తిరుమల క్షేత్రంలోనే ప్రతినిత్యం ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే వుంటుంది. ఎప్పుడూ ఏదో ఒక ఊరేగింపు నిర్వహింప బడుతూనే ఉంటుంది. ఈ వేంకటాద్రి పుణ్యక్షేత్రంలోనే ఏడాది పొడవునా ప్రతిరోజూ పండుగే. ప్రతి రోజూ పచ్చతోరణాలే, ప్రతి పూటా పిండి వంటలే, పరమాన్నాలే. అలంకారప్రియుడూ, నైవేద్య ప్రియుడూ, అంతకంటే అత్యంత భక్తి ప్రియుడూ అయిన శ్రీవేంకటేశ్వరునిది ఎంతటి భోగం.. ఎంతెంతటి వైభోగం.. సర్వదేవ తలకు ఆలవాలమై నిరంతరాయంగా భక్త జన సందోహంతో కిటకిట లాడే దివ్య క్షేత్రం నిత్యకళ్యాణం పచ్చతోరణంగా బాసిల్లుతూ వుంది. వేంకటాచల క్షేత్రంలో వెలసిన తొలినాళ్ళలోనే శ్రీనివాసుడు బ్రహ్మదె వుణ్ణి పిలిచి జగత్కళ్యాణం కొరకు తనకు ఉత్సవాలు నిర్వహించి ఘనంగా నివేదనాదులు చేయవలసిందని ఆజ్ఞాపించారు. శ్రీ స్వామివారి ఆజ్ఞప్రకార మే బ్రహ్మదేవుడు వేంకటేశ్వరుడు ఆనందనిలయం మధ్యలో ఆవిర్భవించిన కన్యామాసం (అశ్వయుజం) లోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తి అయ్యోటట్లుగా, ముందు తొమ్మిది రోజుల నుంచి ఈ ఉత్సవాలను ఘనంగా వైభవంగా నిర్వహించారు. అందువల్లే ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ది చెంది నాటి నుండి నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. అంతే గాక సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీనివాసదేవునికి జరుపబడుతున్న ఉత్సవాలు కనుకే బ్రహ్మోత్సవాలని కూడా పేరు కలిగిందని, బ్రహ్మాండంగా జరిగే ఉత్సవాలు కనుక బ్రహ్మోత్సవాలు అని కూడా పిలువ బడుతున్నాయని మరోక ప్రచారం. ఏది ఏమైనా దేవదేవుడిని కన్నులాల వీక్షించడానికి లక్షలాది భక్తులు తిరుమలవీ ధుల్లో వేచిఉంటారు. ఈ ఉత్సవాలను క్రీ.శ 614 లో పల్లవ రాణి సమవాయి (పేరిందేవి) నిర్వహించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. బ్రహ్మోత్సవాలకు ముందు ఆమె బహూకరించిన వెండి భోగశ్రీనివాసమూర్తి విగ్రహాన్ని పురవీధులలో ఊరేగించే వారన్న కథ ప్రచారంలో ఉంది. తదుపరి క్రీ.శ 1254 లో తెలుగు పల్లవరాజు, విజయగండ గోపాలదేవుడు, క్రీ.శ 1328 తిరువేంకట నాధయాదవరాయలు, క్రీ.శ 1446 లో హరిహర రాయులు, క్రీ.శ 1530 లో అచ్యుతరాయులు ఇలా క్రీ.శ 1583 నాటి వరకు బ్రహ్మో త్సవాలు ఇంచు మించు ప్రతి నెలా ఒ క బ్రహ్మోత్సవం నిర్వహిం చిన్నట్లు శాసనాల ద్వారా తెలిసింది. అయితే రాజులు, రాజ్యాలు అంతరించిపోవడంతో నెలకు ఒక మారు జరిపే బ్రహ్మోత్సవాలు అర్దాంతరంగానే ఆగి పోయాయి. కాని అలనాటి శ్రీనివాసప్రభు కోరిక మేరకు జగత్కళ్యాణం కోసం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు నిర్వహించిన బ్రహ్మోత్సవాలు మాత్రం అఖండంగా వైభవంగా కొనసాగుతూ కొండలరాయుని కొండంత వైభవాన్ని దశ దిశలా చాటుతున్నాయి. అంచేత బ్రహ్మోత్సవ సమయంలో ప్రతి రోజూ ఉదయం సాయంత్రం ఉత్సవాలకు ముందు ని బ్రహ్మరథం్ణ ఉం టుంది. ఈ రథంలో నిరాకార నిర్గుణ స్వరూపంతో బ్రహ్మదేవుడు వేంచేసి ఉత్సవాలకు ఆధ్వర్యం వహిస్తారు. కాని ఒక్క రథోత్సవం రోజు మాత్రమే బ్రహ్మరధం ఉండదు. స్వామి వారి రధోత్సవం నాడు మాత్రం బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీవేంకటేశ్వరస్వామి వారి తేరు యొక్క పగ్గాలను పట్టుకుని లాగుతూ రధోత్సవంలో పాల్గొంటాడు. అందు వల్లే ఇవి బ్రహ్మోత్సవాలుగా పిలవ బడుతూ సాటి లేని విధంగా జరుపబడుతున్నాయి. ఈ ఉత్సవాలు ధ్వజా రోహణం నుంచి ప్రారంభమై ధ్వజావరోహణంతో సమాప్తమవుతాయి.
