Monday, May 19, 2014

ధర్మశాస్త్రం

అమృతం మానవుని దొరకదా? భూమండలం మీద అసలు అమృతం ఉందా?


దూడ అవుదగ్గర పాలు కుడిచేటప్పుడు వచ్చే నురగ అమృతంతో సమానం. ఈ నురగ తీసుకోవడం వలన అనేక రోగాలు చాలావరకు తగ్గిపోతాయి. అమృతం ఇది. ఆయుష్షు పెంచుతుంది.

ఆవు పేడ ఇంట్లో అలకడం వలన, (ఇప్పుడు అన్ని గచ్చు ఇల్లు కనుక ఆవు పేడ తీసుకెళ్ళి ఇంటి మధ్యన వేసి కొంతసేపటి తరువాత తీసేసినా పర్వాలేదు) ప్రమాదకర క్రిములు రావు.

గుమ్మానికి పసుపు రాయడం వలన కూడా క్రిములు రావు.

ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు, బంతిపూలు కట్టడం వలన (ఇది తొందరగా వాడిపోవు కనుక) చెడు శ్వాసలు ఉంటే అవి పీల్చేస్తాయి.

ఇంటికి వచ్చిన అతిథికి "మంచినీరు త్రగుతారా?" అని అడగకుండా (అడగకూడదు) మంచినీరు ఇవ్వాలి.

భోజన సమయానికి వచ్చినవారికి భోజనం పెట్టాలి.

ఇతరులను ఆదరించక పోయినా పర్వాలేదు కాని దూషించకూడదు. అనవసరపు ద్వేషాలు పెంచుకోకూడదు.

ఇంకా అనేకం ఉన్నాయి. కాని వాటికంటే ముందు వరసలో నిలిచే ముఖ్యమైనవి ఇవి. కనుక మార్పు కావాలి అని కోరుకునేవారు ముందుగా వీటితో ప్రారంభించండి.

=======================================

      ఒకరోజు లక్ష్మీదేవి ఆవులమంద ఉన్నచోటికి వెళ్లి నన్ను మీదగ్గర ఉండనివ్వండి అని అడిగింది. గోవులు లక్ష్మిని చూసి నీవు చంచల స్వభావవు. నిన్ను మాదగ్గర ఉండనివ్వడం కుదరదు అని తెల్చి చేప్పాయి. అప్పుడు తన స్వభావాన్ని ఇలా చెప్పింది.

    శౌచం, సత్యం, ధర్మం ఎక్కడ ఉంటాయో అదే నాస్థానం. ఇవి లేనిచోట నేను ఉన్నట్టే ఉంటాను కాని ఉండను. పిసినారి దగ్గర ఉంటాను కాని చూస్తూ చూస్తూ ఏమి తినలేరు, తాగలేరు. ఖర్చుచేయలేరు. రోగం వచ్చిన 100రూపాయలు ఖర్చు చేయడానికి వెనకాడతారు. సుఖంగా జీవించలేరు.

ధనవంతుడు దగ్గర కూడా ఉన్నట్టే ఉంటాను. వీరికి తినాలనే ఉన్నా ఉబ్బసం, ఆయాసం, మధుమేహం లాంటి రోగాలు వీరిని పట్టి పీడిస్తాయి.

అసత్యం పలికేవాడి దగ్గర, అధర్మం చేసేవాడి దగ్గర ఉంటాను. వీరి సంపద ఉంటుంది. ఖర్చు కూడా చేస్తారు. జల్సాలు చేస్తారు. కాకపోతే వీరికి ముందు తరాలు, వెనుకటి తరాలు నానా రకాలుగా బ్రష్టులైపోతారు.

శౌచం లేని వారి దగ్గర ఉంటాను కాని నిత్య దరిద్రులైపోతారు.

పైవారి దగ్గర సంపదల రూపంలో కొన్నాళ్ళు ఉన్నా తరువాత ఆ సంపదలు కూడా హరించేస్తాను. రోగాల రూపంలో, సంతాన రూపంలో అనేక చిత్ర విచిత్రమైన హింసలపాలౌతారు.

