చాలా
మందికి శక్తి పీఠాల గురించిన కథ తెలిసే ఉంటుంది. తండ్రి పిలవక పోయినా
పుట్టింటిపై ప్రేమతో దక్షుడు చేస్తున్న యజ్ఞానికి వేళ్ళిన సతీ దేవికి అక్కడ
అడుగడుగునా తిరస్కారం లభిస్తుంది. అంతే కాక భగవంతుడైన శివుని కూడా దక్షుడు
దుర్భాషలాడుతాడు. తనకు కలిగిన తిరస్కారాలను సహించగలిగినా శివ నిందను
వినలేని సతీ దేవి అక్కడికక్కడే యోగాగ్నిలో దగ్ధమవుతుంది. ఈ విషయం తెలిసిన
శివుడు వీరభద్రుడు, ప్రమథ గణాలను పంపి
దక్ష యజ్ఞం ధ్వంసం గావిస్తాడు. సతీ విరహాతురుడై యోగాగ్నిలో దగ్ధం కాగా
మిగిలిన చిత్కళా శరీరాన్ని భుజంపై వేసుకొని లోకమంతా పరిభ్రమించడం మొదలు
పెడతాడు. శివుని ఈ ఉన్మత్త స్థితిని చూసిన లోకం భయభ్రాంతమై శ్రీ మహా
విష్ణువు ను శరణు కోరగా ఆయన రహస్యంగా శివుని వెంబడిస్తూ తన సుదర్శన చక్రంతో
సతీ దేహ భాగాలను అక్కడక్కడా ఖండిస్తూ శక్తి పీఠాలను నెలకొల్పుతాడు.
ఉత్తర భారత దేశంలో ఎక్కడకి వెళ్ళినా 50/51/52 శక్తి పీఠాల గురిచి చెబుతారు. అందరికీ ప్రామాణికం అయిన దేవీ భాగవతం శక్తి పీఠాల సంఖ్య 108 అని తెలియ చేస్తుంది
ఉత్తర భారత దేశంలో ఎక్కడకి వెళ్ళినా 50/51/52 శక్తి పీఠాల గురిచి చెబుతారు. అందరికీ ప్రామాణికం అయిన దేవీ భాగవతం శక్తి పీఠాల సంఖ్య 108 అని తెలియ చేస్తుంది
No comments:
Post a Comment