ధ్వజారోహణం
వైఖానసాగమ శాస్త్రోక్తంగా గరుడ కేతన ప్రతిష్ఠ, కంకణధారణ, ఆలయ ఆవర ణంలోనూ బయట చుట్టూ అష్టదిక్కులలోనూ బలిని వేస్తూ శ్రీస్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ,ఆలయ పరివారదేవతలతో ఊరేగుతూ వుండగా అష్ట దిక్పాలకులు ఆహ్వానింపబడతారు. ఇలా దేవతలను ఆహ్వానించిన అనంతరం శ్రీస్వామి వారు ఆలయంలో ప్రవేశించి ధ్వజస్తంభం దగ్గరకు చేరుకుంటారు. మిగిలిన పరివార దేవతలైన అనంత, గరుడ, విష్వక్సేన, సుగ్రీవ, హనుమంత, అంగదులు విమాన ప్రదక్షణలో వున్న అంకురార్పణ మండపానికి చేరుకుంటారు. పిదప శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాయిద్యాలు మ్రోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభం పై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు. ధ్వజారోహణం నాడు శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ఇక ఆ తర్వాత దేవేరుల సమేతంగా శ్రీ స్వామి వారిని ఆ రాత్రి నుంచే ఊరేగింపు చేస్తారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఒక్కొక్క వాహనం మీద ఉత్సవాలు అంగరంగ వైభవంగా తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి.
గరుడవాహనం
బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ అత్యంత ముఖ్యమైనది. గరుత్మంతుడే శ్రీ మహావిష్ణువునకు నిత్యవా హనం.అం దువలన గరు డోత్సవానికి ఎక్కువ ప్రాముఖ్యత, ఔచి త్యం ఉన్నాయి. 5 వ రోజు రాత్రి ఈ గరుడ సేవ తిరుమల రాయునికి జరుగు తుంది. కాగా శ్రీవిల్లి పుత్తూ రు దేవస్తానం నుండి వచ్చే తుల సమాలలు, చెన్నపట్నం నుండి గొడుగులు సాంప్ర దాయం గా వార్షిక బ్రహ్మోత్స వాలలో గరుడ సేవనాడు స్వామికి సమర్పించ బడుతున్నాయి. ఇదే విధంగా ప్రజల పక్షాన రాష్ర ముఖ్యమంత్రి శ్రీవారికి సమర్పిం చిన పట్టు వస్త్రాలను ఆ రోజు శ్రీవారికి ధరింప చేస్తారు. దూర ప్రాంతాల నుండి భక్తులు విశేషంగా తరలి వస్తారు.
స్వర్ణరథం
ఉదయం హనున వాహనంపై ఊరేగిన స్వామి సాయంకాల వేళ స్వర్ణ రధోత్సవంపై భుక్తులకు దర్శన మిస్తారు. అత్యంత విశిష్టమైన స్వర్ణరధం శ్రీనివాసునికి అత్యంత ప్రీతి పాత్రమైనది. స్వర్ణ మయమైన రధంలో శ్రీ దేవి, భూదేవేరులతో మలయప్పస్వామి దర్శన మిస్తారు. ఇతర వాహనాల ముందు సాగే బ్రహ్మశూన్యరధం , గజ, అశ్వ, వృషభాదుల సం రంభం ఈ స్వర్ణ రధంలో కూడా ఉంటుంది. భక్తుల నృత్యాలు ఆకర్షణీయంగా ఉంటాయి. వివిధ భజన బృందాలు ఉత్సాహంగా పాల్గొంటాయి. ఈ స్వర్ణ రధోత్సవ సేవలో కళ్యాణ కట్ట సేవా పరులు ఒక సువర్ణ ఛత్రాన్ని తొలుత అలంకరించడం సాంప్రదాయం.
