Friday, May 23, 2014

శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి చరిత్ర మహాత్మ్యం

శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి చరిత్ర మహాత్మ్యం

ఓం విఘ్నేశ్వరాయ నమః
స్వయంభు శ్రీ వర సిద్ది వినాయక స్వామి వారి చరిత్ర మహాత్మ్యం

'శుక్లాం బరధారం, విష్ణుం, శశి వర్ణం చతుర్భు జమ్
ప్రసన్న వదనం ధ్యాయేత్, సర్వ విఘ్నో పశాంతయే'

శ్రీ వర సిద్ది వినాయక
పవన గజ వాదన కాణిపాకం సదనా
కావుము భక్త జనంబుల
నివే ప్రమాణాల స్వామి విల నెల్ల రకున్

శ్రీ వినాయకుడు సర్వ దేవతలలో మొట్ట మొదట పూజల౦ దుకొని దైవము. అయన పుట్టుకను గురించి వివిధ పురాణాలూ రక రకాలుగా వర్ణించి ఉన్నాయి. అయన స్వరూప, స్వభావాల విషయంలో చివరగా అన్ని పురాణాలూ ఏకీభవిస్తాయి. పరమేశ్వరుడు దక్ష ప్రజాపతి కుమార్తె ద్రాక్షాయని వివాహమాడి ఒక రోజు ఆమెతో బాటుగా గజ వనంలో విహరిస్తు౦ టాడు. అప్పుడు ఆ దంపతు లిద్దరూ అక్కడ గజ రాజు శృంగార క్రీడలను ఆసక్తితో తిలకిస్తాయి. వారి రువురు కూడా గజ రూపాలను ధరించి శృంగార క్రీడలలో తేలి యాడతారు అప్పుడు వారికీ గజ దనుడైన వినాయకుడు ఉద్భవిస్తాడు. అతడే తరువాత సమస్త దేవతా గణాలకు నాయకుడుగా పరమేశ్వరునిచే నియమింప బడుతాడు.

పురుషా కారము బటుమ ద
కరి వదనము గుజ్జ పాద కరములు లంభో
దరము, హరి నిల వర్ణము
గర మొప్పంగ దాల్చి విఘ్న కరుడు దయ యించెన్.

పరమ శివుడు పార్వతిని వివాహ మాడిన అనంతరం ఒక సందర్భములో శివుడు తన సైన్యముతో రాక్షసుల పైకి యుద్దానికి వెళతాడు. అప్పుడు ఏకాంతంగా ఉన్న పార్వతి నలుగు పిండితో ఒక ఆకారాన్ని సృష్టించి ఆ బొమ్మకు ప్రాణ ప్రతిష్ట గావిస్తుంది. చూడడానికి ఎంతో ముచ్చటగా ఉన్న ఆ బాలునికి కొన్ని శక్తులు, ఆయుధాలు ప్రసాదించి తాను స్నానానికి బయలు దేరి ఆ బాలుని సింహ ద్వారము వద్ద కాపలాగా వుంచుతుంది. అంతలో శివుడు యుద్ద రంగము నుండి కైలసానికి మరలి వస్తాడు. శివుడు కైలాసము ఖ ద్వారాన్ని సమీపించగానే ఆ బాలుడు
లోనికి ప్రవేశించడానికి విలు లేదని శివుణ్ణి అడ్డగిస్తాడు.

రుద్రుడు మహొ ద్రేకంతో తన త్రిశూ లంతో బాలుని శిరస్సు ఖండిస్తాడు. అప్పుడే పార్వతి ముఖ ద్వారం కడకు వచ్చి జరిగిన సంఘటనకు మిక్కిలిగా విలపిస్తుంది. ఆమె మానసిక బాధను పోగొట్ట డా నికై ఉత్తర దిక్కుగా తల పెట్టుకొని నిద్రించు ఏ ప్రాణి తలనైనా ఖండి౦చి తీసుకొని రావలసినదిగా శివుడు దేవతలకు ఆ జ్ఞా పిస్తాడు. ఇంద్రుడు ఉత్తర దిక్కు తల పెట్టుకొని వున్న ఒక ఏనుగు తల ఖండించి కైలసానికి తీసికొని వస్తాడు. ద్వారము కదా పడి యున్న బాలుని మొండెమునకు ఏనుగు తల అతికిస్తారు. శివుడు నెల పడి వున్న బాలుని స్పృశించ గానే అతడు లేచి కూర్చుంటాడు. పార్వతి దేవి మహానంద భారితురాల వుతుంది. నాటి నుండి ఆ బాలుడే విఘ్నేశ్వరుని గూర్చి ఎన్నో మహిమలు వివిధ పురాణాలలో చెప్పబడి యున్నాయి.

