సుప్రసిద్ధ
దేవి మీనాక్షి సుందేశ్వరులు కొలువైన ప్రాచీన మదురై తమిళ సంస్కృతికి
పుట్టినిల్లు. దక్షిణ భారతదేశంలో పర్యటించే ప్రతి యాత్రికునికీ శిల్పకళా
పూరితమైన ఆలయాలు ప్రత్యేక ఆకర్షణ. ఈ క్షేత్రంలోనే శక్తి స్వరూపిణి
మానవరూపంలో పాండ్యరాజపుత్రికగా పరిపాలనచేసి పరమశివుని సతీమణి అయ్యింది.
దేవలోకాధిపతి అయిన ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకదోషం చుట్టుకోవడంతో పాపపరిహారం కోసం మదురై సమీపంలోని కదంబవనం వద్ద తపస్సు చేశాడు. స్వయంభూలింగం మహత్యం వల్లే తనకు పాపపరిహారం అయ్యిందని పరమశివుని స్వర్ణకమలాలతో ఆరాధించి, ఆ చోట దివ్యవిమానం నిర్మించాడట.
ఏడవ శతాబ్దంలో ఓ శివాలయం, ప్రహరీగోడలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత పన్నెండవ శతాబ్ధంలో చడయవర్మన్, సుందరపాండ్యన్ పరిపాలనాకాలంలో మీనాక్షీదేవి ఆలయాన్ని సందర్శించారు. ఈ క్షేత్రంలో తొలుత మీనాక్షిదేవిని దర్శనం చేసుకున్న తర్వాతే భక్తులు సుందరేశ్వరుని సేవించడం ఆనవాయితీగా వస్తోంది. చేతిలో రామచిలుకను ధరించి మీనాక్షిదేవిని దర్శనం చేసుకోవడానికి దేశం నలుమూలల నుండి వేలాదిమంది భక్తులు వస్తారు.
భారతదేశంలో కంచి-కామాక్షి, మధుర-మీనాక్షి. కాశీ-విశాలాక్షిలను దర్శనం చేసుకుంటే సర్వసౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉత్సవాల సందర్భంగా పేరొందిన మదురైలో వచ్చే శ్రావణం, పుష్యమాసాల్లో అమ్మవారికి అంగరంగవైభవంగా వేడుకలు జరుగుతాయి. మీనాక్షిదేవి ఆలయంలో నిర్వహించే ఈ ప్రత్యేక ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరవుతారు.

No comments:
Post a Comment