై నమః
ఓం ప్రణవాత్మికాయై నమః
ఓం మహాగౌర్యై నమః
ధూపం:
శ్లో|| ఓం శ్రీ గరుడాయ నమః దూపమాఘ్రాపయామి. ధూపం సమర్పయామి.అంటూ ఎడమచేత్తో గంటవాయిస్తూ కుడిచేత్తో అగరుబత్తిని తిప్పుతూ పొగను స్వామికి చూపవలెను.
దీపం :
శ్లో|| ఓం శ్రీ గరుడాయ నమః సాక్షాత్ దీపం దర్శయామి.
అని మొదట్లో చెప్పిన విధంగా దీపారాధనలో వున్న అదనపువత్తులలో ఒకదానిని తీసుకొని హారతి వెలిగించే దాంట్లో వేసి వెలిగించి గంట మ్రోగిస్తూ ఆ దీపం స్వామికి చూపుతూ పై శ్లోకమును చదువవలెను.
నైవేద్యం:
శ్లో|| ఓం శ్రీ నైవేద్యం సమర్పయామి.
అని ఒక బెల్లం ముక్క ,పళ్ళు,కొబ్బరికాయ మొదలునవి ఒక పళ్లెములోనికి తీసుకొని స్వామివద్దనుంచి దానిపై పువ్వుతో నీళ్లు చల్లుతూ ఎడమ చేత్తో గంటవాయిస్తూ
'ఓం భూర్భువ స్సువః ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి,ధీ యో యోనః ప్రచోదయాత్, సత్యం త్వర్తేన పరిషించామి,(ఋతం త్వా సత్యేత పరిషించామి అని రాత్రి చెప్పవలెను) అమృతమస్తు అమృతో పస్తర ణమసి,ఓం ప్రాణాయ స్వాహా,ఓం అపానాయ స్వాహ,ఓం వ్యానాయ స్వాహ,ఓం ఉదానాయ స్వాహ,ఓం సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటూ ఆరుమార్లు చేతితో (చేతిలోని ఉద్ధరిణెతో) స్వామికి నివేదనం చూపించాలి.పిదప ఓం గరుడాయ నమః నైవేద్యానంతరం 'హస్తౌ ప్రక్షాళ యామి'అని ఉద్ధరిణెతో పంచపాత్రలోని నీరు ముందు చెప్పిన ఆర్యపాత్ర (పంచ పాత్ర కాకుండా విడిగా చెంబులో పెట్టుకొనే నీళ్ల పాత్ర )లో వదలాలి.తరువాత 'పాదౌ ప్రక్షాళయామి' అని మరోసారి నీరు ఆర్ఘ్య పాత్రలో ఉద్ధరిణెతో వదలాలి.పునః శుద్ధచమనీయం సమర్పయామి అని ఇంకొక పర్యాయం నీరు వదలాలి.
తాంబూలం :
శ్లో|| ఓం శ్రీ గరుడాయ నమః తాంబూలం సమర్పయామి
అని చెబుతూ తాంబూలమును (మూడు తమలపాకులు,రెండు పోకచెక్కలు,అరటి పండు వేసి) స్వామివద్ద ఉంచాలి.తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కొనుటకు నీరు ఇస్తున్నామని తలుస్తూ ,'తాంబూల చరవణా నంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి'అంటూ ఉద్ధరిణెతో నీరు ఆర్ఘ్య పాత్రలో వదలాలి.పిమ్మట కర్పూరం వెలిగించి
నీరాజనం:
శ్లో|| ఓం శ్రీ గరుడాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి.
అని కర్పూర బిళ్ళలు ఘారతి కుందిలో వేసి ముందుగా దీపారాధనకు వెలిగించిన దీపంతో వెలిగించి,మూడుమార్లు త్రిప్పుచూ,చిన్నగా ఘంట వాయించవలెను.అనంతరం మళ్లీ పువ్వుతో నీరు హారతి కుంది చివర వదులుతూ 'కర్పూర నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి' అని చెప్పి నీరాజనం స్వామివారికి చూపించి తరువాత ఇంటిలోని వారందరూ హారతిని కళ్ళకు అద్దుకోవాలి. తరువాత అక్షతలు,పువ్వులు,చిల్లర డబ్బులు చేతితో పట్టుకొని,
మంత్రపుష్పం :
శ్లో|| ఓం గరుడాయ నమః యథాశక్తి మంత్ర పుష్పం సమర్పయామి
అని చెప్పుకొని అక్షతలు,పువ్వులు,చిల్లర స్వామివద్ద ఉంచవలెను.పిమ్మట ఈ దిగువ మంత్రం జపిస్తూ మూడుసార్లు ప్రదక్షిణలు చేయాలి.