అట్టి వినాయకుడు స్వయంభు వు వై చిత్తూరుకు సుమారు 12 కిలొ మీటర్ల దూరములో గల ఐరాల మండలానికి సంబధించిన క్నిపకం క్షేత్రంలో ఆవిర్భవించిన తీరు పరమాశ్చర్య కరం. పూర్వము ఈ చిత్తూరు మండలానికి సమీపములో విహార పురి నెలకొని వుండేది. సమస్త దేవతలు ఇచ్చట విహరించి నందు వలననే ఈ ప్రాంతానికి విహార పుర అని పేరు వచ్చినట్లు భావింప బడుచున్నది. ఈనాడు ఈ క్షేత్రానికి కాణిపాకంగా పిలుస్తున్నారు. ఇప్పటికి ఈ ప్రాంతములో వివిధ దేవతల ఆలయాలు వెలసి ఉన్నాయి. శ్రీ కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి ఆలయానికి ఎదురుగా నిర్మల జలంలో నిండిన ఒక చక్కని కోనేరు ఒక వినూత్న మైన మండపం ఉన్నాయి. ఈ ఆలయానికి వాయవ్య దిశలో మారక తంబికా సమేతుడైన శ్రీ మణి కంటేశ్వ రాలయము వుంది. ఈ సివయలము ఎంతో ప్రాచీన మైనది. ఆలయ సింహ ద్వారము వద్ద ప్రతిష్టింప బడ్డ శ్రీ రాజ రాజ నరేంద్ర చోళుని శిలా ప్రతిమను బట్టి ఈ ఆలయము 11 వ శతాబ్ద కాలము. నాటిదిగా చెప్ప బడుచున్నది. అనంతరం విజయ నగర రాజులూ ఈ ఆలయాన్ని పునరుద్దరి౦చారు. ఈ మణి కంటే శ్వరాలయములోని సూర్య, చతుర్ముక షణ్ముఖ, దుర్గ విగ్రహాలు చెప్పు కో దగ్గవి. ఈ ఆలయంలో ఎప్పుడూ ఒక సర్పం తిరుగుతూ వుంటుందని, అది దేవత సర్పం కాబట్టి ఎవరికీ ఎటువంటి హాని కలిగించడాని, ఎంతో గొప్ప మహిమ గలదని అది మణి కంటేశ్వర లాయం కాబట్టి ఆ పాము పాడగా పై మణి కూడా దర్శన మిస్తూ వుంటుందని ఇచ్చటి భక్తులు, అర్చకులు చెపుతూ వుంటారు.

కాణిపాకం నది వొడ్డున శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయానికి తూర్పుగా ఈ శాన్య దిశలో శ్రీ వరద రాజు స్వామి దేవాలయములో ఉంది. ఇది భారత కాలము నాడు జనమే జయ సర్ప యాగానంతరము అతనికి శ్రీ మహా విష్ణువు స్వప్నములో కనబడి శ్రీ వరద రాజ స్వామి ఆలయాన్ని కట్టించమని ఆదేశించి నట్లుగా ఇచ్చటి భక్తులు, ప్రజలు చెబుతుంటారు.అట్లె ఆంజనేయ స్వామి గుడి కూడా చాల ప్రసిద్ద మైనది. ఈ ఊరు మొత్తం సుమారు మూడు వంతులు వివిధ దేవాలయాలలో నిండి ఉంది అందుకే ఇది ఎందరో దేవతలు విహరించిన పుణ్య ప్రదేశంగా విను తి కెక్కి ఈ ఊరుకి విహార పురి అను పేరు సార్థక మైనది.