అహంకరించే వారిదగ్గర, తల్లిదండ్రులను పట్టించుకోని వారిదగ్గర, వీరి భారాన్ని ఇతరుల పై వేసే వారిదగ్గర, అత్తమామల్ని, కోడళ్ళని, అల్లుళ్ళని ఇల్లరికం తెచ్చుకుని పీడించేవారి దగ్గర, అకారణ నిందలు మోపేవారి దగ్గర, తమ గొప్పలు తామే చెప్పుకునే వారిదగ్గర, కొంచం చేసి ఎక్కువ చేశామని చెప్పుకునే వారిదగ్గర, బ్రాహ్మణులని నిందించే వారి దగ్గర, (కొందఱు బ్రాహ్మణుడు చేడిపోయారని అందరిని నిందించకూడదు. ఎందుకంటే యజ్ఞాయాగాలతోనే లోకాలు సంచలిస్తున్నాయి. వేదాలు చదివిన ఋత్విక్కులే యజ్ఞాలు చేయాలి. లేదంటే అంతా తలక్రిందులు అవుతుంది.), పర స్త్రీని, పరపురుషుడిని కోరే వారిదగ్గర, ఇతరుల సంపదలు కోరేవారిదగ్గర, తండ్రి ఆస్తుల కోసం కొట్టుకు చచ్చే వారిదగ్గర, సంపదల కోసం నానారకాల గడ్డి కరిచే వారిదగ్గర, మూర్కుల దగ్గర, కఠినాత్ముల దగ్గర, అకారణ కలహ ప్రియుల దగ్గర, వీరిదగ్గర నేను శాశ్వతంగా ఉండను. ఒకవేళ తాత్కాలికంగా ఉన్నట్టు కనపడినా అది పూర్వజన్మ కర్మఫలమే కాని శాశ్వతం కాదు, కర్మబంధం తీరిన వెంటనే తొలగిపోతాను. ఇదే నా అస్థిరత్వానికి కారణం అని చెప్పగా గోవులు సంతోషించి లక్ష్మీదేవికి తమలో స్థానాన్ని కల్పించాయి.


మనం పూర్వజన్మలో చేసిన తప్పుల వలన ఇప్పుడు అనుభవిస్తున్న శిక్షలు.

పత్ని యెడల అన్యోన్యతతో చిరకాలం సౌక్యలు అనుభవించిన వ్యక్తి పూర్వం పరకన్యలపై కన్నెత్తి చూడని సత్పురుషుడు. అనుకూలం లేని దాంపత్యంతో అలమటించి అనతికాలంలో భార్యవియోగంతో అలమటించే పురుషుడు ముందు జన్మలో భార్యని ఏమాత్రం సుఖపెట్టని వాడు. మహనీయ విజ్ఞానఖని అయినా లేమితో సతమతమయ్యే వారు పూర్వం సిరిసంపదలు వున్నా దానం మాటే తలపెట్టని పరమలోభి. విత్తసంపత్తి కలిగినా బుద్దిసంపత్తి లేని మనిషి ముందు జన్మలో ప్రజ్ఞ లేకపోయినా కారుణ్య దృష్టితో దీనులను ఆదరించిన ఆర్ద్ర హృదయుడు. విద్యావంతుడైన మేధావి, ఆచార్యునికి ఏంటో అడకువతో పరిచర్యలాచరించి తన పాండిత్య సంపద ఒరులకి అర్పించవలెనని ఆత్రుతపడిన మహితాత్ముడు. ఎన్నెన్ని విధాల ప్రయత్నించినా చదువు అబ్బనివాడు, విధ్యాగర్వంతో మిక్కిలి మదించి మైమరచి సభలలో సాధు విద్వాంసులని అవమానించి ఈసడించిన దుర్గర్వితుడు. నిరంతరారోగ్యంతో భార్యపుత్రులతో మహైశ్వర్యంతో సుఖిస్తున్న భోగి పూర్వం సత్పురుషులని ఎందరెందరినో మిక్కిలి ఆత్మీయతతో ఆదరించిన మాన్యశేఖరుడు. దుష్టులైన భార్య పుత్రులతో సదా లేమితో రోగాలతో దుఃఖిస్తున్న మానిసి పూర్వం క్రోధ,లోభ,నాస్తికత్వాలతో పరులని ఇనుమిక్కిలిగా పీడించిన దురాత్ముడు. పుట్టుగుడ్డి గతజన్మలో అందగాడై తన సోయగంతో మైమరచి ఇతరుల భార్యలని ఆకర్షించిన పరమపాపి. కర్ణరోగార్తుడు(చెవిటివారు) ముందు పుట్టుకలో కటువైన మాటలతో సజ్జనులను ఎంతో మానసికవ్యధ కలిగించిన కటినుడు. ఉదర రోగాములతో బాధపడేవారు గతజన్మలో విషభోజనంతో పరులను అన్యాయంగా వేధించిన ధురాత్ముడు.

