పూజను ఎందుకు చెయ్యాలి? మానవ జన్మ లభించడం అంత సులభమైన మార్గం కాదు. ఎన్నో జన్మలు తపస్సు చేస్తే కానీ, మానవ జన్మ లభించదు.కర్మాను సారంగా మానవ జీవిత చక్రంలో చిక్కుకుంటూ ఉంటాము. మనకు ఎన్నో తెలియని తప్పులు చేస్తూ ఉంటాము. అది మనసు ద్వారా కావచ్చు, దేహం ద్వారా కావచ్చు, అధికారికంగా కావచ్చు, స్వార్ధ పరంగా కావచ్చు, ఎదుటి మనస్సుని గాయ పరిచేలా కావచ్చు. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పుగానే పరిగణింప బడుతుంది. కానీ, వాటికి నివారణ మార్గాలు కూడా ఉన్నాయి. వివిధ పురణాలు, శాస్త్రాలు ని అనుసరించి, పుట్టిన ప్రతి జీవికి ఒక గమ్యం అనేది ఉంటుంది. ఆ గమ్యం భగవంతుని ఆరాధన పై మలిచినట్లయితే ఎన్నో పుణ్య ఫలాలని మన జీవిత ఖాతాలో, క్రెడిట్ చేసుకోవచ్చు. అందులో మొట్ట మొదటి మెట్టుని "పూజ" గా చెప్పుకోవచ్చు. ఈ పూజని ఎందుకు చేయాలంటే, అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకు, చీకటి నుండి వెలుగులోకి, దానవత్వం నుండి మానవత్వానికి, మానవత్వం నుండి దైవత్వం వైపు మన మనస్సును పురోగమింప చేయడానికి పూజను చేయాలి.
No comments:
Post a Comment