అట్టి ఈ విహార పురికి పక్కగా బహుదా నది ప్రవహిస్తూ న్నది. పురాణ ప్రసిద్దంగా బహు దా నదికి సంబదించిన ప్రసిద్ద గాధలనే ఇచ్చటి స్థానికులు కూడా పదే పదే చెప్పు కొంటు వుంటారు. పూర్వం శంఖుడు, లిఖితుడు అనే ఇద్దరు అన్నదమ్ములు స్వయం భువుగా వెలసిన శ్రీ వర సిద్ది వినాయకుని మహిమలను గూర్చి విని ఆ స్వామిని దర్శించుట కై ఎంతో దూరము నుండి కలి నడకన వస్తు వుంటారు. సుదూరం నుండి రావడం వల్ల తము తెచ్చుకొన్న ఆహారం అయిపొయింది.

ఈ ఇద్దరు అన్నదమ్ములు బాగా అలసిపోయారు. విరు నడిచి వస్తున్న దారిలో ఒక మామిడి తోట వుంటుంది. తమ్ముడైన లిఖితుడు ఆకలి బాధకు తాళ లేక మామిడి చెట్టు లోని ఒక పండును కోసి తింటానని తన అన్నాను అడుగుతాడు. శంఖుడు దానికి ఒప్పుకోడు. అది దొంగతన మవుతుందని ఆ పండును తిన వద్ద ని తమ్మునికి చెబుతాడు. కానీ ఆకలితో అలమటిస్తున్న లిఖితుడు అన్న మాటలను పేద చెవిని పెట్టి దొంగతనంగా మామిడి చెట్టు నుండి ఒక పండు కోసుకొని తింటాడు. ఇట్లు ధర్మ విరుద్దంగా నడుచు కొన్న తన తమ్ముణ్ణి రాజు వద్దకు తీసుకోని వెళ్లి తన తమ్ముడు దొంగతనం చేశాడని దానికి తగిన శిక్ష విధించామని శంఖుడు రాజునూ కోరతాడు. రాజు లిఖితుని రెండు చేతులు నరికి వేయమని భటులకు అజ్ఞాపి స్తాడు. భటులు లిఖితుని రెండు చేతులూ నరికి వేస్తారు. తన తమ్ముడు చేసిన తప్పుకు రాజు ఇంతటి ఘోరమైన శిక్ష విధిస్తాడు. ఊహించని శంఖుడు దు :ఖిస్తాడు. అక్కడ నుండి ఈ అన్నదమ్ములిద్ద రూ స్వామి వారిని దర్శించుట కై బయలు దేరుతారు. ముందుగా స్వామి వారి ఆలయం పక్కనే ప్రవహిసున్న నదిలో స్నాన మాచరిస్తారు. అప్పుడు వెంటనే లిఖితునికి యధా ప్రకారంగా చేతులూ వస్తాయి. నదిలో మునగడం వల్ల బాహువులు వచ్చినాయి, కాబట్టి ఈ నదికి బహు దా నది అని పేరు వచ్చింది. నాటి నుండి ఆ అన్నదమ్ము లిరువూరు స్వామి వారి మహాత్మ్యాన్ని ప్రచారం చేస్తూ జివి౦ చ సాగారు.

ప్రస్తుతము కాణిపాకం అనే పేరు ఏర్పడడానికి గల కారణాలను పరిశీలించ వలసి వుంది. 'కాణి' శబ్దానికి రూపాయితో 64 వ వంతు విలువ గల రాగి న ణె మని అర్ధము. తమిళ దేశములోని భూ పరిమాణ విశేషము 1 .3 ఎకరాల వైశాల్యంగల భూమి, 20 గుంటల నెల అర్ధాలు వున్నాయి. ఇందులో నేలకు సంబధించిన అర్ధాలే అధిక ప్రాముఖ్యం వహించి ఉన్నాయి. అనగా వ్యవసాయ పరమైన అర్ధంలోనే కాణి శబ్దం గ్రహింప బడింది. ఇక 'పాకం' శబ్ద౦ 'పారకం ' లోని రాకరము లోపించి పాకంగా మారిందని పలువురు భావిస్తున్నారు.