అశ్వవాహనం
బ్రహ్మోత్సవాలలో 8వరోజు రాత్రి ఏడు కొండలవాడు తిరువీధులలో అశ్వారూఢుడై విహరిస్తారు. జంతువులలో మిక్కిలి వేగం గల జంతువు అశ్వం. భగవంతుని అవతారాలు 10 ప్రసిద్ద మైనవి. చివరి అవతారం కల్కి. కలియుగాంతంలో కల్కి రూపం ధరించి కత్తి చేత పూని అశ్వవాహనం పై స్వామి దుష్ట సంహారం చేస్తాడని పురాణాలు చెపుతున్నాయి. శ్రీనివాసుడు పారువేట ఉత్సవం కూడా అశ్వవాహాల పైనే నిర్వహిస్తారు. పద్మావతి శ్రీనివాసుల తొలి చూపు వేళ, ప్రణయ వేల, పరిణయ వేళ సాక్షిగా నిలచినది ఈ అశ్వమే. అశ్వాన్ని అధిరోహించిన స్వామి భక్తులకు దర్శన మిస్తారు.
హనుమద్వాహనం
ఆరవ రోజు ఉదయం బ్రహ్మోత్సవాలలో వరద హస్తం దాల్చిన వెంకటాద్రిరాముడు హనుమద్వాహనం పై ఊరేగుతారు. హనుంతుడు భగవద్భక్తులలో అగ్రగన్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్నాతుడుగా, నవ్యాకరణ పండితుడుగా , లంకాభీకరుడిగా ప్రసిద్ది గాంచిన ఆంజనేయుడు వెంకటాద్రి వాసుని మూపున వహించి తిరువీధులలో దర్శన మివ్వడం భక్తకోటికి ఆనందదాయకం. బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వం, ఆరోగ్యం, ఆజాడ్యం, వకృత్వం హనుమంతుని స్మరిస్తే లభిస్తాయని పురాణాలు చెపుతాయి.
గజవాహనం
బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజు రాత్రి గజ వాహ నం పై శ్రీనివాస ప్రభువు కనువిందు చేస్తారు. పూర్వం యుద్ధాలలో రధ , గజాశ్వాల ను వాహనాలుగా ఉపయో గించే వారు. రాజులను పట్టాభిషేకాధి సమయాలలో గజాధిష్ఠిలను చేసి ఊరేగిస్తా రు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానిం చాల్సి వస్తే గజారో హణం కావించే ప్రక్రియ నేటికి కొనసాగుతుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి గజ వాహన రూఢుడై తిరుమాడ వీధులలో ఊరేగడం భక్తులకు మరుపు రాని దృశ్యం.
సూర్యప్రభవాహనం
బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఉదయం శ్రీహరి సూర్య ప్రభ వాహనం అధిష్ఠించి తేజో విరాజితుడై కనిపిస్తారు. సూర్యు డు తేజో నిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రధాత. వర్షాలు, వాటి వల్ల పెరి గే మొక్కలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఓషధులు మొద లనవన్నీ సూర్య తేజం వల్లనే లభిస్తాయి. అట్టి సూర్యప్రభను అధిష్టించి స్వామి కలియుగ వైకుంఠంగా ప్రసిద్ది గాంచిన తిరుమల మాడ వీధులలో ఊరేగడం భక్త కోటికి ఆనంద దాయకం. సూర్యప్రభ పైన శ్రీనివాసుని దర్శనం తిరుమల యాత్రికులకు పూర్ణ ఫలాన్ని ప్రసాదిస్తున్నది. ఆరోగ్యం, ఐశ్వర్య ం పరిపూర్ణంగా ఈ వాహన సేవ వల్ల భక్తులకు సిద్ధిస్తాయి.
