Monday, September 2, 2013

దీపారాధన చేయాలిలా…


  1. పంచ లోహాలు, వెండి, మట్టితో చేసిన ప్రమిదల్లో దీపం వెలిగించడం శ్రేష్ఠం. అయితే మట్టిప్రమిదలను నిత్యపూజకు ఉపయోగించరాదు.
  2. తెల్లవారుజామున 3-5 గంటల మధ్య దీపారాధన శుభకరం. సూర్యాస్తమయం తరువాత దీపం వెలిగించి, మహాలక్ష్మిని స్తుతిస్తే సర్వకార్యసిద్ధి కలుగుతుంది.
  3. తూర్పుముఖంగా దీపం వెలిగిస్తే, ఈతి, గ్రహ బాధలు, దుఃఖాలు తొలిగిపోతాయి. పడమటి ముఖంగా దీపం వెలిగిస్తే రుణ బాధలు, శని గ్రహ దోష నివారణ కలుగుతుంది. ఉత్తర ముఖంగా దీపం వెలిగిస్తే సిరిసంపదలు, విద్య, వివాహానికి ఆటంకాలు తొలగిపోతాయి. దక్షిణ ముఖంగా దీపారాధన చేయరాదు. అలా చేస్తే అపశకునాలు, దుఃఖ బాధలు కలుగుతాయి.
  4. దీపారాధనకు తామరకాడతో వత్తులు చేసి వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి. కొత్త తెల్ల వస్త్రం మీద పన్నీరు జల్లి, ఎండలో ఆరబెట్టి, తరువాత ఆ వస్త్రాన్ని వత్తులుగా చేసి దీపారాధన చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. 
  5. దీపం వెలిగించడానికి ఆవు నెయ్యి శ్రేష్ఠం. లేదా నువ్వుల నూనె వాడవచ్చు. దీపారాదనలో ఆముదము నెయ్యి ఉపయోగిస్తే, దాంపత్య జీవతం సుఖ సంతోషాలతో సాగుతుంది. విప్ప నూనె, వేప నూనె, ఆవు నేయ్యిలతో దీపారాధన చేస్తే, ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆవు నెయ్యి, విప్ప నూనె, వేప నూనె, ఆముదపు నూనె, కొబ్బరినూనెల మిశ్రమంతో 48 రోజుల పాతు క్రమం తప్పకుండా దీపారాధన చేస్తే, అమ్మవారి అనుగ్రహం లభించి, సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.

No comments:

Post a Comment