తమిళ దేశంలో ని పలు గ్రామాల పేర్లు చివరలో పాకం, బాకం, వంటి పదాలు ప్రచారములో ఉన్నాయి. చిత్తూరు మండలం తమిళ సంస్కృతి ని కొంత జిర్ణి౦చుకున్న ప్రాంతము కాబట్టి తమిళ దేశ పరంగా వాడుకలో వున్నా పదములే ఇక్కడ ప్రయోగింప బడి కాణిపాకం అయ్యింది.

కాణిపాకం అనే పేరు కేవలం వ్యవసాయ పరమైన అర్ధంలోనే ఏర్పడినట్లు స్పష్ట మైనది. శ్రీ వరసిద్ది వినయకుడైన గణపతికి కాణిపాకం క్షేత్రానికి ఏదో విడ దీయ రాని అన్యో న్యాను బంధం ఉన్నట్లు తెలియు చున్నది. వినాయకుడు స్వయం భూవుగా ప్రసిద్ది కెక్కినాడు. ఆయన ఏవిదంగా స్వయం భూవుగా సాక్షా త్క రించాడో నిరూపించే గా థ కాణిపాకం చరిత్రతో విడదియలె నంతగా ముడి వడి ఉండటం గమనార్హం.

నిత్యమూ సస్య శ్యా మలమై పండ్లతో పచ్చని పైరు పంటలతో శోభాయ మనంగా ఉండేవి. హార పురిలో పుట్టుకతోనే గ్రుడ్డి, చెవిటి, ముగా అయిన ముగ్గురు వికలాంగులు ఎంతో అన్యోన్యంగా కలసి మెలసి జీవిస్తూ వుండేవారు. వీరు ఎక్కడి నుండి వచ్చారో కానీ యాదృచ్చి కంగా ఏర్పడిన వారి మైత్రి దిన దిన ప్రవర్ధ మానమై ఒకరి నొకరు విడ దియరానంతంగా బల పడింది. బ్రతుకు తెరువు కోసం వచ్చిన ఆ ముగ్గురూ ఆ గ్రామంలో కొంత ఆస్తి సంపాదించు కొన్నారు. సంపాదించినా కాణి మాగాణి పొలాన్ని ఏతం బావి నీటితో సాగు చేసు కొంటూ జీవ యాత్ర సాగించారు.

మూగ చెవిటి గ్రుడ్డి ముగ్గురొక్కటి గ వి హార పురికి ఎపుడు చేరినారో కల నిర్ణ యమ్ము కానట్టి పని కాని కాణి పాకమునకు కర్త లైరి ఆనంద దాయకంగా ప్రకృతి సౌందర్య రమణి యకంగా ఒప్పారు చున్న విహార పురిని ఉన్నట్టు౦డి కరువు రక్కసి అక్కసుతో కబ ళి ౦ చింది. వానలు లేక నేల బీటలు వారింది.

రైతులు త్రాగు నీటికి కూడా కట కట పడ్డారు. ప్రజలు ఆకులు అలుములు తిని ప్రాణాలు నిలుపు కొనె దుర్భర క్షామ పరిస్థితులు నెలకొన్నాయి. అంటు రోగాలు ప్రబలి నాయి. బహు దా నది మరు భూమిగా మారిపోయింది. అట్టి దుర్భర పరిస్థితులలో ఆ ముగ్గురు విక లాంగుల జీవనం కూడ తారు మారయ్యింది.

ఒక నాడు ఈ ముగ్గురు వికలాంగులు తమ పొలములో బావని మరికొంత లోతు చేయటం మంచిదని ఆలోచించి నారు. వారి సంకల్పం దైవ నిర్ణయమై ఉండ వచ్చు కలిగిన సంకల్పాన్ని ఆ ముగ్గురు కార్య రూపంలో పెట్టారు. బావిని త్రవ్వగా త్రవ్వగా కొంత తడి తగిలినది. కొంత ఊట వారికీ ఊరట కలిగించినది. నిరు కొద్ది కొద్దిగా ఊరుతూ ఉన్నట్ల నిపించినది. అది విఘ్న నాయకుడైన వినాయకుని అపార కృపా విశేషమని మనం భావించాలి.

