శని మహాత్మ్యము
శని స్తోత్రము
అస్య శ్రీ శనైశ్చర స్తోత్ర మంత్రస్య దశరథ ఋషి: శనైశ్చరో దేవతాః త్రిష్టుపా ఛందః శనైశ్చర ప్రీత్య ర్దే జపే వినియోగః ||
దశరథ ఉవాచ
శ్లో|| కోణస్థ కో రౌద్ర మాయో థ బభ్రు:
కృష్ణః శని: పింగళ మంద సౌరి:
నిత్యం స్మృతో యో హరతే చ పీడాం
తస్మై నమః శ్రీర వినందనాయ 1
సురాసుర కింపురుషా గణెంద్రా
గంధర్వ విద్యాధర పన్నగాశ్చ
పీడ్యంతి సర్వే విషమ స్థితేన
తస్మై నమః శ్రీర వినంద నాయ 2
నరా నరేంద్రా: పశవో మృగేంద్రా
వన్యాశ్చ యే కీట పతంగ భ్రుంగా:
పీడ్యంతి సర్వే విషమ స్థితేన
తస్మై నమః శ్రీర వినంద నాయ 3
దేవాశ్చ దుర్గాణి వనాని యత్ర
సేనానివేశాః పురపట్టణాని
పీడ్యంతి సర్వే విషమ స్థితేన
తస్మై నమః శ్రీర వినంద నాయ 4
తిలైర్య వై ర్మా ష గుడాన్న దానై
లోహేన నీలాంబర దానతోవా
ప్రీణాది మంత్రై ర్ని జవాసరే చ
తస్మై నమః శ్రీర వినంద నాయ 5
ప్రయాగ తీరే యమునాతటే చ
సరస్వతీ పుణ్యజలే గుహాయామ్
యో యోగినాం ధ్యాన గతోపి సూక్ష్మః
తస్మై నమః శ్రీర వినంద నాయ 6
అస్య ప్రదేశా త్స్వ గృహం ప్రవిష్ట
స్వదీయ వారే సనరః సుఖీ స్యాత్
గృహాద్గ తౌ యోన పునః ప్రయాతి
తస్మై నమః శ్రీర వినంద నాయ 7
స్రష్టా స్వయం భూర్భువ సత్ర యస్య
త్రాతా హరి: శం హరతే పినాకీ
ఏకస్త్రిధా ఋగ్యజు సామమూర్తి
తస్మై నమః శ్రీర వినంద నాయ 8
శన్యష్ట కం యః పటతః ప్రభాతే
నిత్యం సుపుత్రై: ప్రియబాంధ వైశ్చ
పటేచ్చ సౌఖ్యం భువి భోగ యుక్తం
ప్రాప్నోతి నిర్వాణ పదం పరం సః 9
పిప్పాలాదునిచో చేయబడిన దశనామ శనిస్తోత్రము
కోణస్థ పింగళో బభ్రు :
కృష్ణో రౌద్రో న్త కోయయః
సౌరి: శనైశ్చరో మందః 10
పిప్పాలాదేవ సంస్తుతః
పిప్పాలాదేవ సంస్తుతః
ఏతాని దశనామాని ప్రాత రుత్దాయ పటేత్
శనైశ్చర కృతాపీడా
నకదాచి ద్భ విష్యతి 11
ఇతి శ్రీ దశరథ ప్రోక్తం శనైశ్చర స్తోత్రమ్ సంపూర్ణమ్
శ్రీ గురవే నమః
ఇతి శ్రీ దశరథ ప్రోక్తం శనైశ్చర స్తోత్రమ్ సంపూర్ణమ్
శ్రీ గురవే నమః
ఓ
గణనాయకా ఏకదంతా! వరదాయకా! సుందర స్వరూపా! వినాయకా! నీకు
నమస్కరించుచున్నాడను. ఓ బ్రహ్మకుమారీ! హంసారూడీ! వాగీశ్వరీ ! వీణాధారిణీ !
విజయమూర్తీ ! సర్వధా నీకు వందన మాచరించువాడను. ఓ సద్గురువర్యా ! సుఖరూపా!
కరుణాలయా నీపాద పద్మములకు ప్రణమిల్లువాడను. ఓ సాధుపురుషులారా! సదా
మిమ్ము కొనియాడెదను. హి పాడురంగా ! నా భవబంధములను బాపి కరుణతో రక్షింపుము.
మిమ్మందరను నా హృదయ మందిడుకొని ఈ శనిమత్మ్య గ్రంథమును వ్రాయబూసు కొంటిని. ఈ
గ్రంథమును ఎవరైతే భక్తిశ్రద్ధలతో ప్రతిదినము పటింతురో లేక వినియెదరో వారి
మనోవ్యథ దూరమగును. సకల సంకటములు, బాధలు తొలంగును.