పరుల భార్యలని గాని, కన్యలని గాని పూర్వజన్మలో మధాందుడై అనుభవించిన దురాత్ముడు, నీరుపట్టిన శరీరంతో గాని మధుమేహంతో గాని ఇనుమిక్కిలిగా దుఃఖించగలడు. దురహంకారంతో మైమరచి కాళ్ళు చేతులు విరిచి పరులని భాదించిన పాపి కుంటివాడై జన్మించగలడు. కత్తులతో,కర్రలతో, దారుణ ప్రహరణాలతో సజ్జనులను అన్యాయంగా హింసించిన దుష్టులు కంతులు మొదలైన దుస్సహ చర్మరోగాలతో దుఃఖించగలరు. అల్పులని అన్యాయంగా కాలితాపులతో(కాళ్ళతో తన్నడం),పరిశుభ్రతలేని పదాలతో దేవాలయాలలో ప్రవేశించినా ఉత్తరజన్మలో తప్పక చరణ రుగ్మతలు(కాళ్ళకు సంభందించిన రోగాలు) ఏర్పడగలవు. జ్వరము, అతిసారము, మహోదరము, వాత పిత్త కఫాల దారుణోద్రేకాలతో ఆదిగా గల రోగాలతో యాతనలు అనుభవిస్తున్న మానవులందరు పూర్వజన్మలో వినోధార్ధమై ప్రాణులని సంహరించిన(మాంసాహారం తినడం కూడా) పాపాత్ములు. ధాన్యాల వ్యాపారాలలో కల్తి కలిపిగాని, తప్పుడు తూకలతో వ్యవహరించి లాభాలు ఆర్జించిన పాపాత్ములు గూని, కాళ్ళులేమి, మరుగుజ్జుతనము అన్న రోగాలతో సదా అలమటించగలరు. ఈజన్మలో సజ్జనులను అన్యాయంగా మోసగించి సొమ్ము చేజిక్కించుకున్న కపటాత్ముడు మతిభ్రంశంతో దుఃఖించే వారు. ఈజన్మలో పితృకార్యాలు వదిలేసినా, పసివారిని సంహరించినా, ముందు పుట్టుకలో సంతానం కలగదు. తప్పేమిలేకపోయినా పిరుదుల మధ్య భాదినా, సాంగత్య సుఖానికి అడ్డంకి కలిగించినా నపుంసకత్వం వస్తుంది. భర్తని వంచించి సొమ్ము కూడబెట్టినా, సౌందర్య గర్వంతో పరాయివారి భర్తలని ఆకర్షించినా, అపహరించినా(వేరేవారి భర్తతో లేచిపోవడం) కొద్దికాలంలోనే వితంతువు అవుతుంది. ఇంకావుంది.

పుట్టుగుడ్డి గతజన్మలో అందగాడై తన సోయగంతో మైమరచి ఇతరుల భార్యలని ఆకర్షించిన పరమపాపి. కర్ణరోగార్తుడు(చెవిటివారు) ముందు పుట్టుకలో కటువైన మాటలతో సజ్జనులను ఎంతో మానసికవ్యధ కలిగించిన కటినుడు. ఉదర రోగాములతో బాధపడేవారు గతజన్మలో విషభోజనంతో పరులను అన్యాయంగా వేధించిన ధురాత్ముడు. పవిత్ర వంశంలో జన్మించి పాపపు పనులకి పాల్పడేవారు పూర్వజన్మలో గర్వం, అహంకారాలతో పూజ్యులని అవమానించిన పరమ పాపాత్ములు. తప్పులు ఏమి లేకపోయినా గర్వాతిరేకంతో దూషణలో, శారీరక హింసలతో, శిక్షలతో పరిజనులను ఈసడించి అవమానించిన దురాత్ములు ఇతరులకు దాసులై చీటికిమాటికి దూషణలతో శిక్షలతో ఎడతెగని దుఃఖాలు అనుభవించగలరు. ధనవంతుల గృహము ప్రాంగణము నందు ద్వారపాలకులు అడ్డగించినందువలన మిక్కిలి దైన్యంతో అలమటిస్తున్న జనులు వెనుకటి పుట్టుకలో యవ్వనంతో, మదంతో మైమరచి పూజ్యులవైపు కన్నెత్తైనా చూడక,ధర్శనమీయక తిరస్కరించిన దుర్గర్వితులు. అపరాధం చేయనివారిని అన్యాయంగా శిక్షించిన యెడల మరుజన్మలో రాజ దండనము సంప్రాప్తించగలదు. పరులు ఎవ్వరైనా తనదగ్గర సొమ్ము దచుకున్నయెడల ఏదో నెపంతో అపహరించిన దుష్టాత్ములు మరుజన్మలో సంపద మొత్తం ఒక్కమారుగా నశించిపొగలధు. ఏమాత్రము కరుణ లేక అనేకమంది మనుషులను ఒక్కమారుగా నిర్మూలించిన వారు బాంధవులతో, కుటుంబంతో ఒక్కుమ్మడిగా పరలోకం చేరుకోగలరు. ఇంకా ఇటువంటి పాపాత్ములు తప్పక భీకర నరకాగ్ని జ్వాలల్లో కూలిపోగలరు. అయితే ఎక్కువగా పాపకర్మలు చేసిన మానవులు ఒక్కొక్కప్పుడు తిరిగి మానవజన్మ వస్తుంది. అయితే దుశ్చర్యలు ఆచరించినప్పుడు అదే జన్మలో ఫలితమెప్పుడు సంఘటిల్లదు. కాని మునీశ్వరులు, యక్షులు, గంధర్వులు మాత్రం అదే జన్మలో తాము చేసిన తపశ్చర్యలకు అదే జన్మలో సత్ఫలితాలు అనుభవిస్తున్నారు. ..

