Saturday, September 14, 2013

అక్షయమైన శుభఫలితాలనిచ్చే తదియ

అక్షయ అనే పదానికి ‘ఎప్పటికీ తరగనిది’ అని అర్థం. అందువల్లే ఆ రోజున అదృష్టం కలిసి వస్తుందని, విజయం లభిస్తుందని ఒక విశ్వాసం. ఈ రోజున దానంచేసిన వారికి అనేక విజయాలు లభిస్తాయని నమ్ముతారు. కొత్త పనుల ప్రారంభించటానికి
ఈ రోజు చాలా పవిత్రమైనది.

అక్షయ తృతీయను ‘నావున్న పర్వం’ అని కూడా అంటారు. ఈ తిథి సోమవారం, రోహిణి నక్షత్రంలో వస్తే దానిని పవిత్రమైనదిగా భావిస్తారు. వేదవ్యాసుడు అక్షయ తృతీయనాడే మహాభారత గాథను వినాయకునికి చెప్పి రాయించుకున్నాడని, విష్ణుమూర్తి ఆరవ అవతారమయిన పరశురాముడు ఈ రోజునే జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి.

అందుకే సంవత్సరం మొత్తానికి అక్షయ తృతీయను పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండి, దేవుని పూజిస్తారు. విసనకర్రలు, బియ్యం, ఉప్పు, నెయ్యి, పంచదార, కూరగాయలు, చింతపండు, పళ్లు, వస్త్రాలు వంటివాటిని దానం చేయాలి. విష్ణుమూర్తిని పూజించాలి. ఈరోజు హారతి ఇచ్చేటప్పుడు ఇల్లంతా తులసి నీటిని చల్లటం మంచిది.

అక్షయ తృతీయ వివాహాలకు, సామూహిక వివాహాలకు శుభ తిథి. ఈరోజు జరిగే వివాహాలకు ముహూర్తం అక్కర్లేదని చెబుతారు. దేవతలందరిలోకి అత్యంత ధనవంతుడిగా ప్రసిద్ధుడయిన కుబేరుడు సైతం ఈ రోజు లక్ష్మీదేవిని ప్రార్థిస్తాడు. సామాన్యులు ఈ రోజంతా లక్ష్మి, కుబేరులను పూజిస్తారు. ఈ పూజలో సుదర్శన కుబేర యంత్రాన్ని ఉంచటం శుభప్రదం.
హిందూ సంప్రదాయం ప్రకారం విష్ణుమూర్తి ‘అక్షయతృతీయ’దినాన్ని పరిపాలిస్తాడని, త్రేతాయుగంలో ఈ రోజునే గంగానది స్వర్గం నుంచి భూమి మీదకు ప్రవహించిందని పురాణాలు పేర్కొంటున్నాయి.

అక్షయ అనే పదానికి ‘ఎప్పటికీ తరగనిది’ అని అర్థం. అందువల్లే ఆ రోజున అదృష్టం కలిసి వస్తుందని, విజయం లభిస్తుందని ఒక విశ్వాసం. ఈ రోజున దానంచేసిన వారికి అనేక విజయాలు లభిస్తాయని నమ్ముతారు. కొత్త పనుల ప్రారంభించటానికి ఈ రోజు చాలా పవిత్రమైనది. ఈ రోజున ప్రారంభించిన వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ సంపదలు తెచ్చిపెడుతుందని నమ్ముతారు. అందువల్ల సాధారణంగా చాలామంది కొత్త వ్యాపారాలు, భవననిర్మాణానికి పునాదులు వేయటం వంటివి చేస్తుంటారు.

ఈ అక్షయ తదియ అందరికీ అక్షయమైన శుభఫలితాలను ప్రసాదించాలని కోరుకుందాం.

No comments:

Post a Comment