చంద్రప్రభవాహనం
స్వామికి సూర్య చంద్రులు రెండు నేత్రాలు. ఉదయం సూర్యప్రభలో ఊరేగి న శ్రీనివాసుడు బ్రహ్మో త్సవాలలో ఏడవ నాటి రాత్రి చంద్రప్రభ వాహనం పై ఊరేగు తారు. రాత్రి నిశాకరు డైన చంద్రుని ప్రభతోకూడిన వా హనం పై విహరించడం సమ ం జసమే. చంద్రుడు భగవంతుని మారు రూపమే. ఓషధీసుడైన చంద్రుడు మనకు పోషకుడే. ఆ చల్లని దేవర ప్రభతో నేడు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడు భక్తులకు దర్శన మిస్తున్నారు. అందు వలన ఈ వాహన సందర్శనం ఆధ్యాత్మిక , ఆదిభౌతిక, ఆది దైవిక మనే త్రివిధ తాపాలను నివారిస్తుంది.
పెద్దశేషవాహనం
అంకురార్పణతో సాంప్రదాయ బద్దంగా ఆరంభించబడిన బ్రహ్మోత్సవాలలో మొదటి ఆకర్షణ విష్వక్సేనల ఊరేగింపు. విష్ణువు యొక్క సర్వ సైన్యాధి పతి విష్వక్సేనుడు ఆయన ఊరేగింపుతో ప్రారంభించ బడిన ఈ తిరువీధి ఉత్సవాలలో ఆదిశేష వాహనంలో దేవదేవుడు మొదటి రోజు రాత్రి కన్నుల పండుగగా దర్శనమిస్తారు. ఆదిశేషుడు శ్రీ హరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడిగా , ద్వాపరంలో బలరాముడుగా, శ్రీ మన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు, భూ భారాన్ని వహించేది కూడా శేషుడే. ఈయన శ్రీ భూదేవి సహేతుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలి రోజు ఏడుపడగల బంగారు శేషుని పైస్వామి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. శేష వాహనం ముఖ్యంగా దాస్య భక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం ఆ నుంచి దైవత్వం, పరమ పదం సిద్దిస్తాయి. ఆ సందేశాన్ని మనకు అందించడానికే శేషాద్రి నాదుడు శేష వాహనం పై తిరుమాడ వీధులలో విహరిస్తారు.
చిన్న శేషవాహనం
బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు మళయప్పస్వామి ఐదు తలల చిన్న శేష వానహం పై దర్శనమిస్తారు. నాగజాతిలో అనంతుడిని ,సర్పజాతిలో వాసుకిని పేర్కొన్నారు. కాబట్టి పెద్ద శేషవాహనం ఆదిశేషుడిగాను , చిన్న శేషవాహనం వాసుకిగాను భావించ వచ్చు. ఎల్లప్పుడూ ఆదిశేషుని మీద శయనించే స్వామి మళ్లి ప్రీతితో రెండవ పర్యాయం శేషవాహనం పై దర్శనమిస్తారు. ప్రతి మానవ శరీరంలో మూలాధారం నుండి సహస్రారికర్ణిక వరకు ఏడు చక్రాలు ఉంటాయి. వాటిని మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అణాహత, విసుద్ద, ఆజ్ఞ, సహస్రారము అని పేర్కొంటారు. మూలాధారం నుండి సహస్సారం వరకు బ్రహ్మం దండి మధ్య నుండి (వెన్నుముక మధ్య నుండి) కుండలిని శక్తి అనే సుఘమ్నాడి సర్పాకారంలో ఉంటుంది. సర్పాకారంగా వ్యాపించి ఉండే కుండలిని శక్తి శిరస్సు మూలాధారంలో ఉంటుంది. శేషవాహం పై శ్రీవారిని దర్శించి ధ్యాని ంచే భక్తులకు మనోవృత్తులు శ్రీనివాసుని అధినమై అభిముఖ మౌతాయి. అటు న ుంచి వారిలోని కుండలిని సర్పరూపం శిరస్సు సహస్రారంలోనూ , పుచ్చం మూలాధారంలోనూ నిలుస్తాయి. ఆనాడు మానవుడు మాధవుడికి నిజమైన సేవకులు అవుతాడు. ఆ దివ్య దర్శనం చిన్న శేషవాహనాన్ని సందర్శించిన భక్తులకు కుండలిని యోగ సిద్ది లభిస్తుంది అని పండితులు చెప్పుతారు.
