Saturday, September 14, 2013

స్వామివారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారు?

తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంలోని మూలవిరాట్టు గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు. దీనివెనుక ఉన్న వృత్తాంతం ఏమిటో మీకు తెలుసా అయితే ఈ కథనం చదవండి. స్వామి అలంకరణ కోసం పుష్పనందన వనాన్ని పెంచాలని రామానుజాచార్యుల వారు తన శిష్యుడు అనంతాళ్వార్‌ను ఆదేశించారు.
ఈ పనిలో అనంతాళ్వార్ సతీమణి కూడా పాలుపంచుకుంది. గర్భవతిగా ఉన్న ఆమె.. తవ్విన మట్టిని గంపలో తీసుకెళుతూ అలసి కింద పడిపోతుంది. దీన్ని గుర్తించిన శ్రీనివాసుడు బాలుని రూపంలో ఆమెకు సాయపడతాడు. దైవకార్యంలో ఇతరులెవరూ జోక్యం చేసుకోకూడదంటూ ఆ బాలుడిని అనంతాళ్వార్ కొడతాడు.

గడ్డంపై దెబ్బ తగలడంతో బాలుడు అదృశ్యమై పోతాడు. తర్వాత అనంతాళ్వార్ ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుంటాడు. గడ్డంపై నుంచి రక్తం కారడం చూసిన అనంతాళ్వార్ ఆ బాలుడు శ్రీహరేనని గ్రహించి రక్తం కారకుండా పచ్చకర్పూరం పెడతాడు. అందుకే నేటికీ మూలవిరాట్ గడ్డం కింద పచ్చకర్పూరం పెడుతున్నారు.

No comments:

Post a Comment