గ్రుడ్డి మూగ చెవిటి పడ్డ పాటులు గాంచి కలిగె దైవమునకు కరుణ- జాలి మనుజ యత్న మునకు అనుపమ దైవయ త్న మ్ము తోడు పడిన దనరు సిద్ది బావి నుండి నీరు పైకి తియ్యడానికై బాన వదలి పెట్టారు. అది భళ్ళున పగిలినది. పగిలిన బానను తీసి మరొక బాన కట్టి బావిలోకి వదిలారు. అది కూడ అదే విధంగా పగిలి పోయింది . మళ్ళి మళ్ళి బాణలి బావిలోకి దింపడం అవి పగిలి పోవడం చూసి ఏదో రాయి గట్టిగా కుదురు కొని వుంది. దానిని మెల్లగా తొలగిస్తే చాలు అనుకొన్న పని నేర వేరు తుందని వారు నిర్ణ యించు కొన్నారు. అడ్డు తగిలిన రాతిని శిధిలం చేయడానికి గున పంతో పదే పదె పొడవడం మొదలి పెట్టారు. త్రవ్వుతున్న ఆ ప్రదేశంలో గున పంత గిలిన చోటు నుండి ఖంగు మనే శబ్దం వినిపించింది. ఒకటికి మూడు సార్లు ఈ విధంగానే శబ్దం వచ్చింది. చివరి దెబ్బతో ఏదో చిన్న రాతి ముక్కో లేక గట్టి ఎర్ర మట్టి పెళ్ళో విరిగి అవతల పడింది. అంతే ఆ పగిలిన చోటు నుండి ఏకంగా రక్తం ఎగ జిమ్మింది. రక్తం ఎగ జిమ్మ డానికి కారణం స్వయం భూవు అయిన వినాయకుని తల వెనుక భాగం చిట్లి ఎగిరి పడడమే, ఏక ధారగా రక్తం కారుతూనే వుంది. పరమేశ్వరుని జటా జూటం నుండి గంగ పరవళ్ళు త్రొక్కుతూ పరుగులు తీసినట్లు గా రక్త జలం నురుగులు కక్కుతూ వెలువడింది. అది వరసిద్ది వినాయకుని ఆవ్యాజ కరుణా కటాక్ష పూర్ణ మైన అమృత సారమని ఆ అమాయకులకు అర్ధం కాలేదు. అద్భుతా శ్చర్య సం భ్ర మాలు వారిని ముప్పు రి గొన్నాయి. వారికీ దిక్కుతో చని స్థితి ఏర్పడింది. ఎప్పుడు రక్త జలంతో వారి శరీరాలు తడిసి ప్రక్షాళన జరిగిందో అంతలో మూగ వానికి మాటలు సవ్యంగా వచ్చాయి. చెవిటి వానికి సర్వమూ శ్రావ్యంగ స్పష్టంగా వినిపించింది. గట్టు పైన ఉన్న గుడ్డి వానికి కూడ దివ్య శ్రీ మైన చూపు వచ్చింది.

శ్రీ వరసిద్ది వినాయకుని అవిర్భావం అయన చూపిన మహిమా న్విత ప్రభావం అంతటితో ఆగలేదు. విగ్రహం నుండి రక్త జలం ప్రవహిస్తూనే వుంది. దానిని ఏ విధంగా నివారించాలో ఆ ముగ్గురికి తోచలేదు. అది వారిలో కలతను రేకెత్తి౦ చింది. వెంటనే చూపు వచ్చిన గ్రుడ్డి వాడు విహార పురి ప్రభువు కడకు పరుగెత్తు కెళ్ళి జరిగిన దంతా పూసగు చ్చినట్లు వివరించాడు. ఈ విషయాన్ని విన్న ప్రభువుకు కూడ ఒక వైపు ఆనందాన్ని మరియొక వైపు ఆశ్చర్య భయాందో ళ నలను కలిగి౦ చాయి. మనసు అల్ల కల్లో లమయ్యింది.

