ప్రదక్షిణాలు చేసేటప్పుడు ధ్యానించుకోవలసిన స్తోత్రం
శ్రీ పరాశర మహర్షి' వారు పెట్టిన నియమము ప్రకారం, మనము ఎన్ని ప్రదక్షిణలు చేయదలుచుకున్నను, ప్రతి ప్రదక్షిణము తరువాత ఒక చోట ఆగి ఈ క్రింది శ్లోకం చెప్పుకుని తిరిగి ప్రదక్షిణము చేయవలెను. వేరే ఏ శ్లొకములు చెప్పు కొరాదట.
!!ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం
అరుణార్కం ప్రభుం శమథం రామదూతం నమామ్యహం !!
*ఏ గుడిలొనైనను ప్రదక్షిణలు చేసేటప్పుడు, ఒక తొమ్మిది నెలల గర్భిణి స్త్రీ ఎంత నిధానముగ నడుస్తుందో అంత నిధానముగ చేయాలి కాని, అంతకు మించిన వేగముతొ చేయరాదు.
*ఎన్ని ప్రదక్షిణలు చేసామో లెక్కపెట్టుకోడానికి, వక్కలు, పసుపు కొమ్ములు లేక బియ్యము కాని వినియోగించుకోవాలి తప్ప వేళ్ళతో లెక్కపెట్టొకొవడము, పేపర్ మీద గళ్ళు వేసుకుని పెన్సిల్తో గుర్తు పెట్టుకోడము లాంటివి కూడదు.
No comments:
Post a Comment