సాధారణం గా శని బాధ తట్టు కోవటం చాలా కష్టం .అందుకే శని అనుగ్రహం కోసం పూజలు చేస్తారు .
అయితే పేద వారు చేయ లేరు కదా .నూనె తో కూడా అభిషేకం చేసే స్తోమత వారికి ఉండక పోవచ్చు .ఇలాంటి వారి కోసం శ్రీ మద్రామాయణం లోని సుందర కాండ లో ని 48 వ సర్గ ను శనివారం ఉదయం ,సాయంకాలం పఠిస్తేశని దేవుని అనుగ్రహం పొంద గలరు .ఖర్చు లేని పని .ఇప్పుడు ఆ సర్గ లో ఉన్న విషయాన్ని తెలుసు కొందాం
ఆంజనేయుడు లంక లో ఉన్న రాక్షసులను కాలితో ,చేతులతో కొండలతో తోక తో చంపి పారేస్తున్నాడు .రావణుడు పంపిన అక్ష కుమారుణ్ణి ససైన్యం గా హతమార్చాడు .చేసేది లేక రావణుడు ఇంద్రుని జయించి "ఇంద్ర జిత్ " అనే బిరుదు పొందిన తన పుత్ర రత్నం మేఘ నాదుడిని సైన్యం తోడూ ఇచ్చి హనుమ పైకి యుద్ధానికి పంపించాడు.పంపిస్తూ కొడుకు తో ఇలా చెప్పాడు "నాయనా !నీకు అన్ని అస్త్ర శస్త్ర విద్యాల రహస్యాలు తెలుసు .రణ వేత్తవు .ఇద్రు డిని సునాయాసం గా గెలిచి రాక్హస రాజ్యానికి ముప్పు లేకుండా చేసిన ఘనుడవు .బ్రహ్మ దేవుని అనుగ్రహం పొంది అనేక దివ్యాస్త్రాలను సాధించు కొన్నావు .నీ అస్త్రాల ముందు ఎవరు నిలబడ లేరు .మూడు లోకాల్లో నిన్ను జయించ గల మగాడు లేడు .నీ చేత ఓడిమ్పబడని వాడూ లేడు .నీ పరాక్రమ విక్రమం అంత గొప్పది .ఏయే కాలాలలో ఏయే ప్రదేశాలలో ఏమి చేయాలో నీకు బాగా తెలుసు .నీకు యుద్ధం లో అసాధ్యమైనది లేదు .సూక్ష్మ బుద్ధి తో ఆలోచించి కార్య సాధన చేయ గల సర్వ సమర్దుడవు .నీ భుజ ,వీర్య ,తపో బలాలు నాతో సమాన మైనవి .యుద్ధ సమయం లో నేను నిర్ణ యించిన పని చిటికెలో నువ్వు చేయ గల వాడివి .నువ్వు అండగా ఉండ బట్టే నేను ఇంత నిక్షేపం గా లంకా రాజ్య పాలన చేస్తున్నాను .ఎవడో కోతి మన మహా వీరు లందర్నీ అశోక వనం దగ్గర ఉండి మట్టు పెడు తున్నాడు .అక్షయ కుమారుడిని చంపేశాడు .జంబుమాలి ,పంచ సేనాగ్ర నాయకులు వాడి చేతి లో మరణించారు . .మన సైన్యం దాదాపు అంతా క్షీణించి పోయింది .నువ్వే ఇప్పుడు లంకా రాజ్యాన్ని రక్షించ గల ఏకైక వీరుడివి .ఎంత మంది సైనికుల్ని పంపినా ఆ కోతి సునాయాసం గా చంపేసి భయం కల్గిస్తున్నాడు .వారి వల్ల ఇక కార్యం సాను కూల పడదు .ఆ కోతి పరాక్రమం ఏమిటో ఎక్కడి నుంచి వచ్చాడో ఆతని వెనకాల ఉన్న వ్యూహం ఏమిటో తెలుసుకో .దాన్ని బట్టి నీ దగ్గ ర ఉన్న సర్వశాస్త్రాలను ధైర్యం గా ప్రయోగించు .వాడిని వదించటం తక్షణ కర్తవ్యం .నువ్వే తగిన వాడివి .నిన్ను పంపటం నాకు సుత రామూ ఇష్టం లేక పోయినా తప్పని సరి గా పంపువలసి వస్తోది .లంకా రాజ్య భవిష్యత్తు అంతా నీ చేతి లో ఉంది .విజయం సాధించి తిరిగి రా .నా ఆశీస్సులు ,లంకా వాసుల ఆశీస్సులు నీకు లభించు గాక " అని చెప్పి ఉత్సాహ పరచి ఇంద్ర జిత్ ను పంపాడు
రెట్టించిన ఉత్సాహం తో ,ఉప్పొంగిన పరాక్రమం తో ఇంద్రజిత్ సకల సేనా సమేతుడై మారుతి మీదకు యుద్ధానికి తండ్రి ఆశీస్సులు గ్రహించి ప్రణామం చేసి బయల్దేరాడు .ఉప్పొంగే సముద్రం లా ఉన్నాడు .గరుత్మంతుని వేగం తో కదిలాడు .నాలుగు ఏనుగులున్న రధాన్ని ఎక్కాడు .సుశిక్షితు లైన విలుకాన్ద్రను వెంట బెట్టు కొన్నాడు .హనుమ ఉన్న ప్రదేశానికి క్షణాల్లో చేరాడు .అప్పడు పది దిక్కుల్లో దుశ్శకునాలు కలిగాయి క్రూర మృగాలు అరిచాయి .వీరిద్దరి యుద్ధాన్ని చూడాలని మునులు ,సిద్ధులు ,సాధ్యులు దేవతలు అందరు ఆకాశవీధి లోఉత్కంథ గా చేరి చూస్తున్నారు .