ఈ సంఘటన జరిగిన ముందు నాటి రాత్రి విహార పురి ప్రభువునకు స్వామి కలలో సాక్షా త్కరించాడు. ప్రభువు పరమానంద భరితుడై స్వామి విగ్రహాన్ని తనివి తీరచూసి, తనువు పుల కరింపగా భక్తి భావో ద్వేగంతో సాష్టాంగ నమస్కారం. గావించాడు. వేకువన వచ్చే స్వప్నం యదార్థ మై తక్షణ ఫల సిద్ది ని కలిగి స్తుందని దైవజ్ఞులు అంటారు. నిజంగా అదే తీరులో అక్కడ శ్రీ వరసిద్ది వినాయకుని అవిర్భా వం జరుగ బోయే తరుణంలో రాజుకు ముందు సుచానంగా ఇచ్చట స్వప్న రూపంలో శ్రీ వినాయకుడు నిండైన విగ్రహంతో ప్రసన్ను డై సాక్షాత్కా రించాడు.

విహార పురి ప్రభువు స్వామి తల నుండి రక్త ధార ఆగలేదని తెలిసి కొని అంతః పుర కాంతలతో, సమస్త దండ నాయకులతో, దాసదసి పరి వారముతో బయలు దేరి స్వామి అవిర్భ వించిన ప్రదేశానికి విచ్చేసినాడు. రాజు వెంట ప్రజలు గుంపులు గుంపులుగా అక్కడికి చేరుకొన్నారు. బావి దగ్గరకు చేరిన వారి భక్తికి అవధులు లేవు. పూజా ద్రవ్యాలతో, కొబ్బరి, కర్పూరము, పత్ర, పుష్ప, ఫలతో యాలతో విచ్చేసిన ప్రజలు బావి దగ్గరకు చేరి అపరిమిత భక్తితో స్వామిని పూజిస్తూ తమ జన్మ ధన్య మైనట్లు పరవశించారు. ప్రజల కష్ట నష్టాలూ పోగొట్టి అందరి అభిష్టాలు తీర్చడానికి శ్రీ వర సిద్ది వినాయక రూపంలో స్వయం భూవై సాక్షాత్కరించా డని ప్రణతులు గావించారు. ఎవరెంత మొర పెట్టుకొన్నా రక్త ధార ఆగలేదు. ప్రభవు, ప్రజలు అందరు ఆ స్వామిని శాంతింప జేయడానికి సర్వ సన్నాహాలు చేశారు.

భూమ్యా కాశాలు దద్ద రి ల్లే టట్లు స్వామి నామాలు వల్లిస్తూ స్తోత్ర గానాలు కీర్తి స్తూ మహా పచారాన్ని మన్నించ మని విన్న విన్చుకొన్నారు. భజనలు, అర్చనలు, కోలాటాలు, నైవేద్యాలు, సాష్టాంగ దండ ప్రణామాలతో ఆ ప్రదేశం కిక్కిరిసి పోయింది. వినాయక నిను విన బ్రోచుటకు వెరేవ్వరున్నారు? విఘ్న రాజా! అనాధ రక్షకా! అధరించిమము బ్రోవ రాదా ! అని ఆ బల గొపలమూ వర వినయకునితో మొర పెట్టు కున్నారు. ఇక ఆ స్వామి ఏ విధంగా కాదన గలడు? సరే అని శాంతిచాడు. అప్పుడు శాంతి మంత్రాలు వల్లించారు. వర వినాయకుడు ప్రసన్నుడై శశి వర్ణంతో చల్లని వెన్నెలలు ప్రసరింప జేశాడు. భక్త జనులు వినాయకునికి నారి కే ళ ఫలాలు ఇష్టమని ఒక్క క్షణం కూడ నిలప కుండా కొబ్బరి కాయలు కొత్త సాగారు. స్వచ్చ మైన కొబ్బరి నీళ్ళతో ఆ బావి నిండి పొంగి పొరలింది. బావి నుండి పొంగి పొరలిన నిర్మలమైన ఆ కొబ్బరి నీళ్ళు ఆ కాణి మాగాణి అంతా పారింది. ఆ విధంగా కొబ్బరి నీళ్ళు పారిన ఆ ప్రాంతా న్నే కాణి పాకంగా వ్యవహరిస్తూ న్నారు.