ప్రదక్షిణం :
శ్లో|| ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ,
నమస్తే విఘ్న రాజయ నమస్తే విఘ్న నాశన ||
శ్లో|| ప్రమధ గణ దేవేశ ప్రసిద్ధే గణనాయక,
ప్రదక్షిణం కరోమి త్వా మీశ పుత్ర నమోస్తుతే ||
శ్లో|| యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
ఓం శ్రీ గరుడాయ నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
శ్రీ స్వామికి చేతిలో అక్షతలు, పువ్వులు, తీసుకొని లేచి నిలబడి మూడుసార్లు ఆత్మా ప్రదక్షిణ చేసి (అనగా తమలో తాము చుట్టూ తిరిగి) పిమ్మట సాష్టాంగ నమస్కారం చేసి (మగవారు పూర్తిగా పడుకుని తలను నెలకు ఆన్చి,ఆడువారు మోకాళ్ల పై పడుకుని కుడికాలు ఎడమ కాలుపై వేసి) తరువాత స్వామిపై చేతిలో నున్న అక్షతలు, పువ్వులు చల్లి మరల తమ స్థానమున ఆసీనులై నమస్కరించుచూ
పునఃపూజ:
ఓం గరుడాయ నమః పునః పూజాంచ కరిష్యే
అని చెప్పుకొని,పంచపాత్రలోని నీటిని చేతితో తాకి,అక్షతలు స్వామిపై చల్లుచూ ఈ క్రింది మంత్రములు చదువుకొనవలెను.
విశేషోపచారములు:
చత్రం ఆచ్చాదయామి,చామరం వీచయామి,నృత్యం దర్శయామి,గీతం శ్రావయామి, వాద్యం ఘోషయామి, సమస్త రాజోపచార,శక్త్యోపచార,భక్త్యోపచార పూజాం సమర్పయామి అనుకొని,నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకమును చదువుకొనవలెను.
పూజాఫల సమర్ఫనమ్:
శ్లో|| యస్య స్మ్రుత్యాచ నామూక్త్యా త పం పూజాక్రియాది షు
యాన సంపూర తాంయతి సద్యోవందే తమచ్యుత మ్
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర |
యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||
అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః శ్రీగరుడ సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు.
ఏతత్ఫలం శ్రీగరుడర్పణమస్తు అంటూ అక్షతలు నీటితోపాటు అరవేణంలో వదలవలెను.పిమ్మట 'శ్రీగరుడ ప్రసాదం శిరసా గృహ్ణామి'అనుకొని స్వామివద్ద అక్షతలు తీసుకొని తమ తమ తలలపై వేసుకొనవలెను.ఆ పిదప పసుపు గణపతిని తీసి దేవుని పీటము పై నుంచవలెను.దీనిని ఉద్వాసన చెప్పటం అంటారు.
ఓం శ్రీగరుడాయనమః యధాస్థానం ప్రవేశయామి. శోభనార్ధం పునరాగమనాయచ అని ఉద్వాసన పలుకుతారు.
పూజావిధానం సంపూర్ణం
తీర్ధ ప్రసాదానమ్:
శ్లో|| అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణమ్ |
సమస్త పాపక్షయకరం శ్రీగరుడ పాదోదకం పావనం శుభమ్ ||
అని తీర్ధమును చేతిలో తీసుకొని మూడుమార్లు నోటిలోనికి తీసుకొనవలెను.
వ్రత కథా ప్రారంభము :
శ్రీ సూతముని శౌనకాది మహర్షులను చూచి ఇలా చెప్పుచుండెను.
'శ్రావణమాస శుద్ధ పంచమి' రోజున సోదరులు (అన్నతమ్ములు)కలవారి చేత పదిసంవత్సరములు చేయతగినది.ఈ వ్రతము చేసినచో స్త్రీలు సుమంగళీత్వమును, సౌభాగ్యమును కలిగి యుందురు.
గరుడపంచమీ వ్రతకల్పము ఈ వ్రత మహత్యమును తెలుపుమని శౌనకాది మునులు అడుగగా శ్రీ సూతుడు దీనిని గూర్చి ఇలాచెప్పెను.అన్నతమ్ములు కలిగి యున్న 'స్త్రీ' శ్రావణశుద్ధ పంచమిరోజున వేకువన (అనగా తెల్లవారుజామున అంటే 4 నుంచి 6 గంటలలోపు) నిద్ర లేచి,పసుపు మొ||గు చందనములతో స్నానము ముగించి శుభ్రమైన వస్తములు ధరించి, చతురస్రమైన మంటపములు ఏర్పరచి (అనగా ఒకపీట వేసి,దానిపై ముగ్గులు పెట్టి,దానికి నాలుగు వైపులా కొబ్బరి ఆకులను లేదా అరటి ఆకులను కట్టి దైవ మంటపములాగ ఏర్పరచవలెను) పువ్వులతో పండ్లతో దానిని అలంకరించవలెను.ఆ పీట పైభాగమున మధ్యలో బియ్యము కాసిని పోసి, స్వర్ణ(బంగారు) రజత (వెండి) తామ్ర (రాగి) మొ||గు వాటితో దేనితో నైనా ద్రవ్యలోపము లేకుండా (అంటే సరిపడినంత ఖర్చుతో) తమ శక్తికి తగినంత సర్పప్రతిమను చేయించి,బియ్యము మీద దానిని ఉంచి,దాని పడగల మధ్యన గౌరీ బింబము (అనగా గౌరిదేవి చిత్రపటము లేక బొమ్మ) ను ఉంచి,ఈ గౌరీదేవిని ధ్యాన,ఆవాహన ఆసన అర్ఘ్య పాద్య గంధ ఆభరణ పుష్ప అక్షతలునూ,ధూప దీప నైవేద్య తాంబూల నీరాజన స్వర్ణ మంత్ర పుష్ప ప్రదక్షిణ నమస్కారములు మొ||గు సర్వ ఉపచారములతో దేవిని సంతోషపరచి,పదిముళ్లు కల దివ్యతోరము (అనగా మంచితోరము) ను పూజించి ఆ తోరము కుడిచేతికి కట్టుకుని, తాంబూలము దక్షిణలతో కూడిన పాయసము మొ||గు పిండి వంటలు భోజనమును బ్రహ్మాణులైన వారికి పెట్టి,తరువాత తానూ భోజనం చేయవలెను.