రథోత్సవం
బ్ర హ్మోత్సవాలలో ఎనిమిదవ రోజున ఉభయ దేవేరులతో మలయ ప్పస్వామిని మహోన్నత రథం పై అధిష్టింపచెసి ఆలయ వీధులలో విహరింప చేస్తారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పిస్తారు. గోవింద నామ సంకీర్తనలు, భజనలు, నినాదాలు మిన్నంటుతాయి. అనాది కాలం నుండి రాజులకు రథ సంచారం ప్రసిద్ధం. యుద్దాలలో కూడా విరివిగా రథసంచారం జరిగినట్లు భారతాధిగ్రంధాల ు వివరిస్తున్నాయి. శ్రీహరి గరుడధ్వజుడై నాలుగు గుర్రాలు పూన్చిన రథం పై విహరిస్తారు. రధోత్సవంలో భక్తులు రథాన్ని లాగే ఈ వేడుక చూసి తీరవలసిందే.
హంసవాహనం
బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు రాత్రి మలయప్పస్వామి వీణాపాణి అయి సరస్వతి మూర్తిగా దర్శన మిస్తాడు. హంసవాహనాన్ని అధిరోహించి పయనించే శ్రీవేంకటేశ్వరస్వామి సూర్య భగవానునిలోను శ్రీమన్నారాయణునికి ప్రతీక. హంసకు ఒక విశిష్ట గుణం ఉంది. అది క్షీర -నీర విభాగం చేయగలదు. అంటే పాలు నీళ్ళు కలిపి ముందు పెడితే పాలు గ్రహించి నీరు వదలి వేయగల శక్తి హంసకు ఉంది. అహంభావం కలిగిన భక్తులలో అహన్ని తొలగించి సమభావం కలగించడానికే శ్రీనివాసుడు హంస వాహన రూఢుడై తిరువీధులలో విహరిస్తారు.
సింహవాహనం
మూడవ రోజు ఉదయాన శ్రీవారు సింహవాహనం పై దర్శన మిస్తారు. అనంత తేజో మూర్తి శ్రీనివాసుడు రాక్షసుల మనసులలో సింహలా గోచరిస్తారు. సింహం పరాక్రమం కల జంతువు అది మద గజాలనే సంహరించ గలదు. అట్టి సింహాన్ని తనకు వాహనంగా చేసుకున్న వేంకటపతి పరాక్రమం ఎట్టిదో ఊహించుకోవచ్చు. యోగ శాస్త్రంలో సింహం సింహావన శక్తికి శీఘ్ర గమన శక్తికి ఆదర్శంగా భావిస్తారు. భక్తులు సింహబలం అంతటి భక్తి బలం కలిగినపుడు భగవంతుడు తనను అనుగ్రహిస్తాడని వాహన సేవలో అంతరార్దాన్ని గ్రహించాలి. తిరుమల ఆలయం లోపల ఉన్న ఆనంద నిలయం పై సింహాలు స్వామికి సింహం పట్ల ఉన్న ప్రీతిని స్పష్టం చేస్తున్నాయి.
ముత్యాల పందిరి వాహనం
బ్రహ్మోత్సవాలలో మూడవ రోజు రాత్రి ముత్యపు పందిరి వాహనంతో ఏడు కొండల స్వామి ప్రత్యక్షమౌతారు. ముత్యాలు విలువైనవి. చల్లదనాన్ని ప్రసాదిస్తాయి ,తెల్లని కాంతులీనుతుంటాయి, జోతిష్య శాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను ప్రకాశిస్తుంది. సముద్రం మనకు ప్రసాదించిన మేలిమి వస్తువులలో ముత్యం ఒకటి. శ్రీక్రిష్ణుడు మెడలొనూ ముత్యాలను ఆభరణాలు ధరిస్తున్నట్లు పురాణ గాధలు వెల్లడిస్తున్నాయి. ఇంతటి ప్రశస్త మైన ముత్యాలను పందిరిగా రూపొందించి తయారు చేయబడిన వాహనంలో ఏడు కొండల స్వామి మిరిమిట్లు గొలుపుతూ ముచ్చటగా ఊరేగుతారు. చల్లని ముత్యాల క్రింద నిలచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూరుస్తుంది.
సర్వభూపాల వాహనం
బ్రహ్మోత్సవాలలో 4 వ రోజు రాత్రి మలయప్పస్వామి సర్వభూపాలవాహనం పై విహరిస్తారు. ఆది దేవుడైన శ్రీహరి రాజాధిరాజు కావడంలో ఆశ్చర్యం ఏముంది. భూపాలురు అనగా రాజులు సర్వభూపాలురు అంటే అందరూ రాజులని అర్దం. ప్రజలను రంజింప చేసే వారే రాజులు. విష్ణ్వంశ లేని వాడు రాజు కాలేడు. అందుచేత రాజులు అందరూ అంతో ఇంతో భగవదాంశ కలవారే. వారు అంశలైతే స్వామి అంశి. ఇక్కడ రాజులకు రాజాధిరాజుకు అంశ అంశి భావం కుదిరింది. అందుకే సర్వ భూపాలురూ స్థానీయులై భగవంతుని తమ భుజస్కంధాల పై మోస్తూ తిరువీధుల్లో విహరిస్తున్నారు.