ఇవి తెలుసుకున్న తరువాత కూడా ఇలానే చేస్తే ఇప్పుడు పడే భాధలు కోటింతలు మరుసటి జన్మలో అనుభవిస్తారు. కాబట్టి చదువుకుని జాగ్రత్తతో మెలగండి.


నమస్కారాన్ని సంప్రార్ధన అని అంటారు. ఇవి నాలుగు రాకాలుగా ఉంటాయి.
1. రెండు చేతులు జోడించి నమస్కరించడం ప్రార్ధన ముద్ర.
2. మిత్రులకు హృదయం దగ్గర నమస్కారం చేయాలి. దీనిని వినమిత మస్తకం అంటారు.
3. గురుదేవులకు నెన్నుదురు(నుదుటి దగ్గర) దగ్గర నమస్కరించాలి. దీనిని ధ్యానం అంటారు.
4. దేవతలకు తలపై(నుదుటి పైన మణికట్టు అంటేలా) నమస్కరించాలి. దీనిని విన్నపం అంటారు.
ఇది భారతీయ ఆచార విధి.

వివాహములు 5రకాలు

కులము, శీలము, విధ్యాసంపత్తి కలిగిన వరునికి అధరపూర్వకంగా ఉదక ప్రదానంతో కన్యను అర్పించిన యెడల అది బ్రహ్మము అవుతున్నది. కన్యా వరులు ఒకరిమీద ఒకరు అనురాక్తులు అయినప్పుడు జరిపించిన వివాహం క్షాత్రమని అంటారు. ప్రగడ అనురాగంతో వలచిన వరునికి కన్యను ఇచ్చి వివాహం జరిపించిన యెడల అది గాంధర్వం అవుతున్నది. కన్నియకి ఇంత వెల అని నిర్ణయించి వివాహం జరిపించిన యెడల అది అసుర వివాహం అవుతున్నది. తల్లిదండ్రులని ఎదుర్కొని దారుణ క్రౌర్యంతో కన్నియని చేపట్టిన ఎడల అది రాక్షస వివాహం అవుతున్నది.

మొదటి మూడు శాస్త్ర సమ్మతం. మిగిలిన రెండు ధర్మవిరుద్దం. జననీ జనకులు లేకపోయినా, అన్నదమ్ములు లేకపోయినా ఆ కన్య వివాహానికి అనర్హురాలు. అని ధర్మ వేత్తలు నొక్కి వాక్కానిస్తున్నారు. మహాభారతం.

ఎలాంటివాడు సుఖంతో, శుభంతో నిర్భయంగా జీవిస్తాడు?

   లోకంలో అన్ని వర్ణాలవారికి (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు నాలుగు వర్ణముల వారు), అన్ని ఆశ్రమాల వారికి (బ్రహ్మచర్య, గృహస్త, వానప్రస్త, సన్న్యాస ఆశ్రమాలకు) శాంతి, దాంతి కలిగి ఉండడం విశేషించి బ్రాహ్మణులకు దాంతితో (నిగ్రహంతో)కూడిన జీవన విధానం ఎక్కువగా కావలసి ఉంటుంది.నిగ్రహం సధ్గుణాలరాశి.