ముగా, చెవిటి, గ్రుడ్డి, అయిన ఆ ముగ్గురూ పూనుకొన్న వ్యవసాయ కార్య క్రమానికి భంగం కలుగ కుండా స్వయం భువుగా వెలసిన వరసిద్ది వినాయకుని మహిమ వల్ల వినాయకుని కరుణా మృత ధారలు ఏతం బావి నుండి కొబ్బరి నీరు వలె పారడం వల్ల 'కాణిపాకం' అయ్యిందని అదే కల క్రమంలో 'కాణిపాకం' గా స్థిర పడిందని అభిజ్ఞులు భావిస్తున్నారు.

కాణిపాకం ప్రమాణాలకు పవిత్ర క్షేత్రంగా ఎంతో ప్రసిద్ద కెక్కింది. ప్రమాణ పురుషుడైన వరసిద్ది వినాయకుడే న్యాయ నిర్ణేత వివాద మైన స్వామి సన్నిధిలో అవలీలగా పరిష్కారం కావడం నిజంగా వరసిద్ది వినాయకుని మహిమా విశేషం. సర్వ సాధారణంగా లోకంలో తమ వివాదాలను పరిష్క రించు కోవడానికి ఉభయ పక్షాల స్టేషన్ల ను, న్యాయ స్థానాలను లేక మధ్య వర్తులను ఆశ్రయించడం పరిపాటి అయినప్పటికీ అవి పరిష్కారం కావడం అంత సులువు కాదు. వివాదాలతో సత మత మయ్యే ఇరు పక్షాల వారు పుష్కరిణిలో స్నానం చేసి చిట్టా శుద్ధి తో వరసిద్ది వినాయకుని సన్నిధానంలో చేరి తమ వివాదాన్ని విన్న వించు కొని వెలిగించిన హారతి కర్పూరాన్ని అర్ప గలిగితే చాలు అంతే. వారి తగువును అరక్షణంలో స్వామి తిర్చ గలుగుతూ వున్నాడు. ప్రమాణం చేయడానికి ముందె ఎవరికీ వారు తమకు తామై తమ తప్పులు ఒప్పుకొని పరిశుద్ద మనస్కులు కావడం ఇక్కడ జరిగే విచిత్ర, పవిత్ర పరివర్తన పూర్వక పరిణామ౦.

తగవులు తీర్చు వినాయక! జగమున నీ కన్న కాలరే సాక్షి ! పవిత్ర మ్మగు మనసు న నీ సన్నిధి తగవరు లై నిలిచి తప్పిద ములు తెలుపరే!

ప్రమాణాలు చేయడం పూర్తయిన వెంటనే అపరాధిగా భావింప బడే వ్యక్తిని విడిచి పెట్టడం ఇచ్చట సర్వ సాధారణంగా అనుసరించే పద్దతి చేసిన ప్రమాణం నిజమే అయితే అతనికి ఎటువంటి అరిష్టాలు కలుగవు, క్షేమంగా నే ఉంటాడు. ఆ విధంగా కాకుండా అపర్ధలే పలికి వుంటే తప్పక వెంటనే శిక్ష అనుభవించి తీరుతాడు. స్వామి అపర ధు ల్ని శిక్షించిన సందర్భాలు ఎన్నో అన్నాయని ఇక్కడి ప్రజలు చెబుతారు. సామాన్య న్యాయ ధి పతి కన్న లోకాధి పతియే మిన్న అనే సత్యానికి ఈ క్షేత్రం చక్కని నిదర్శనం.

ఇక సంతాన ప్రాప్తి లేని దంపతులు, దీర్ఘ వ్యాధి గ్రస్తులు సైతం ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించి స్వామి వారిని కనీసం 11 దినాలు గాని, లేదా 22 దినాలు గాని, ఒక మండలం అనగా 41 దినాలు ఎంతో నియమ నిష్టతో స్వామిని పూజిస్తే అటువంటి వారికీ సంతాన ప్రాప్తి కలగటం, ఆరోగ్య౦ చే కూర టం జరుగుతుంది. ఈ విధంగా ఒకటి రెండు కాదు ఎన్నో విషయాలలో స్వామి అత్య ద్భుత మహిమలు ప్రత్యక్ష ప్రమాణాలతో నిరూపింప బడినాయి.