ఇంద్ర జిత్ విచిత్ర ధ్వని కలిగేటట్లు ధనుష్టన్కారం చేశాడు .హనుమ ఇంద్ర జిత్తులు యుద్ధం ప్రారంభించారు .అతి వేగం గా ఇంద్ర జిత్ బాణ ప్రయోగం చేస్తున్నాడు .మహాకాయుడు అయిన ఆంజనేయుడు వాటిని ముక్కలు చేస్తున్నాడు .ఆకాశ మార్గం లో సంచరిస్తూ అతనికి అంద కుండా అసహనాన్ని కల్గిస్తున్నాడు .ఎన్నో రకాల శరాలను లాఘవం గా సందిస్తున్నాడు రావణ పుత్రుడు .వాటిని అతి తేలిక గా తప్పించు కొంటున్నాడు వాయు పుత్రుడు .అతని బాణ ధ్వని ,రాధ ధ్వని భేరీ ల ధ్వని విని ఆకాశం లోకి అంద నంత ఎత్తు కు యెగిరి తప్పించు కొంటున్నాడు మారుతి .ఒకరి కొకరు తీసి పోకుండా యుద్ధం చాలా సేపు చేశారు .ఎంత చేసినా హనుమ ఆంతర్యం ఏమిటో అతనికి అర్ధం కాలేదు .అతని అతి శక్తి వంత మైన బాణాలన్ని వ్యర్ధమే అయ్యాయి .హనుమంతుని ,ఇసుమంతైనా ఏమీ చేయ లేక పోయాయి .హనుమ ను వోడించటం అసాధ్యం అని ఇంద్రజిత్ నిర్ణయానికి వచ్చాడు .మరి ఉపాయం ?బ్రహ్మాస్త్రం ప్రయోగించి హనుమ ను బంధించాలి అని నిశ్చయించు కొన్నాడు .
మంత్ర పూతం గా బ్రహ్మాస్త్రాన్ని హనుమ పై ఇంద్ర జిత్ ప్రయోగించాడు .అరి వీర భయంకరుడైన హరి వీరుడు బ్రహ్మాస్త్రానికి లొంగి బంధింప బడ్డాడు .ఇది బ్రహ్మ పూర్వం ఇచ్చిన శాపం .అయితే అది తను ఏమీ చేయదు అన్న సంగతి కూడా జ్ఞాపకం వచ్చింది .నమస్కరించి బద్ధుదయాడు .,బంధుడు అయాడు .ఈ బ్రహ్మాస్త్ర బంధనం తనకు మేలే చేస్తుందని ,రావణుడిని చూసే ఆవ కాశం కలుగు తుందని ,దానితో అతని పరాక్రమం ,వ్యూహం తెలుసు కొ వచ్చునని భావించాడు .రాక్షసులు బలాత్కారం గా పట్టి లాగుతున్నా ,ఏమీ మాట్లాడ లేదు .తప్పించు కొనే ప్రయత్నమూ చేయ లేదు .అతని నిర్వి చేష్టతను గమనించి రాక్షసులు హనుమ ను గొలుసు లతో నార వస్త్రాలతో కట్టే శారు .బ్రహ్మ వరం పని చేసింది .బంధింప బడ గానే బ్రహ్మాస్త్ర ప్రభావం విడిచి పోయింది .వేరే బంధం ఉంటె బ్రహ్మాస్త్ర బంధం పని చేయదు .అది హనుమ కు మాత్రమే తెలుసు .ఈ విషయం ఇంద్ర జిత్ అర్ధం చేసు కొన్నాడు .తను కష్ట పడి బంధించింది అంతా వ్యర్ధమైనదని దుఃఖించాడు .ఇక ఈ మాయా కపి వల్ల లంకా రాజ్యానికి వినాశం తప్పదు అని ఊహించాడు .ఏమీ చేయ లేక మౌనంగా తండ్రి దగ్గరకు ,సైన్యం హనుమను ఈడ్చుకొని వస్తుంటే చేరాడు .విషయాన్ని అంతటిని తండ్రికి వివ రించాడు .హనుమ ను చూసి రాక్షసు లందరూ "చంపండి ,నరకండి " అని అరుస్తున్నారు .
హనుమ రావణ సింహా సనం దగ్గరకు వెళ్లాడు .అక్కడి పెద్దలన్దర్నీ తేరి పార జూశాడు .రావణుడు మంత్రులతో ''ఈ కోతి ఎందుకు వచ్చిందో తెలుసు కొండి ''అని ఆజ్ఞా పించాడు .వారు హనుమను వివరాలు అడిగారు .అప్పుడు హనుమంతుడు ''నేను రామ బంటును .హనుమ నామ దేయుడిని .సుగ్రీవుని మంత్రిని .సీతా మాత శ్రీ రాముని ఇల్లాలు .నువ్వు అపహరించావని తెలిసి మా రాజు నన్ను వెదికిఆమె జాడ తెలుసు కోమని దక్షిణ దిక్కు కు పంపితే ఇక్కడ ఉందని తెలుసు కొని లంక చేరాను. దుస్తర మైన సముద్రాన్ని ఆవ లీల గా దాటాను .ఇది నా శక్తి కాదు శ్రీ రాముని దివ్య విభూతి మాత్రమే ..''అని చెప్పాడు –కనుక శని పీడా బాధితులు శని వారం నాడు సుందర కాండ లోని ఈ నలభై ఎనిమిదవ సర్గ ను భక్తీ తో పఠిస్తే ఆ పీడ నుంచి విరగడ పొందుతారు.

No comments:
Post a Comment