ఆ సద్గుణాలు?
     నిగ్రహం అనే లక్షణం ఉంటె దానిలో ఎన్నో ఇమిడిపోతాయి. ఆ సద్గుణాలు ఇవి:

పరిశుబ్రత - బయటి, లోపలి మలినాలు తొలగించుకోవడం, కోపంలేకుండా, కపటం లేకుండా దైన్యానికి (ప్రతి సమస్యకి అకారణంగా కృంగిపోకుండా) దూరంగాజీవించడం,పరాకు పడకుండా(చదువు కాని, ఇంకేదైనా పని కాని ప్రారంభించి మధ్యలో ఏదో ధ్యాసలో ఉండటం, వేరే ఆలోచనలు చేయకుండా) ఉండటం దురభిమానం (ఎదుటివాడు మంచోడని ఎవరైనా పొగిడితే వీడిని, వాడిని ఇద్దరినీ దూషించడం, చెడు పని చేసేవారి మీద అధికప్రేమ కనబరచడం), అధిక ప్రసంగం (అయినదానికీ,కానిదానికి అనవసరంగా మాట్లాడటం), వీటిని త్యజించడం, ఎల్ల ప్రాణుల యందు సమభావం కలిగి ఉండి, దయతో ఉండటం, పెద్దల యెడల గౌరవం కలిగి ఉండటం, ఇతరులను నిందించడం, పొగడటం వంటి పనులు చేయకపోవడం, కొండెములు(వీదిమీద వాడికి, వాడిమీద వీడికి, ఒకరిమీద మరొకరికి చాడీలు చెప్పడం) చెప్పకుండా ఉండటం, సజ్జనుల సాంగత్యం చేయడం, అబద్దాలు ఆడకుండా ఉండడం, ఆశలకు లోనుగాక పోవడం, హింసకు పాల్పడకపోవడం, మంచి శీలం కలిగి ఉండటం, ఇంద్రియాలను అదుపులో ఉంచడం. ఇవన్నీ వాస్తవానికి దమము రూపాంతరాలే. ఈ లక్షణాలు గల ధన్య జీవి ఇహలోక విషయాల వలనకాని,పరలోక విషయాలలో గాని ఎట్టి పరిస్థితులకు భయము ఉండదు. ఏర్పడదు. వీరు శాంతికి సుఖానికి నిలయమై ఉంటారు. జ్ఞానం వలన సౌమ్యమైన ఆకారంతో వెలుగొందుతారు. ధమవంతుడు సధ్గుణరాశి.

వ్రత నిర్వహణలో ఉన్నవారు అక్కడక్కడ అప్పుడప్పుడు భోజనాలు చేస్తూ ఉంటారు. వారికి వ్రతభంగం వాటిల్లదా?

      విప్రుల కోరిక మీద చేసే భోజనాలు, ఇంకా వేదోక్తాలయిన భోజనాలూ వ్రతస్థులు చేసినా వారివలన వ్రతహాని కలుగదు అని శాస్త్రాలు చెపుతున్నాయి. మొక్షార్థి యైన సాధకుడు సదా ఉపవాసిగా బ్రహ్మచారిగా ఉండాలి. మాంసాహారం భుజించకూడదు. దేవతలా అతిథులకు పెట్టగా మిగిలినది మాత్రమే భుజించేవాడు అమృతాన్ని భుజించేవాడు. నిదురపోనివాడుగా కూడా ఉండాలి. పైన తేలిపిన వీరిస్వరూపాలు ఏవిధంగా ఉంటాయి?

రోజుకు రెండు పూటల భోజనం చేస్తూ మధ్యమధ్య ఏమీ తిననివాడు సదోపవాసి.

ఋతుకాల సమయాన మాత్రమే ధర్మపత్నితో సంగమించేవాడు సద్బ్రహ్మచారి
ఆహారాన్ని దేవతల,పితరుల, అతిథుల కొరకు వండి వడ్డించి ఆ పిదప మాత్రమే భుజించేవాడు అమాంసాహారి.

సేవకులందరూ భుజించిన తరువాతే భుజించే పుణ్యాత్ముడు అమృతాశి.

పగటిపూట నిద్రపోనివాడు అస్వప్నుడు. (నిద్రపోనివాడు)ఇటువంటి మహా వ్రతాలన్నీ శరీర భాధకాలే.


ధర్మశాస్త్రం 2

పెద్దలు, గురువులు, పండితులు, సద్బ్రహ్మనులు, ఋషులు, మునులు, ఇలాంటి వారిని మనం అనుసరించాలి.