ఇలా ఏ 'స్త్రీ' పది సంవత్సరములు చేయునో ఆ 'స్త్రీ' కోరికలన్నీ ఫలించి,ఈ ఇహలోకమున భోగులన్ని అనుభవించి, చివరకు మొక్సము పొందును.అని ఈ విధముగా సూతుడు పలుకగా శౌనకాది మహర్షులు మహాత్ముడైన 'గరుడుని' యొక్క జన్మమును (అనగా పుట్టుటను) గూర్చి,అతని పరాక్రమము గూర్చి చెప్పుము అని కోరగా సూతముని ఈ క్రింది విధముగా చెప్పెను.
ఓ మునులారా! పూర్వము బ్రహ్మ కొడుకైన కశ్యపమహర్షి తన భ్యార్యయగు 'సుపర్ణి' అను ఆమె యందు, ధైర్య వీర్య సంపన్నుడు మంచి బలవంతుడు ఐన ;గరుత్మంతుడు ' అను ఒక కొడుకును కనెను.అతడు పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు ఒకనాడు తన తల్లికి వచ్చిన దాస్యత్వము (అనగా మరొకరి పంచన సేవ చేయుచూ కాలము గడుపుట) ను చూచి, ఓ తల్లీ నీకు ఇలాంటి అవస్థ ఎందుకు కలిగినదో చెప్పుము అనగా, ఆమె ఇలా చెప్పెను.
నీ సవతి తల్లీ కొడుకులైన కాకోదరులకు తెచ్చి ఇచ్చినచో నాదాస్యము తొలగును అని చెప్పగా విని, ఆ 'గరుత్మంతుడు' వెంటనే సాక్షాత్తు పుండరీకాక్షుడైన 'శ్రీ మహావిష్ణువు' యొక్క అనుగ్రహము చే ఆకాశ మార్గమంతనూ దాటి,క్షణములో సహస్రాక్షాలయము వెళ్లి, అందు అనేక ద్వారప్రాకారములను చూచి,దాని పొట్టలో రుద్రాక్ష యంత్రముచే రక్షింపబడి ఉన్న, కసీర సాగర సారరక్షకులను శిక్షించి, ఆ అమృతము తీసుకొనివచ్చి,సవతి తల్లి (అనగా తండ్రి ఒక్కడే అతని భార్యలు ఇద్దరు కొడుకుకు తల్లులే అవుతారు)కి ఇచ్చి ఓ తల్లీ! మా అమ్మ దాస్యము విడిపింపుము అని కోరగా విని ద్రువ 'సుపర్ణి' తో ఇలా పలికెను.నీవు నీ ఇష్టము ఉన్నట్లు విహరింపవచ్చును. నీ దాస్యం తొలగి పోయెను.అని దాస్య విముక్తి చేసెను.
'శ్రావణ శుక్ల పంచమి' రోజున అమృతమును అపహరించెను(అనగా దొంగి లించెను) కావున ఆ రోజు 'గరుడపంచమి' అనబడినది.మరియు ఈ వ్రతం ఆచరించువారు (అంటే చేయువారు)ఈ వ్రత కథను చదువువారు, వ్రాసినవారు,వినువారు,ఈ లోకంలో సుఖములు అనుభవించి సకల సామ్రాజ్య లక్ష్మిని చేత ధరించిన వారగుదురు.(అనగా మొత్తం రాజ్యాధికారం ఉన్నవారు అగుదురు.)
ఈ విధముగా సూతుడు చెప్పినది విని శౌనకాది మహర్షులు సంతోషము చెందిరి. ఇట్లు బ్రహ్మాండ పురాణమునందు బ్రహ్మనారద సంవాద రూపము అగు 'గరుడ పంచమీ' వ్రత కథ ముగిసెను.
No comments:
Post a Comment