కథా ప్రారంభము
ఇమ్మహీమండల
మండనాయ యానంబగు ఉజ్జయినీ పురమును విక్రమార్క మహారాజు పాలించుచుండెను.
ఇట్లుండ నొకనాడుదయ కాలంబున నమ్మహీపాలుండు సేవక జనులు పరివేష్టింప
సామంతరాజులు గొలువ మంత్రులిరుపార్శ్వములయందు గూర్చుండి ప్రభునాజ్ఞకై నెదురు
చూచుచుండ, పండితులు వేదశాస్త్ర పూణేతి హాసంబులు జర్చింపుచుండ, వంది
మాగధులు గొలువ రత్న ఖచితంబగు సింహాసనంబున గూర్చుండి పండితుల వైపుంజూచి
పండితులారా! నవగ్రహములలో శ్రేష్టులెవరు? ఎవరి నెట్లు పూజించవలెనో, మరియు
నేయే గ్రహ ఎట్టి ఫలమొసంగునో తెలియగోరితిని. కావున మీరు చక్కాగా విచారించి
నానతీయుడు. అనిన యచట గూర్చున్న వారిలో నొకరొకరుగా పండితులు ముందునకు వచ్చి
ఇట్లు పలికిరి.
మొదటి పండితుడు
మహీపాలా!
అన్ని గ్రహములలో సూర్యుడే శ్రేష్టుడు. ఏ నరుడైతే భక్తి పూర్వకముగా
సూర్యభగవాను నారాధించునో యాతని విఘ్నములన్నియు దూరమగును. సూర్యదేవుని
స్మరించినంత మాత్రమున ఆదివ్యాధులన్నియు తొలగిపోవును. సకల కోరికలు
సిద్ధించును. సూర్యుడే ముఖ్య దైవము, ఆయనను దప్పనితర దేవతలా గొనియాడుట
వ్యర్ధము. మిగతా గ్రహములన్నియు సూర్యదేవుని యాజ్ఞను పరిపాలించెదరు.
సూర్యుని వంటి బలవంతుడు, తెజోవంతుడును నింకొకరులేరు. సూర్యుడే ప్రత్యక్ష
దైవము, కావున నవగ్రహములలో సూర్యుడే శ్రేష్టుడు. అని యిటులనునంతలో రెండవ
పండితుడు లేచి ఇటుల పలికెను.
రెండవ పండితుడు
గ్రహములన్నింటిలో
చంద్రుడే శ్రేష్టుడు వనస్పతుల నన్నిటిని పోషించు వాడగుటచే చంద్రుడే
పూజ్యుడు. సాక్షాత్ శంకరుడే తన మస్తకమునందాయనను ధరించెను. చంద్రుడ మృతమును
వర్షించి సర్వదేవతలను తృప్తి పరచుచుండెను. మహారూప వంతుడు, పాడారు కళలచే
వెలుగొందువాడు, ఆయన ఎవరిని లక్ష్య పెట్టువాడు కాడు. అందరికిని సౌఖ్యమొన
గూర్చునాడు. నిర్మల హృదయుడు కావున ఆ సోముని పూజించువాడే ధన్యుడు అని పల్కిన
మూడవ పండితుడు ముందుకు వచ్చి ఇటులనెను.
మూడవ పండితుడు:-
భూమీశ్వరా
! నిశ్చిత మనస్కుండ వై వినుము. అన్ని గ్రహములలో కుజుడే గొప్పవాడు. ఆయన
సామర్ధ్యమును వర్ణింపనెవరికిని తరము గాదు. కుజుడు కోపస్వభావము గలవాడు.
పదునైన ఘజ్గముతో సమానుడు. ఆయన మాహత్య మెవరికిని తెలియదు. అందరికంటెను
గొప్పవాడు. ఆయన కులమున క్షత్రియుడు. ఎవ్వరైతే భక్తి పూర్వకముగా
నారాధింతురో వారిని క్రుపాపూర్ణడై సంరక్షించును. ఎవ్వరైతే గర్వపడి ఆయనను
పూచించరో వారిపై కోపము జెంది వారి సర్వస్వమును నాశనము గావించును. అంతేగాక
వారి ప్రాణములను దీయుటకు కూడా వెనుదీయడు. కావున సర్వగ్రహములలో కుజుడే
శ్రేష్టుడని తెలియవలెను. అని కూర్చుండెను.