అధికారం ఉంది అని కాని ఆస్థి ఉంది అని కానీ వాళ్ళని మనదగ్గరకి రప్పించుకోవాలని ప్రయత్నించకూడదు. మనమే వెళ్లి ఆదరంతో మాట్లాడి తగిన గౌరవ మర్యాదలతో స్వాగతించాలి.

ధర్మ శాస్త్రం చెప్పేవారు, ధర్మం తెలిసినవారు చెప్పే మాటలు అంతరార్ధం గ్రహించాలి. అంతేకాని వితండవాదం చేయకూడదు. వారు నీకన్నా అధమ(తక్కువ కులం) జాతి వారైనా గౌరవించు. నీకంటే గొప్పవాడైనా, నీతోటి వాడైన అసత్యం, అధర్మం చేస్తే తక్షణం సాగనంపు. ఎందుకంటే ఒక మనిషికి ఒక అబద్దం పదే పదే చెప్తే నిజం అనుకునే ప్రమాదం ఉంది.

నువ్వు తక్కువ జాతిలో పుట్టినా, ఎక్కువ జాతిలో జన్మించినా! సత్పురుషుల సాంగత్యం చెయ్యి. గొప్పవాడివి అవుతావు. ధర్మాలు తెలుస్తాయి. ధర్మంగా ఎలా బ్రతకాలో తెలుస్తుంది.

ఒకసారి నీమీద అపవాదు పడిన తరువాత నువ్వు ఎంత పెద్ద అధికారంలో ఉన్నా ఆ పదవిని వదిలేయ్.

ఆత్మగౌరవాన్ని చంపుకుంటే అది చావుకన్నా భయంకరం. తప్పు తెలుసుకున్నాడు కదా అనుకుంటే రేపు ఇంకోసారి అపవాదు వేయడని ఏమి హామీ లేదు కదా!

ధర్మశాస్త్ర విశేషం

ఎవరిని వివాహం చేసుకోవాలి? ఎవరిని చేసుకోకూడదు?

మనలో చాలామందికి ఈ విషయం అంతగా తెలియదు. తెలిసినా ఈరోజుల్లో ఇవన్నిఏంటి. ఏమి లేవు అని వాదించేస్తున్నారు. బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మణులు, భుజముల నుండి క్షత్రియులు, ఉరుములు (తొడలు) నుండి వైశ్యులని, పాదాల నుండి శూద్రులు ఉద్భవించారు. వీరిలో బ్రాహ్మణులు! క్షత్రియులని, వైశ్యులని, శూద్రులని వివాహం చేసుకోవచ్చు. క్షత్రియులు! వైశ్యులని, శూద్రులని వివాహం చేసుకోవచ్చు. వైశ్యులు! శూద్రులని వివాహం చేసుకోవచ్చు. పైనుండి క్రిందికి రావచ్చు. కాని క్రింది నుండి పైకి పొరపాటున కూడా వెళ్ళకూడదు. శూద్రుడు పైవారిని చేసుకోకూడదు. అలాగే వైశ్యులు క్షత్రియులని, క్షత్రియులు వైశ్యులని చేసుకోకూడదు. అందునా స్త్రీలు వారివారి జాతులలో మాత్రమే వివాహం చేసుకోవాలి. బ్రాహ్మణ స్త్రీని ప్రేమతో కాని, బలవంతంగా కానీ తాకరాదు.

శాస్త్ర నియమాలు:

          ధర్మభీతి చేతకాని, దారిద్ర్య పీడవల్ల కానీ, రోగ పాపా నివారణ కోసం కాని, దేవతా ప్రీతికై గాని, చేసిన పశుహింస, పరమ తపోనిష్టతో వేధద్యాయన నిరతితో అవలంభించిన అప్రతిగ్రహ నియమము, మద్య మాంస, పర స్త్రీ పరిత్యాగాది పుణ్య నియమాలతో జన పోషణము, సువర్ణ, గృహ, అన్న, పానాల దానము, దీనాతి దీనులకు ఆశ్రయము, హింసా పరిత్యాగము, పుణ్యకార్యములు అని ధర్మాధర్మవేత్తలు ఉపదేశిస్తున్నారు. ఇంకా మంటపము, తోట, నూయి, చలిపందిరి, మొదలుగా గల నిర్మాణములు, ప్రాణభీతితో అలమటించే వారికి అభయం ఇవ్వడం, ఇతరులు కీడు చేసినా వారి యెడల ఎడతెగని ఓరిమి, సదా మిత్రులు, బందువుల పరిరక్షణం, ఇంకా ఇతరుల విజయాల వల్లకాని, ధన ప్రభావం వల్లకాని తనకు ఎంతో మానసిక అలజడి కలిగినా దుష్ట ధోరణిలో ప్రవేశించక సుస్థిర వైఖరి అవలంభించేవారు ఉన్నత స్థితి పొందగలరు. వీరికి స్వర్గలోకం వస్తుందని ఆర్యుల సూక్తి.

