ఈ ఆలయ మూలాలకు సంభందించిన సంప్రదాయ గాథల ప్రకారం, క్రిత యుగం చివరలో అసలు రూపంలో జగన్నాథుడు (విష్ణువు విగ్రహరూపం), పూరి సముద్రతీర సమీపంలోని మర్రి చెట్టు దగ్గర ఇంద్రనీల లేదా ఒక నీలి ఆభరణంగా అవతరించాడు. అది ఎంత ప్రకాశావంతమైనదంటే దాన్ని చూసినవారికి తక్షణ మోక్షం లభిస్తుంది. కనుక ధర్మదేవుడు లేక యముడు దాన్ని భూమిలో దాచిపెట్టాలనుకున్నాడు. అందులో విజయం కూడా సాధించాడు.ద్వాపర యుగంలో మాల్వాకి చెందిన ఇంద్రద్యుమ్న అనే రాజు అంతుపట్టని ఆ రూపం గురించి తెలుసుకోవాలని సంకల్పించి తన లక్ష్యం కోసం ఘోరమైన తపస్సు చేయసాగాడు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమయ్యి, పూరి సముద్ర తీరానికి వెళ్లి అక్కడ తేలే చెట్టు దుంగను కనుక్కొని దాని కాండంలో నుంచి తనకు కావలసిన రూపును తయారు చేసుకొమ్మని అతన్ని ఆజ్ఞాపించాడు.
ఆ రాజు చెక్క దుంగను కనుక్కొన్నాడు.తర్వాత అతను అద్భుతమైన యజ్ఞాన్ని నిర్వహించాడు. దానికి యజ్ఞనరసింహరాజు ప్రత్యక్షమై నారాయణున్ని నాలుగు అక్షలలో విశదీకరించి నిర్మించమని ఆజ్ఞాపించాడు. అవి పరమాత్ముణ్ణి వాసుదేవుని లాగా, వ్యూహని సంకర్షణ వలె, యోగమయని సుభద్ర లాగా మరియు విభవున్ని సుదర్శన వలె నిర్మించామన్నాడు. రాజు ముందు విశ్వకర్మ చిత్రకారుని రూపంలో ప్రత్యక్షమై చెట్టునుంచి జగన్నాథ, బలభద్ర మరియు సుభద్రల రూపాలను తయారు చేశాడు.పూరి జగన్నాథ్ లోని శ్రీక్షేత్రగా పిలవబడే స్థలం భారతీయ సంస్కృతులకు పూర్తిగా అద్దం పడుతుందని నమ్మకంగా చెప్పవచ్చు. ఈ సంస్కృతుల గురించి తెలుసుకోవాలంటే ఎవరైనా దీని స్థల పురాణం గురించి తెలుసుకోవాలి. కాని ఇది ప్రపంచంలోని మిగతా దేశాలకు భిన్నంగా వుంటుంది. భారతీయ చరిత్రలోనే ఆ దేశం ఎక్కడా ఇతర దేశాల మీద దండెత్తడం కాని సరిహద్దు రాగద్వేషాలతో వాటిని ఆక్రమించుకోవటంగాని చేసిన దాఖలాలు లేవు.
చరిత్ర ప్రకారం జగన్నాథున్నే తీసుకుంటే శబరాలు అనే ఆదివాసీలు ఆయన్ను నారాయణుని మారు రూపంగా పూజిస్తారు. ఇంకొక నేపధ్యం ప్రకారం ప్రాచీన కాలంనుంచి అక్కడే నివసిస్తున్న ప్రజలు ఆయన్ను నీలిరాయితో తయారుచేసిన నారాయణుని ప్రతిరూపమైన నిలమధావగా కొలుస్తారు. ఆయన్ను నీలగిరి(నీల పర్వతం) లేక నీలాచలకి తీసుకువచ్చి బలరామ(బలభద్ర) మరియు సుభద్ర సమేతంగా జగన్నాథునిగా నెలకొల్పారు. ఈ చెక్క విగ్రహాలు, ప్రాచీన కాలంనుంచి వస్తున్న చెక్క స్తంభాలను కొలవటం అనే ఆచారంతో ముడిపడివున్నాయి. వీటన్నిటికన్నా ఒరిస్సాకే చెందిన ఆదివాసీల వంశస్థులుగా చెప్పుకొనే ధైతపతులు ఇప్పటికీ ఆలయంలో జరిగే పూజాకార్యకలాపాలలో అధిక శాతంలో పాల్గొంటూ వుంటారు. వీటన్నిటిబట్టి మొదట్నుంచి శ్రీక్షేత్ర యొక్క సాంస్కృతిక చరిత్ర హిందూ మరియు ఆదివాసీల సంస్కృతుల కలయికతో ఏర్పడిందని ధృడంగా చెప్పవచ్చు. ఇది గర్వించదగ్గ మన జాతి ఔన్నత్యంలో ఒక భాగమయ్యింది. ఈ మూడు విగ్రహాలు త్రిరథ(జైన ఆచారాలు)గా పిలవబడే సమ్యక్ దర్శన్, సమ్యక్ జ్ఞానంద్ మరియు సమ్యక్ చరితలకు ప్రతీకగా ప్రాచుర్యమయ్యాయి.ఇవి మోక్షం లేక శిఖరాగ్రమైన ఆనందానికి మార్గంగా పిలవబడుతున్నాయి.
స్వామి జగన్నాథుడు విష్ణువు లేదా నారాయణ లేదా కృష్ణుడిగా మరియు బలభద్రుడు శేషునిగా పూజలు అందుకుంటున్నారు. అదే సమయంలో ఈ ఆలయంలో నెలకొల్పబడిన విగ్రహాలను భైరవ (శివ, అజేయుడు) మరియు విమల(భైరవి, శివుని భార్య)గా కూడా చూస్తుంటారు. కాబట్టి పూరి జగన్నాథ్ లో ఉన్న శ్రీక్షేత్ర యొక్క సంస్కృతీ సంప్రదాయాలు, హిందూ మతానికి చెందిన శైవతత్వం, శక్తితత్వం మరియు వైష్ణవతత్వం వల్ల, అలాగే జైనమతం, బౌద్ధమతంలోని కొంత భాగాలు మేలుకలయికతో ఏర్పడి, ఎప్పటినుంచో అలాగే కలగలిపి ఉన్నాయని మనం గుర్తించవచ్చు.ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర లేక రథ ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది. ఇందులో మూడు ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా మరియు అందంగా అలంకరించిన రథాలపైన ఊరేగిస్తారు. మధ్య కాలంనుంచి ఈ ఉత్సవం అధిక మత తీవ్రతతో ముడిపడి వుంది. వైష్ణవ సంప్రదాయాలకు మరియు ఈ ఆలయంతో దగ్గర సంబంధమున్న రామానంద స్వామి వారికి ఈ గుడి ఎంతో పవిత్రమైనది. గౌడియ వైష్ణవ మతస్థులకు కూడా ఈ ఆలయం ప్రాముఖ్యమైంది. ఈ మత వ్యవస్థాపకుడైన చైతన్య మహాప్రభు ఆలయంలోని జగన్నాథ విగ్రహానికి ఆకర్షింపబడి చాన్నాళ్ళు పూరిలోనే నివసించాడు

No comments:
Post a Comment