శ్రీ వరసిద్ది వినాయక స్వామి స్వయం భువు కావడం వల్ల క్రమ క్రమ ప్రవర్త మాన మవుతూ వున్నాడు. అత్యంత సూక్షంగా కంటికి కనిపించ కుండా పెరుగుతూ ఉన్న డనేది ప్రత్యక్ష సత్యం. సుమారు 50 సంవత్స రాల ముందు అరగొండ గోలపల్లె వాస్తవ్యులు శ్రీ బెడ వాడ శిద్దయ్య నాయుడు, శ్రీ మతి లక్షమ్మ అనే పుణ్య దంపతులు స్వామి వారికే చేయించిన వెండి కవచం నేడు స్వామి వారి శరీరానికి పట్టడం లేదంటే నిజంగానే ఇది ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. స్వామి వారు ఆవిర్భ వించిన పుడు పూర్తిగా కనిపించని బొజ్జ, నేడు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది స్వామి క్రమ క్రమంగా అభివృద్ధి చెందుతూ వున్నాడ నడానికి చక్కని ని దర్శనం . శ్రీ స్వామి వారి తల వెనుక నాడు తగిలిన గుణ పపు వేటు నేటికి మనం గుర్తించ వచ్చు స్వామి వారి ఆవిర్భ వించిన ఆ బావిలో ని నీటినే నేటికి భక్తులు తీర్ధంగా గ్రహిస్తూ వున్నారు.

నేటికి భక్తులచే ప్రతి దినమూ స్వామి వారికీ అర్చన లూ, అభిషేకాలు జరుగు తూ వుంటాయి. వినాయక చవితి మొదలు 22 దినములు స్వామి వారికీ బ్ర హ్మొ త్స వాలు అత్యంత వైభవంగా నిర్వ హింప బడతాయి. ఈ బ్ర హ్మొత్సవాలు ద్వ జారో హణంతో ఆరంభ మై తెప్పో త్స వంతో ముగియడం ఒక సంప్రదాయం బ్ర హ్మొత్సవాల లో స్వామి హంస వాహనం, నెమలి వాహనం, మూషిక వాహనం , శేష వాహనం, వృషభ వాహనం, గజ వాహనం, అశ్వ వాహనములతో అత్యంత వైభముగా ఊ రేగుతాడు. సూర్య, చంద్ర ప్రభాలను కూడా ఊరేగిస్తారు. ఇచ్చట జరిగే రథోత్స వం, పుష్ప పల్లకి సేవ తెప్పోత్స వం కనుల పండుగగా ఉంటుంది. ఈ బ్ర హ్మొ త్స వాలను చూడ టానికి దేశము నలు మూలల నుండి ప్రజలు తంతో ప తండాలుగా వస్తారు. ఈనాడు కాణిపాకం క్షేత్రనికే మత ప్రమేయం లేకుండా భక్తులందరూ విచ్చేసి ప్రార్థనలు చెసు కొంటున్నారు. ఈ క్షేత్ర ప్రాశ స్థ్య౦ దిన దిన ప్రవర్థ మనమై దర్శించిన భక్త జనులను అలరిస్తూ వున్నది. ఇటువంటి దైవము నెలకొన్న కాణిపాకం నిజంగా కలియుగ కైలసమే. భక్తుల సౌకర్యా ర్థ మై కాణిపాకం దేవ స్థానం వారు విశ్రాంతి గదులను వసతి సౌకర్యాలను కల్పించారు. నిత్యాన్న దాన పథ కాన్ని ప్రవేశ పెట్టారు. ఈ క్షేత్రాన్ని ఎంతో దివ్యంగా, నవ్యంగా, భావ్యంగా దేవస్థానం తీర్చి దిద్దు తూ వున్నది.

No comments:

Post a Comment