         పాపా కృత్యములు: సత్రము, సాల, చలిపందిరి, మంటపము నిర్మూలించిన పాపులు. గురు జన వేద నిందకులు, ఆమ్నాయాల విక్రేతలు, వాటిని వ్రాసేవారు, కొండెములు(ఇతరుల మీద లేనిపోనివి చెప్పేవారు) చెప్పేవారు, సంధి విభేధకులు(గొడవ జరిగిన ఇద్దరి మద్య సంధి కుదరకుండా అడ్డుపడేవారు), కృతజ్ఞతా విహీనులు, పరదారాసక్తులు(పరుల సొమ్ముకోసం పాకులడేవారు), అతిధి పుత్ర మిత్ర సోదరులకు ఆహారమీయక మునుపే భుజించిన వారు తప్పక పాపం అంటగలదు. ఇంకా విష (విషతుల్యమైన పదార్ధాలు, పానీయములు), శాస్త్ర (ఆయుధాలు), కేశాలు అమ్మకం, శస్త్రవంతుడు (ఈకాలంలో ఆయుధాలు పట్టుకుని తిరగలేము కనుక శక్తివంతుడు, చాతుర్యం) అయినప్పటికీ భయపడే గో బ్రాహ్మణ ఆడవారి అసంరక్షణ ము, ఉపాధ్యాయుని అనాదరణ (ఉపాధ్యాయుడు చెప్పిన మాట వినకపోవడం, అగౌరవ పరచడం), ఇంకా ఏదో ఒక నెపంతో ఇతరులను దూషించడం, రాజు అన్యాయంగా ప్రజల నుండి ధనం గుంజడం, దేశ పరిరక్షణ మరవడం, ఇచ్చిన మాట తప్పి తనకి అనుకూలంగా మార్చుకోవడం, ముక్కు త్రాటితో గోవుని వేదించడం, ఇలాంటి పాపములు చేసే వారు ఇహ పర లోకాలలో అధోగతి పాలు అవుతారు.


కొబ్బరికాయ ఎందుకు కొడతారు? తరువాత కర్పూర హారతి ఎందుకిస్తారు?


కొబ్బరికాయ ముందుగా పైపోట్టుతో ఉంటుంది. దీనిని తీయడం కూడా కొంచం కష్టంతో కూడుకున్న పని. ఒకదానితో ఒకటి కలిసి అనేకానేక చిక్కులు కలిగి చాలా బలంగా ఉంటుంది పైన ఉండే పీచు. దానిని కొంచం కష్టపడి తీసి పగులగొట్టి లోపల తెల్లటి కొబ్బరిని దేవుడికి చూపిస్తున్నాం. ఇలా చూపడానికి ఒక కారణం ఉంది.

కొబ్బరికాయ పీచు విడతీసేటప్పుడు అది చిక్కులు చిక్కులుగా ఉంది మిక్కిలి కష్టముగా వస్తుందో అలానే స్త్రీ పురుషుల చర్మములు చూపునకు మాత్రమే నునుపుగా ఉన్నా లోపల మనస్సుకి అనేకానేక అశాపాశములు అనే చిక్కులు ఒకదానితో ఒకటి అనేకానేకములు జన్మజన్మలుగా వస్తున్నవి. ఇలాంటి లోపలి పాశములు అనే ఈ చిక్కుముడులను విడతీసినప్పుడు కొబ్బరికాయలోని తెలుపు వర్ణం ఉన్నట్లు నాలో శుద్దమైన పరమాత్మ స్వరూపము ఉన్నది. ఆ పరమాత్మా స్వరూపమును అనేక జన్మలనుండి కొంత కొంత కప్పుతూ వస్తున్న ఆశాపాశముల చిక్కులని అంత విడతీసి పరబ్రహ్మ స్వరూపమునందు నన్ను ఐక్యము చేయవలెనని విన్నవించుకొనుటకు గాను దేవునికి కొబ్బరికాయ పగులగొట్టి నివేదన ఇవ్వడానికి కారణం. ఈ కొబ్బరికాయ పైనున్న పీచువలె అనేక జన్మలనుండి అశాపాశాములనెడి చిక్కులు ఆత్మస్వరూపమును కప్పుకొని కనబడనీయకుండా చేయుచున్నది. కనుక ఈకర్పూరపు గడ్డ అంతా ఏవిధముగా వెలిగి ఏమాత్రము ముగాలక జ్యోతి స్వరూపములో ఎలా కలిసిపోవుచున్నదో నా యందు ఆత్మస్వరూపమును,పరమాత్మా స్వరూపమును నీయందు కలసిపోవునట్టు చేయుము అని దేవుని ఎదుట కొబ్బరికాయ కొట్టి, కర్పూరం వెలిగించుటకు కారణం అని పెద్దలు ఏర్పరిచారు.