నాలుగవ పండితుడు
ప్రభువరేణ్యా
బుధుడు చాలా బలవంతుడు. ఆయన ప్రతాపము గూడా అద్భుతమైనది. సర్వగ్రహములకు
శిరోమణి వంటివాడు. ఆయనను పూజించి ఏకార్యమాచరించిననూ నిర్విఘ్నముగా
నెరవేరును. సర్వానందము ప్రాప్తించును. బుదుడెవనిపై ప్రసన్నుడగునో
నాతడైశ్వర్య వంతుడగును. ఈవిధముగా బుధుడు పరోపకారియని తెలియవలెను.
బుధుడుడెవనికైతే నుచ్చస్థానమందుండునో నాతనికి సర్వమనుకూలము గానే యుండును.
బుధునియొక్క బుద్ధి చాలా గొప్పది. ఎవరితోనైననూ నిష్టురములు గర్పింపడు.
సంసార చింతనము గలుగ జేయడు, కావున బుధుడే గొప్పయని చెప్పి గూర్చుండెను.
వేరొక పండితుడు లేచి రాజుతో ఇట్లు పలికెను.
అయిదవ పండితుడు:-
జననాయకా!
గురుడందరికంటే పెద్దవాడు. గురునియొక్క సామర్ధ్యము గొప్పది. గురుని యాజ్ఞ
ఇంద్రాది దేవతలు కూడా శిరసావహింతురు. గురుజ్ఞాన మెవ్వరికిని తెలియదు.
కరుణాసాగరుడు, భక్తులయొక్క కర్మ పుంజములను త్రెంచివేసి భవసాగరము నుండి
తరింపజేయును. గురుని స్మరించిన మాత్రమున దుఃఖము దూరమగును దారిద్ర్యము
తొలగిపోవును, రోగములు విదిపోవును. గురుదే నవగ్రహములలో
శ్రేష్టుడు. గురుడు బ్రాహ్మణ జాతికి జెందినవాడు. గురువాక్యమునందరు
సమ్మతించెదరు. గురుడు జ్ఞానసాగరుడు, సాటిలేనివాడు. ఆయన ఎదుట ఎవ్వరును
పనికిరారు. కావున గురుని పూజించుటచే సర్వగ్రహములు సంతోషించును. సాక్షాత్
శ్రీశంకరుడే గురుని పూజించుచుండ నితరులు లెక్కఏమి? కావున సర్వగ్రహములలో
గురువే పూజ్యుడు అని యూరకుండగా మరొక శాస్త్రజ్ఞుడు ఇటుల పలికెను.
ఆరవ పండితుడు:-
మహారాజా
శుక్రుడే బహుమంచివాడు, రాక్షసులకు నుపకార మొనరించినవాడు. మరణించిన తన
భక్తులను సంజీవిని మంత్రమువలన పునర్జీవితుల గావించిన మహానుభావుడు. ఆయన
కోపించిన త్రిలోకవాసులు భయపడెదరు. ఆయన శక్తి సామర్ధ్యములను వర్ణింప
బ్రహ్మదేవునికైనా నలవికాదు. సర్వదుష్కర్మలను చూర్ణము గావించును. ఆయనను
దలచినంత మాత్రమున సర్వవిఘ్నములు దూరమగును. శుక్రునెవరు పూజింతురో వారికి
శక్తి సామర్ధ్యములు ప్రాప్తమగును. అధివ్యాధులు, దుఃఖ దారిద్ర్యములు
తొలగిపోవును. ఆయనను ఆరాధించినవారికి వారి సర్వాభీష్టములు నెరవేరును. కావున
అందరిలో శుక్రుడే శ్రేష్టుడు అని పలికెను. అందులకు రాజు పండితులారా,
మీరన్నాది నిజమే కాని అందరు శ్రేష్టులే అయిన ఇందులో నెవరిని పూజించవలెను.
అని మరల ప్రశ్నించెను. అంత నింకొక పండితుడు లేచి నిలువంబడి ఇటుల
పలుకచుండును.
ఏడవపండితుడు:-
భూమీశ్వరా!
రాహుకేతువులనువారందిరిలో శ్రేష్ఠులు. వారి చర్యలు మహాద్భుతములు.
వీరిరువురు రాక్షసజాతికి జెందినవారు. వారిని జూచినంత మాత్రమున సూర్య
చంద్రులు గడ గడ వణుకుచుందురు. రాహువు చంద్రుని, కేతువు సూర్యుని పీడించు
చుందురు. అట్టి సమయమున గ్రహణమని యందురు. ఇది మనకందరకు ప్రత్యక్షముగా
కనబడుచుండును. ప్రాణిమాత్రులకు వారిని పూజించుటచే సర్వపీడలు నివారణ
మగుచుండును. వారిరువురి చర్యలొక్కటే. సర్వగ్రహములకంటే వీరతిక్రూరులు,
జనులను మిక్కిలిగా పీడించుచుందురు. కావున ప్రతిదినము రాహుకేతువులను
పూజించుచుండ వలెను, అని పల్కినవిని యింకొక పండితుడు ముందుకు వచ్చి
పలుకసాగెను.