కల్పవృక్ష వాహనం
ప్రకృతి శోభను సమకూర్చేది చెట్టు అనేక విధాలైన వృక్షాలు సృష్టిలో ఉన్నాయి. అందులో మేటిది కల్పవృక్షం. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే అందిస్తాయి . అలా కాక కల్ప వృక్షం వాంఛిత ఫలాలన్నింటిని ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి 4 వ రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు తనివితీరా దర్శన మిస్తాడు శ్రీ శ్రీనివాసుడు. కల్ప వృక్షం నీడన చేరిన వారికి ఆకలి దప్పులు ఉండవు. పూర్వ జన్మ స్మరణ కూడా కలుగుతుంది. ఈ వాహన దర్శనం వ ల్ల స్వామి ఆ ఫలాన్ని పరిపూర్ణంగా అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం.
వెూహినిదేవి అవతారం
బ్ర హ్మోత్సవాలలో 5 వ రోజు నాటి ఉదయాన ఆపద మ్రొక్కుల వాడు మోహిని రూపం వహించి శృంగార దేవతగా దర్శన మిస్తారు. ప్రక్కనే స్వామి దంతపు పల్లకి పై వెన్నముద్ద క్రిష్ణుడై మరో రూపంలో కన్నుల ముందుకు ఆలయం నుండి విచ్చేస్తారు. కమనీయమైన శ్రీకాంతుని రూపం జగత్సమ్మోహకంగా ఉంటుంది. శ్రీమహావిష్ణువు ఏ రూపం ఎత్తినా , పురుషులకు కూడా సమ్మోహకుడౌతాడు. ఇక మోహినీ రూపంలో చెప్పనవసరం లేదు. జగత్తు అంతా మాయా మోహానికి లొంగి ఉన్నది. ఈ జగన్నాటక సూత్రధారి తిరుమల రాయులే. ఆయన ఈ బ్రహ్మోత్సవాలలో మోహిని రూప ధారియై ప్రపంచ మంతా తన మాయా విలాసమనే , తన భక్తులు కాని వారు ఆ మాయా ధీనులు కాక తప్పదని , తనకు ప్రసన్నులైన వారు మాయను సులభంగా దాట గలరని మోహిని రూపంలో స్పష్టం చేస్త్తున్నారు ఆపదమొక్కులవాడు. అందు వల్ల మాయామయమైన ఈ జగత్తు నుండి బయట పడడానికి మోహిని రూపంలో సమ్మోహంగా ఆవిర్భవించి తిరుమల మాఢ వీధులలో ఊరేగుతున్నారు.
చక్రస్నానం
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరిది చక్రస్నానం, యజ్ఞాంతంలో ఆచరింపబడే అవభృథస్నానమే. యజ్ఞం చివర మరలా అవభృథస్నానం చేయించడం సాంప్రదాయం. తొమ్మిద రోజులు ఒక యజ్ఞంగా బ్రహ్మోత్సవాలు నిర్వహింప బడి, లక్షలాదిమంది భక్తులు పాల్గొన్న యజ్ఞం ఇది. అవభృథస్నానంలో చక్రతాళ్వారులకు స్నానం పుష్కరిణిలో నిర్వహించే ముందు స్నపన తిరుమంజనం గావిస్తారు. ఇందులో ఉభయ దేవేరులతో ఉన్న శ్రీవారి సరసన చక్రతాళ్వారులు పాలు, పెరుగు, నెయ్యి ఇత్యాదులచే అర్చకులు చేసిన అభిషేక కైంకర్యాన్ని అందుకుని, ధూపదీపాధికంతో ప్రసన్నులవుతారు. చక్రస్నాన సమయంలో అర్చకులు , అధికారులు, భక్తులు అందరూ పుష్కరిణిలో స్నానం చేస్తారు. యజ్ఞ ఫలానికి అధికారులౌతారు. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ రూపాలలో స్వామి చివరి రూపమైన అర్చా విగ్రహానికి జరిగే ఉత్సవాల సందర్శనం అన ంత ఫల ప్రదాయకం.

No comments:
Post a Comment