Thursday, September 12, 2013

ఇంటి వాకిలి దక్షిణం వైపు ఉండకూడదు!

మనం ఉన్న ఇంటి వాకిలి దక్షిణం వైపు ఉండకూడదు, ఉత్తరంవైపు ఉండాలి. పూజామందిరం తూర్పువైపు ఉండకూడదు ఈశాన్యం వైపు ఉండాలి. అంతేకాకుండా బీరువా వంటివి అంటే నగలు, డబ్బు దాచి పెట్టే అలమరాలు కూడా తూర్పువాకిలి వైపు తిరిగి ఉండకూడదు. పడమరవైపు వాకిలి ఉండాలి.

ఇక ఇల్లు అద్దెకు ఇస్తున్నప్పుడు సాధారణంగా మనం వాడుకునే ఇంట్లో ఏ భాగం కూడా అద్దెకు ఇవ్వకూడదు. తప్పకుండా అద్దెకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మనం తూర్పు, ఉత్తర భాగాలు, నైరుతి, ఈశాన్యాలు ఉండి, వాయవ్యం గది లేదా ఆగ్నేయం గదిని అద్దెకు ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడ మనం ఉంటున్న ఇంటి నిర్మాణాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. మిగతా అన్ని ఇళ్లకు ఇలా ఇచ్చుకునే వీలు ఉండదు.

No comments:

Post a Comment