ఎనిమిదవ పండితుడు:-
రాజాధిరాజా!
సహాసాంకా! నే జెప్పునది సావధానముగా వినుడు. అందరిలో శనైశ్చరుడే శ్రేష్టుడు
మరియు నద్భుత బలాడ్యుడు, ఆయన కళ ఎంతవాని కైనను తెలియలేదు. ఆయన కృప ఎవరి
యందుండునో వారిని అన్ని
విధముల సంరక్షించుచుండును. ఆయన గ్రహదిక్పాలకులందరి యందుండును. ఎవరి
యందయితే ఆయనకు కోపమువచ్చునో వారికి నానా విఘ్నములు కలుగునని తెలియవలెను.
వారి సంసారము చెడిపోయిన దన్నమాటే, శనిదేవుడు మహాక్రోధము గలవాడు. ఆయనను
పూజించని వారి కపజయమే సిద్ధించును.
ఆయన
మహాదుఃఖదాయకుడు. శనైశ్చరుడు నల్లని దేహము కలవాడు. కులమున శూద్రుడు పాదముల
కంటి, మంచి స్వరూపము కలవాడు. పూజించిన ఆయననే పూజించవలెను. ఎవరి యందాయన
కోపద్రుష్టి ప్రసరించునో వారిని సర్వనాశనము మొనరించును. కృపాదృష్టి
నిండినవారి యానందమునకు మేర లేకుండును. ఆయన దృష్టి యొక్క చమత్కార మెటువంటి
దనిన
శనైశ్చరుడు
జనించినప్పుడు ఆయన దృష్టి తన తండ్రియగు సూర్యునిపైబడెను. తక్షణమే సూర్యుని
దేహమెల్ల రంధ్రములతో నిండిపోయెను. ఆయ రథసారథి కుంటివాడయ్యెను. గుర్రములు
గ్రుడ్డివాయెను. ఎప్పుడాయన దృష్టి అణుమాత్రము వారినుండి మరలెనో ఆప్పుడువారు
మంచివారైరి. అనిన యాపండితుడు డాడుమాటలను విన్నంతలో విక్రమార్క మహారాజు
నవ్వి ఇట్లనెను. అట్టి అపవిత్రుడగు పుత్రుడు బుట్టి తండ్రి కి యేమి
ప్రయోజనము? వాడు పుత్రుడు కాడు, శత్రువు. పుట్టగానే అంతపని జేసినవాడు,
పెరిగిన వెలకనేమి జేయకుండును? పండితులారా మీరే చెప్పుడు. అని శనైశ్చరు
నెన్నో విధముల తూలయాడెను.
అట్టి
సమయమునందే శనిదేవుడు విమానారూడుడై పోవుచుండి రాజుమాట చెవిని బాడినంతనే
తక్షణము విమానము నుండి దిగి వచ్చెను. అకస్మాత్తుగా రాజసభలోకి వచ్చి
కూర్చుండెను. అది గని పండితులెల్లరు శనిదేవుడు ప్రత్యక్షమయ్యెనని గోలజేయ
మొదలుపెట్టిరి. అంత విక్రమార్కుడు వెంటనే సింహాసనము నుండి దిగివచ్చి
శనైశ్చరుని, పాదంబులకు తన శిరమువంటి మ్రొక్కబోయెను. శనైశ్చరుడా రాజును
కోపద్రుష్టితో చురచురం జూచుచు రాజా నీకింత మదమా? నన్ను నిందజేయుదువా? సరే
నా చమత్కార మిను క్షణమాత్రములో చూపించెదను చూడుము. నీ గర్వమును
పరిహారమొనర్చుటకై కన్యారాశి యందు ప్రవేశించుచున్నానని విమానారూడుడై
వెడలిపోయెను. అంత మహారాజు భిన్నవదనుడై పండితులను జూచి ఈ విధముగా పలికెను.
పండితులారా
ఇప్పుడేమి చేయవలెను? నే నూరకుండక శనిదేవుని అపహాస్య మొనరించితిని. ఆయన
కోపమిను కెపడోపును? నన్ను కష్ట పెట్టక మానడు, ఏది యెట్లు గానున్నాడో
అట్లగును. నా నుదుట నెట్టలు వ్రాసియున్నదో కదా! అని విక్రమార్క మహారాజు
చింతాక్రాంతుడై సభనుండి అంతఃపురమునకు వెడలిపోయెను. సంధ్యా స్నానమాచరించి
భోజనముచేసి మంచముపై శయనించెను. అంత ఒక నెల
No comments:
Post a Comment