Saturday, September 14, 2013

భక్తి లేని జీవితం పుణ్యమా? పురుషార్థమా?

చక్రము లేని రథము
నీరెరువులు లేని పంట
చంద్రకళలు లేని రాత్రి
సింధూరము లేని గృహిణి
వెన్న తీసినట్టి పాలు
మంచి ప్రకాశములెట్లు కలిగియుండు?
భక్తి లేని జీవితం పుణ్యమా? పురుషార్థమా?

భగవాన్ నీవు నాకు ముక్తిని ప్రసాధించనవసరం లేదు. మహాత్ముల సాంగత్యం అనుగ్రహిస్తే చాలు, అని తుకారాం ప్రార్థిస్తాడు. మహాత్ముల సాంగత్యంతో సాధించలేనిదంటూ ఉండదు. ముక్తి ఉత్కృష్టమైనచో, అట్టి ముక్తిని ప్రసాదించు సత్పురుషుల సాంగత్వము అంతకన్నా ఉత్కృష్టమైనదని తుకారాం భావనతో మనం పూర్తిగా ఏకీభవించాలి.

అవతార పురుషుల సాంగత్యంతో ఆత్మతత్త్వము భోదపడుతుంది. ప్రతీ హృదయంలో భగవానుడున్నాడు. ఎవరినీ కష్టపెట్టే మాటలు మాట్లాడకు. అంధకారబంధురమైన హృదయంలో దీపాన్ని వెలిగించి, అందు సదా ధ్వనించే ప్రణవనాదాన్ని ఆలకించు అని కబీర్‌దాసు చెప్పియున్నాడు.

No comments:

Post a Comment