అక్షయ తృతీయ

      అక్షయ తృతీయ నాడు ఇప్పుడు చాలామంది ''బంగారం కొంటున్నారు. వ్యాపారాలు కూడా తమ స్వార్ధం కోసం ''అక్షయ తృతీయ'' నాడు ప్రత్యేక సందర్భం అని చెప్పి అమ్ముకుంటున్నారు. కాని అక్షయ తృతీయ నాడు పొరబాటున కూడా బంగారం దానం ఇవ్వడం కాని, కొనడం కాని చేయకూడదు. అలా చేస్తే కలిపురుషుడు మీ మీద విజ్రుంభిస్తాడు. ఆరోజు చేయవలసింది ముందురోజు ఒక కుండని శుబ్రం చేసి, నీరు పోసి అందులో లవంగం, యాలుకలు లాంటి సుగంధ మూలికలు కలిపి దానిని దానంగా ఇవ్వాలి. అంతేకాని ఎవరో ఏదో చెప్తే అదే నిజం అనుకుని దాని వెంట పరుగులు పెట్టకండి. మీరు చేసే ఈ పొరబాట్ల వల్ల లేనిపోని దోషాలు తగులుకుని వంశం నాశనం అవుతుంది. భావితరాలు దెబ్బతింటాయి. అందుకే శాస్త్ర పరిజ్ఞానం తప్పని సరిగా తెలుసుకోండి.


భూదానం

      గోదానం, భూదానం, సువర్ణదానం అన్నదానం. వీటిలో ఏది గొప్పది అంటే చాలామంది ఘంటాపదంగా చెప్పేది ఒకేఒక్క దానం. అన్నదానం. కాని నూటికి 90మంది చెప్పేవారే గాని చేయరు. మన సంప్రదాయాల కోసం లోకం గాలిస్తానంటారు. కాని ఇది మన సంప్రదాయం అంటే మాత్రం ఆ నిజాన్ని జీర్ణించుకోలేరు.

     దానలన్నిటిలో కెల్లా గోప్పదానం భూదానం. ఈ భూదానం తరతరాలను తరింపజేస్తుంది. ఏలోటు ఉండదు. ఎందుకంటే భూమిలో సువర్ణం,(బంగారం), బీజం(ఆహారం), నీరు, నిప్పు, పెట్రోలియం. ఇలా మానవులకు ఉపయోగపడే వనరులు మొత్తానికి ఆధారం భూమి మాత్రమే. చివరిని నువ్వు చస్తే పాతిపెట్టాల్సింది ఈభుమిలోనే. ఇది కాకుండా ఇంకేదైనా గొప్పది ఉంటె చెప్పండి. మనం కొత్త శాస్త్రాలు సృష్టిద్దాం.

సువర్ణదానం : ఇది ఆయుష్షుని పెంచుతుంది. దీర్గాయువు ఇస్తుంది. రేపో మాపో చనిపోయేవారు పేరు మీద సువర్ణం దానం ఇస్తే ఆరోగ్యం మెరుగుపడి ఆయుష్షు పెరుగుతుందని శాస్త్రం చెప్తుంది.

అన్నదానం : ఇది మనకి ఆహారం, వస్త్రం కొరతరాకుండా చేస్తుందని శాస్త్రం.

ఒక్క విషయం గుర్తుంచుకోండి. నాకు నచ్చిందే సాంప్రదాయం అనుకునేవారిని, కులాచారాలు పాటించని వారిని ఎవరు బాగుచేయలేరు. శాస్త్రాలని, ఆచారాలని అనుసరించి జీవించేవారికి సాక్షాత్తు ఆదైవమే తోడుండి నడిపిస్తుంది.

No comments:

Post a Comment